అంతర్జాతీయం
బాస్కెట్ బాల్ క్రీడాకారులు కోబ్ బ్రయంట్ మృతి
- బాస్కెట్ బాల్ క్రీడాకారులు కోబ్ బ్రయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.
- లాస్ఏంజిలిస్‌లోని కలాబాసాస్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన 13 ఏళ్ళ కుమార్తె జియానా కూడా మృతి చెందింది.
- 41 ఏళ్ళ కోబ్ బ్రయంట్.. బాస్కెట్ బాల్ క్రీడలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. అయిదు సార్లు ఎస్‌బీఏ ఛాంపియన్‌గా గెలిచారు.
- రెండు సార్లు ఒలంపిక్ స్వర్ణ పతకాలను సాధించారు.
- రెండు దశాబ్దాలుగా బాస్కెట్‌బాల్‌లో మెరిసిన ఈ అమెరికా ప్లేయర్ 2016లో రిటైర్మెంట్ ప్రకటించాడు.
- బ్లాక్ మాంబా'గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో సుప్రసిద్ధుడైన కోబ్, దాదాపు 20 సంవత్సరాలకు పైగా బాస్కెట్ బాల్ క్రీడలో ఉన్నారు.
- చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన టాప్-3 ప్లేయర్లలోనూ చోటు దక్కించుకున్నారు.
స్ట్రాత్ ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్2020 అవార్డు
* ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక స్ట్రాత్ ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్2020 అవార్డుకు భారతసంతతికి చెందిన సంధ్యారెడ్డి ఎంపికయ్యారు.
*ఈమె హైదరాబాద్ నగరానికి చెందినవారు.
* అవార్డు అందుకున్న తొలి భారతసంతతి మహిళగా సంధ్యారెడ్డి గుర్తింపు పొందారు.
*సమాజసేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేసేవారిని స్ట్రాత్ ఫీల్డ్ సిటిజన్ అవార్డుకు ఎంపిక చేస్తారు.
*సంధ్యారెడ్డి చేసిన కృషి --
దేశంలోకి వచ్చే కొత్తవారికి సాయం చేయడం,
వారికి సలహాలు సూచనలు ఇవ్వడం,
పాఠశాలల్లో చేరేలా ప్రోతహిస్తూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చూడటం
క్లీన్‌అప్ ఆస్ట్రేలియా డేలో పాలుపంచుకోవడం,
స్వచ్ఛతపై ప్రచారం,
రక్తదాన శిబిరాలు నిర్వహించడం,
స్థానిక పాఠశాలల్లో చదరంగం పోటీలు ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టారు.
*స్ట్రాత్ ఫీల్డ్ ప్రాంతంలో అత్యవసర సేవలందించడంలో సంధ్యారెడ్డి ముందు ఉన్నారు.
సిఏఏ పై ఈయు పునరాలోచన తీర్మానం
*యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సిఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టింది.
*యూరోపియన్ యూనియన్‌లోని 24 దేశాలకు చెందిన 154 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
*దీనిపై జనవరి నెల 30న ఓటింగ్ నిర్వహించనున్నారు.
* యూరోపియన్ యూనియన్ పేర్కొన్న అంశాలు --
భారత్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది.
సిఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాల వల్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుంది.
ఈ చట్టం కారణంగా ముస్లింలు పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉంది.
అంతర్జాతీయ సిద్ధాంతాలను, ఒప్పందాలను భారతదేశం ఉల్లఘించి జాతి, మతం, రంగు ఆధారంగా పౌరసత్వం ఇవ్వకూడదు.
శాంతియుతంగా సిఏఏను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న వారిపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టడం సరి అయినది కాదు.
*ఎంఈఎఫ్‌కు చెందిన 66 మంది సభ్యులు మాత్రం సీఏఏకు అనుకూలంగా మరో తీర్మానం చేసే అవకాశం ఉంది.
*భారతి స్పందన --1.యూరొపియన్ పార్లమెంట్‌లో సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టడంపై భారతదేశం,తమ అంతర్గత అంశంగా పేర్కొంది.
2.ఒక ప్రజాస్వామ్య దేశం చేసిన చట్టాలపై మరో దేశం తీర్మానం చేయడం సరికాదు.
3.తీర్మానాలు ప్రవేశ పెట్టిన సభ్యులు ముందు భారత్ తో సంప్రదింపులు జరపాలి.
4.ఏ వర్గం పైనా వివక్ష చూపదని, సీఏఏ చట్టం వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదు.
5.చట్టంపై పూర్తి అవకగాహన ఏర్పరచుకోవాలి.
*మార్చి 13వ తేదీన ఇండియా-ఈయూ సమ్మిట్ జరగనుంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.యూరోపియన్ యూనియన్ తీర్మానం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
'సోలార్ ఆర్బిటర్'-సూర్యుడి ధ్రువాలపై పరిశోధనలు
*నూతన పరిశోధన అంశం --సూర్యుడి ఉత్తర, దక్షిణ ధ్రువాలను తొలిసారిగా చిత్రీకరణ
* పరిశోధన నిర్వహించేవారు- అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా
*వ్యోమనౌక -- 'సోలార్ ఆర్బిటర్' అనే వ్యోమనౌకను ప్రయోగించనున్నారు.లాక్‌హీడ్, బోయింగ్ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలోని యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన 'అట్లాస్-5' రాకెట్ ద్వారా వ్యోమనౌకను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
*ఎప్పుడు --ఫిబ్రవరి నెల ఏడవ తేదీన
*పరిశోధన సంబంధించి ముఖ్యమైన అంశాలు --
సూర్యుడి మధ్యరేఖా ప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉన్న ప్రదేశాన్ని 'ఎక్లిప్టిక్ ప్లేన్'గా పేర్కొంటారు.
గ్రహాలన్నీ ఇందులోనే పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి వద్దకు ఇప్పటివరకూ ప్రయోగించిన వ్యోమనౌకలన్నీ ఈ ఎక్లిప్టిక్ ప్లేన్‌లోనో దానికి దగ్గర్లోనో ఉన్నాయి.
సోలార్ ఆర్బిటర్ మాత్రం దాన్ని దాటి వెళుతుంది. ఇందుకోసం శుక్రుడు, భూమి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటుంది.
ఫలితంగా ఎగువ నుంచి సూర్యుడిని పరిశీలించవచ్చు.
సౌర గోళం నుంచి ఆవేశిత రేణువులు వస్తూ ఉంటాయి. వీటిని సౌర గాలి అంటారు.
ఒక్కోసారి విస్ఫోటంలా వచ్చే సౌర గాలులు భూమి ఎగువ వాతావరణ పొరలను తాకినప్పుడు అక్కడ సౌర తుపాన్లు చెలరేగుతుంటాయి. ఫలితంగా జీపీఎస్, కమ్యూనికేషన్ ఉపగ్రహాల పనితీరుపై ప్రభావం పడుతుంది.
వ్యోమగాములకూ హాని కలగొచ్చు. అందువల్ల ఈ సౌర తుపాన్లకు సన్నద్ధమయ్యేందుకు శాస్త్రవేత్తలు సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుంటారు.
ఎక్లిప్టిక్ ప్లేన్‌లో ఉంటూ ప్రస్తుత ఉపగ్రహాలు సాగిస్తున్న పరిశీలనల్లో కొన్ని లోపాలు ఉంటున్నాయి.
అత్యంత కచ్చితత్వంతో అంచనాలు వేయాలంటే సూర్యుడి ధ్రువ ప్రాంతాలపై పరిశీలనలు చేపట్టాలి.
సోలార్ ఆర్బిటర్ ద్వారా అది సాధ్యమవుతుంది.బుధ గ్రహాన్ని దాటి వెళ్లి సూర్యుడిని పరిశీలిస్తుంది.
సౌహార్ధ్రరాయబారికి 'టేలర్' పురస్కారం
*'టేలర్' పురస్కారం - ఎవరికి ?ప్రఖ్యాత భారత పర్యావరణ ఆర్థికవేత్త, ఐరాస పర్యావరణ కార్యక్రమం సౌహార్ధ్రరాయబారి పవన్‌సుఖ్‌దేవ్(59)కు లభించింది.
*ఏ సంవత్సరానికి? 2020 సంవత్సరానికి పొందారు.
* 'టేలర్' పురస్కారం విశిష్టత -పర్యావరణ రంగంలో ఈ పురస్కారాన్ని నోబెల్‌గా పరిగణిస్తారు.
*పవన్‌సుఖ్‌దేవ్ చేసిన కృషి- హరిత ఆర్ధికవ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి
*ఆయన ఈ పురస్కారాన్ని ప్రఖ్యాత బయాలజిస్టు గ్రెషెన్ డైలీతో కలిసి పంచుకుంటారు.
ఖతార్ ప్రధానిగా షేక్ ఖాలీద్
* ఖతార్ ప్రధానిగా షేక్ ఖాలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ నియమితులయ్యారు.
*ఈ మేరకు ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆదేశాలు జారీ చేశారు.
*షేక్ అబ్దుల్లా రాజీనామా పత్రాన్ని అంగీకరించగా, ఆయన స్థానంలో షేక్ ఖాలీద్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
*ఖతార్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షేక్ ఖాలీద్ గ్యాస్ ఇండిస్టీలో కీలక పదవి నిర్వర్తించారు.
*ఆయన విద్యాభ్యాసం అమెరికాలో కొనసాగింది.
*ఇది ఒక స్వార్వభౌమాధికారం కలిగిన దేశం. అరేబియన్ ద్వీపకల్పం ఈశాన్యభాగంలో కొంతభూభాగంలో విస్తరించి ఉన్న ద్వీపకల్పమే ఖతార్. దేశానికి దక్షిణ సరిహద్దులో సౌదీ అరేబియా ఉంది. మిగిలిన భూభాగానికి పర్షియన్ గల్ఫ్ (అరేబియన్ గల్ఫ్) ఉంది. ఖతార్ మరియు బహ్రయిన్ లను అరేబియన్ గల్ఫ్‌లో ఉన్న స్ట్రెయిట్ (జలసంధి) విడదీస్తూ ఉంది. ఖతార్ సముద్ర సరిహద్దులను యునైటెడ్ మరియు ఇరాన్ దేశాలతో పంచుకుంటూ ఉంది.
*1971 సెప్టెంబరున ఖతార్‌కు అధికారికంగా యునైటెడ్ కింగ్డం నుండి స్వతంత్రం లభించింది. తరువాత ఖతార్ సార్వభౌమాధికారం కలిగినదేశం అయింది.
ప్రభుత్వం తరువాత ఆయుధాలను ఫ్రెంఛ్ నుండి దిగుమతి చేసుకుంది.
అమెరికా గ్రీన్‌కార్డ్ నిబంధన
*అమెరికా గ్రీన్‌కార్డ్ నిబంధన
*అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఒక గ్రీన్‌కార్డ్ నిబంధనకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
*నిబంధన - మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్ తదితర ప్రయోజనాలు పొందిన వారికి అమెరికాలో శాశ్వత నివాస సౌకర్యాన్ని కల్పించే గ్రీన్‌కార్డ్‌ను నిరాకరించాలని ప్రతిపాదిస్తూ ఆ నిబంధనను రూపొందించారు.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
* ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో ఐదుగురు ఈ పాలసీకి మద్దతివ్వగా, నలుగురు వ్యతిరేకించారు. ఈ కొత్త నిబంధన అమలుపై స్టే విధిస్తూ న్యూయార్క్‌లోని రెండో సర్క్యూట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది.
*దరఖాస్తుదారులు భవిష్యత్తులోనైనా ఆ ప్రయోజనాలు పొందే అవకాశముందని అధికారులు భావిస్తే.. వారికి గ్రీన్ కార్డ్‌ను నిరాకరించే అవకాశం కూడా ఉంది.
*ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్‌కార్డ్‌కు అప్లై చేసుకుంటారు.
* వలసదారుల్లో కొందరికి మాత్రమే.. వారి ఇమిగ్రేషన్ స్టేటస్‌ను బట్టి మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్.. తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది.
బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు
*అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా.. ప్రతిష్ఠాత్మక గ్రామీ పురస్కారానికి ఎంపికయ్యారు.
*విభాగం --'బెస్ట్ స్పోకెన్ వర్డ్' / బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్
*ఏ సంవత్సరానికి -- 2020 సంవత్సరానికి గ్రామీ అవార్డు దక్కింది.
*పుస్తకం --దక్షిణ చికాగో నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు ఒబామా ప్రస్థానాన్ని, అమెరికా ప్రథమ మహిళగా తన అనుభవాలను వివరిస్తూ మిషెల్ రూపొందించిన ఆడియో బుక్ 'బికమింగ్'కు గ్రామీ అవార్డు దక్కింది.
జాతీయం
6.7% తగ్గిన బంగారం దిగుమతులు
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 త్రైమాసికాల కాలంలో బంగారం దిగుమతులు 6.77 శాతం తగ్గాయి.
*గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలానికి 2,473 కోట్ల డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 2,300 కోట్ల డాలర్లకు తగ్గాయి.
*వాణిజ్య లోటు --వాణిజ్య లోటు 14,823 కోట్ల డాలర్ల నుంచి 11,800 కోట్ల డాలర్లకు తగ్గింది.
*కరంట్ అకౌంట్ లోటు --2018 , జూలై-సెప్టెంబర్ కాలానికి 2.9 శాతంగా ఉన్న కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గత ఏడాది ఇదే కాలానికి 0.9%కి తగ్గింది.
*క్యాడ్ 1,900 కోట్ల డాలర్ల నుంచి 630 కోట్ల డాలర్లకు చేరింది.
*2019 జూలై నుండి బంగారం దిగుమతులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
*ప్రపంచంలో బంగారం ఎక్కువ దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. వార్షికంగా దిగుమతులు 800-900 టన్నుల వరకు దిగుమతి చేసుకుంటాం.
*బంగారం దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10% నుంచి 12.5 శాతానికి పెంచింది.
*బంగారం దిగుమతి సుంకం పెంచడం వల్ల బంగారం నగల తయారీ కేంద్రాలను వేరే దేశాలకు వ్యాపారులు మారుస్తున్నారు.జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్ పోర్ట్స్ కౌన్సిల్ (జీజేఈపీసీ) దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.
*గత ఆర్థిక సంవత్సరం జెమ్స్ అండ్ జువెలరీ ఎగుమతులు 6.4 శాతం తగ్గి ఎగుమతుల విలువ 2,790 కోట్ల డాలర్లకు పతనం అయ్యింది.
ఉత్తమ ఎలక్షన్ సిఇఓ
*సీనియర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి జాతీయస్థాయి పురస్కారం లభించింది.
*ఆంధ్రప్రదేశ్ గత ఏడాది జరిగిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ ఉత్తమ ఎన్నికల నిర్వహణ కేటగిరిలో ఆయన ఈ పురస్కారంకు ఎంపికయ్యారు.
*జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదిగా ఉత్తమ ఎలక్షన్ సిఇఓ అవార్డును అందుకున్నారు.
*అవార్డుకు ఎంపిక అవ్వడానికి కారణాలు--
ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. స్వేచ్చాయుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగాన్ని నడిపించినందుకు
ప్రజాస్వామికంగా ఎన్నికల కమీషన్ నిబంధనలను పకడ్భందీగా అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నందుకు.
*ప్రస్తుతం గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
100% రైళ్ల విద్యుదీకరణ
*అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఒక గ్రీన్‌కార్డ్ నిబంధనకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
*నిబంధన - మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్ తదితర ప్రయోజనాలు పొందిన వారికి అమెరికాలో శాశ్వత నివాస సౌకర్యాన్ని కల్పించే గ్రీన్‌కార్డ్‌ను నిరాకరించాలని ప్రతిపాదిస్తూ ఆ నిబంధనను రూపొందించారు.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
* ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో ఐదుగురు ఈ పాలసీకి మద్దతివ్వగా, నలుగురు వ్యతిరేకించారు. ఈ కొత్త నిబంధన అమలుపై స్టే విధిస్తూ న్యూయార్క్‌లోని రెండో సర్క్యూట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది.
*దరఖాస్తుదారులు భవిష్యత్తులోనైనా ఆ ప్రయోజనాలు పొందే అవకాశముందని అధికారులు భావిస్తే.. వారికి గ్రీన్ కార్డ్‌ను నిరాకరించే అవకాశం కూడా ఉంది.
*ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్‌కార్డ్‌కు అప్లై చేసుకుంటారు.
* వలసదారుల్లో కొందరికి మాత్రమే.. వారి ఇమిగ్రేషన్ స్టేటస్‌ను బట్టి మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్.. తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది.
బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు
*అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా.. ప్రతిష్ఠాత్మక గ్రామీ పురస్కారానికి ఎంపికయ్యారు.
*విభాగం --'బెస్ట్ స్పోకెన్ వర్డ్' / బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్
*ఏ సంవత్సరానికి -- 2020 సంవత్సరానికి గ్రామీ అవార్డు దక్కింది.
*పుస్తకం --దక్షిణ చికాగో నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు ఒబామా ప్రస్థానాన్ని, అమెరికా ప్రథమ మహిళగా తన అనుభవాలను వివరిస్తూ మిషెల్ రూపొందించిన ఆడియో బుక్ 'బికమింగ్'కు గ్రామీ అవార్డు దక్కింది.
జాతీయం
6.7% తగ్గిన బంగారం దిగుమతులు
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 త్రైమాసికాల కాలంలో బంగారం దిగుమతులు 6.77 శాతం తగ్గాయి.
*గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలానికి 2,473 కోట్ల డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 2,300 కోట్ల డాలర్లకు తగ్గాయి.
*వాణిజ్య లోటు --వాణిజ్య లోటు 14,823 కోట్ల డాలర్ల నుంచి 11,800 కోట్ల డాలర్లకు తగ్గింది.
*కరంట్ అకౌంట్ లోటు --2018 , జూలై-సెప్టెంబర్ కాలానికి 2.9 శాతంగా ఉన్న కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గత ఏడాది ఇదే కాలానికి 0.9%కి తగ్గింది.
*క్యాడ్ 1,900 కోట్ల డాలర్ల నుంచి 630 కోట్ల డాలర్లకు చేరింది.
*2019 జూలై నుండి బంగారం దిగుమతులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
*ప్రపంచంలో బంగారం ఎక్కువ దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. వార్షికంగా దిగుమతులు 800-900 టన్నుల వరకు దిగుమతి చేసుకుంటాం.
*బంగారం దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10% నుంచి 12.5 శాతానికి పెంచింది.
*బంగారం దిగుమతి సుంకం పెంచడం వల్ల బంగారం నగల తయారీ కేంద్రాలను వేరే దేశాలకు వ్యాపారులు మారుస్తున్నారు.జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్ పోర్ట్స్ కౌన్సిల్ (జీజేఈపీసీ) దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.
*గత ఆర్థిక సంవత్సరం జెమ్స్ అండ్ జువెలరీ ఎగుమతులు 6.4 శాతం తగ్గి ఎగుమతుల విలువ 2,790 కోట్ల డాలర్లకు పతనం అయ్యింది.
ఉత్తమ ఎలక్షన్ సిఇఓ
*సీనియర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి జాతీయస్థాయి పురస్కారం లభించింది.
*ఆంధ్రప్రదేశ్ గత ఏడాది జరిగిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ ఉత్తమ ఎన్నికల నిర్వహణ కేటగిరిలో ఆయన ఈ పురస్కారంకు ఎంపికయ్యారు.
*జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదిగా ఉత్తమ ఎలక్షన్ సిఇఓ అవార్డును అందుకున్నారు.
*అవార్డుకు ఎంపిక అవ్వడానికి కారణాలు--
ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. స్వేచ్చాయుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగాన్ని నడిపించినందుకు
ప్రజాస్వామికంగా ఎన్నికల కమీషన్ నిబంధనలను పకడ్భందీగా అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నందుకు.
*ప్రస్తుతం గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
100% రైళ్ల విద్యుదీకరణ
*ఢిల్లీలో జరిగిన ఇండియా-బ్రెజిల్ బిజినెస్ ఫోరం సదస్సులో పీయూష్ గోయల్ పేర్కొన్న అంశాలు
*రైల్వేల అంశంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ --
దేశంలో 2024 నాటికి ప్రతి రైలు విద్యుత్తు ఆధారిత నెట్‌వర్క్‌పై నడిచేలా చర్యలు
మొత్తం రైల్వే నెట్‌వర్క్‌ని విద్యుదీకరణ చేసేందుకు వేగంగా పనుల కొనసాగింపు
2030 నాటికి భారత్‌లో అన్ని 'శుద్ధ ఇంధన' ఆధారిత రైళ్లే ఉండేలాగా చర్యలు
'శుద్ధ ఇంధన' ఆధారిత రైళ్ల కొరకు బ్రెజిల్‌తో కలిసి పనిచేయడానికి ప్రణాళిక
బ్రెజిల్ మరియు భారత్ మధ్య క్రీడలు, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, పండుగలు, వాణిజ్యంలో అనేక సారూప్యతలు
భువన్ వెబ్‌సైట్ ఆవిష్కరణ
*ఇస్రో నూతన వెబ్ సైట్ ఆవిష్కరణ --
*ఉద్దేశ్యం -
1.గ్రామపంచాయతీల అభివృద్ధి కొరకు
2.భూగర్భ జలాలు, విద్య, సామాజిక, వైద్య, భౌగోళిక అంశాలపై సమాచార సేకరణ
*వెబ్ సైట్ -భువన్ పంచాయత్ జియో వి-3.0 వెబ్‌సైట్
సిఎఎ నూతన నిబంధనలు
* సిఎఎ పై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూల్స్ --
: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ మతాన్ని కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం దీనికి సంబంధించిన ఆధారాలు కచ్చితంగా సమర్పించేలా సిఎఎ నిబంధనలు.
సిఎఎలో పేర్కొన్న విధంగా ముస్లిం మతం కాకుండా ఇతర ఆరు మతాల్లో ఏదొకదానికి చెందినట్లు నిర్ధారించే పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.
దీంతో పాటుగా వారు 2014, డిసెంబర్ 31 నాటికి దేశంలోకి ప్రవేశించినట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది.
అస్సాంలో ఉన్న వారికి మాత్రం ప్రభుత్వం భారత పౌరసత్వం పొందేందుకు మూడు నెలల సమయం మాత్రమే ఇవ్వనున్నారు.
*నేపథ్యం --. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చిన అక్కడి మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలకు పౌరసత్వం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకువచ్చింది. డిసెంబర్ 11న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సిఎఎ జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటిం చింది.
*ముస్లిములకు చోటుకల్పించక పోవడం కచ్చితంగా మతవివక్ష కిందకు వస్తుందని, రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు, హక్కుల, ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.
*అసోం వాదన -1985లో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందాన్ని సిఎఎ ఉల్లంఘించేదిగా ఉంది.అస్సాం ఒప్పందం ప్రకారం1971 తర్వాత ఎవరైతే అక్రమంగా ఇతర దేశాల నుంచి అస్సాంకు వచ్చి అక్కడ నివాసముంటున్నారో వారిని గుర్తించి తిరిగి తమదేశాలకు పంపి వేయాలి.కేంద్రం 31 డిసెంబర్ 2014లోపు వచ్చిన
ఆరెస్సెస్ తొలి సైనిక్ స్కూల్
*దేశంలోనే తొలి సైనిక్ స్కూల్ ను రాష్ట్రీయ స్వయం సేవక్ స సంఘ్ (ఆరెస్సెస్ ) ఏర్పాటు చేయనుంది.
*ఎక్కడ ?ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో
*రజ్జూ భయ్యా సైనిక్ విద్యా మందిర్ పేరుతో తొలిసారి సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నారు.
*ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ స్కూలులో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.
*మార్చి 1న రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి బ్యాచ్‌లో 160 మంది ఎంపిక చేసి, 6వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. యుద్ధంలో మరణించిన ఆర్మీ కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం 8 సీట్లను కేటాయించారు.
*ఈ స్కూల్‌లో టీచర్లు, విద్యార్థులు అంతా విధిగా యూనిఫాం ధరించి ఉంటారు. ఉపాధ్యాయులు తెలుపు చొక్కా, బూడిద రంగు ప్యాంటు, విద్యార్థులు ముదురు నీలం రంగు ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా ధరించి ఉంటారు.
*ఈ పాఠశాలల్లో విద్యతో పాటు నైతిక ఆధ్యాత్మిక అంశాలపై మార్గదర్శనం చేయనున్నారు.
*ఎన్డీఏ, నేవల్ అకాడమీ, ఇండియన్ ఆర్మీ,టెన్ ప్లస్ టూ టెక్నికల్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తారు.
దేశంలో మొదటి అండర్‌వాటర్ మెట్రో
*నూతన ప్రాజెక్ట్ -- తొలి అండర్‌వాటర్ మెట్రో ఈస్ట్-వెస్ట్ ప్రాజెక్టు
*ఏ నదిలో ?--హుగ్లీ నది
*1984లో చేపట్టిన ప్రాజెక్టుకు విస్తరణగా ముందుకొచ్చిన భారత్‌లో తొలి అండర్ వాటర్ మెట్రో సుదీర్ఘ కాలం తర్వాత మార్చి 2022 నాటికి అందుబాటులోకి రానుంది.
*భారత రైల్వే బోర్డు నుంచి చివరి వాయిదాగా రూ 20 కోట్లు మైట్రో రైల్ అథారిటీకి అందిస్తుంది.
విస్తరణలో భాగంగా చేపట్టిన అండర్‌వాటర్ మెట్రో పనులు తుది దశకు చేరుకున్నాయి.
*ప్రాజెక్టు వ్యయం - రూ 10,000 కోట్లు
* ఈ ప్రాజెక్టులో 49 శాతం మేరకు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూర్చింది.
*న్యూలైన్‌లో రోజుకు 9 లక్షల మంది అంటే నగర జనాభాలో 20 శాతం మంది ప్రయాణిస్తారు.
*520 మీటర్ల అండర్‌వాటర్ టన్నెల్‌ను ఈ రైలు కేవలం నిమిషం లోపే దాటుతుంది.
*అనుకున్న రూట్ ప్లాన్ కూడా మారిపోవడంతో అంచనా వ్యయం రెట్టింపు అయింది. మొదటిగా 14 కిలోమీటర్లకు గానూ రూ.49 బిలియన్లు ఖర్చు అవుతుంది అని అంచనా వేశారు.
*చివరికి ప్రాజెక్టు వ్యయం రూ.86 బిలియన్లుగా మారింది. కాగా, ఈ మెట్రో అందుబాటులోకి వస్తే సుమారు 9,00,000 మంది ప్రజలు రోజు ప్రయాణిస్తారు.హౌరా బ్రిడ్జిని అతి తక్కువ సమయంలోనే దాటవచ్చు.
ఫిబ్రవరిలో ట్రంప్ భారత్ పర్యటన
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.
*డొనాల్డ్ ట్రంప్ పర్యటన అంశాలు---
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ అహ్మదాబాద్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో ట్రంప్ రెండు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్, అప్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాలలో పెరుగుతున్న ఉగ్రవాదంపై చర్చించనున్నారు.
చైనాతో తొలి దశ ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప భారత్‌తోనూ ఆ తరహా విధానాన్ని అమలు చేసేందుకు చర్చ జరిపే అవకాశం ఉంది.
దీంతో పాటు యుఎస్ నుంచి 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలను అనుమతించే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ)పై చర్చ.
జీఎస్పీ ఉపసంహరణ తర్వాత భారతదేశం తన సుంకాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.
వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ 6 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా కోరుతుంది.ఈ ఒప్పందాన్ని అధిగమించడానికి చమురు లేదా షేల్ గ్యాస్‌పై హామీలు పొందాలని భారత్ భావిస్తుంది.
గర్భస్రావం గడువు పెంచిన కేంద్రం
*మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ(ఎంటీపీ)గా పరిగణించే గర్భస్రావాన్ని 1971 జూన్‌లో చట్టబద్ధం చేశారు.
* ఈ చట్టం ప్రకారం ఐదు నెలలలోపు గర్భం వరకే ఇది పరిమితం. ఐదు నెలల తర్వాత గర్భస్రావ ప్రయత్నం ప్రమాదకరం చట్ట వ్యతిరేక చర్య కిందకి వస్తోంది.
*కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గర్భం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదమయితే లేదా బిడ్డ సరిగ్గా రూపొందకపోతేనే గర్భస్రావం చేయాలి.
*గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
*కేంద్ర క్యాబినెట్ నిర్ణయానికి ముందు పరిస్థితి -- 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉంది.
*కేంద్ర క్యాబినెట్ నూతన నిర్ణయం -- 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు పరిస్థితిని 24 వారాలకు పెంచారు.కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్న ప్రకారం,మహిళలు గర్భాన్ని తొలగించుకునే పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా వారి పునరుత్పత్తి హక్కులను కాపాడటం కిందకి వస్తుంది.
*మొదటి ఐదు నెలల (20 వారాలు) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణులు ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టులకు వెళ్లాల్సి వచ్చేది.
*మైనర్లు,అత్యాచార బాధితులు,కొన్ని విపత్కర పరిస్థితుల్లో గర్భం దాల్చినవాళ్లు మొదటి ఐదు నెలల్లో తాము గర్భం దాల్చామని తెలుసోలేక ఆ తర్వాత అబార్షన్ కోసం కోర్టులకు వెళ్లాల్సి వచ్చేది.
*గతేడాది సెప్టెంబర్ లో...అబార్షన్ కు 20వారాల గడువు ఫిక్స్ చేసిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971 సెక్షన్ 3(2) రాజ్యాంగ ప్రామాణికతను సవాల్ చేస్తూ,లిమిట్ ను 26వారాలకు పొడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కేంద్రం స్పందిస్తూ...రాష్ట్రం పౌరుల సంరక్షకుడిగా,గర్భంలో ఉన్న పిండం సాధ్యమయ్యే దశకు చేరుకున్న తర్వాత ఆ ప్రాణాన్ని కాపాడటానికి నైతికంగా మరియు విధి కలిగి ఉందని తెలిపింది.
*పుట్టని శిశువు తన తండ్రి,లేదా తల్లి తలపెట్టే హానినుంచి తనను తాను కాపాడుకోలేదని తెలిపింది. చాలా కేసుల్లో పదే పదే... ప్రెగ్నెన్సీని తొలిగించుకోవాలనుకున్న మహిళల కన్నా...మానసిక వేదన,గాయాలతో గర్భం దాల్చాలనుకున్న మహిళల్లో 20వ వారం తర్వాత తీవ్రమైన అసాధారణతలు గుర్తించారు.
*ఈ అంశంపై అధ్యయనం చేయడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.
.ట్రాన్స్ జెండర్ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్
* కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
* ట్రాన్స్‌జెండర్-2019 చట్టం రాజ్యాంగ ప్రామాణికతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు జనవరి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
*పిటిషన్‌దారు వాదనలు -
1. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం రాజ్యాంగ కల్పించిన జీవించే, స్వేచ్ఛా, సమానత్వపు హక్కులకు విరుద్ధంగా ఉంది.
2.లింగ గుర్తింపుపై స్వీయ ప్రకటన అనేది ఆర్టికల్ 21 ప్రకారం ఒక ప్రాథమిక హక్కు
3.ఒక ట్రాన్స్‌జెండర్ గుర్తింపునకు సంబంధించి కేంద్రం చట్టంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పరీక్షల అనంతరం జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసే ధ్రువపత్రం ద్వారానే వారి గుర్తింపు స్థితి ఉంటుంది.
4.ఈ నిబంధనలు గోప్యత హక్కును ఉల్లంఘించేవి, ఏకపక్షంగా ఉన్నాయి.
*దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కె బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.
రాష్ట్రీయం
మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం
*శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది.
*అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌడకు పంపించింది.
*ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పూర్తిగా పరిశీలించి..ఒక బిల్లును రూపొందించనుంది.
*అనంతరం ఈ తీర్మానం పార్లమెంట్ కు పంపించి..పార్లమెంట్ ఉభయసభల్లోను అంటే లోక్ సభ, రాజ్యసభల్లో చర్చ జరిపి ఆమోదం పొందాల్సి ఉంది.
*పంజాబ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు శాసన మండలి కావాలని కోరుతున్నాయి.
*1985లో అప్పటి సీఎం ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేయగా..దాన్ని తిరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మండలిని పునరుద్ధరించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు.
*రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ప్రకారంగా..పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన అనంతరం మండలి పునరుద్ధరణకు మూడు సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది.
*ఈ క్రమంలో శాసనమండలి రద్దు తీర్మానం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి దాన్ని పునరుద్ధరించటానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
*ఏపీ మండలి రద్దు తీర్మానం బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లోను ఆమోదం లభించిన పక్షంలో అది రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే ఏపీ మండలి రద్దు అనే ప్రక్రియ పూర్తవుతుంది.
వైఎస్‌ఆర్ కాపు నేస్తం - మార్గదర్శకాలు
వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకం -- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు మహిళల జీవన ప్రమాణాలకు పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.ఒక్కో మహిళకు ఏడాదికి రూ. 15వేలు చొప్పున ఐదు సంవత్సరాలకు రూ. 75వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీని కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1101.69 కోట్లు కేటాయించారు.
*వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకం మార్గదర్శకాలు ---బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికాలవలవన్ ఉత్తర్వులు జారీ చేశారు.
లబ్ధి పొందే మహిళ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారై ఉండాలి.
కుటుంబ నెలవారి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 10వేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 12 వేలు కంటే తక్కువుగా ఉండాలి.
మూడు ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల కంటే తక్కువ కలిగి ఉండాలి.
. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా పెన్షన్ దారులైనా అటువంటి వారు అనర్హలు.
పై నిబంధనలు పారిశుధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది.
కుటుంబంలో ఎవరి పేరు మీద నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు.ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది.
కుటుంబ సభ్యులు ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.
మునిసిపాలిటీ ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తులు లేని వారు, 750 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో నివాస గృహాలు కానీ వ్యాపార సంబంధిత భవనాలు కలిగిన వారు అర్హులు.
తప్పని సరిగా లబ్ధిదారుని వయసు 45 ఏళ్లు నుంచి 60 ఏళ్ల లోపల ఉండాలి.
వయసును ధృవీకరించే కులం, పుట్టిన తేది, స్థానికత వివరాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కుల సర్టిఫికేట్, పుట్టుక ధృవీకరణ పత్రం లేదా పదో తరగతి మార్కుల జాబితా, ఓటర్ ఐడి కార్డు, రాష్ట్ర ప్రభుత్వం చేత జారీ చేయబడిన పెన్షన్ కార్డును ఆధారాలుగా కలిగి ఉండాలి.
లబ్ధిదారుని పేరుతో ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.
ఇంటింటి సర్వే ఆధారంగా గ్రామ, వార్డు వలంటీర్లు అర్హులను గుర్తిస్తారు.
*నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. పథకానికి ఎంపికైనట్లు, నగదు బ్యాంకులో జమచేస్తున్నట్లు తదితర వివరాలతో పాటు ముఖ్యమంత్రి సమాచారంతో కూడిన పత్రాన్ని లబ్ధిదారులకు వలంటీర్లు అందజేస్తారు.ఈ పథకం అమలు కోసం కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించనున్నారు.
హోమ్ డెలివరీ పెన్షన్
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 54 లక్షల మంది పేదలకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
*ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 39 లక్షల మంది మాత్రమే పింఛన్లకు అర్హులుగా ఉండగా,ఇప్పుడు 54.64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వనున్నారు.
*15.64 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం కలగనుంది.
* గ్రామ, వార్డ్ వాలంటీర్లు పెన్షన్ సొమ్మును అర్హుల ఇంటి దగ్గరకు వచ్చి పంపిణీ చేస్తారు.
*స్పందన కార్యక్రమంలో ఎక్కువగా పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులే రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
*ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 21వ తేదీ వరకు కొత్తగా రేషన్ కార్డులకు, పెన్షన్ కు అర్హులైన వారికి రేషన్, పెన్షన్ కార్డులను అందజేయనున్నారు.
*ఫిబ్రవరి 2వ తేదీలోపు సామాజిక తనిఖీ పూర్తి చేసి వెంటనే కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.
*అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే కొత్త కార్డుల మంజూరు గ్రామ సచివాలయాల ద్వారా చేస్తారు.
No comments:
Post a Comment