Current Affairs in Telugu 28 December 2019.

అంతర్జాతీయం 


వాడా నిషేధంపై రష్యా సవాలు
*అంతర్జాతీయ డోపింగ్‌ సంస్థ (వాడా) తమపై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని రష్యా సవాలు చేసింది.       పై 
* రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థ (రుసాడ) పలు ఆధారాలతో ఓ నివేదికను వాడాకు పంపింది. 
* దీనిలో తమపై విధించిన నిషేధాన్ని రష్యా నిరాకరించింది. 
* ఈ విషయం కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)కు చేరనుంది. 
*ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను వాడాకు రష్యా సమర్పించింది. 
* అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా ఇటీవల రష్యాపై నాలుగేళ్లు నిషేధం విధించారు. 
* డోపింగ్‌ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగశాలకు సంబంధించి          తప్పుడు వివరాలను ఇచ్చినందుకు వాడా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 
*2011-15 కాలంలో ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహించిందని మెక్‌లారెన్‌ స్వతంత్ర నివేదిక 2016లో       బయటపెట్టింది. 
*ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) రష్యా ఒలింపిక్ క్రీడలు సహా అన్ని ప్రపంచ                   చాంపియన్‌షిప్స్‌ లో రష్యా క్రీడాకారులపై నిషేధం విధించింది. 
*డోపింగ్ వివరాలు బయటికి తెలియకుండా లేబరేటరీ డేటాను తారుమారు చేసినందుకు వాడా ఈ          నిర్ణయం తీసుకుంది. 
*అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లపాటు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ           ప్రతిపాదనకు ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం   తెలిపింది. 
* దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్, 2022లో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ సహా మరే     ఇతర అంతర్జాతీయ క్రీడల్లో రష్యా పాల్గొనడానికి వీలుండదు.

ధ్వని వేగాన్ని మించిన అవన్‌గార్డ్‌
*ధ్వని కన్నా 20 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్‌ క్షిపణులను రష్యా తన అమ్ములపొదిలో చేర్చింది. 
*దీంతో ఈ సామర్థ్యాన్ని సాధించిన తొలి దేశంగా అవతరించింది. 
* అవన్‌గార్డ్‌ అనే ఈ అస్త్రాలు డిసెంబర్ 27వ తేదీన సైనిక దళాల్లో చేరాయి. 
* గంటకు సుమారు 33 వేల కిలోమీటర్ల వేగం లేదా 'మ్యాక్‌ 27' వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుందని పరీక్షల్లో తేలింది. 
*'మ్యాక్‌ 1' అంటే ధ్వని వేగంతో సమానం (ధ్వని వేగం గంటకు 1,235 కి.మీ.)తాజా క్షిపణికి సంబంధించిన చిత్రాలను గతంలో విడుదల చేశారు. 
* ఇప్పటివరకున్న అన్ని క్షిపణి వ్యవస్థలను ఓడించగల సత్తా ఈ అవాన్‌గార్డ్‌ క్షిపణికి ఉంది. 
* కంబాట్‌ సర్వీసుల్లో ఇలాంటి వేగవంతమైన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని తీసుకొచ్చిన తొలి దేశం రష్యా. 
*అత్యధిక వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి కదలికలను అంచనా వేయడం అంత సులువు కాదు.


అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
*చైనా అత్యధిక బరువైన, అత్యంత ఆధునిక సమాచార ఉపగ్రహం 'షిజియాన్‌-20'ను తన లాంగ్‌మార్చ్‌-5 వాహననౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. 
*డిసెంబర్ 27వ తేదీన విజయవంతంగా ఉపగ్రహం కక్ష్యలో ప్రవేశించింది. 
* చైనా దక్షిణాది రాష్ట్రం హైనాన్‌లోని వెన్‌చాంగ్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 'షిజియాన్‌-20'ని ప్రయోగించారు. 
* నిమిది టన్నులకు పైగా బరువున్న షిజియాన్‌-20 చైనా చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యధిక బరువైన ఉపగ్రహం. 
*వాహన నౌక 'లాంగ్‌మార్చ్‌-5' చైనా శక్తిమంతమైన రాకెట్‌. 
*జియోక్రయోజనిక్‌ కక్ష్యలోకి గరిష్ఠంగా 25 టన్నుల పేలోడ్స్‌ తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. 
*2020లో అంగారక గ్రహంపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్న ప్రణాళిక రూపొందించిన చైనాకు తాజా ప్రయోగం ముందడుగు వంటిది.

వలర్డ్ పొల్యూషన్ ఇండెక్స్
*ప్రపంచంలోని 25 అత్యంత కాలుష్య నగరాల్లో 7 భారత దేశానివే ఉన్నాయి. 
*టాప్ 10లో రెండు ర్యాంకులు భారతదేశ నగరాలకే దక్కాయి. 
*వలర్డ్ పొల్యూషన్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. దక్షిణాసియా, ఆఫ్రికా తదితర దేశాల్లో కాలుష్యం పెరిగిపోతోంది. 
*అభివృద్ధి చెందిన దేశాల్లో తగ్గుముఖం పడుతోంది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి విపరీతంగా కాలుష్యం అవుతోంది. 
*నివేదికలోని టాప్ 20 స్థానాలు-- అక్రా (ఘనా)-97.25% టెతోవో (మాసిడోనియా)-96.37% కఠ్మాండు (నేపాల్)-95.66% కాబూల్ (అఫ్ఘానిస్తాన్)-95.59% ఫరీదాబాద్ (భారత్)- ఉలాన్ బటార్ (మంగోలియా)-95.27% గజియాబాద్ (భారత్)-94.46% ఢాకా (బంగ్లాదేశ్)-93.56% కైరో (ఈజిప్ట్)-93.27% నోయిడా (భారత్)-93.01% యాంగాన్ (మయన్మార్) బీరుట్ (లెబనాన్) హోచిమిన్ సిటీ (వియత్నాం) హనోయ్ (వియత్నాం) అలహాబాద్ (భారత్) ఢిల్లీ (భారత్) మనీలా (ఫిలిప్పీన్స్) వారణాసి (భారత్) కరాచీ (పాకిస్తాన్) పట్నా (భారత్) 
*హైదరాబాద్ 64వ స్థానంలో, చెన్నై 65వ స్థానంలో, విజయవాడ 75వ స్థానంలో, విశాఖ పట్నం 98వ స్థానంలో ఉన్నాయి.

నాసా -'మార్స్‌ మిషన్‌'
*అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వచ్చే సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 'మార్స్‌ మిషన్‌'లో ఉపయోగించనున్న రోవర్‌ను డిసెంబర్ 27వ తేదీన ఆవిష్కరించింది. 
*ప్రాచీన జీవజాతి మనుగడపై అన్వేషణే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయోగం మరిన్ని లక్ష్యాలను కూడా ఛేదించనుంది. 
* భవిష్యత్తులో అంగారకునిపైకి మానవసహిత యాత్రకు కూడా ఇది ఉపయోగపడనుంది. 
* లాస్‌ఏంజిల్స్‌కి సమీపంలోని పాసడేనా 'జెట్‌ ప్రొపల్షన్‌ లేబోరేటరీ'లో తాజా రోవర్‌ను రూపొందించారు. 
* జీవజాతి ఆనవాళ్లతో పాటు గ్రహానికి సంబంధించిన భౌగోళిక, రసాయనిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేసేలా పరికరాలను పొందుపరిచారు. రోవర్‌లోని పరికరాలు--- రోవర్‌లో 23 కెమెరాలు, రెండు 'చెవి' లాంటి భాగాలు, ఆరు చక్రాలతో పాటు పలు ఇతర సెన్సర్లు, పరికరాలు అమర్చారు. ఏడు అడుగుల పొడవున్న చేతి లాంటి భాగాలతో పాటు గ్రహంపై రాళ్లను పగలగొట్టేలా డ్రిల్లర్‌ను కూడా పొందుపరిచారు. గ్రహంపై సేకరించిన మట్టి నమూనాల్ని గాలి చొరబడకుండా ప్రత్యేక గొట్టాల్లో భద్రపరిచి వాటిని అదే గ్రహంపై వదిలేసేలా రోవర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రహంపై వనరుల్ని ఉపయోగించుకొని ఆక్సిజన్‌ తయారుచేసేలా రూపొందించిన 'మోగ్జి'(మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్‌) అనే పరికరాన్ని కూడా ఈ రోవర్లో అమర్చారు. ఈ ఆక్సిజన్‌ వ్యోమగాముల శ్వాస, తిరిగి భూమి పైకి చేరుకునేందుకు ఇంధనంలా ఉపయోగపడనుంది. 
*2026లో చేపట్టనున్న మరో ప్రయోగంలో వాటిని సేకరించి రాకెట్‌ ద్వారా వాటిని అంగారక గ్రహం చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోవర్ దిగే ప్రాంతం----- అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండడానికి అత్యధిక ఆస్కారం ఉన్న ప్రాంతాన్ని తాజా రోవర్‌ దిగేందుకు ఎంపిక చేశారు. 'జేజీరో' అనే ఈ ప్రాంతంలో ఒకప్పుడు 500 గజాల లోతున్న సరస్సు ఉన్నట్లు భావిస్తున్నారు. సంవత్సరాల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. 
*అధ్యయనం--- 'మార్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డైనమిక్స్‌ అనలైజర్‌' అనేది కొన్ని సెన్సార్ల సమూహం. ఇది గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది. అలాగే ఏళ్లుగా వాతావరణ పరిస్థితులు ఎలా రూపాంతరం చెందాయో కూడా ఇది గుర్తించనుంది. దుమ్ము, రేడియేషన్‌ని సైతం అధ్యయనం చేయనుంది. రిమ్‌ఫ్యాక్స్‌: కేవలం ఉపరితలాన్నేగాక గ్రహం బయటి పొర లోపలికి చొచ్చుకుపోయేలా 'రాడార్‌ ఇమేజర్‌ ఫర్‌ మార్స్‌ సబ్‌సర్ఫేస్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (రిమ్‌ఫ్యాక్స్‌)' అనే పరికరాన్ని రూపకల్పన చేశారు. ఇది మార్స్‌ భూగర్భాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడనుంది. టెర్రెయిన్‌ రిలేటివ్‌ నావిగేషన్‌: తాజా అంతరిక్ష ప్రయోగాల్లో ల్యాండింగ్‌ ఓ పెద్ద అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో రోవర్‌ ల్యాండ్‌ అయ్యే ప్రదేశంలో ఎలాంటి అవాంతరాలు ఉన్నా ముందే గుర్తించి ప్రమాదాన్ని అడ్డుకునేందుకు దోహదం చేయనుంది. 
*తాజా రోవర్‌ అంగారక గ్రహంపై ఏడాది పాటు మనుగడ సాగించేలా రూపొందించారు. 
*2012లో నాసా పంపిన క్యురియాసిటీ రోవర్‌ నిర్దేశిత సమయం కంటే ఎక్కువ కాలం పని చేయనుంది. 
*వచ్చే సంవత్సరం జులైలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది. 2021 ఫిబ్రవరిలో ఇది మార్స్‌పై ల్యాండ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
   
జాతీయం 
జనవరి 15 నుండి 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్'

*దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు 12 రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకాన్ని అమలు చేయనున్నారు. 
* జనవరి 15వతేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, గోవా, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్ఖండ్ రాష్ట్రాల్లో 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. 
*ఈ 12 రాష్ట్రాల్లో 35 మిలియన్ల మంది ప్రజలు ఈ పథకం కింద ఎక్కడైనా రేషన్ సరకులు పొందవచ్చు. 
*దేశంలో మొత్తం 79 కోట్ల మంది ప్రజలకు రేషన్ కార్డులు ఉండగా ఇందులో 35 మిలియన్ల మందికి 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద కార్డులు జారీ చేయనున్నారు. 
*ఈ పథకం కింద వలసకూలీలు, రోజువారీ కార్మికులు ఎక్కడైనా సబ్సిడీ ధరలకు జాతీయ ఆహార భద్రత పథకం కింద రేషన్ సరకులు పొందవచ్చు. 
*బయోమెట్రిక్, ఈ పాస్ ద్వార ఆధార్ అథంటికేషన్ ద్వారా చౌకధరల దుకాణాల్లో రేషన్ సరకులు తీసుకోవచ్చు. 
*ఈ పథకం అమలుతో తరచూ ఉపాధి కోసం వలస వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం కలగనుంది.


ముగిసిన మిగ్27 ప్రస్థానం
*భారత ఆర్మీకి కార్గిల్ వార్‌లో కీలకంగా వ్యవహరించిన మిగ్ 27 యుద్ధ విమానాలు ఇక చరిత్రలో కలిసిపోనున్నాయి. 
*నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్ 27కు వాయుసేన వీడ్కోలు పలికింది. జోధ్ పూర్ వైమానిక స్థావరం నుంచి మిగ్ 27లు చివరిసారిగా ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. 
*రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. 
*ఇప్పటికే చాలా విమానాలు కుప్పకూలాయి. వీటి పనితీరుపై విమర్శలు రావడం.. శత్రు దేశాలు పవర్ ఫుల్‌ జెట్‌లను వినియోగిస్తుండటంతో భారత వాయుసేన వీటికి స్వస్థి చెప్పాలని నిర్ణయించింది ప్రభుత్వం. 
*ఇకపై తేజస్‌, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ జెట్‌ విమానాలు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు కొత్త శక్తి ఇవ్వబోతున్నాయి. 
*దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడుతుంది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు. 
*జోధ్‌పూర్‌లో 29వ స్వ్కాడ్రన్‌కు చెందిన సిబ్బంది మిగ్ 27 బహదూర్‌ను చివరిసారిగా నడిపారు. ఈ విమానాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టనున్నారు. 
*ఇన్నాళ్లూ జోథ్‌పూర్‌ ఎయిర్‌ బేస్‌లో మిగ్‌-27 రకం విమానాలు ఏడు వరకు సేవలందించాయి. మిగ్‌-27లు 1985 నుంచి భారత వైమానిక దళంలో ఉన్నాయి. భూతల దాడి విభాగానికి మిగ్‌-27 చాలాకాలం పాటు వెన్నెముకగా ఉంది. 
*యుద్ధరంగంలో శత్రువును గడగడలాడించడంలో నేర్పరైన మిగ్27కు మూడు మారుపేర్లున్నాయి. కార్గిల్ వార్ లో సాహసోపేతంగా పోరాడినందుకు బహదూర్ అని, దీని కాక్ పిట్ లో కూర్చుంటే విశాలమైన బాల్కనీ వ్యూ కనిపిస్తుందికాబట్టి బాల్కన్ అని, విమానం ముందరి భాగం ముందుకు పొడుచుకుని ఉన్నందుకు(ఉట్కోనోస్)అని ముద్దుగా పిలుచుకుంటుంది. 
*శత్రుదాడిని తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉంది. 1999 నాటి కార్గిల్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. 
*మిగ్27.. బేసిగ్గా టాక్టికల్ ఫైటర్ జెట్. ఇందులో ఒక పైటల్ మాత్రమే కూర్చునేవీలుంటుంది. 
*గరిష్టవేగం గంటలకు 1700 కిలోమీటర్లు. 23 మిల్లీమీటర్ల సిక్స్ బ్యారెల్ రోటరీ ఇంటిగ్రల్ ఫిరంగి దీని సొంతం ఒకేసారి 4,000 కిలోల వరకు ఆయుధాలను మోయగలుగుతుంది. 
*ఈ ఏడాది(2019)లోనే.. రొటీన్ ఆపరేషన్ చేస్తుండగా మూడు మిగ్27లు కూలిపోయాయి. 2012లో అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంట్ కు చెప్పిన లెక్కప్రకారం 40 ఏండ్లలో మొత్తం 482 మిగ్ ఎయిర్ క్రాఫ్టులు యాక్సిడెంట్ కు గురయ్యాయి.


త్రిపుల్‌ తలాఖ్‌ మహిళలకు ఆర్థిక సహాయం
*భర్తల నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా బతుకులిడుస్తున్న మహిళలకు, మరియు త్రిపుల్‌ తలాఖ్‌ వల్ల ఒంటరి అయిన ముస్లిం మహిళలకు యూపీ ప్రభుత్వం సహాయం అందించనుంది. 
* ట్రిపుల్‌ తలాఖ్‌ పొందిన వివాహితులకు పునరావాసం కల్పించేందుకు వచ్చే 2020 సంవత్సరం నుంచి ఏటా ఆరువేల రుపాయల ఆర్థికసాయం అందించనుంది. 
* ట్రిపుల్‌ తలాఖ్‌ ద్వారా భర్తల నుంచి వేదింపులకు గురైన బాధిత ముస్లిం మహిళలకు ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయసహాయం అందిస్తారు. 
* ఈ పథకం కింద ట్రిపుల్‌ తలాఖ్‌ వల్ల విడాకులు పొందిన ముస్లిం మహిళలు 5వేల మందికి ఆర్థికసాయం అందిస్తారు. 
* ఇతర మతాల్లో కూడా విడాకులు పొందిన ఒంటరి మహిళలకు కూడా ఈ పథకం కింద 6000 రుపాయల ఆర్థికసాయం అందించనున్నారు. 
* ఆర్థిక ప్రయోజనాలను పొందాలంటే సదరు బాధిత మహిళ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కోర్టు కేసుకు సంబంధించిన కాపీని ప్రూఫ్‌ కింద సమర్పించాల్సి ఉంటుంది. 
*యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 5,000 మంది ట్రిపుల్ తలాక్ బాధితులతో సహా దాదాపు 10,000 మంది మహిళలు నేరుగా లబ్ధి పొందనున్నారు.

పట్టణ ప్రజల అతి పెద్ద సమస్య నిరుద్యోగం
* ఇప్సోస్‌ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం,నిరుద్యోగమొక్కటే తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని దేశంలోని నగరాల యువతలో సగం మంది అభిప్రాయపడుతున్నారు. 
* 'వాట్‌ వర్రీస్‌ ద వరల్డ్‌' పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమతౌల్యత, వాతావరణ మార్పులు వంటి సమస్యలపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇప్సోస్‌ తెలిపింది. 
*'పట్టణాల్లో ఉన్న వారిని అక్టోబరులో ప్రశ్నించినప్పుడు సుమారు 46 శాతం మంది నిరుద్యోగం లేదా ఉపాధి లేకపోవడమన్నది అతిపెద్ద సమస్యగా చెప్పుకొచ్చారు. 
*నవంబరులో ఈ సంఖ్య మరో మూడు శాతం పెరిగింది. 
*అంతర్జాతీయ స్థాయిలో పౌరులు అతిపెద్ద సమస్యలుగా పేదరికం, సామాజిక అసమతౌల్యతగా గుర్తించారని, తరువాతి స్థానాల్లో నిరుద్యో గం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి, ఆరోగ్యం వంటి అంశాలు ఉన్నాయి.

పీఎంఏవై క్రింద మరో 6.5 లక్షల గృహాల నిర్మాణం
 *ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం క్రింద పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 6.5 లక్షల గృహాల నిర్మాణానికి డిసెంబర్ 27వ తేదీన ఆమోదం తెలపడంతో, ఈ పథకం క్రింద నిర్మితమయ్యే మొత్తం గృహాల సంఖ్య ఒక కోటికి చేరబోతోంది. 
* ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనా పేరిట వీటి నిర్మాణం చేపట్టనున్నారు. 
*కేంద్ర ప్రభుత్వం 1.12 కోట్ల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
* గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్‌ పూరి 
*ఇవి కాక.. ఇంకో 57 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి.నాలుగునెలల్లోగా 30 లక్షల ఇళ్లనిర్మాణం పూర్తి కానుంది. 
* గతంలో ఆంధ్రప్రదేశ్‌కు 20 లక్షలు, ఉత్తరప్రదేశ్‌కు 15.54 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. 
* తొలిసారి ఇళ్లు తీసుకునే వాళ్లకు వడ్డీ రహిత రుణాలు అందిస్తున్నారు. 
*ప్రజలు తాము కలగన్న ఇంటిని పొందేలా సాధికారపరచుటకు గాను, గౌరవనీయ ప్రధానమంత్రి గారు 2015, జూన్ 17 వ తేదీన ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అందరికీ ఇళ్ళు’ అనే ఒక సమగ్రమైన మరియు ప్రగతిదాయకమైన పథకాన్ని ప్రకటించారు. 
*ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) క్రింద ఉన్న ప్రధాన విభాగాలలో ఒకటి, అల్పాదాయ సమూహము/ ఆర్థికంగా బలహీన వర్గము (EWS/LIG) మరియు మధ్యాదాయ సమూహము (MIG – I & II) కొరకు ఋణ అనుసంధానిత రాయితీ పథకము (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీము) (CLSS). 
*వడ్డీ రాయితీ రెండు కేంద్ర నోడల్ సంస్థలు - నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) మరియు హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HUDCO) ద్వారా మార్గనిర్వహణ చేయబడుతోంది.


No comments:

Post a Comment