Current Affairs in Telugu 24th end 25th January

అంతర్జాతీయం


ఏఏఐ పై నిషేధం ఎత్తివేత
* వరల్డ్‌ ఆర్చరీ (డబ్ల్యూఏ) భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై విధించిన నిషేధాన్నికొన్ని షరతులతో ఉపసంహరించింది.
*నిషేధాన్నిఎత్తివేయడానికి కారణం -ఏఏఐ ఎన్నికలు వరల్డ్‌ ఆర్చరీ నిర్దేశించిన విధం గా నిర్వహించడంతో నిషేధాన్ని ఎత్తి వేశారు.ఎగ్జిక్యూటివ్‌ బోర్డు పోస్టల్‌ ఓటుతో ఇండియాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించారు.
* ఎన్నికలు జరిగిన వారంలోపే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.
* వరల్డ్‌ ఆర్చరీ విధించిన షరతులు --
  1.  అథ్లెట్‌ మెంబర్‌షిప్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ చేసుకోవాలి
  2. పాలనాపరమైన సమస్యలను పరిష్కరించుకోవాలి.
  3. క్రీడాభివృద్ధికి వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేసుకోవాలి.
  4. పై అంశాలపై  క్వార్టర్లీ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ (త్రైమాసిక పురోగతి) ఇవ్వాలి.
*నిషేధం ఎత్తివేత వల్ల ప్రయోజనం-  ఏఏఐపై నిషేధం తొలగిపోవడంతో భారత ఆర్చర్లు ఇకపై టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా జెండా కింద బరిలోకి దిగనున్నారు.
భారత ఆర్చరీ సంఘం ఎన్నికలు --భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి అర్జున్‌ ముండా ఎన్నికయ్యారు. 
ఎన్నికల్లో అర్జున్‌ 34-18తో తెలంగాణకు చెందిన బీవీ పాపారావును ఓడించారు.


బ్రెగ్జిట్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

*యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వేరుపడేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిపై రాణి ఎలిజబెత్‌-2 సంతకం చేశారు.
* ఈయూ అంగీకారం కూడా లభిస్తే ముందుగా నిర్ణయించినట్టు ఈ నెల 31న బ్రెగ్జిట్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది.
*తొలుత దిగువ సభ హౌస్‌ఆఫ్‌ కామన్స్‌ ఆమోదముద్ర పొందిన ఈ బిల్లుకు ఎగువ సభ హౌస్‌ఆఫ్‌ లార్డ్స్‌ కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ వెనక్కి పంపింది. 
*ఈ సవరణలను దిగువ సభ భారీ మెజార్టీతో తిరస్కరించటంతో, స్వల్ప వ్యవధి చర్చ అనంతరం ఎగువ సభ కూడా తమ ఆమోదముద్ర వేసింది.
*దీనితో బ్రెగ్జిట్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం లభించింది.
*ఎగువసభలో ఈ బిల్లుకు ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవటంతో ఓటింగ్‌ అవసరం రాలేదు. 
* 2016 జూన్‌లో జరిగిన రిఫరెండంలో బ్రిటన్‌ ప్రజలు బ్రెగ్జిట్‌కు ఓటు వేసిన మూడున్నరేళ్లకు ఇప్పుడు ఆమోదం లభించింది.
*బ్రెగ్జిట్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించటంతో ఈ నెల 31వ తేదీన బ్రిటన్‌ ఐరోపా కూటమి నుండి నిష్క్రమించనుంది. 
*2021 జనవరి 1 నాటికి కూటమితో శాశ్వత సంబంధాలు నెలకొల్పుకునేందుకు బ్రిటన్‌ ఆసక్తి చూపుతుంది కాబట్టి  ఈ ఏడాది మొత్తం యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌ అధికారులు కూటమి నిబంధనలు అనుసరిస్తారు.

బర్త్ టూరిజంపై ఆంక్షలు
*అమెరికా తమ దేశానికి వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధించింది. 
*ప్రస్తుత పరిస్థితి---అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఆ దేశంలో పుట్టే ప్రతి ఒక్కరినీ అమెరికా పౌరులుగానే పరిగణిస్తారు. పాస్‌పోర్టు మంజూరు చేస్తారు.
సమస్యలు--
1.దీంతో తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కాలన్న ఉద్దేశంతో పలు దేశాలకు చెందిన గర్భిణులు ఆ దేశానికి వెళ్లి పిల్లలకు జన్మనిస్తున్నారు. 
2. అత్యంత ఆదరణ, విలువ ఉన్న అమెరికా పాస్‌పోర్టు తమ పిల్లలకు దక్కుతుందనే ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారు.
3 .అమెరికాకు చెందిన కొన్ని సంస్థలు దీన్ని వ్యాపార అవకాశంగా మలుచుకుంటున్నాయి.
4.బర్త్‌ టూరిజం ఏజెన్సీల వీసా మోసాలు, పన్ను ఎగవేత కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

*నూతన నిబంధనలు --
  1. వీసా దరఖాస్తుదారులెవరైనా కాన్పు కోసమే అమెరికాకు రావాలనుకుంటున్నట్లు కాన్సులర్‌ అధికారులు గుర్తిస్తే, వారికి పర్యాటక వీసాను నిరాకరిస్తారు. 
  2. నిజంగా వైద్య సేవల కోసమే గర్భిణులు రావాలనుకుంటే.. చికిత్స కోసం వచ్చే ఇతర సాధారణ విదేశీయుల తరహాలోనే వారిని పరిగణిస్తారు.
  3. చికిత్స, రవాణా, జీవన ఖర్చులకు అవసరమైన డబ్బు తమ వద్ద ఉందని వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది.  
  4.  దేశంలో బర్త్ టూరిజం అదుపులో పెట్టాలని ట్రంప్ నిర్ణయించారు.
*ఎప్పటి నుండి అమలు --జనవరి 24,2020 నుండి కొత్త నిబంధనలు అమలు లోకి వచ్చాయి.
*ఇతర అంశాలు --ఓ నివేదిక ప్రకారం,2012లో 36వేల విదేశీ మహిళలు అమెరికాలో పిల్లలకు జన్మనిచ్చి తిరిగి స్వదేశాలకు వెళ్లిపోయారు.
*అమెరికాకు వెళ్లడం, అక్కడ డెలివరీ చేయించుకుని, బర్త్ సర్టిఫికేట్ తీసుకునేందుకు దాదాపు 80 వేల డాలర్ల వరకూ ఈ సంస్థలు వసూలు చేస్తాయి. ఇందుకోసం అమెరికాకు చైనా, రష్యాల నుంచి ఎక్కువగా వస్తుంటారు.


రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్ గా భారత్
* ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారతదేశం అవతరించింది.
* స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వార్షిక స్థాయిలో తొలిసారిగా అమెరికాను భారత్ అధిగమించింది.
*కౌంటర్ పాయింట్ రీసెర్చ్ 'మార్కెట్ మానిటర్' నివేదికలోని అంశాలు ---
  1. 2019లో ఏడు శాతం వృద్ధితో 158 మిలియన్ ఎగుమతులకు చేరుకుంది.2018తో పోల్చితే ఇది 7 శాతం అధికం.  
  2. చైనా బ్రాండ్ల వాటా 2019 సంవత్సరానికి 72 శాతానికి చేరుకుంది, ఇది గత ఏడాది 60 శాతం ఉంది. 
  3. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేసింది. ఫీచర్ ఫోన్ మార్కెట్ 2019లో దాదాపు 42 శాతం తగ్గింది.
  4.  బ్రాండ్ల పరంగా చూస్తే షియోమీ ఫోన్లదే అగ్రస్థానం. 

ఐదు లక్షల పరుగులతో మొదటి స్థానంలో ఇంగ్లాండ్
*టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన దేశంగా ఇంగ్లండ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
*క్రీడకు మాతృకగా ఇంగ్లాండ్ ను భావిస్తారు.
*ఒకప్పటి తన జాతీయ క్రీడ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్లు ఇప్పటి వరకు 5 లక్షల పరుగులు చేసి ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. క్రికెట్ లో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా గుర్తింపు పొందిన ఇంగ్లండ్ తాజాగా ఐదు లక్షల పరుగుల మైలురాయి దాటి మరో రికార్డు నెలకొల్పింది.
*ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సీరీస్ నాల్గో టెస్ట్ లో ఇంగ్లండ్ ఆటగాడు, జట్టు కెప్టెన్ జోరూట్ సింగిల్ తీయడం ద్వారా ఐదు లక్షల మైలురాయిని అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ ప్రారంభమయ్యాక ఆదేశానికి ఇది 1,022వ టెస్ట్.
*క్రికెట్ చరిత్ర --పదహారవ శతాబ్దంలో ఇంగ్లండ్ లో క్రికెట్ క్రీడ మొదలయ్యింది.ఆగ్నేయ ఇంగ్లండ్ (సౌత్ ఈస్ట్) లో ప్రారంభమైన క్రీడ కొన్నాళ్లకు దేశమంతా విస్తరించింది. 18వ శతాబ్దంలో ఆ దేశ జాతీయ క్రీడగా రాణించింది. 1739లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఏర్పడింది. 19వ శతాబ్దంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదులతోపాటే క్రికెట్ కూడా ఇతర దేశాలకు విస్తరించడం ప్రారంభించింది.
*20వ శతాబ్దం వచ్చేసరికి చాలాదేశాల్లో ప్రముఖ క్రీడగా గుర్తింపు సాధించింది.
*ప్రపంచ క్రికెట్ లో ఇంగ్లండ్ తర్వాత అత్యధిక రన్స్ చేసిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 830 టెస్టు ఆడిన ఆ దేశ ఆటగాళ్లు 4,32, 706 పరుగులు చేశారు.
*భారత్‌ జట్టు 540 టెస్టుల్లో 2,73,518 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్‌ 545 టెస్టులతో 2,70,441 పరుగులతో నాల్గో స్థానంలో ఉంది. 





జాతీయం

గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథి
*2019 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 
*2004లో అప్పటి భారత ప్రభుత్వం బ్రెజిల్ అధ్యక్షుణ్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. 
*భారత గణతంత్ర వేడుకలకు బ్రెజిల్‌ అధక్షుడు ప్రత్యేక అతిథిగా విచ్చేయడం ఇది మూడోసారి.
* జైర్ బోల్సోనారో జనవరి 24న ఇండియా వచ్చి 27 వరకూ భారత దేశంలో ఉంటారు.అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. 
* బోల్సోనారో జనవరి 1, 2019న అధ్యక్షుడయ్యారు.1964- 85 మధ్య బ్రెజిల్‌లో సైనిక నియంత పాలన కొనసాగడాన్ని ఆయన బహిరంగంగా సమర్థించిన బోల్సోనారో.. పలుమార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 
*భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించవచ్చని బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో 2019 అక్టోబర్ నెలలో ప్రకటించారు. 


పాన్ కార్డ్ వివరాలు ఇవ్వకపోతే 20% టీడీఎస్‌

*ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్‌ కార్డు వివరాలను యాజమాన్యాలకు అందజేయాలి.
* ఒక వేళ ఇవ్వకపోతే 20 శాతం మొత్తం కానీ, చట్టంలో వర్తించే రేటు ప్రకారం గానీ ఏది ఎక్కువ అయితే అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి వద్ద నుంచి వసూలు చేయాలి.
* సాధారణంగా 20 శాతం శ్లాబు కంటే తక్కువలోకి వచ్చే ఉద్యోగులు పాన్‌, లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వకపోతే వారికి జీతంలో 20 శాతం పన్ను కోత విధిస్తారు.
*20 శాతం శ్లాబు దాటితే ఎంత అయితే అంత కోత విధించడంతో పాటు 4 శాతం హెల్త్‌, ఎడ్యూకేషన్‌ సెస్‌ కూడా వసూలు చేస్తారు.
*పాన్‌కార్డు గానీ, ఆధార్‌ కార్డుగానీ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) చేయాలని ఆదాయపు పన్ను శాఖ అన్ని సంస్థల యాజమాన్యాలకు మరోసారి వెల్లడించింది.
*ఉద్యోగి యొక్క ఆదాయం 2.5 లక్షల పన్ను పరిధిలోకి వచ్చినట్లయితే, టిడిఎస్ అవసరం లేదు.
*చలాన్లు, టిడిఎస్-సర్టిఫికెట్లు, స్టేట్‌మెంట్లు, జారీ చేసిన ఇతర పత్రాలలో యజమానులు పన్ను మినహాయింపు సేకరణ ఖాతా సంఖ్య (టిఎఎన్) ను పొందాలి. విఫలమైతే రూ.10,000 జరిమానా విధిస్తారు.

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు నిలిపివేసిన సుప్రీం కోర్టు

*సుప్రీంకోర్టు తీర్పు- టాటా గ్రూప్ - సైరస్ మిస్త్రీ వ్యవహారంలో భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం NCLAT ఆదేశాలపై స్టే ఇచ్చింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ (ROC) దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీస్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిని తాజాగా సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది.
*కేసు నేపథ్యం--టాటా సన్స్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ ఇచ్చిన తీర్పులో కొన్ని సవరణలు చేయాలని ఎన్‌సీఎల్‌ఏటీని ఆర్‌ఓసీ(Registrar of Companies) కోరింది. 
*దీనికి ఎన్‌సీఎల్‌ఏటీ నిరాకరించడంతో ఆర్‌ఓసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
* టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు జనవరి 10న ఉత్తర్వులు జారీ చేసింది 
*దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 
* సైరస్‌ మిస్త్రీని తిరిగి టాటా సన్స్‌ ఛైర్మన్‌గానియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబరు 18న తీర్పు ఇచ్చింది.
* విచారణ మరియు తీర్పు-- ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆర్‌ఓసీ విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది.మిస్త్రీ పునర్నియామకాన్ని సవాల్‌ చేస్తూ టాటా సన్స్‌ వేసిన పిటిషన్‌తో పాటు విచారించనుంది. 

రాష్ట్రాలకు తగ్గనున్న నిధుల బదలాయింపు

*15వ ఆర్థిక సంఘం తయారు చేయనున్న నివేదికలోని అంశాలు --
*ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం,రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించనుంది.  
*ప్రస్తుతం ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేయనుంది. 
* ప్రత్యక్ష కేటాయింపులు తగ్గించి వివిధ రూపాల్లో రాష్ట్రాలకు అందించే గ్రాంట్లను పెంచే అవకాశం. 
*ఎన్ కె సింగ్ నేతృత్వం వహించిన ఆర్ధిక సంఘం తన నివేదికను గత ఏడాది డిసెంబర్ లోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందించింది.
*పథకాలకు నిధులను తగ్గించి రెవిన్యూ లోటు, విపత్తునిధి మున్సిపల్, పంచాయితీలు ఇతర స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ లను పెంచింది. 
* రాష్ట్రాల పని తీరు ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని సిఫారసు చేసే అవకాశం. 
* గ్రామీణ, సామాజిక రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ విధానాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశముంది.
*14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు భిన్నంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉండే అవకాశం ఉంది. 
*గతంలో ఉన్న 32 శాతం నిధుల కేటాయింపును 14 వ ఆర్థిక సంఘం 42 శాతానికి పెంచి గ్రాంట్లను తగ్గించింది. 
*నిధుల్లో తగ్గుదల వల్ల అనేక రాష్ట్రాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఇబ్బంది కలుగుతుంది. 
* కేంద్ర ఖజానాపై భారం తగ్గుతున్నప్పటికీ రాష్ట్రాలకు భారం పెరుగుతుంది. 
*2020-2021 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న సమయంలో ప్రస్తుతం ద్రవ్యలోటు జిడిపిలో 3.6 ఉంది.అంచనా 3.3 శాతం కంటే ఇది ఎక్కువ. 
* రెవిన్యూ కూడా భారీగా తగ్గి, ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం 114 శాతానికి పెరిగి పోయ

ఒకే వాహన రోడ్డు పన్ను
*వాహనం కొనేటప్పుడు రోడ్డు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
* రోడ్డు పన్ను అంశం రాష్ట్రాల జాబితా కిందకు వస్తుంది. ఈ పన్ను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. 
*కర్ణాటకలో అతి ఎక్కువగా  13 నుంచి 18 శాతం వరకు ఉంది.
*త్రిపురలో అత్యల్పంగా రూ.410 నుంచి రూ.825 దాకా ఉంటుంది. 
*వేరు వేరు వాహన పన్నుల వల్ల కలిగే నష్టం -
  1. తక్కువ పన్ను ఉన్న రాష్ట్రాల్లో వాహనాలను ఎక్కువగా కొంటుంటారు.
  2. ఎక్కువ పన్ను ఉన్న రాష్ట్రాల్లో వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుంది.
  3. వాహన సంస్థకు నష్టం కలుగుతుంది.
కేంద్రం తీసుకుంటున్న చర్యలు --
  1. అన్ని రాష్ట్రాల్లో ఒకే పన్ను విధానం తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
  2. 2018లో నియమించిన మంత్రుల కమిటీ 'ఒకదేశం-ఒకే రోడ్డు పన్ను' విధానం కింద విధించాల్సిన పన్నులకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది.
  3. మంత్రుల కమిటీ వాహనం ఖరీదు రూ.10 లక్షలలోపు ఉంటే 8 శాతం పన్ను, రూ.10-20 లక్షల మధ్య ఉంటే 10 శాతం పన్ను, రూ.20 లక్షలకు మించిన వాహనాలపై 12ు పన్ను విధించాలని సిఫారసు చేసింది.


ఉజ్వల పై అధ్యయనం
*ఉజ్వల యోజన పథకంపై అధ్యయనం -నివేదికలోని అంశాలు 
*ఈ అధ్యయనం చేసిన వారు- కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంచేశారు. 
  1. ఉజ్వల పథకం కింద ప్రజలను సిలిండర్లను కొనేలా చేయగలిగినా.. వాటిని పూర్తిగా వినియోగించేలా చేయడంలో యంత్రాంగం విఫలమయ్యింది. 
  2. పథకం కింద కేంద్రం పేద మహిళలకు సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్లు అందిస్తారు.
  3. పథకం ప్రారంభమైన తొలి 40 నెలల్లో 8 కోట్ల మందికి పైగా ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నారు. 
  4. గ్రామీణ ప్రాంతాల్లో కట్టె పొయ్యిలనే వాడుతున్నారు. వంటకు ఎల్పీజీని మాత్రమే వాడితేనే సత్ఫలితాలు అందుతాయి. 

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మే 1, 2016 సంవత్సరంలో ప్రారంభించారు.
* దారిద్ర్య రేఖ దిగువన ఉన్నకుటుంబాలకు 50 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్లు అందించడం కొరకు ఈ పథకాన్ని ప్రారంభించారు.


బ్రెజిల్ అధ్యక్షుడి భారత్ పర్యటన
* నాలుగు రోజుల పర్యటన కోసం బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బాల్సోనారో భారత్‌కు వచ్చారు. 
*జనవరి 26న నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో జాయిర్‌ బాల్సోనారో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
*ప్రధాని మోదీ బ్రెజిల్‌ పర్యటనలో ఉన్నప్పుడే బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బాల్సోనారోను ఆహ్వానించారు.
*పర్యటనలో అంశాలు--
  1. ప్రధాని మోదీతో సమావేశమై 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
  2. ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్‌ భద్రత ఒప్పందాలపై సంతకాలు. 
  3. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ 
  4. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జయశంకర్‌తో భేటీ



కనీస పెన్షన్ పెంపు అవకాశం

*కొత్త పెన్షన్‌ పథకం (ఈపీఎస్ )లో వారి కనీస పెన్షన్‌ను పెంచాలని కేంద్రం భావిస్తోంది.
*పెన్షన్‌ పెంపు కోసం యూనియన్లు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి.
*ప్రస్తుతం నెలకు రూ.1,000 ఉన్న కనీస పెన్షన్‌ను రూ.6,000కు పెంచే అవకాశం ఉంది.
*ప్రభుత్వం వద్ద దాదాపు రూ.3 లక్షల కోట్లు పెన్షన్‌ నిధులు ఉన్నాయి.
* అసంఘటిత కార్మికులతో పాటు వ్యాపారులకు సైతం ఇస్తున్న పెన్షన్‌ అయినా ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఇవ్వడం లేదు.
*గతంలోని కమ్యుటేషన్‌ పద్ధతిని పునరుద్ధరించే అవకాశం ఉంది.
*ఈ విధానంలో ఉద్యోగులు రిటైర్మెంట్‌ సమయంలో ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)తో పాటు కొంత పెన్షన్‌ మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు. 
* ఇలా తీసుకుంటే 15 ఏళ్ల పాటు నెలవారీ పెన్షన్‌ మూడోవంతు తగ్గుతుంది. 
* 2009లో నిలిపివేసిన ఈ పద్ధతిని పునరుద్ధరించాలని ఈపీఎఫ్‌వో కోరింది. 6.5 లక్షల మంది ఉద్యోగులకు ఇది లబ్ధి చేకూరుస్తుంది

‘పర్యాటన్‌ పర్వ్‌’ ఆఫర్‌

కోణార్క్‌లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు జరిగింది.
* ఈ సదస్సులో కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ చేసిన ప్రకటన లోని అంశాలు--
  1.  సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన  ప్రయాణికులకు కేంద్రం ఆఫర్‌ అందించనుంది. 
  2. ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
  3. సంవత్సరం లోపు 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన టూరిస్టులకు ప్రభుత్వం రివార్డుతో సత్కరిస్తుంది.
  4. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  ‘పర్యాటన్‌ పర్వ్‌’ కార్యక్రమంలో భాగంగా  అతడు /ఆమె 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలి. 
  5.  స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి 
  6. ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. ఇది నగదు రూపంలో కాకుండా   ప్రోత్సాహక​ బహుమతిగా ఉంటుంది.
  7. ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తారు.
  8. టూరిస్టు గైడ్స్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్‌ కూడా నిర్వహిస్తోంది. 

జాతీయ ఎన్నికల దినోత్సవం

*భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. 
*ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
*ఇది జనవరి 25, 2011 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. 
*18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ స్టేషన్లలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది.
* జనవరి 25వ తేదీన 10 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు.
*ఎన్నికల సంఘాన్ని జనవరి 25,1950 లో ఏర్పాటు చేశారు.
*జాతీయ ఎన్నికల దినోత్సవాన్ని 2011 జనవరి 25 నుండి జరుపుకుంటున్నారు.2011 సంవత్సరంలో ఎన్నికల సంఘం స్థాపించి 61 సంవత్సరాలు పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

తగ్గనున్న ప్రత్యక్ష పన్నుల వసూళ్లు
*కేంద్ర ప్రభుత్వం అంచనా --2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.13.5 లక్షల కోట్ల వసూలు కావచ్చని అంచనా వేసింది. 
*ప్రభుత్వ లక్ష్యం --2018-19లో నమోదైన రూ.11.5 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే 17 శాతం అధికంగా రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.(రూ.13.5 లక్షల కోట్లు)
*ప్రస్తుత పరిస్థితి- గత ఆర్థిక సంవత్సరం కంటే 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.ఈసారి వసూళ్లు రూ.10 లక్షల కోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది.
* బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే రూ.3 లక్షల కోట్లకు పైగా తగ్గవచ్చు. 
*గడిచిన 20కి పైగా సంవత్సరాల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అంతకు ముందు సంవత్సరం కంటే ఎప్పుడూ తక్కువగా వసూలు కాలేదు.
*జనవరి  23 వరకు ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరిన ఆదాయం రూ.7.3 లక్షల కోట్లు.
*ఆర్థిక మందగమనం వల్ల ప్రత్యక్ష పన్నుల వసూలు తగ్గుతున్నాయి.

విశ్వవిద్యాలయాల్లో మహిళా'విద్యాపీఠాలు'

మహిళా 'విద్యాపీఠాలు'
*కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటన --పదిమంది ప్రముఖ మహిళల పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాపీఠాలను ఏర్పాటు
*ఏ రంగంలో కృషి చేసిన వారి పేరు మీద?పరిపాలనదక్షులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సంఘసంస్కర్తలుగా తమదైన ముద్రవేసిన ప్రముఖ మహిళల పేరిట ఈ పీఠాలు ఏర్పాటవుతాయి.
*ఉద్దేశ్యం--ఆయా రంగాల్లో పరిశోధనలను చేపట్టడమే ఈ విద్యాపీఠాల లక్ష్యంగా ఉంటుంది.
*ఎవరి సహాయంతో? విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) సాయంతో వీటిని నెలకొల్పుతారు. 
*కాల వ్యవధి- ముందుగా ఐదేళ్ల కాలవ్యవధికి మాత్రమే వీటిని నెలకొల్పుతారు.
*ఎవరి పేరు మీద ?ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి, సాహితీ స్రష్ట మహాదేవి వర్మ,ఈశాన్య ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి గైదిన్‌లియు మొదలైన వారి పేరుమీద విద్యాపీఠాలు ఏర్పాటవుతాయి.


రాష్ట్రీయం 

అమరావతి విశాఖ లకు అవార్డులు

విశాఖలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. 
*ఈ సదస్సులో భాగంగా పలు అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందించారు. 
*‘ప్రజల కోసం నగరాల నిర్మాణం’ అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు జనవరి 24 ,25 తేదీల్లో జరిగింది. 
*స్మార్ట్ సిటీ మిషన్‌లో ఆంధ్ర ప్రదేశ్ నుండి అమరావతి,విశాఖ నగరాలు అవార్డులు దక్కించుకున్నాయి.
1.అమరావతి ---స్మార్ట్ నగరాల అంశంలో రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో అమరావతికి పురస్కారం లభించింది. 
*స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో కనబర్చిన పురోగతి ఆధారంగా అమరావతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 
ఈ సదస్సులో భాగంగా పలు అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందిస్తున్నారు. 
2. విశాఖ--విశాఖకు వినూత్న ఆవిష్కరణల అంశంలో ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవార్డు అభించింది.
3.సూరత్ --అత్యుత్తమ ప్రదర్శనతో సూరత్‌ నగరం 'సిటీ' అవార్డును కైవసం చేసుకుంది.

దిశ అమలుకు ప్రతి జిల్లాకు ప్రత్యేక న్యాయస్థానాలు
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ కేసుల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక న్యాయ స్ధానాలను ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్తర్వులు జారి చేసింది.
* న్యాయశాఖ జివో ఎంఎస్ నెంబర్ 17ను విడుదల చేసింది. 
* జివో ప్రకారం,ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే ఈ కోర్టులలో 21 మంది సిబ్బంది నియామకం అవుతారు. 
*కోర్టుల నిర్వహణ కోసం ఏడాదికి 1.93 కోట్లు ఖర్చు అవుతాయి. ఖర్చు మొత్తానికి కూడా జీవో అనుమతించింది. 
*ఈ కోర్సులను పర్యవేక్షించే అధికారం ఎవరికి ఉంటుంది?*ఈ వ్యవహారాలను రాష్ట్ర అత్యున్నత న్యాయ స్ధానం పర్యవేక్షిస్తుంది. 
*కోర్టు లోని సిబ్బంది--జిల్లా జడ్డి ఒకరు, సూపరిండెంట్ లు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, స్టేనో గ్రాఫర్ ముగ్గురు, జూనియర్ అసిస్టెంట్ ముగ్గురు, టైపిస్టులు ఇద్దరు, ఎగ్జామినర్ ఒకరు, కాపియిస్ట్ ఒకరు, రికార్డు అసిస్టెంట్ ఒకరు, అటెండెర్లు ఐదుగురు ప్రతి కోర్టులోనూ పనిచేయనున్నారు.
*దిశ చట్టం అమలుకు సంబంధించి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులుగా బాధ్యతలలో ఉన్న ఐఎఎస్ అధికారి కృతికా శుక్లాను దిశ ప్రత్యేక అధికారిగా నియమించారు. 
* ప్రత్యేక అధికారి యొక్క విధులు-- 
  1. మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలపై విచారణ కోసం ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేక ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఈ వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యత ప్రత్యేక అధికారిపై ఉంది.
  2.  లైంగిక వేధింపులకు గురైన వారి ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్య సేవలు పర్యవేక్షణ బాధ్యత ప్రత్యేక అధికారిపై ఉంటుంది. 
  3. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసులలో సంక్షేమం, ఉపశమనం, పునరావాసం, పోలీసులతో సహకారం వంటి మొత్తం బాధ్యతలను దిశ ప్రత్యేక అధికారి చూసుకుంటారు. 
  4. చట్టం అమలులో భాగంగా బాధితులకు వేగవంతమైన వైద్య సేవలు అందనుండగా, ప్రతి బోధన, జిల్లా ఆసుపత్రిలో దిశా చట్టం కోసం పత్యేక వైద్య కేంద్రం ప్రారంభిస్తారు.
*ప్రత్యేక కేంద్రం విధులు--
1.సున్నా ఎఫ్ఐఆర్ నమోదుతో సహా బాధితులకు అన్ని రకాల సామాజిక, చట్టపరమైన సహాయం అందించటం
2.వారిలో మానసిక స్ధైర్యాన్ని నింపడం. 
3. ఈ కేంద్రాలలో ఒక ఎస్ఐ స్థాయి అధికారి, గైనకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. 
4. కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 












No comments:

Post a Comment