Current Affairs in Telugu 21st January

అంతర్జాతీయం 

భారత వృద్ధిరేటు 4.8శాతం-ఐఎంఎఫ్
*అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మరోసారి భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించింది. 
*ఐఎంఎఫ్ ప్రకారం,2020లో భారత వృద్ధిరేటు 4.8శాతంగా ఉంటుంది.
*కారణాలు -
  1.  నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సెక్టార్, 
  2. బలహీన గ్రామీణ ఆదాయం పెరుగుదల వృద్ధిరేటు తగ్గించడానికి గల కారణాలు
*వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం జరుగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఈ సంస్థ తాజా నివేదికలను వెల్లడించింది. 
*నివేదికలోని అంశాలు --

  1.  2022 ఆర్థిక సంవత్సరం నాటికి భారత వృద్ధిరేటు 6.5 శాతానికి చేరుకుంటుంది.
  2. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్, క్రెడిట్ గ్రోత్ క్షీణత కారణంగా భారత వృద్ధిరేటు అంచనాల తగ్గుదలకు కారణాలు 
  3. భారత దేశీయ డిమాండ్ అనుకున్నదానికంటే వేగంగా పడిపోతుంది
  4. అంతర్జాతీయ వృద్ధిరేటును కూడా ఐఎంఎఫ్ తగ్గించింది. 
  5. 2019లో అంచనా వృద్ధిరేటు 2.9శాతానికి, 2020కి 3.3శాతానికి, 2021 ఆర్థిక సంవత్సరానికి 3.4శాతానికి తగ్గించింది.
  6. వచ్చే రెండేళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత్ లాంటి దేశాలు వృద్ధిరేటును సల్పంగా పెంచుకునే అవకాశం.
  7. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2019లో 3.7శాతం ఉంటే, 2020 నాటికి 4.4శాతంగా, 2021లో 4.6శాతానికి పెరుగుదల నమోదు చేస్తాయి.0.2శాతం పెరుగుదులను నమోదు చేస్తాయి.
  8. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కూడా వృద్ధిరేటు అంచనాలు మందగమనంలోనే ఉన్నాయి. 2019లో వృద్ధి 1.7శాతం ఉండగా.. ఇది 2020, 2021 నాటికి 1.6శాతానికి పడిపోయే అవకాశం ఉంది.
*ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాత్


ప్రపంచ సంపద సూచికలో భారత్ స్థానం

*ప్రముఖ రేటింగ్‌ సంస్థ 'క్రెడిట్‌ సూస్సే' రూపొందించిన 2019-ప్రపంచ సంపద సూచికలో భారత్‌ 7వస్థానంలో నిలబడింది.
*భారత్‌లో సుమారుగా రూ.895లక్షల కోట్ల సంపద ఉంది.
*గ్లోబల్‌ వెల్త్‌ రిపోర్ట్‌-2019'లో అమెరికా, చైనా, జపాన్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. 
*ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో మొత్తం సంపద సుమారుగా రూ.25560 లక్షల కోట్లు(360 ట్రిలియన్‌ డాలర్లు). ఈ సంపదలో అధికభాగం అమెరికాలో ఉంది.
*అయితే అమెరికా(30శాతం) పోగేసిన సంపద విలువ గణించగా... రూ.7526లక్షల కోట్లుగా ఉంది.రూ.4531లక్షల కోట్ల సంపదతో చైనా రెండో స్థానంలో (17.7శాతం) నిలబడింది.
*స్థిరచరాస్థులు, బ్యాంకులో నగదు, స్టాక్‌మార్కెట్లో షేర్లు...దగ్గర్నుంచీ ఇంట్లో ఉండే పాత ఫర్నిచర్‌, పాత సామానూ, గోడకు వేలాడదీసిన పేయింటింగ్స్‌ వరకూ అన్నింటినీ 'సంపద గణన'లో పరిగణలోకి తీసుకుంటారు.
*ఈలెక్కన...ప్రపంచంలో ఎంత సంపద ఉంది? అనేదానిపై అధ్యయనం చేసిన 'క్రెడిట్‌ సూస్సే' తాజాగా 'గ్లోబల్‌ వెల్త్‌ రిపోర్ట్‌-2019'ను విడుదలచేసింది.
*. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ సంపదలో భారత్‌ 3.5శాతం వాటా కలిగివుంది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, జపాన్‌, చైనాలు భారత్‌కన్నా ముందున్నాయి. 
*మొత్తం సంపదలో మొదటి 15దేశాలు 84.3శాతం వాటాను కలిగివున్నాయి.
*సంపదను పెంచుకోవటంలో చైనా ముందు స్థానంలో ఉంది.ముఖ్యంగా అక్కడి మధ్యతరగతి ఆ దేశ సంపదను పెంచటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
* ఈ నివేదిక ప్రకారం, మరో పదేండ్లలో చైనాలో ప్రయివేటు సంపద 120 శాతం పెరగవచ్చు.
*ప్రపంచ సంపదలో అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న మిగిలిన 13దేశాల సంపదకన్నా అమెరికా, చైనాల సంపద ఎక్కువగా ఉంది. 
*మొత్తం సంపదలో దాదాపు సగం (సుమారుగా 48శాతం) వాటాఈ రెండు దేశాలు కలిగివున్నాయి.


ప్రపంచంలో నిరుద్యోగ సమస్యలు
గత దశాబ్ధంతో పోలిస్తే ప్రపంచ నిరుద్యోగ రేటు నిలకడగానే సాగుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక పేర్కొంది. 
*నివేదికలోని అంశాలు --
  1. ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల మంది నిరుద్యోగులు, చిరుద్యోగులున్నారని, అర్హులకు సరైన ఉద్యోగం కల్పించకపోతే అది సామాజిక అశాంతికి దారి తీస్తుంది.
  2. నిరుద్యోగరేటు 5.4 శాతం కొనసాగుతున్నా ఆర్థిక మందగమంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య మాత్రం తగ్గిపోతుంది.
  3. 2019లో 18.8 కోట్ల మంది నిరుద్యోగులుగా నమోదు చేయించుకోగా, ఈ ఏడాది వారి సంఖ్య 19.5 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
  4.  ప్రపంచవ్యాప‍్తంగా 28.5 కోట్ల మందికి అన్ని అర్హతలున్నా అరకొర వేతనాలతో చిరుద్యోగులగానే బ్రతుకుతున్నారు.
  5. ప్రపంచ కార్మిక శక్తిలో దాదాపు 50 కోట్ల మందికి సరైన వేతనాలు అందడం లేదు.
  6. 2009 నుంచి 2019 మధ్య అంతర్జాతీయ స్ధాయిలో సమ్మెలు, ప్రదర్శనలు పెరిగాయి.
  7. ప్రపంచంలో 60 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. వీరంతా చాలీచాలని జీతాలతో కనీస సాంఘిక రక్షణలు లేకుండా పనిలో పాల్గొంటున్నారు.


జాతీయం
భాజపా పదకొండవ జాతీయ అధ్యక్షుడు
         
భాజపా పదకొండవ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి జగఏకగ్రీవ ఎంపిక జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వీరు హిమాచల్ ప్రదేశ్ కుభాజపా పదకొండవ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి జగఏకగ్రీవ ఎంపిక జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.  వీరు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారు హిమాచల్ ప్రదేశ్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పని చేశారు. పాఠశాలల అప్గ్రేడ్ చేయాలనే ఉద్యమంలో 45 రోజులు నిర్బంధము కు  గురయ్యారు., ఏబీవీపీ యువ మోర్చా లో పని చేశారు. గత జూన్ లోబిజెపి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పని చేశారు.పాట్నా యూనివర్సిటీఛాన్స్ లర్ గావ్యవహరించారు. ఎన్నికయ్యారు బిలాస్పూర్ నుంచి 1993లో అసెంబ్లీకిఎన్నికయ్యారు.  

     

సుఖోయ్‌ యుద్ధవిమానాలకు బ్రహ్మోస్‌

*హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు తంజావూరు బేస్‌ స్టేషన్‌గా భారత వాయు సేన (ఐఏఎఫ్‌) బ్రహ్మోస్‌ క్షిపణులను అమర్చిన సుఖోయ్‌ యుద్ధవిమానాలను ప్రారంభించింది.
* ఐఏఎఫ్‌ ప్రకారం, టైగర్‌షార్క్‌ 222 స్క్వాడ్రన్‌కు చెందిన సుఖోయ్‌30 ఎంకేఐ యుద్ధ విమానాలు దక్షిణ భారత జలాలపై ఆధిపత్యం సాధిస్తాయి.
* దక్షిణ భారత్‌లో తంజావూర్‌ వ్యూహాత్మక స్థావరంగా మారనుంది.
*చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ --భారత్‌-రష్యాల సంయుక్త కృషితో తయారైన బ్రహ్మోస్‌ క్షిపణులకు సుఖోయ్‌లు తోడై అత్యంత శక్తిమంతంగా మారాయి.ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు సులువుగా టార్గెట్‌ చేయగలవు. 
*ఈ విమానాలు ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1500 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం.


తూత్తుకుడి లో చమురు శుద్ధి కేంద్రం

*తూత్తుకుడి రూ.40 వేల కోట్ల వ్యయంతో ముడిచమురు శుద్ధీకరణ కేంద్రం నెలకొల్పేందుకు రాష్ట్ర మంత్రి వర్గం అంగీకరించిది.అల్‌కెరాఫీ సంస్థ ఆధ్వర్యంలో కొత్త చమురు శుద్ధీకరణ కేంద్రం నెలకొల్పేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
* అదే విధంగా శ్రీపెరుంబుదూరులో చైనాకు చెందిన వింటెక్‌ ఎలక్ట్రికల్‌ వాహనాల తయారీ కర్మాగారం ఏర్పాటు చేయడానికి కూడా మంత్రివర్గం అంగీకరించిది.
*దక్షిణాది జిల్లాల్లో కొత్త ఆరు పరిశ్రమలను ప్రారంభించడానికి కూడా మంత్రివర్గం అంగీకరించింది.
*'హైడ్రోకార్బన్‌' పథకం- 
*కేంద్రం నిర్ణయం--హైడ్రోకార్బన్‌ పథకానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి పొందాల్సిన అవసరం లేదని, ప్రజల అభిప్రాయాలు కోరాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. 
*తమిళనాడు డిమాండ్ --
  1. హైడ్రోకార్బన్‌ బావులు ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి పొందాలి. ఆ ప్రాంతానికి చెందిన ప్రజల అభిప్రాయాలు కోరాలి.
  2. ఈ పథకంతో కావేరి పీఠభూమి ప్రాంతంలో ప్రజల జీవనాధారం దెబ్బతింటుంది. సముద్రతీర జిల్లాల్లో హైడ్రోకార్బన్‌ ప్రాజెక్టులను అమలు చేస్తే తమిళ రైతులు తీవ్రంగా నష్ట పోతారు.
  3. హైడ్రోకార్బన్‌ ప్రాజెక్టులను అమలు చేయదలచిన ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలి.


మహిళలపై నేరాలు -జాతీయ మహిళా కమిషన్‌ నివేదిక
* జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తాజా నివేదిక ప్రకారం,మహిళలు వేధింపులకు గురవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 
*ఈ మేరకు 2018-19కు సంబంధించిన వార్షిక నివేదికను ఎన్‌సీడబ్ల్యూ విడుదల చేసింది.
* నివేదికలోని అంశాలు--దీని ప్రకారం
  1. మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, వేధింపులపై దేశవ్యాప్తంగా 19,279 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో 11,287 కేసులు (60 శాతం) యుపి నుంచే ఉన్నాయి. అంతకుముందు ఏడాది సైతం యుపినే మొదటిస్థానం (8,454 కేసులు.. 55 శాతం)లో ఉంది. 
  2. ఈ నివేదికలో ఢిల్లీ (1,733 కేసులు), హర్యానా (1,181), రాజస్థాన్‌ (733), మహారాష్ట్ర (591), మధ్యప్రదేశ్‌ (533), బీహార్‌ (754), బెంగాల్‌ (323)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  3. మహిళలు ఎక్కువగా తాము గౌరవంగా జీవించే హక్కును కోల్పోతున్నామని 6,792 ఫిర్యాదులు చేయగా.. వరకట్న వేధింపు కేసులు 2,584, పోలీసుల ఉదాసీనత కేసులు 2,734, మహిళలపై హింసకు సంబంధించి 1,636 కేసులు నమోదయ్యాయి.
  4.  కొంతకాలంగా పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయనే ఫిర్యాదులూ ఎక్కువవుతున్నాయి. 
*ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ



ఆర్బీఐ ద్వారా ఎన్పీఆర్‌

*జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) అప్‌గ్రెడేషన్‌పై కేంద్రం 2015 నాటి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి, తాజాగా బ్యాంకుల ద్వారా వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తుంది.
* మనీల్యాండరింగ్‌ నిబంధనలు-2005ను సవరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం 2015 జూలై 7వ తేదీన రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)కి ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.
* వినియోగదారుల నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాలతోపాటు 'నో యువర్‌ కస్టమర్‌' వివరాల్లో భాగంగా ఎన్పీఆర్‌ను సేకరించాలని అందులో సూచించింది.
*మూడేళ్ల తర్వాత ఆర్బీఐ 2018 ఏప్రిల్‌లో కేవైసీలో ఎన్పీఆర్‌ను భాగంగా మార్చుతూ ఆదేశాలిచ్చింది.
*బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, కొత్త అకౌంట్లకు ఈ వివరాలు తీసుకోవాలన్న ఆర్బీఐ సూచనలను అమలు చేయబోతున్నారు.





సాయిబాబాకు ముకుందన్‌ సి.మీనన్‌ అవార్డు

*మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఏటా ఇచ్చే ముకుందన్‌ సి.మీనన్‌ అవార్డును 2019 సంవత్సరానికిగానూ దిల్లీ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్‌ జి.సాయిబాబాకు నేషనల్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించింది. 
*ఈ సంస్థ జరిపిన ప్రకారం,90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నాసాయిబాబా తాను ఎంచుకున్న మార్గం నుంచి పక్కకు తప్పుకోలేదు.
*ప్రస్తుతం ఆయన నాగ్‌పుర్‌ జైలులో ఉన్నారు.



ఖేలో ఇండియా గేమ్స్‌లో ధనావత్‌ గణేష్‌

*ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణకు మరో మూడు పతకాలు లభించాయి.
*బాలుర అండర్‌-17 వెయిట్‌ లిఫ్టింగ్‌ 73 కిలోల పోటీల్లో ధనావత్‌ గణేష్‌ రజతం కైవసం చేసుకున్నాడు. 
*స్నాచ్‌లో 107 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 138 కిలోలు, మొత్తంగా 245 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు.
*బాలికల అండర్‌-21 బాక్సింగ్‌ 75 కిలోల కేటగిరిలో నిహారిక సెమీస్‌లో సనమాచ చాను (మణిపూర్‌) చేతిలో ఓడి కాంస్యం గెలిచింది.
*బాలుర అండర్‌-17 ఖో-ఖోలో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం లభించింది. 
*సెమీస్‌లో తెలంగాణ 6-9తో మహారాష్ట్ర చేతిలో ఓడింది. బాలికల అండర్‌-21 టెన్నిస్‌ సింగిల్స్‌లో సామ సాత్విక ఫైనల్‌ చేరింది. 
*బాలికల అండర్‌-17 సింగిల్స్‌లో సంజనా సిరిమల్ల సెమీస్‌కు చేరింది.




గ్రీన్‌పీస్ ఇండియా - కాలుష్యంపై నివేదిక
*గ్రీన్‌పీస్ ఇండియా అనే సంస్థ దేశంలోనే కాలుష్యంపై నివేదిక విడుదల చేసింది.
*నివేదికలోని అంశాలు -
  1. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఢిల్లీ కాస్త విజయం సాధించింది. 
  2.  జార్ఖండ్‌లోని ఝరియా భారత దేశంలో అత్యంత కలుషిత నగరంగా కొనసాగుతోంది.
  3. దేశంలోని 287 నగరాల్లో సమాచారాన్ని అధ్యయనం చేసి, ఈ నివేదికను రూపొందించారు. 
  4. పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం)10 డేటా ఆధారంగా విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. 
  5. భారత దేశంలో అత్యంత కలుషిత నగరాల్లో 10వ స్థానంలో ఢిల్లీ ఉంది. ఇది ఓ ఏడాది క్రితం 8వ స్థానంలో ఉండేది.
  6. కాలుష్య నగరాల జాబితాలో రెండో స్థానంలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఉంది. ధన్‌బాద్, ఝరియా నగరాలు బొగ్గు నిక్షేపాలు, పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఉన్నాయి.
  7. మిజోరాంలోని లుంగ్లీ కలుషిత నగరాల జాబితాలో చివరిలో ఉంది.
  8. టాప్ టెన్ కలుషిత నగరాల్లో ఆరు నగరాలు ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నాయి. నోయిడా, ఘజియాబాద్, బరేలీ, అలహాబాద్, మొరాదాబాద్, ఫిరోజాబాద్.



రాష్ట్రీయం

సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం

*రాష్ట్రాన్ని నాలుగు జోన్లగా విభజించే మంత్రివర్గ నిర్ణయాన్ని శాసనసభ ఆమోదించింది.
*నాలుగు బిల్లులకు ఆమోదం
*పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం
* విశాఖ పాలనా రాజధాని, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం
*అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ
*విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు
* హైకోర్టు కర్నూలు తరలింపునకు ఆమోదం
*రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లుగా విభజించాలని నిర్ణయం
* జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టరేట్‌ వ్యవస్థ ఏర్పాటు
*మంత్రులు రెండుచోట్ల అందుబాటులో ఉండాలని నిర్ణయం
* రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం
*రాజధాని రైతు కూలీలకు పరిహారం పెంపునకు మంత్రివర్గం ఆమోదం
* రైతు కూలీలకు ఇచ్చే పరిహారం రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు
*భూములిచ్చిన రైతులకు ప్రభుత్వమిచ్చే కౌలు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు
*సీఆర్‌డీఏ రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
*ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
* రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
*రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రూ.199 కోట్లు కేటాయింపునకు ఆమోదం
*ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరిపించాలని నిర్ణయం
*పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం
*సీఆర్డీఏను రద్దు చేస్తూ కొత్త బిల్లు ----సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది.  సీఆర్డీఏ స్థానంలో 'అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ'ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. 
* సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 
*సీఆర్డీఏ స్థానంలో 'అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్ అథారిటీ'ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. సీఆర్డీఏకు సంబంధించిన ఆస్తులు, అప్పులు అన్నీ ఏఎంఆర్డీఏకు బదలాయింపు చేస్తూ ప్రతిపాదన చేసింది.
*భూ సమీకరణ విధానంలో అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకూ.. పట్టా భూములు ఇచ్చిన రైతులతో సమానమైన ప్లాట్లను ఇవ్వాలని ప్రతిపాదించారు.
*రాజధాని ప్రాంతంలో రైతుల కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని బిల్లులో ప్రతిపాదించారు. భూములు లేని కూలీలకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్​ను 5వేలకు పెంచాలని ప్రతిపాదన చేశారు.






No comments:

Post a Comment