Current Affairs in Telugu 20 January

అంతర్జాతీయం 
నంబర్ వన్ ను ఓడించిన కోరి గౌఫ్‌

* ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రారంభమైన తొలి రోజే అమెరికా టీనేజ్‌ క్రీడాకారిణి కోరి గౌఫ్‌ అద్భుత విజయాన్నందుకుంది. అమెరికాకే చెందిన మాజీ వరల్డ్ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే ఓడించింది.
*ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల గాఫ్ 7-6(5), 6-3తో వీనస్ విలియమ్స్‌ను ఓడించింది.
*రెండో రౌండ్‌లో సొరానా సిర్‌స్టి(రొమెనియా)తో తలపడుతుంది.
*విలియమ్సన్‌ను ఓడించడం గాఫ్‌కు ఇది రెండో సారి. గతేడాది జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తొలి రౌండ్‌లోనే వినస్ విలియమ్స్‌ను గాఫ్ ఓడించింది.
*2009 వింబుల్డన్‌లో బ్రిటన్‌కు చెందిన లారా రాబ్సన్‌ 15 ఏళ్ల వయసులో మెయిన్‌ 'డ్రా'లో ఆడింది. అయితే లారా రాబ్సన్‌కు టోర్నీ నిర్వాహకులు నేరుగా మెయిన్‌ 'డ్రా'లో ఆడేందుకు వైల్డ్‌ కార్డు ఇచ్చారు.


మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌
*జేఎల్‌ఎల్‌ సిటీ ముమెంటమ్‌ ఇండెక్స్‌ (సీఎంఐ)  ప్రకారం,వరల్డ్‌ మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌ నిలిచింది.
* ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాల్లో టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది.బెంగళూరు రెండు, చెన్నై ఐదు, ఢిల్లీ ఆరో ప్లేస్‌లో నిలిచాయి. పుణే, కోల్‌కతా, ముంబై నగరాలు వరుసగా 12, 16, 20 స్థానాల్లో నిలిచాయి. 
* జేఎల్‌ఎల్‌ సిటీ ముమెంటమ్‌ ఇండెక్స్‌ (సీఎంఐ) ఏడో ఎడిషన్‌లో టాప్‌ -20 లిస్టులో రెండొంతులు ఆసియా పసిఫిక్‌ నగరాలే ఉన్నాయి.
*2014లో హైదరాబాద్‌ ఈ జాబితాలోనే లేదు. 2015లో 30, 2016లో ఐదో స్థానంలో నిలిచింది. 2018లో టాప్‌ ప్లేస్‌కు వచ్చింది. 2019లో బెంగళూరు ఫస్ట్‌ ప్లేస్‌కు రాగా ఇప్పడు మళ్లీ సిటీ ఫస్ట్‌ ప్లేస్‌కు వచ్చింది.
*నగరంలోని 40 శాతం జనాభా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లే ఉన్నారు.

చైనాలో కనిష్ట స్థానానికి జననాల రేటు
*చైనాలో గత ఏడాది జననాల రేటు అత్యంత తక్కువ స్థాయికి పతనమైంది. 
*1949లో కమ్యూనిస్ట్ చైనా ఆవిర్భావం తర్వాత జననాలు ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. 
* దేశంలో వృద్ధుల పెరుగుదల, శ్రామికశక్తి కుంచించుకుపోవడం ఆర్థిక మాంద్యానికి దారి తీసే అవకాశం ఉంది.
* జనాభా తగ్గుదల సంక్షోభాన్ని నివారించేందుకు 2016లో చైనా ప్రభుత్వం ఖఒకే బిడ్డగ నిబంధనను సడలించి, ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండేందుకు అనుమతిచ్చింది. 
* నిబంధన సడలించినా గర్భధారణలు పెరగడానికి అది దోహదం చేయలేదు. 2019లో వెయ్యి మందికి 10.48 జననాలుండేవి. 
*జాతీయ గణాంకాల సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎన్‌బిఎస్) విడుదల చేసిన ప్రకటన ప్రకారం,అంతకు ముందు ఏడాదికన్నా కొంచెం తగ్గుదల కనిపించింది. 
*వరసగా మూడేళ్లుగా జననాల రేటు పతనమవుతోంది. 2019లో 14.65 మిలియన్ బిడ్డలు పుట్టారు.

ప్రపంచ బాలమేధావి ఈశ్వర్‌ శర్మ

*ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్‌ విద్యార్థి, బ్రిటిష్‌ ఇండియన్‌ ఈశ్వర్‌ శర్మను ప్రపంచ బాల మేధావి-2020 అవార్డుతో బ్రిటన్‌ సత్కరించింది. 
*30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్‌నెస్, మార్షల్‌ ఆర్ట్స్‌ తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు.
*ఇంగ్లండ్‌లోని కెంట్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్‌ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
*'45 దేశాల నుంచి 15 వేల మంది దరఖాస్తుదారుల్లో ప్రపంచ బాల మేధావి అవార్డుకు ఈశ్వర్‌ శర్మ ఎంపికయ్యారు.

మూడో వన్డేలో సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ;

భారత్ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మూడో వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 132 బంతుల్లో 131 పరుగులు చేశారు. దీనిలో 14 ఫోర్లు ఒక సిక్సు గలవు. భారత క్రీడాకారులు రోహిత్ శర్మ 128 బంతుల్లో 119 పరుగులు దీనిలో8ఫోర్లు 6సిక్స్లు అదేవిధంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 79 పరుగులు చేసి భారత్ గెలిపించడానికి కారకులయ్యారు రోహిత్కు  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ,కోహిలి కి మన్ఆఫ్ద సిరీస్అవార్డులు లభించాయి

రాచరిక రాహోదాలకు స్వస్తి చెప్పిన హ్యారీ ,మెరికల్ ;

బ్రిటన్ యువరాణి మేఘన మార్కెల్ యువరాజు హరి రాజ కుటుంబం నుంచి అధికారికంగా తమకున్న రాయల్ గుర్తింపును వదులుకున్నారు.  దీనిపై అధికారిక ఒప్పందం పై సంతకం చేశారు.. దీనితో వారికి గౌరవ సూచకాలు ఉండవు . అంతేకాకుండా వారసులుగా వారు నిర్వహించే బాధ్యతలకు  పన్ను రూపంలో ఆదాయం కూడా ఇకపై వారికి అందదు. హ్యారీ దంపతులకు జన్మించిన ఆర్ కి ని రాజ కుటుంబ సభ్యులు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారని ఎలిజబెత్ రాణి పేర్కొన్నారు .. ఇకనుంచి కుటుంబం కెనడాలోనివసించ నుంది.  దీనితో రాయల్ మెరిసి దళానికి కెప్టెన్ గాహ్యారీ విధుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కుటుంబానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఏటా 8.. 22కోట్ల పౌండ్లు అందుతున్నాయి దీన్నిసావరిన్ గ్రాంట్ గా పేర్కొంటారు . ఈ ఒప్పందంతో రాచరిక విధుల కోసం హ్యారీ దంపతులకు ప్రభుత్వ నిధులు అందవు.  

40 % దేశాల్లో అలజడి
*'వెరిక్స్‌ మ్యాపిల్‌క్రాఫ్ట్‌' అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ పంచాంగం ప్రకారం,2020 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచంలోని 195 దేశాల్లో 40 శాతం దేశాల్లో, అంటే 75 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయి.అందులో భారత దేశం కూడా ఉంది.

*2019లో హాంగ్‌ కాంగ్, చిలీ, నైజీరియా, సుడాన్, హైతీ, లెబనాన్‌ తదితర 47 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొనగా 2020 సంవత్సరానికి ఆ పరిస్థితులు 75 దేశాలకు విస్తరిస్తాయని అంచనా వేసింది.
*ఈ నివేదిక ప్రకారం,గతేడాది ఎక్కువ అశాంతి పరిస్థితులు నెలకొన్న హాంగ్‌ కాంగ్, చిలీ దేశాల్లో ఈ ఏడాది కూడా అశాంతి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.మరో రెండేళ్ల వరకు ఆ దేశాల్లో పరిస్థితి మెరుగు పడే అవకాశం లేదు.

జాతీయం 

;K4క్షిపణి విజయవంతం

డి ఆర్ డి ఓ పరిధి లోని డి ఆర్ డి ఎల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కె ఫోర్ బాలిస్టిక్ క్షిపణిని సముద్రంలో ఉండే జలాంతర్గామి నుంచి ప్రయోగించగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది 2500 కేజీల బరువున్న అణ్వాయుధాలను ఈ క్షిపణి నుంచి ప్రయోగించవచ్చు 

అరిహంత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం

*3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అణు క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) విజయవంతంగా ప్రయోగించింది.
*ఆంధ్రప్రదేశ్ తీరంలో ఈ కే-4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది డీఆర్‌డీఓ. నేవీకి సేవలందిస్తున్న అణుజలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్‌లో ఈ అణుక్షిపణిని ఉంచుతారు. 
*ఈ అణుక్షిపణి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
*జనవరి 19వ తేదీన  సముద్ర గర్భం నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను చేధించేలా క్షిపణి ప్రయోగం జరిగింది. 
*ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది.
*భారత్ తయారు చేస్తున్న అరిహంత్ అణు జలాంతర్గాములకు సపోర్ట్ చేసేలా ఈ క్షిపణిని రూపొందించారు. 
*అణుజలాంతర్గాముల్లో మోహరించి ఉండేలా ఈ క్షిపణులు రూపొందిస్తున్నారు. 
*ప్రస్తుతం ఒకే ఒక అణు జలాంతర్గామి భారత నేవీకి సేవలందిస్తోంది.
*డీఆర్‌డీఓ రూపొందిస్తున్న సముద్ర గర్భ క్షిపణుల్లో కే-4 ఒకటిగా ఉంది. మరొకటి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల BO-5 క్షిపణి. 
*క్షిపణ ప్రయోగ సమయంలో వాయుసేనకు, మెరైన్ విభాగాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. 
*2017 డిసెంబర్‌లో ఏకే-4 ఎస్‌ఎల్‌బీఎం ప్రయోగం విఫలమైంది. బ్యాటరీలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రయోగం నాడు విఫలమైంది. కే-4 శ్రేణికి చెందిన క్షిపణిని చివరిసారిగా ఐఎన్‌ఎస్ అరిహంత్‌ జలాంతర్గామి నుంచి ఏప్రిల్ 2016లో ప్రయోగించారు.
* తాజా ప్రయోగంతో ఆకాశం, నేల, నీరు.. నుంచి అణ్వాస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం గల ఆరో దేశంగా భారత్‌ నిలిచింది.
*భారత్‌ తన జలాంతర్గాముల శ్రేణుల కోసం అభివృద్ధి చేస్తున్న రెండు అండర్‌వాటర్‌ క్షిపణుల్లో కే 4 క్షిపణి ఒకటి.

సత్వర న్యాయంలో 6వస్థానంలో కర్ణాటక

*ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌ 2019 -- సత్వర న్యాయం అందించడంలో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే 6వస్థానంలో ఉంది.
*ఈ నివేదిక ప్ర కారం సామాన్యులకు సత్వరం న్యాయం అందించే విషయంలో మహారాష్ట్ర టాప్‌లో ఉం ది. కేరళ, తమిళనాడు, పంజాబ్‌, హరియాణ తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
* టాటా ట్రస్టు నిర్వహణలో ప్రతి ఏటా ఇండియా జస్టిస్‌ రిపోర్టును సిద్ధం చేస్తున్నారు.
* హైకోర్టు, జిల్లా కోర్టులతోపాటు తాలూకా కోర్టులు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్సులలో పెండింగ్‌లో ఉన్న కేసుల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తున్నారు.
* లైంగిక వేధింపులు, హత్యాకేసుల విచారణను మరింత త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. 

శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు సునందా పట్నాయక్‌ మృతి

*ఒడిశాకు చెందిన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు సునందా పట్నాయక్‌ (85)జనవరి 19వ తేదీన కన్నుమూశారు. 
*కవి బైకుంఠనాథ్‌ పట్నాయక్‌ కుమార్తె అయిన సునందా పట్నాయక్‌ పలు జాతీయ అవార్డులతోపాటు ఒడిశా సంగీత అకాడమీ నుంచి సత్కారాలు పొందారు. 
*ఆమెపై నిర్మించిన లఘు చిత్రం 'నీల మాధవ్‌' 2010లో జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ లఘుచిత్రంగా అవార్డు సాధించింది.

శ్రీలంకకు 50 మిలియన్ డాలర్ల సహాయం

*ఉగ్రదాడులు, హెచ్చరికలతో సతమతమవుతోన్న శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది.
* సెక్యూరిటీని కట్టుదిట్టం చేసుకునేక్రమంలో ఆయుధాలు, ఇతరత్రా పరికరాల కొనుగోలు కోసం ఏకంగా 50 మిలియన్ డాలర్ల(సుమారు 400 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 
* జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ శ్రీలంకలో పర్యటించారు.
*శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సతో దోభాల్‌ సమావేశమయ్యారు.
*రక్షణ రంగంలో సహకారం, సముద్ర జలాల్లో భద్రత, ఇంటెలిజన్స్‌ షేరింగ్‌ సహా ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.
*శ్రీలంక ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత గొటబాయ రాజపక్స తన మొదటి విదేశీ పర్యటనగా భారత్ కు రావడం, ప్రధాని మోదీతో చర్చలు జరపడం జరిగింది.
*శ్రీలంకను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు. ఇది ఉన్న ప్రదేశం మూలంగా పశ్చిమ ఆసియాకు మరియు ఆగ్నేయ ఆసియాకు నౌకాయాన కేంద్రంగా నిలిచింది. ప్రాచీన కాలం నుంచి బౌద్ధ మతము నకు మరియు సంప్రదాయానికి కేంద్ర బిందువు. కానీ నేడు ఇతర మతాలైన హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ప్రజలు మరియు ఇతర జాతుల వారు 25% శాతం వరకూ ఉన్నారు. జనాభాలో సింహళీయులే అధికంకాగా ఉత్తర మరియు తూర్పు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తమిళులు మైనారిటీలో అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

దేశ బడ్జెట్ ను మించిన బిలియనీర్ల సంపద

*భారత్‌లోని 63 మంది బిలియనీర్ల సంపద మొత్తం కలిపితే దేశ వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువే ఉంటుందని అంతర్జాతీయ హక్కుల సంస్థ 'ఆక్స్‌ఫామ్‌' నివేదిక పేర్కొంది. 
*ఈ నివేదిక ప్రకారం,ఆర్థికంగా దిగువన ఉన్న 95.3 కోట్ల మంది ప్రజల సంపద కంటే కేవలం ఒక శాతం ధనవంతుల వద్ద ఉన్న సంపదే ఎక్కువ.
*నివేదికలోని ముఖ్యమైన అంశాలు --
  1. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు విస్తరిస్తున్నాయి.
  2.  గత దశాబ్దకాలంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అయింది.గత ఏడాది కాలంగా వారి మొత్తం సంపదలో తగ్గుదల కనిపించింది. 
  3. ఆర్థిక అసమానతలు రూపుమాపే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉంది.
  4.  లింగ భేదాల వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. 
  5.  ఒక టెక్‌ కంపెనీ సీఈవో సంవత్సరంలో ఆర్జించే మొత్తాన్ని సంపాదించడానికి ఒక సాధారణ గృహిణికి 22,277 సంవత్సరాలు పడుతుంది. సెకనుకు సగటున రూ.106 చొప్పున 10 నిమిషాల్లో ఓ సీఈవో సంపాదించే మొత్తాన్ని ఆర్జించడానికి మహిళకు ఒక ఏడాది సమయం పడుతుంది.
  6. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు రోజుకు 3.26 బిలియన్ల గంటలు ఎలాంటి భత్యం లేకుండా పని చేస్తున్నారు. ఈ లెక్కన వారంతా కలిసి ఏడాదికి సంపాదించగలిగే రూ.19 లక్షల కోట్ల మొత్తం భారత విద్యాశాఖ బడ్జెట్‌ కంటే 20 రెట్లు ఎక్కువ.
  7. జీడీపీలో రెండు శాతంగా ఉన్న సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల్ని నేరుగా అనుమతించడం వల్ల 2018లో కోల్పోయిన 11 మిలియన్ల ఉద్యోగాల్ని తిరిగి సృష్టించవచ్చు.
  8.  ప్రపంచంలోని తొలి 22 మంది ధనవంతుల సంపద.. ఆఫ్రికాలో ఉన్న మొత్తం మహిళల సంపద కంటే ఎక్కువ.
  9. ప్రపంచ అత్యంత ధనవంతుల్లో 1శాతం మంది పదేళ్లపాటు తమ సంపదపై 0.5శాతం అధిక పన్ను చెల్లిస్తే వృద్ధులు, బాలల సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాల్లో 117 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించొచ్చు.











No comments:

Post a Comment