Current Affairs in Telugu 19th January

అంతర్జాతీయం 


ట్రూనాట్ టీబీ టెస్ట్ -డబ్ల్యుహెచ్‌ఓ

*వ్యాధిని నియంత్రించేందుకు భారత శాస్తవ్రేత్తలు అభివృద్థి చేసిన సరికొత్త సాంకేతికతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) దృవీకరించింది.
*ప్రధానంగా ట్యూబర్‌కులోసిస్ (టీబీ)ని ప్రాథమిక దశలోనే కనుగొనేందుకు, దాన్ని నివారించేందుకు బహుళ ఔషధ విధానంతో కూడిన నియంత్రణ చర్యలతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన డయాగ్నోస్టిక్ విధానాన్నిశాస్త్రవేత్తలు అనుసరించారు.
*ప్రపంచ టీబీ నియంత్రణ కార్యక్రమం 'ట్రూనాట్ టీబీ టెస్ట్'లో ఈ సరికొత్త కణ పరీక్షా విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేరుస్తుంది.
*దీనిద్వారా కేవలం 90 నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. తద్వారా వెంటనే చికిత్సకు అవకాశం కలుగుతుంది.
*ఈ విషయాలను డబ్ల్యుహెచ్‌ఓ తన 'ల్యాబొరేటరీ మెడిసిన్ అండ్ పార్మకాలజీలో అనుసరించాల్సిన కణ పరీక్షలు, పరిశోధన' అనే సమాచార డాక్యుమెంట్‌లో పొందుపరచింది.
*భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ అభిప్రాయం--  ఇలా భారత చికిత్సకు సంబంధించిన సాంకేతికతను డబ్ల్యుహెచ్‌ఓ దృవీకరించడం వల్ల పేద, మధ్య స్థాయి ఆర్థిక స్థితికలిగిన దేశాలు సైతం 'ట్రూనాట్' విధానాన్ని టీబీ వంటి వ్యాధుల నియంత్రణకు వినియోగించేలా తయారు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
*అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టీబీని పారదోలేందుకు వీలు కలుగుతుంది.
*'ట్రూనాట్ అస్సే కిట్' వాస్తవానికి ఇతర విధానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నది,పైగా దాన్ని సోలార్ పవర్ బ్యాటరీలతో కూడిన లైబ్రరీల్లో మాత్రమే (ఎయిర్ కండిషన్స్ లేకుండా) భద్రపరిచేందుకు వీలు కలుగుతుంది.
*ఈ కిట్ రెండు రకాలుగా పనిచేస్తుంది.తొలుత స్పుటమ్ (గళ్ల) నుంచి డీఎన్‌ఏను సేకరించడానికి, రెండో దశలో వ్యాధి తీవ్రతను గుర్తించి దానికి నివారణకు అనుసరించాల్సిన బహుళ ఔషధ చికిత్సా విధానాన్ని సూచిస్తుంది.
*కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖ (డీహెచ్‌ఆర్) నేతృత్వంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం మేరకు భారత శాస్తవ్రేత్తలు, కంపెనీలు అనేక విధాలైన సాంకేతికతలను టీబీ నివారణ కోసం కనుగొనగా అందులో ఈ విశిష్ట కిట్‌లను నిపుణులు ఎంపికచేసి దేశంలోని నాలుగు రెఫరల్ ప్రయోగశాలలకు పంపడం జరిగింది. 
* చివరికి 'ట్రూనాట్ ఎంటీబీ అండ్ రిఫ్' అస్సేను అత్యున్నత ప్రమాణాలు కలిగిన విధానంగా ఎంపిక చేశారు.
*ఐసీఎంఆర్ సిఫారసుల మేరకు జాతీయ టీబీ నివారణ కార్యక్రమంలో దీన్ని చేర్చడం జరిగింది.
* సమర్థత విషయంలో ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 'జీన్‌ ఎక్స్‌పర్ట్‌' విధానానికి ఏ మాత్రం తీసిపోదు.



చైనాలో ప్రమాదకర వైరస్
*చైనాలో విశ్వవిద్యాలయాల నగరంగా పేరొందిన 'వూహాన్‌'ను ఓ సరికొత్త వైరస్‌ వణికిస్తోంది.
*దాదాపు 60 మంది చైనీయులు ఈ వైరస్‌ బారిన పడగా.. న్యూమోనియా తరహా లక్షణాలతో బాధపడుతూ వారిలో ఇద్దరు మరణించారు. 
* ఈ కొత్త వైరస్‌ కరోనా జాతికి చెందిందిగా చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు.ఇది గతంలో గుర్తించిన కరోనా వైర్‌సలకు భిన్నంగా ఉంది. దీని గురించి తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది.
*ఈ వైరస్‌ సోకినవారికి తీవ్రంగా జ్వరం,శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది,ఊపిరితిత్తులు దెబ్బతినడం జరుగుతుంది.
*ఈ వైరస్‌ వ్యాపిస్తున్న వూహాన్‌ నగరంలో చాలా వైద్య విశ్వవిద్యాలయాలున్నాయి. 500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఆ వర్సిటీల్లో చదువుకుంటున్నారు. వైరస్‌ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం వారికి సూచించింది. అలాగే.. చైనా నూతన సంవత్సర సెలవుల సందర్భంగా అక్కడి నుంచి, ముఖ్యంగా వూహాన్‌ నగరం నుంచి భారత్‌కు వస్తున్నవారికి హెచ్చరికలు జారీ చేసింది.
*'ఒక సరికొత్త కరోనావైరస్‌ కారణంగా చైనాలో ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయి. జనవరి 11 నాటికి 41 ధ్రువీకరించిన కేసులు నమోదయ్యాయి.  





జీడీపీ వృద్ధి 5.7శాతం - ఐక్యరాజ్యసమితి
* ఐక్యరాజ్యసమితి భారత జీడీపీ గణాంకాల్ని తగ్గించింది. 2019-20లో జీడీపీ వృద్ధి 5.7శాతం నమోదుకావొచ్చని తాజాగా అంచనావేసింది.
*ఇంతకుముందు ఆర్‌బీఐ, ఎస్‌ బీఐ, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, మూడీస్‌, నోమురా (రేటింగ్‌ సంస్థలు)...భారత జీడీపీ వృద్ధి తగ్గుతుం దని అంచనావేశాయి.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడాదికి సంబంధించి వివిధ దేశాల వృద్ధి అంచనాలను తెలియజే స్తూ ఐరాస నివేదిక (ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు- 2020)ను విడుదలచేసింది.
* చైనా 2019లో 6.1శాతం జీడీపీ వృద్ధి సాధించవచ్చునని ఐరాస అంచనావేసింది.
*కూరగాయల ధరలు 60.5శాతం, పప్పు దినుసుల ధరలు 15.44శాతం పెరిగాయి.
* డిసెంబరు 2019లో రిటైల్‌ ద్రవ్యోల్బణం (టోకు ధరల ఆధారిత) 7.35శాతానికి పెరిగింది. 
*జులై 2014 తర్వాత అత్యధికస్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదైంది.
*సీఎంఐఈ తాజా గణాంకాల ప్రకారం, 13 జనవరి 2020నాటికి నిరుద్యోగం 7.6శాతానికి (45ఏండ్ల గరిష్టం) పెరిగింది.
*దేశ జీడీపీలో 7శాతం వాటా, తయారీరంగంలో 49శాతం వాటా కలిగివున్న వాహనరంగం అనేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నది.
*గత రెండు సంవత్సరాలుగా వాహన అమ్మకాలు క్షీణించాయి. అమ్మకాలు 19ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి.
*ఐఐపీ సెప్టెంబరులో 4.3శాతం, అక్టోబరులో 3.8శాతం నమోదైంది. గణాంకాలు 8ఏండ్ల కనిష్టానికి చేరుకున్నాయి.



సాల్వే మరో ఘనత
*భారత్‌కు చెందిన న్యాయ కోవిదుడు, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీష్‌ సాల్వే ఘనతను సాధించారు.
*ఇంగ్లాండ్‌, వేల్స్‌ కోర్టులకు సంబంధించి 'క్వీన్స్‌ కౌన్సిల్‌' సభ్యునిగా ఆయన నియమితులయ్యారు. 
*బ్రిటన్‌ మహారాణి ఆస్థాన న్యాయవాది పదవిని సాల్వే మార్చి 16న చేపడతారు.
* న్యాయశాస్త్రంలో అసామాన్య ప్రజ్ఞ కనబరిచిన వారికి మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది.
*ఒక ప్రత్యేక రకమైన సిల్క్‌ వస్త్రాలను ధరించే క్వీన్స్‌ కౌన్సిల్‌ సభ్యులను ''టాకింగ్‌ సిల్క్‌'' అనటం సంప్రదాయం. *నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పొందిన సాల్వే, 1992 నుంచి దిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్నారు. 1992-2002 కాల వ్యవధిలో భారత సొలిసిటర్‌ జనరల్‌గా కూడా పనిచేశారు. సాల్వే ప్రస్తుతం బ్లాక్‌స్టోన్‌ ఛాంబర్స్‌ అనే న్యాయసంస్థలో న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.
*సీనియర్‌ న్యాయవాది అయిన హరీష్‌ సాల్వే, ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సమక్షంలో కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసును భారతదేశం తరపున వాదించారు. 
*ఈ కేసులో పాక్‌కు వ్యతిరేకంగా వాదించి, గెలవటం ద్వారా ఆయన భారత్‌కు ఘనవిజయం సాధించిపెట్టారు. 
* ఈ కేసుకు ఫీజుగా ఆయన కేవలం రూ.1 మాత్రమే తీసుకున్నారు.
*ఎనిమిదవ హైదరాబాద్‌ నిజాం ఒక బ్రిటిష్‌ బ్యాంకులో 35 మిలియన్‌ పౌండ్లు (306 రూ. కోట్లు) డిపాజిట్‌ చేసిన కేసులో కూడా భారత్‌కు అనుకూలంగా తీర్పు రావటంలో హరీష్‌ సాల్వే ప్రముఖ పాత్ర పోషించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో సాల్వేకు రెండో అత్యున్నత విజయం.




జాతీయం

విరామం తరువాత సానియామీర్జా తొలి విజయం;


రెండుసంవత్సరాల విరామం తరువాత సానియామీర్జా తొలిసారిగా  అంతర్జాతీయ హాబర్ట్ మహిళల డబుల్స్ లో విజయం సాధించింది, ఈ టోర్నీలో ఫైనల్ నందు చైనాకు  చెందిన షు పెంగ్ మరియు షూ జుంగ్ ల పై సానియా ,ఉక్రెయిన్ కు చెందిన నదియా తో కలిసి 6- 4 తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో సానియా మీర్జా జోడి కి 9.4 లక్షల నగదు బహుమతితో పాటు 280 లభించినది సానియా మీర్జా చివరిసారిగా 2017లోఅమెరికాకు చెందినబేథానిమాటెక్తో కలిసి brisbane అంతర్జాతీయ టోర్నీలో విజయం సాధించింది.  2018 లోఇజ్హన్ కు జన్మనిచ్చిన తర్వాత కూడా తన ఫిట్నెస్ తగ్గలేదని మరొకసారి నిరూపించింది 2017 లో బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తర్వాత సానియా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే 2017 అక్టోబర్ లో చైనా ఓపెన్ ఆడిన సానియా ఆ తర్వాత గాయపడి ఆటకు దూరమైంది ముప్పైమూడేళ్ళ కెరియర్ లో ఇది 42 వ డబుల్స్ టైటిల్, సానియా తో జత కట్టినఉక్రెయిన్  కు చెందిన నదియాకు 5వ డబుల్స్ టైటిల్





జోన్స్ ల్యాంగ్ లాసలే (J.L.L)జాబితాలో హైదరాబాద్ కు ప్రథమ స్థానం


జోన్స్ ల్యాంగ్ లాసలే (J.L.L)జాబితాలో హైదరాబాద్ కు ప్రథమ స్థానం; 2020 సంవత్సరానికి గాను ఇరవై అగ్రశ్రేణి నగరాల జాబితాలో హైదరాబాద్ కు ప్రథమ స్థానం లభించింది. ర్యాంకింగ్ 130 నగరాలలో చేయడం జరిగింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ స్థిరాస్తి వ్యాపారం అవకాశాలు ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130నగరాల్లో  జోన్స్ ల్యాంగ్ లాసలే సంస్థ అధ్యయనం చేసింది. గతంలో ఈ సర్వేలో కూడా హైదరాబాద్కు ర్యాంకు రావడం జరిగింది(2018). గత ఏడాది నుంచి హైదరాబాదు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూ అమెజాన్ లాంటి అతి పెద్ద క్యాంపస్ ను కూడా కలిగి ఉంది. ఏడాదిలో 20 శాతం వృద్ధిని సాధించింది భారత్ నుంచి ఈ జాబితాలో హైదరాబాద్  ఒకటవ, బెంగళూరు రెండో స్థానంలో, ఢిల్లీ ఆరో స్థానంలో ,పూణే 12వ స్థానంలో ,కోల్కత్తా 16వ స్థానంలో ,ముంబై 26 స్థానంలో ఉంది అదేవిధంగా పక్కనున్న చైనా నుంచి ఐదు నగరాలు ఎంపిక కావడం జరిగింది వాటిలో అవి షెన్జెన్ 10, చొంగ్విన్ 11,వుహాన్ 13 ,హాంగ్జౌ 15, షాంగై 17వ ర్యాంకులలో ఉన్నాయి అదే విధంగా అమెరికా నుంచి  సిలికాన్ వ్యాలీ 9 ,ఆస్టిన్ 19వ ర్యాంకులలో , మధ్య ఆసియా, ఆఫ్రికా నుంచి నైరోబి 4వ ర్యాంకు,దుబాయి 14వ ర్యాంకు, ఆగ్నేయాసియా నుంచి హొచిమిన్ 3వ ర్యాంకు, హనోయి 7 ,మనీలా 8 వర్యాంకుతో నగరాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి .హైదరాబాదులో వాణిజ్య సముదాయాల గిరాకీ 50 శాతం పెరిగింది. ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త ప్రోత్సాహకాలను ప్రకటించింది.  లుక్ ఈస్ట్ పాలసీని ప్రభుత్వం తీసుకొని వచ్చింది . గ్రేటర్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నది. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ప్రత్యేకంగా కూల్ రూఫ్ ప్రోగ్రాం ను ప్రారంభించింది. గత ఏడాది హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది ఈ ఏడాది బెంగళూరు ను రెండో స్థానంలోకి పంపించి హైదరాబాద్ మొదటి స్థానం లోకి వచ్చింది.




జీశాట్‌-30 విజయవంతం
*సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక వ్యవస్థ కలిగిన 'జీశాట్‌-30' ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. 
*ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్‌ -5 రాకెట్‌ ద్వారా నిర్ధిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టింది. 
*జనవరి 18వ తేదీన  స్పేస్‌ పోర్టులోని 3వ ఏరియన్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది.
*ఉపయోగాలు --
1.జీశాట్‌-30 ఉపగ్రహం బరువు 3,357 కిలోలు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం.
2.దీనిద్వారా టెలివిజన్‌, టెలీకమ్యూనికేషన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సేవలు మరింత బలోపేతం కానున్నాయి.
3.ఇది జియో స్టేషనరీ ఆర్బిట్‌ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో సమాచార సేవల్ని అందిస్తుంది. ఇన్‌శాట్‌-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్‌-30 ఉపగ్రహం పనిచేయనుంది.
4.జీశాట్‌-30తో నింగిలోకి దూసుకెళ్లిన ఎరియన్‌-5 రాకెట్‌ భూమికి 3,545 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 13617 కి.మీ. దూరంగా దీర్ఘ వృత్తాకారపు జీయోసింక్రనైజ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి చేరవేసింది. 
* ఇస్రో 2005లో ప్రయోగించిన ఇన్‌శాట్‌-4ఏ కాలపరిమితి గతేడాది అక్టోబరులో ముగిసింది.
* 15 సంవత్సరాలపాటు పనిచేసేలా దీన్ని రూపొందించారు. కాగా.. ఎరియన్‌-5 రాకెట్‌ జీశాట్‌-30తోపాటు ఐరోపాకు చెందిన యుటిల్‌శాట్‌ ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి చేరవేసింది.
*1981లో యాపిల్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఎరియన్‌ స్పేస్‌.. ఇప్పటి వరకూ జీశాట్‌-30తో సహా భారత్‌కు చెందిన 24 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది.
*జీశాట్‌-30 కక్ష్యలోకి చేరిన వెంటనే కర్ణాటక హసన్‌లోని మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ (ఎంఎ్‌సఎఫ్‌) దాన్ని ఇస్రో ఆధీనంలోకి తీసుకుంది.
*ఆన్‌బోర్డ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను ఉపయోగించి ఈ ఉపగ్రహాన్ని కొద్ది రోజుల్లోనే వృత్తాకారపు జియోస్టేషనరీ కక్ష్యలోకి చేరవేస్తారు.
* ఈ కక్ష్యలోకి చేరిన తర్వాత ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. డీటీహెచ్‌ టెలివిజన్‌ సర్వీసెస్‌, సెల్యూలర్‌ బ్యాక్‌హోల్‌ కనెక్టివిటీ, టెలివిజన్‌ అప్‌లింక్‌, టెలిపోర్టు సెర్వీసెస్‌, డిజిటల్‌ శాటిలైట్‌ న్యూస్‌ గ్యాదరింగ్‌ వంటి సేవలు అందించనుంది. 
*రోదసిలో ఇస్రో ప్రవేశపెట్టిన 18 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలతో కలిపి జీశాట్‌-30 పనిచేస్తుంది.




'చెక్‌బుక్‌'కు సరస్వతి సమ్మాన్ పురస్కారం
*సింధీ భాషా పుస్తకం ''చెక్‌బుక్‌'' 2019 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక సరస్వతీ సమ్మాన్‌ పురస్కారానికి ఎంపికైంది.
*ప్రముఖ రచయిత వాసుదేవ్‌ మోహి 2012లో ఈ చిరు కథల పుస్తకాన్ని(చెక్‌బుక్‌) రచించారు.
*సింధీభాషా సాహితీవేత్త అయిన వాసుదేవ్‌ మోహి పద్యాలు, కథలు, అనువాదాలు తదితరాలు కలిపి 25కు పైగా రచనలు చేశారు. సాహిత్య అకాడమీ అవార్డు సహా ఆయనకు ఇప్పటికే ఎన్నో పురస్కారాలు లభించాయి.
*సరస్వతి సమ్మాన్ పురస్కారం---సరస్వతి సమ్మాన్ భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ఉన్న 22 భారతీయ భాషలలో ఏదైనా ఒక భాషలో కవిత్యంలో ప్రతిభావంతులైన కవులకు అందజేసే వార్షిక పురస్కారం. ఈ పురస్కారానికి భారతీయుల విద్యనందించే దేవత సరస్వతి పేరును పెట్టారు. 
*ఈ పురస్కారాన్ని 1991లో కె.కె.బిర్లా ఫౌండేషన్ ప్రారంభించింది. ఈ అవార్డు కింద పతకం, ప్రశంసాపత్రంతో పాటు రూ.15లక్షల నగదును అందజేస్తారు.
*ఈ పురస్కారాన్ని గత 10 సంవత్సరాలలో సాహితీ రంగంలో జరిగిన ప్రచురణల నుండి ఒకదానిని పండితులు, మాజీ అవార్డు గ్రహీతలతో కూడిన బృందం ఎంపిక చేస్తుంది.
*
2018

పక్కకి ఒత్తిగిలితే
(కవిత్వం)
తెలుగు






నూతన ఆర్మీ వైస్‌ చీఫ్ నియామకం
* భారత సైన్యం వైస్‌ చీఫ్‌గా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎస్‌కె సైనీ నియమితులయ్యారు.
*వైస్‌ చీఫ్‌ పదవిలో ఉన్న లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎంఎం నరవనే భారత సైన్యాధ్యక్షుడిగా నియమితులు కావడంతో ఆ పదవి ఖాళీ అయింది. 
*దీనితో దక్షణి కమాండ్‌ చీఫ్‌గా ఉన్న లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎస్‌కె సైనీని ఆ పదవిలో నియమించారు. జనవరి 25వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.





షిరిడి సాయిబాబా పై రగడ ;
షిరిడి సాయి బాబా పై రగడ 
ప్రస్తుతం మహారాష్ట్రలోని షిరిడీ సాయి నాధుని  జన్మస్థలం గురుంచి వివాదం జరుగు 
తుంది. అసలుజన్మస్థలం స్థలం షిరిడి  లేదా పర్భని జిల్లా పత్రి అనే అనుమానాలు   వ్యక్తమవుతున్నాయి, ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అహ్మద్నగర్ జిల్లాలోని ని షిరిడి వాసులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన శిరిడి ఆలయ ప్రాధాన్యత తగ్గుతుంది అనేది వారి ఆందోళనకు కారణం .చరిత్రకారులుగోవింద్ మహారాజ్ మరియు  గోవింద్దబోల్కర్ తమ పుస్తకములో షిరిడి సాయి బాబా 1835 సెప్టెంబర్ 28న పత్రిలో బ్రాహ్మణ దంపతులకు జన్మించారు అని ఐదేళ్ల బాలుడి గా ఉండగా సాయిబాబా ఒక ఫఖీర్ కు పెంచుకోవడానికి ఇచ్చినట్లు వివరించారు. ఆ రోజుల్లోనే షిరిడి సాయి బాబా ముస్లిం ప్రార్ధనా స్థలాల్లో కి వెళ్లి హిందూ దేవతల ఆరాధన అదేవిధంగా హిందూ దేవాలయాల్లో ముస్లిం దేవతల ప్రార్ధన నిర్వహించే వారని ఈ రెండూ మతస్థులు ఫిర్యాదు చేయడం వల్ల పొరుగింట్లో ఉన్న వెంకోసా అనే వ్యక్తికి బాబాని అప్పగించారని 1939 నుంచి 1951 వరకువెంకోస    ఆశ్రమంలోనే శిరిడి సాయిబాబా ఉన్నాడని, పదహారేళ్ళ వయసులో షిరిడి కి వచ్చాడని వారు వివరించారు . ముంబైకి చెందిన విశ్వాస్ కేర్ సాయిబాబా పై పరిశోధనలు చేసి సాయి బాబా జన్మస్థలం పత్రియా అని కనుగొన్నాడు. బాబా జన్మస్థలంపత్రియ అని చెప్పడానికి 29 ఆధారాలు ఉన్నట్లుగా అతని పరిశోధనలో వెల్లడైంది అని ట్రస్ట్ సభ్యులు తెలిపారు .





సీఏఏను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
*పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించగా.. తాజాగా పంజాబ్‌ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. 
*సీఏఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికార కాంగ్రెస్‌ తీసుకొచ్చిన తీర్మానానికి పంజాబ్‌ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.
*పంజాబ్‌కు మంత్రి బ్రహ్మ మోహీంద్ర ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ''కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ, దేశ వ్యాప్తంగా అశాంతికి, నిరసనలకు కారణమైంది. స్వేచ్ఛా, సమానత్వంతో ఉన్న ప్రజాస్వామ్యానికి ఈ బిల్లు వ్యతిరేకం. మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పించడంతో దేశంలోని కొన్ని వర్గాల భాష, సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశం ఉంది.'' అని పంజాబ్ ప్రభుత్వం ఆ తీర్మానంలో పేర్కొంది.
*కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రవేశపెట్టగా.. ఒక్క భాజపా ఏకైక ఎమ్మెల్యే మినహా మిగతా సభ్యులంతా ఆమోదముద్ర వేశారు. 
*మరోవైపు ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన తొలి రాష్ట్రం కేరళనే.
* కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 19వ తేదీన నిర్ణయించుకుంది.






సీబీఐ నూతన జాయింట్ డైరెక్టర్
*సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) జాయింట్‌ డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌ నియమితులయ్యారు. 
*1994 గుజరాత్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శశిధర్‌. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. 


2025 నాటికి భారత్ కు ఎస్‌-400
* భారత గగనతలం శత్రు దుర్భేద్యంగా మారనుంది. భారత్‌ కోసం భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే ఐదు ఎస్‌-400 ట్రయంఫ్‌ దీర్ఘ శ్రేణి క్షిపణుల వ్యవస్థల తయారీని రష్యా ప్రారంభించింది. 
*భారత దేశానికి 2025 నాటికి ఎస్‌-400 క్షిపణులను సరఫరా రష్యా సరఫరా చేయనుంది.
*భారత్‌కు అందజేయనున్న ఎస్‌-400 మిస్సైల్స్‌ ఉత్పత్తి రష్యాలో ప్రారంభమయ్యింది.
*భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మార్చి22 నుంచి రెండు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. *రష్యా-భారత్‌-చైనా త్రైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. 
*ఎస్‌-400 మిస్సైల్స్‌ ఇప్పటి వరకూ రష్యా రక్షణ శాఖకు మాత్రమే అందు బాటులో ఉండేవి. తొలిసారిగా మన దేశ రక్షణకు అండగా నిలుస్తున్నాయి.
*అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా రష్యా నుంచి గగనతల రక్షణ క్షిపణులను కొనుగోలు చేయడానికి 2018, అక్టోబరులో భారత్‌ 35 వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. 
*చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కెమోవ్‌ మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందంపై కూడా త్వరలోనే ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి.
*హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌తో కలిసి రష్యాకు చెందిన రెండు సంస్థలు ఈ హెలికాప్టర్లను తయారు చేస్తాయి.



'ది ఫార్‌ ఫీల్డ్‌' నవలకు క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డు
*యువ రచయిత్రి మాధురీవిజయ్‌ (32)ని ప్రతిష్ఠాత్మక 'క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డు (జ్యూరీ కేటగిరీ)' దక్కింది.
*కశ్మీర్‌ లోయలో పరిస్థితులను ఆవిష్కరించిన 'ది ఫార్‌ ఫీల్డ్‌' నవలకు గాను ఈ పురస్కారం లభించింది. 
*బెంగళూరులో జన్మించిన మాధురి.. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. 'ది ఫార్‌ ఫీల్డ్‌' ఆమె రచించిన తొలి నవల.
*ఆ నవలకు భారత్‌లో అత్యంత ఖరీదైన సాహిత్య బహుమతిగా పేరున్న జేసీబీ ప్రైజ్‌ (సాహిత్యం)తోపాటు టాటా లిటరేచర్‌ లైఫ్‌ ఫస్ట్‌ బుక్‌ అవార్డును ఇప్పటికే గెల్చుకున్నారు. 
*సల్మాన్‌ రష్దీ, విక్రమ్‌ సేఠ్‌, కిరణ్‌ దేశాయ్‌ వంటి ప్రఖ్యాత భారతీయ రచయితలు గతంలో క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డును గెల్చుకున్నారు.




కదంబ మొక్క కాన్సర్ మందు
*కేవలం క్యాన్సర్ బారిన పడిన కణాల మీద మాత్రమే ప్రభావం చూపే చికిత్సను ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో కనుగొన్నారు.
*ఎలుకల మీద చేసిన ప్రయోగాలు విజయవంతం కావడం వల్ల త్వరలో ఈ విధానం అందుబాటులోకి రానుంది.
*సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించినా ఆ చికిత్స వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రోగిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. చికిత్స దుష్పరిణామాలను తట్టుకోలేక చనిపోయిన వారూ ఉన్నారు.
*ఈ సమస్యకు పరిష్కారాన్ని ఐఐటీ హైదరాబాద్, బొంబాయి పరిశోధకులు చూపించారు. భిన్న చికిత్సా విధానాలు ఉపయోగించి... ఆరోగ్యకరమైన కణాలపై ఎలాంటి ప్రభావం లేకుండా క్యాన్సర్ కణాలనే పూర్తిగా నాశనం చేయడంలో సఫలీకృతులయ్యారు. కదంబ మొక్క నుంచి సేకరించిన పదార్థం, ఐఆర్ 780డై వీరి పరిశోధనల్లో కీలక పాత్ర పోషించాయి.
*ఎలుకపై ప్రయోగం నియర్ ఇన్ ఫ్రారెడ్ కిరణాలు 'ఐఆర్ 780డై'పై పడినప్పుడు ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఈ వేడికి క్యాన్సర్ కణాలు నాశనమైపోతాయి. కదంబం నుంచి సేకరించిన పదార్థం తిరిగి ఈ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. పరిశోధనల్లో భాగంగా రొమ్ము క్యాన్సర్ కణాలను ఎలుకల్లోకి పంపి పరిశీలించారు.
*వీరి పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక జర్నల్ నానో స్కేల్​లో ఇటీవల ప్రచురితం అయ్యాయి. 





దాడుల్లో కేంద్ర సహాయానికి ఆధార్ తప్పనిసరి
*ఉగ్ర దాడులు, మతకలహాల్లో గాయపడిన వ్యక్తులు లేదా వారి కుటుంబీకులకు కేంద్ర ప్రభుత్వం అందించే పథకం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
*ఉగ్ర దాడిలో గాయపడిన వారు లేదా వారి కుటుంబీకులు, నక్సల్ దాడి బాధితులు, మతకలహాలల బాధితులు, భారత సరిహద్దుల్లో కాల్పులు, పేలుళ్ల బాధితులు భారత ప్రభుత్వం అందించే పథకానికి అర్హులవ్వాలంటే తప్పనిసరిగా తమ ఆధార్‌ గుర్తింపును తెలియపరచాలి.
*ఈ పథకం కింద అర్హులైన వ్యక్తులకు ఆధార్‌ గుర్తింపు సంఖ్య లేకపోతే వెంటనే దానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
*అసోం, మేఘాలయలో తప్ప దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఈ నియమం వర్తిస్తుంది.
*ఆ రెండు రాష్ట్రాలలో ఆధార్‌ నమోదు ఇంకా పూర్తికానందున వాటికి ఈ సూచన వర్తించదు.
* ఈ సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులకు అందజేస్తాయి. వారి నుంచి కేంద్రానికి ప్రతిపాదన అందినప్పుడు రాష్ట్రాలకు కేంద్రం ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.



భద్రత పై కేంద్రం ముందుకు
*ప్రజా రవాణా వాహనాల్లో మహిళలు, చిన్నారుల భద్రతకు ఉద్దేశించిన పర్యవేక్షణ కేంద్రాల ఏర్పాటులో రాష్ట్రాలు తగినంత పురోగతి సాధించలేదని కేంద్రం పేర్కొంది. 
*వీటిని త్వరితగతిన నెలకొల్పేందుకు తోడ్పాటు అందించడానికి కేంద్రం ముందుకు వచ్చింది.
*ఇందుకు ఫిబ్రవరి 15లోగా తమకు సమాచారమివ్వాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. 
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, రవాణా కమిషనర్లకు కేంద్రం లేఖలు రాసింది. 
*2019, జనవరి 1, ఆ తర్వాతి నుంచి నమోదైన వాహనాలన్నింటికీ వాహనాల ట్రాకింగ్‌ వ్యవస్థలను, అత్యవసర మీటలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
*వీటి ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు సుమారు రూ.463.90 కోట్లతో పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించింది.





పురుషుల దళానికి మహిళా నాయకత్వం


*కెప్టెన్‌ తానియా షెర్గిల్‌,ఆర్మీ అధికారిగా ఈమె అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 
*న్యూఢిల్లీలో జనవరి 16వ తేదీన నిర్వహించిన ఆర్మీ డే పరేడ్‌లో పురుషుల దళానికి ఆమె నేతృత్వం వహించారు. 
*ఆర్మీ డే పరేడ్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు.

* గత ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కెప్టెన్‌ భావనా కస్తూరి అనే ఆర్మీ అధికారి, పురుషుల ఆర్మీ బృందానికి నేతృత్వం వహించారు.






No comments:

Post a Comment