అంతర్జాతీయం
అమెరికాలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిక్కు మతస్తులు
*అమెరికాలో నివసిస్తున్న సిక్కు మతస్తులకు అరుదైన గుర్తింపు లభించింది.
* 2020 యూఎస్ (సెన్సస్) జనాభా లెక్కల ప్రకారం వారిని ప్రత్యేకమైన జాతిగా గుర్తించనున్నట్లు మైనారిటీ వర్గానికి చెందిన సంస్థ వెల్లడించింది.
*అమెరికాలోని సిక్కు మతస్తులకు మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలకు సైతం భవిష్యత్తులో ఇలాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించేందుకు ఇది ప్రారంభం అని చెప్పవచ్చు.
*యునైటెడ్ సిక్కులకు చెందిన ఒక బృందం యూఎస్ జననగణన అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా శాన్‌డిగో నగరంలో ఈ ఏడాది జనవరి 6న సమావేశం నిర్వహించారు.
* 'అమెరికాలో నివసిస్తున్నటువంటి సిక్కు మతస్తుల కచ్చితమైన జనాభా లెక్క ఉండాలంటే వారికి ఒక ప్రత్యేకమైన కోడ్ అవసరం.
*అందుకే వారికి ఈ గుర్తింపు లభించనుంది.
*ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 10 లక్షల మంది సిక్కు జనాభా ఉంది. అమెరికాలోని సిక్కులను ఒక ప్రత్యేక జాతిగా గుర్తించాలని.. వారి జనాభాను నిర్ధరించేందుకు ప్రత్యేక కోడ్ ఏర్పాటు చేయాలని గత రెండు దశాబ్దాలుగా సిక్కు మతస్తులు కోరుతున్నారు.
పెరుగుతున్న సముద్ర మట్టాలు
* ప్రపంచ మహా సముద్రాలు అసాధారణ రీతిలో వేడెక్కుతున్నాయని, ఈ తీవ్రత పెరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
* గ్లోబల్ వార్మింగ్‌కు సంబంధించి మరిన్ని ఆధారాలను సమకూర్చడంలో భాగంగా జరిపిన అధ్యయనం మేరకు గత 10 సంవత్సరాలలో సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
* అధ్యయనం లోని అంశాలు-- సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవాళి చర్యలు కారణం. సముద్ర మట్టాల పెరుగుదల, సముద్ర ఆమ్లీకరణ కారణంగా మహా సముద్రాలు అధిక వేడిని గ్రహిస్తున్నందున వాతావరణ పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి.
* గ్లోబల్ వార్మింగ్ వేగవంతం కావడంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
* 2004-2010 మధ్య కాలంలో మహా సముద్రాలు మొత్తం 15 మిల్లీమీటర్లు పెరిగాయి. 2010-2016 మధ్య కాలంలో ఇది రెట్టింపయ్యింది.
* ప్రత్యేకించి పశ్చిమ పసిఫిక్‌లోని ఉష్ణ మండల ప్రాంతాలు ప్రభావితమైన కారణంగా శతాబ్దాంతానికి అనేక తీర ప్రాంతాలు, లోతట్టు ద్వీపాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.
నివసించేందుకు అనువైన దేశాల్లో 25 స్థానంలో భారత్
*ప్రపంచంలో నివసించేందుకు 2020లో అత్యంత అనువైన దేశాల్లో భారత్ టాప్ 25లో స్ధానం దక్కించుకుంది.
*తేడాది కంటే రెండుస్థానాలను భారత్ ఎగబాకింది. 2019లో భారత్ ఈ జాబితాలో 27వ ర్యాంక్ ను దక్కించుకుంది.
*వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూఎస్ సహకారంతో యూఎస్ న్యూస్ అండ్ ది వరల్డ్ రిపోర్ట్ నిర్వహించిన సర్వేలో జీవించడానికి ఉత్తమ దేశాల్లో భారత్ కంటే చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, యూఏఈ వంటి నాలుగు ఆసియా దేశాలే ముందున్నాయి.
*జీవించేందుకు అనువైన దేశాల్లో భారత్ స్ధానం మెరుగుపడినా దేశంలో పిల్లల ఎదుగుదల లేదా మహిళల స్థితిగతుల విషయంలో భారతదేశం గురించి ప్రజలకు మంచి అవగాహన లేదని సర్వేలో తేలింది.
* ఈ విభాగంలో సింగపూర్ 22వ స్ధానంలో ఉండగా అంతర్గత సమస్యలు ఎదుర్కొనే కెన్యా, ఈజిప్ట్ వంటి దేశాలు సైతం భారత్ కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి.
*చిన్నారుల ఎదుగుదలకు అనువైన దేశాల్లో భారత్ 59వ స్ధానంలో ఉంది.
* 2019తో పోలిస్తే ఈ విభాగంలో ఆరు ర్యాంకులు మెరుగు పడింది.
* గతేడాది ఈ విభాగంలో భారత్ కు 65వ స్థానంలో నిలిచింది.
*మరోవైపు 2020లో మహిళల జీవనానికి అనువైన దేశాల జాబితాలో భారత్ 58వ ర్యాంక్‌లో ఉంది.2019తో పోలిస్తే ఈ విభాగంలో భారత్ ఒక స్ధానం దిగజారింది.
* పశ్చిమాసియా దేశాలు, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాలు భారత్ కంటే ఎగువ ర్యాంకులు సాధించాయి.
*ఈ సర్వేలో మన పొరుగు దేశాలు చైనా, శ్రీలంకలు సైతం మహిళలకు అనువైన జీవనం కల్పించడంలో భారత్ కంటే ముందున్నాయి.
*1 లక్ష జనాభాకు 36.4 హత్యల రేటుతో దక్షిణాఫ్రికా భారతదేశపు 2.2 కన్నా చాలా ఎక్కువగా ఉంది.
*మొత్తం మీద అత్యాచారాల నేరాల రేటు 72.1 వద్ద ఉంది భారతదేశం యొక్కఅత్యాచారాల నేరాల రేటు 5.2 గా మాత్రమే ఉంది. అయితే దక్షిణాఫ్రికా మత్రం మహిళలకు ఉత్తమమైన దేశాల్లో భారత్ కన్నా 15 ర్యాంకుల ముందు ఉంది.
జాతీయం
సివిల్ డ్రోన్ల దృవీకరణ పథకం
డ్రోన్లకు రిజిస్ట్రేషన్--
*భారత విమానయాన మంత్రిత్వశాఖ సివిల్ డ్రోన్ల ధ్రువీకరణ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పథకాన్ని ప్రారంభించింది. *జనవరి 31 వరకు ఆపరేటర్లందరూ తమంతట తాము ఈ వాలంటరీ రిజిస్ట్రేషన్ పథకం కింద డ్రోన్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.
*ఈ నిర్ణయం వెనుక నేపధ్యం--ఇరాన్ అగ్రశ్రేణి మేజర్ జనరల్ సులేమానీని అమెరికా దళాలు డ్రోన్ దాడితో హత్య చేసిన ఘటన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
*రిజిస్టర్ చేసుకోని వారిపై భారతీయ శిక్షా స్మృతి, విమానయాన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.
*రిజిస్ట్రేషన్ విధానం,అంశాలు--సివిల్ డ్రోన్లను, ఆపరేటర్లను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పించింది.
*డ్రోన్ వినియోగదారులందరూ జనవరి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
*ఆన్‌లైన్‌లో ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసుకోవడం ద్వారా డ్రోన్ రసీదు సంఖ్య(డీఏఎన్), యాజమాన్య రసీదు సంఖ్య(ఓఏఎన్) పొందుతారు.
*ఈ నంబర్లు దేశంలోని డ్రోన్లను ధ్రువీకరించడానికి తోడ్పడతాయి.
*ఫిక్కీ కమిటీ సహ వ్యవస్థాపకులు అంకిత్ మెహతా తెలిపిన ప్రకారం ,దేశంలో దాదాపు 50వేల నుంచి 60వేల అక్రమ డ్రోన్లు ఉన్నాయి.
*జనవరి 3వ తేదీన అమెరికా దళాలు డ్రోన్ సాయంతో ఇరాన్ మేజర్ జనరల్ సులేమానీని హత్య చేసింది. దీంతో భారత్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి అనుమతులు లేని డ్రోన్లపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
*డీజీసీఏ 2018 ఆగస్టు 27న భారత్‌లోని సివిల్ డ్రోన్ల నియంత్రణకు (సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్)సీఏఆర్‌ను జారీ చేసింది.
*దీని నిబంధనల కింద ఆపరేటర్లు ఏకీకృత గుర్తింపు నంబర్(యూఐఎన్) సహా ఇతర అనుమతులు తీసుకోవాలని సూచించింది.
మతపరమైన అంశాలపై సుప్రీం జోక్యం చేసుకోవచ్చా ?
* శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలని ఆదేశిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
* మతపరమైన ఆచారవ్యవహారాలలో కోర్టులు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు.. వంటి అంశాలపై మాత్రమే విచారణ జరుగుతోంది.
*శబరిమల కేసు విచారణలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత నవంబర్ 14న తమకు నివేదించిన అంశాలకు మాత్రమే చీఫ్ జస్టిస్ (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం పరిమితమవుతోంది.
*శబరిమల అంశంపై 2019లో సుప్రీంకోర్టు తీర్పు---గత ఏడాది నవంబర్ 14న అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం 3:2 మెజారిటీతో కొన్ని అంశాలను విచారణ నిమిత్తం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. అవి.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25, 26లో మతస్వేచ్ఛ కింద భిన్న ప్రభావం, 'రాజ్యాంగ నైతికత'అనే వ్యక్తీకరణను వివరించాల్సిన అవసరం, మతపరమైన ఆచార వ్యవహారాలలో కోర్టులు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు, ఆర్టికల్ 25 కింద హిందువులలోని వివిధ వర్గాలకు అర్థం, మతంలోని ఒక వర్గం లేదా తెగలో 'తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారాల'కు ఆర్టికల్ 26 కింద ఉన్న సంరక్షణ.ఈ అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు శబరిమల కేసులో రివ్యూ పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
*ప్రార్థన స్థలాలలోనికి మహిళలు, బాలికల ప్రవేశంపై నిషేధం విధించడం రాజ్యాంగపరంగా చెల్లుబాటవుతుందా అన్నది కేవలం శబరిమలకు మాత్రమే పరిమితం కాలేదని జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పులో వ్యాఖ్యానించింది.మసీదులు, దర్గాలలోనికి ముస్లిం మహిళల ప్రవేశంపై ఆంక్షలున్నాయి, పార్శీయేతర పురుషుడిని పెండ్లి చేసుకున్న పార్శీ మహిళను అగ్యారీ పవిత్ర అగ్ని వద్దకు రాకుండా నిషేధం విధించారు.
*మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రా ముస్లింలలో మహిళల జననాంగ విచ్ఛిత్తి, పార్శీయేతర పురుషుడిని పెండ్లి చేసుకున్న పార్శీ మహిళకు అగ్యారీలోని పవిత్ర అగ్ని వద్దకు రాకుండా నిషేధం వంటి అంశాలకు సంబంధించిన పిటిషన్లను లిస్టింగ్‌లో ఉంచాలని కోరుతామని, అయితే వాటిపై ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని ధర్మాసనం పేర్కొంది.
*ఈ విస్తృత ధర్మాసనంలో సీజేఐతోపాటు జస్టిస్‌లు ఆర్ భానుమతి, అశోక్ భూషణ్, ఎల్ నాగేశ్వరరావు, ఎం ఎం శంతనగౌడర్, ఎస్ అబ్దుల్ నజీర్, ఆర్ సుభాష్‌రెడ్డి, బీఆర్ గవాయ్, సూర్యకాంత్ ఉన్నారు.
*విచారణ జరుపాల్సిన అంశాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఏఎం సింఘ్వీతో సహా నలుగురు సీనియర్ న్యాయవాదులు నిర్ణయిస్తారు.
సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా మహేశ్వరి
*'సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్'(సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.పి. మహేశ్వరి నియమితులయ్యారు.
* యూపీ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ అధికారి అయిన మహేశ్వరి ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వశాఖలో ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత భద్రత)గా ఉన్నారు.
*డిసెంబరు 31న ఆర్‌ఆర్ భట్నాగర్ పదవీవిరమణ చేసిన నాటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
100 దేశాలతో అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు
*రైజినా డైలాగ్-2020 సమావేశం, వివరాలు---భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజినా డైలాగ్-2020 ఐదో అంతర్జాతీయ సదస్సు జనవరి 14 వ తేదీన ప్రారంభమై మూడు రోజులపాటు జరిగింది.
*ఈ సదస్సులో భారత్ తోపాటు మరో 100 దేశాలకు చెందిన ప్రత్యేక సభ్యులు పాల్గొన్నారు.
*'నావిగేటింగ్ ద ఆల్ఫా సెంచురీ'గా పిలుస్తున్న ఈ సదస్సుకు వివిధ దేశాల మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రధాన ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తదితరులతో కలిపి దాదాపు 700 మంది హాజరయ్యారు.
* అందులో ముఖ్యంగా 40 శాతం మంది మహిళలే ఉన్నారు.
* స్త్రీ, పురుష సమానత్వ అమలుకు సంబంధించి భారత్ అవలంబిస్తున్న విధానాలపై ప్రసంగించారు.
* భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అబ్జర్వర్ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది.
* సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
సమావేశంలో ముఖ్యమైన భాగం --ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మారుతున్న వాతావారణం, నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిర్మూలనకు కలిసికట్టుగా తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై తమ ఆలోచనలను వీరంతా భారత్‌తో పంచుకున్నారు.
*అంతర్జాతీయంగా ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం 2030 వరకు అనుసరించాల్సిన విధానాలపై కూడా చర్చించారు.
ఇంకా అందరికీ అందని వైద్యం
*2017-18 సంవత్సరానికి సంబంధించి చేసిన ఆల్ ఇండియా సర్వే ఆధారంగా జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌ఒ) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది.
*నివేదికలోని అంశాలు--భారత్‌లో 15 ఏళ్లు పైబడి ఉన్నవారిలో 10.6 శాతం మందే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
*ఇది గ్రామాల్లో 5.7 శాతం ఉండగా, మహిళల్లో 8.3 శాతానికి పరిమితమైంది. 2011 సెన్సెస్ ప్రకారం ఇదే వయసు పైబడి ఉన్నవారిలో గ్రాడ్యుయేట్ల శాతం 8.2 శాతంగా ఉంది.
*అప్పటి నుంచి దాదాపు దశాబ్దం గడిచినా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెద్దగా పెరగ లేదు. 2017-18 సర్వేలో విద్యకు సంబంధించి పూర్తి సమాచారం లేనందున, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితు ల్లోకి వెళ్లే అవకాశం లేదు.
*ఎన్‌ఎస్‌ఒ రిపోర్టు ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి సంఖ్య అత్యల్పంగా ఉంది.
*దళిత హిందువుల కంటే ముస్లిముల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. భారత్‌లో సామాజిక, ఆర్థిక అసమా నతలు, లింగవివక్ష శతాబ్దాలుగా కొన సాగుతూనే ఉన్నాయి. ఈ కారణాలతో ఉన్నత విద్యను అందుకుంటున్న వారి శాతం తక్కువగా ఉంది.
*విద్యకు అయ్యే ఖర్చు ---
-
ఒక ప్రభుత్వ విద్యాసంస్థలో గ్రాడ్యుయేషన్ చదవా లంటే ఒక విద్యార్థికి సగటున రూ.10,501 ఖర్చు అవుతుంది. అదే అన్‌ఎయిడెడ్ ప్రయి వేటు సంస్థలో దీనికి రెట్టింపు (రూ.19,972) అవుతుంది.
-
ప్రభుత్వ కళాశాలలో టెక్నికల్ కోర్సులో గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఏడాదికి రూ.36,180 అవుతుండగా, అదే ప్రయివేటు సంస్థలో ఈ ఖర్చు రూ.72,712 ఉంది.
-
2017-18 పిఎల్‌ఎఫ్‌ఎస్ సర్వే ప్రకారం 45 శాతం శాశ్వత ఉద్యోగులు, 60 శాతం స్వయం ఉపాధి గల వారి నెలవారీ ఆదాయం రూ.10 వేల కంటే తక్కువగా ఉంది.
-
భారత్‌లోని కార్మిక జనాభాలో 67 శాతం మంది ఏడాదికి రూ.లక్ష 20 వేలు మాత్రమే సంపాదించగలుగు తున్నారు.
నివేదికలోని ఇతర అంశాలు --
-
3 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్య గలవారిలో 15 శాతం పురుషులు, 14 శాతం మహిళల పేర్లు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా విద్యాసంస్థల్లోనే నమోదు కాలేదు.
-
మత, కులపరంగా ఉన్న కొన్ని కట్టుబాట్ల కారణంగా 5 శాతం మంది మహిళలు పాఠశాల వైపునకే చూడలేదు.
-
ఆర్థిక సమస్యల కారణంగా 24 శాతం మంది పురుషులు, 18 శాతం మంది మహిళలు విద్య నుంచి మధ్యలోనే డ్రాపౌట్ అయ్యారు.
-
వివాహాల కారణంగా 13 శాతం మంది మహిళలు విద్య నుంచి పక్కకు తప్పుకున్నారు.
-
కార్మికశక్తిలో గ్రాడ్యుయేట్ల శాతాన్ని పరిశీలిస్తే.. 2017-18 సంవత్స రానికి సంబంధించి ఉన్న శాశ్వత ఉద్యోగుల్లో 62 శాతం మంది గ్రాడ్యుయేట్లే ఉన్నారు.
-
ఇతరులకు ఇచ్చే వేతనం కంటే గ్రాడ్యుయేట్లకు ఇచ్చే వేతనం కొంత అధికంగా ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన వారిలోనూ నిరుద్యోగం అధికంగానే ఉంది.
ఒక ప్రభుత్వ విద్యాసంస్థలో గ్రాడ్యుయేషన్ చదవా లంటే ఒక విద్యార్థికి సగటున రూ.10,501 ఖర్చు అవుతుంది. అదే అన్‌ఎయిడెడ్ ప్రయి వేటు సంస్థలో దీనికి రెట్టింపు (రూ.19,972) అవుతుంది.
ప్రభుత్వ కళాశాలలో టెక్నికల్ కోర్సులో గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఏడాదికి రూ.36,180 అవుతుండగా, అదే ప్రయివేటు సంస్థలో ఈ ఖర్చు రూ.72,712 ఉంది.
2017-18 పిఎల్‌ఎఫ్‌ఎస్ సర్వే ప్రకారం 45 శాతం శాశ్వత ఉద్యోగులు, 60 శాతం స్వయం ఉపాధి గల వారి నెలవారీ ఆదాయం రూ.10 వేల కంటే తక్కువగా ఉంది.
భారత్‌లోని కార్మిక జనాభాలో 67 శాతం మంది ఏడాదికి రూ.లక్ష 20 వేలు మాత్రమే సంపాదించగలుగు తున్నారు.
3 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్య గలవారిలో 15 శాతం పురుషులు, 14 శాతం మహిళల పేర్లు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా విద్యాసంస్థల్లోనే నమోదు కాలేదు.
మత, కులపరంగా ఉన్న కొన్ని కట్టుబాట్ల కారణంగా 5 శాతం మంది మహిళలు పాఠశాల వైపునకే చూడలేదు.
ఆర్థిక సమస్యల కారణంగా 24 శాతం మంది పురుషులు, 18 శాతం మంది మహిళలు విద్య నుంచి మధ్యలోనే డ్రాపౌట్ అయ్యారు.
వివాహాల కారణంగా 13 శాతం మంది మహిళలు విద్య నుంచి పక్కకు తప్పుకున్నారు.
కార్మికశక్తిలో గ్రాడ్యుయేట్ల శాతాన్ని పరిశీలిస్తే.. 2017-18 సంవత్స రానికి సంబంధించి ఉన్న శాశ్వత ఉద్యోగుల్లో 62 శాతం మంది గ్రాడ్యుయేట్లే ఉన్నారు.
ఇతరులకు ఇచ్చే వేతనం కంటే గ్రాడ్యుయేట్లకు ఇచ్చే వేతనం కొంత అధికంగా ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన వారిలోనూ నిరుద్యోగం అధికంగానే ఉంది.
No comments:
Post a Comment