అంతర్జాతీయం
రష్యా ప్రధాని రాజీనామా
*రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదేవ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మెద్వెదేవ్ సమర్పించారు.
*మంత్రివర్గం, రాజ్యాంగంలో సంస్కరణలపై భేటీ తర్వాత మెద్వెదేవ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
*మెద్వెదేవ్‌తో పాటు తన మంత్రివర్గం రాజీనామా చేశారు.
*2012 నుంచి రష్యా ప్రధానిగా మెద్వెదేవ్ కొనసాగుతున్నారు. అంతకుముందు 2008 నుంచి 2012 వరకు రష్యా ప్రెసిడెంట్ గా దిమిత్రి సేవలందించారు.
*రష్యా నూతన ప్రధానిగా మైఖైల్ మిషుస్తిన్(53) పేరును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు.
*మిషుస్తిన్ మాస్కోలో జన్మించారు. 1990లలో ఐటీ నిపుణుడిగా పని చేశారు.
*1998 నుంచి ట్యాక్స్ సర్వీస్ అధికారిగా సేవలందించారు. ఆ తర్వాత డిప్యూటీ ట్యాక్స్ మినిస్టర్ గా పని చేశారు. 2008లో రష్యా పెట్టుబడి సంస్థ అయిన యూ ఎఫ్ జీ కంపెనీలో పని చేశారు మిషుస్తిన్.
*2010 నుంచి రష్యా ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ అధినేతగా మిషుస్తిన్ కొనసాగుతున్నారు. రష్యా ఐస్ హాకీ ఫెడరేషన్ బోర్డులో మిషుస్తిన్ ఒక మెంబర్ గా కూడా ఉన్నారు.
తైవాన్ అధ్యక్షురాలిగా తా యింగ్ వెన్
*తైవాన్ అధ్యక్షురాలిగా తా యింగ్ వెన్ (63) మళ్లీ ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఆమె అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
*ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
* చైనాకు అనుకూల కొమింటాంగ్ పార్టీ నాయకుడు హన్ క్యో యూను ఆమె ఓడించారు.
*తైవాన్ తమ భూభాగమే అంటున్న చైనాకు ఆమె విజయం పెద్ద ఎదురుదెబ్బలాంటిది.
*తమ దేశ రాజకీయాల్లో చైనా ప్రమేయాన్ని నిరోధిస్తూ తైవాన్ చట్టసభ జనవరి 14 వ తేదీన ఓ చట్టాన్ని ఆమోదించింది.
* తైవాన్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన నేషనలిస్ట్ పార్టీ అభ్యర్థులకు చైనా బలంగా మద్దతివ్వడం, ప్రచారానికి నిధులు సమకూర్చడం, సామాజిక అనుసంధాన వేదికల్లో మద్దతు కూడగట్టడం వంటి ఆరోపణల నేపథ్యంలోనే 'చొరబాటు నిరోధక చట్టాన్ని' ఆమోదించింది.
*తైవాన్ ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందని, చైనాలోని అంతర్భాగముగా ప్రపంచముచే గుర్తించబడ్తున్నఫసిఫిక్ మహాసముద్రములోని ఒక దీవి. తైవాన్ చైనా నుండి స్వాతంత్ర్యము ప్రకటించుకుంది. వాస్తవ నియంత్రణాధికారము దీనిపై చైనాకు లేదు. ప్రజల భాష చైనీసు (చీనీ).
జాతీయం
భారత రాయబారిగా వీడ్కోలు,విదేశాంగ కార్యదర్శిగా నియామకం
* అమెరికాలో భారత రాయబారి హర్షవర్దన్ ష్రింగ్లాకు ఆ దేశంలో ఘన వీడ్కోలు లభించింది.
* ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం వేగవంతం చేయడానికి హర్షవర్దన్ ష్రింగ్లా కృషి చేశారు.
* అంతకుముందు భారత రాయబారికి అక్కడి విదేశాంగశాఖలోని దక్షిణ, మధ్య ఆసియా విభాగం అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ జి వెల్స్ ప్రత్యేకంగా వీడ్కోలు పలికారు.
* ప్రస్తుతం విదేశాంగశాఖ కార్యదర్శి ఉన్న విజయ్ గోఖలే పదవీకాలం జనవరి 28తో ముగియనుంది.
* ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 23న ఉత్తర్వులు విడుదల చేసింది.
* జనవరి నెల 29న ష్రింగ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు.
* 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన హర్షవర్దన్ ష్రింగ్లా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. తన 35 ఏళ్ల దౌత్యపరమైన వృత్తిలో ఆయన బంగ్లాదేశ్, థాయిలాండ్‌లో భారత హైకమిషనర్‌గానూ సేవలందించారు.
* రంజిత్ సింగ్ సంధూ అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్దన్ ష్రింగ్లా స్థానంలో నియమితులయ్యారు.
జమ్మూకాశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన
*జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉద్ధంపూర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు.
*ఈ వంతెనను వచ్చే 2021 నాటికి పూర్తి చేయనున్నారు.
*కొంకణ్ రైల్వేస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా
*ఇప్పటికే బ్రిడ్జ్ ఆర్చ్ చాలా వరకు పూర్తి అయ్యింది. దాని ఎత్తు ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ.
*బ్రిడ్జిని, టన్నెళ్లను నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని.
* జమ్మూకాశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలతో కలిపేందుకు 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ ప్రపంచంలోనే ఎత్తైన ఈ వంతెన నిర్మాణానికి పునాదిరాయి వేశారు.
*ఈ రైల్వే వంతెన పొడవు 1.3 కిలోమీటర్లు.
*ఈ వంతెనను చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. కాశ్మీర్ లోయ ప్రాంతాన్ని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడుతుంది.
*జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కవూరి గ్రామం ప్రాంతంలో కాట్రా -బనిహాల్ రైల్వే లైన్ మీద ఈ వంతెనను నిర్మించనున్నారు.
* నదిపై 359 మీటర్ల ఎత్తు, 1.3 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే వంతెన కశ్మీర్ లోయలోని రియాసీ జిల్లాలో మారుమూల గ్రామాలను కలుపుతుంది.మరియు ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కన్నా దాదాపు 30 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది.
*రూ.12వేల కోట్లతో కొంకణ్ రైల్వే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టింది. 2004లో ప్రారంభమైన ఈ వంతెన పనులు అధిక గాలుల ప్రభావంతో భద్రతా కారణాల దృష్ట్యా 2008లో నిలిచిపోయాయి.
*ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకోగలదు.
*దాదాపు దీని జీవిత కాలం 120 సంవత్సరాలు.
* కాట్రా, బనిహాల్ ప్రాంతాల మధ్య ఈ వంతెన కీలక మార్గం కానుంది. నదికి రెండు చివరల్లో కాకుండా మధ్యలో ఎలాంటి సపోర్టు లేకుండా ఉన్న వంతెనల్లో ఇది ప్రపంచంలోనే ఏడోది కానుండటం విశేషం.
*ఈ వంతెన పూర్తయిన అనంతరం భారత రైల్వే దీని మీది నుంచి బంగీ జంప్ వంటి సాహస కృత్యాలు నిర్వహించనుంది.
* భారత రైల్వే ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వేను నిర్మిస్తోంది.భారత దళాలకు ఇదో వ్యూహాత్మక ఆస్తిగా ఉంటుంది.
శ్యాం ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్
*జనవరి 12వ తేదీన జరిగిన కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌కు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరు మారుస్తూ ప్రకటన చేశారు.
*నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.
*కలకత్తా పోర్టును బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ కాలంలో 1870లో నిర్మించారు.
*ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు ---
1. 'ఒక దేశం, ఒక రాజ్యాంగం' ఆలోచనతో పాటు, దానిని కార్యరూపంలో తీసుకువచ్చేందుకు పాటుపడిన లెజండరీ నాయకుడు ముఖర్జీ
2.'పారిశ్రామిక, ఆధ్యాత్మిక, స్వయం సమృద్ధికి కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ ప్రతీక.
3.న్యూ ఇండియా శక్తిని చాటిచెప్పే సింబల్‌గా పోర్ట్ ట్రస్ట్‌ను తీర్దిదిద్దాలిన బాధ్యత మనపై ఉంది.
4.ఛటర్జీ లోకోమోటివ్ ఫ్యాక్టరీ, హిందుస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి దిగ్గజ సంస్థల ఏర్పాటులో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ చురుకైన పాత్ర పోషించారు.
5.ఈ కార్యక్రమంలో భాగంగా కోల్‌కతా పోర్ట్ ట్రస్టులో పనిచేసి రిటైరైన నగీనా భగట్, నరేష్ చంద్ర చక్రవర్తి అనే వయో వృద్ధ పెన్షనర్లను ప్రధాని సన్మానించారు.
6.సత్యాగ్రహం నుంచి స్వచ్చాగ్రహం (స్వచ్ఛ భారత్) వరకు ఎన్నో అనుభూతులకు కోల్‌కత పోర్టు వేదిక అయింది.
*కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్(కేవోపీటీ) 150వ వార్షికోత్సవాల్లో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ గా రూ.501 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.
రాయ్ పూర్ లో స్వామి వివేకానంద స్మారక నిర్మాణం
*ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో స్వామి వివేకానంద నడయాడిన నేలకు గుర్తుగా జాతీయ స్మారకాన్ని నిర్మించనున్నారు.
*ఈ విషయం 30 ఏళ్ల క్రితమే చర్చల్లోకి వచ్చినా ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వివేకానంద జాతీయ స్మారక నిర్మాణంపై దృష్టి సారించింది.
*రాయపూర్‌లో ఒకప్పుడు స్వామి వివేకానంద నివసించారు. ఇప్పుడు ఆ ప్రాంతం రాయబహద్దూర్ భూతనాథ్ డే చారిటబుల్ ట్రస్ట్ ఆధీనంలో ఉంది.
*ఇటీవల ఢిల్లీలో జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో వివేకానంద జాతీయ స్మారక నిర్మాణ అంశం ప్రస్తావనకు వచ్చింది.
*చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇక్కడ స్మారక నిర్మాణం ఏర్పాటుకు సమ్మతి తెలిపింది.
*రాయపూర్‌లో స్వామి వివేకానంద 1877 నుంచి 1879 వరకూ ఉన్నారు.
* ఇక్కడి మెట్రో పాలిటన్ విద్యాలయలో చదువుకున్నారు. వివేకానందుని తండ్రి విశ్వనాథ దత్త తన పనుల కారణంగా రాయపూర్‌లో ఉన్నారు.
*ఈ సమయంలో వివేకానందుడు, అతని సోదరుడు మహేంద్ర, సోదరి జోగేంద్రబాలా, తల్లి భువనేశ్వరి కలకత్తా నుంచి రాయపూర్ వచ్చారు.
*అప్పట్లో రాయపూర్ వరకూ రైలు సౌకర్యం లేకపోవడంతో జబల్ పూర్ వరకూ రైలులో వచ్చి అక్కడి నుంచి ఎడ్లబండిలో రాయపూర్ చేరుకున్నారు.
పది రూపాయలకు కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష
*కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్షను కేవలం రూ.10లోనే, 95% కచ్చితత్వంతో చేయగలిగే కొత్త పరికరాన్ని ఐఐటీ-ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.
*మోటార్ ద్వారా నడిచే డిస్క్ ఆధారిత పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
* ఈ పరికరం బయో-డీగ్రేడబుల్ పరికరం మరియు కొన్ని పరీక్షల అనంతరం దీన్ని డిస్పోజ్ చేయవచ్చు.
* ఈ ఆవిష్కరణ గ్రామీణ ప్రజలకు సేవలను అందించడంలో ఓ కొత్త మార్పు తీసుకు వస్తుంది.
*ఐఐటీ-ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ---ఐఐటీ-ఖరగ్‌పూర్‌కు చెందిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇలాంటి మరెన్నో పరికరాలను వాడుతూ సమాజంలోని ప్రతీ ఒక్కరికి టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్‌కేర్ అందేలా దోహదపడుతుంది అని పేర్కొన్నారు.

ఎన్‌ఎస్‌జీ వీఐపీ భద్రత విధుల తొలగింపు
*జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) కమాండోలకు వీఐపీల భద్రతా విధుల నుంచి పూర్తిగా విముక్తి కలిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
*1984లో ఏర్పాటైన ఎన్‌ఎస్‌జీ గత రెండు దశాబ్దాలుగా మాత్రమే వీఐపీల భద్రతా విధులు నిర్వర్తిస్తోంది. ప్రారంభంలో ఆ విధులు దాని పరిధిలో లేవు.
* ప్రస్తుతం జడ్‌ప్లస్ కేటగిరిలోని 13 మంది హై రిస్క్ వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తోంది.
*ఒక్కొక్కరికి రెండు డజన్ల మంది బ్లాక్ క్యాట్ కమాండోలు చొప్పున అత్యాధునిక ఆయుధాలతో భద్రత కల్పిస్తున్నారు.ఇకపై వీరి భద్రత బాధ్యతను సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ తదితర పారామిలటరీ దళాలకు అప్పగించనున్నారు.
*రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, మాయావతి, ములాయంసింగ్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా, ముఖ్యమంత్రులు యోగి(యూపీ), శర్బానంద సోనేవాల్(అసోం), మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ తదితరులకు ఎన్‌ఎస్‌జీ భద్రత ఉంది.
* దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్న దృష్ట్యా వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా ఎన్‌ఎస్‌జీకి వీఐపీల భద్రతా విధులు తొలగించాలని 2012 నుంచే చర్చ జరుగుతోంది.
*ఉగ్రవాద నిర్మూలన, హైజాక్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌జీని కేవలం ఆ విధులకే పరిమితం చేయాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది.
*పరిమితంగానూ, ప్రత్యేక సామర్థ్యాలతోనూ ఉన్న ఎన్‌ఎస్‌జీకి హై రిస్క్ వీఐపీల భద్రత భారంగా మారింది.
*తాజా నిర్ణయంతో సుమారు 450 మంది కమాండోలకు ఆ విధుల నుంచి ఉపసంహరించి,వారందరినీ ఇకపై ఉగ్రవాద, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లకు పరిమితం చేయనున్నారు.

వాయుసేన లోకి 200 జెట్ ఫైటర్లు
*భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం సుమారు 200 జెట్‌ఫైటర్లను కొనుగోలు చేయనుంది.
*రక్షణశాఖ కార్యదర్శి అజరు కుమార్
* 83 ఎల్‌సీఏ తేజస్ మార్క్1 విమాన తయారీకి హెచ్‌ఏఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం చివరిదశలో ఉంది.
*ఇవే కాకుండా మరో 110 జెట్‌ఫైటర్ల కోసం ప్రతిపాదనలు ఉన్నాయి.
*ప్రస్తుతం వాయుసేనలో సుఖోయ్-30 ఎంకెేఐలు, మిరాజ్-2000 లు, మిగ్-29 లు, జాగ్వార్స్, మిగ్-21 బైసన్స్ పనిచేస్తున్నాయి.
*1999 కార్గిల్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఏడు స్వింగ్-వింగ్ మిగ్ -27 యుద్ధ విమానాలను గత నెలలో తొలగించారు.
మహిళలపై నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం
*జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో ప్రతి 90 నిమిషాలకు ఒక చిన్నారిపై నేరం, ప్రతి రెండు గంటలకు ఒక లైంగిక దాడి జరుగుతున్నాయి.
*యూపీలో రోజూ 12 లైంగిక దాడి కేసులు నమోదవుతుండగా, 2018లో ఈ తరహా కేసులు ఏకంగా 4,322 నమోదయ్యాయి.
*రాష్ర్టవ్యాప్తంగా రోజూ మహిళలపై 162 నేరాలు జరుగుతుండగా, 2018లో అతివలపై 59,445 నేరాలు జరిగినట్టు కేసులు నమోదయ్యాయి.
*2017తో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ. 2017లో రాష్ర్టంలో మహిళలపై 56,011 నేరాలు జరిగాయి.
*018లో 144 మంది బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. 2017లో ఈ సంఖ్య 139గా నమోదైంది. 2018లో 2,444 మంది మహిళలు వరకట్న వేధింపులకు గురి అయ్యి మరణించారు.
*యూపీలోవృద్ధుల పై జరుగుతున్న దాడులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
*2018లో ఈ తరహా కేసులు 454 నమోదయ్యాయి. ఆ ఏడాది దాదాపు 131 మంది వృద్ధులు హత్యకు గురయ్యారు.
*మహిళలపై జరుగుతున్న నేరాల్లో టాప్ 19 నగరాల్లో లక్నో (2,736 కేసులు) తొలి స్థానంలో నిలిచింది.

2018లో రైతుల కంటే ఎక్కువగా నిరుద్యోగ ఆత్మహత్యలు
* హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌ఆర్‌సీబీ నివేదిక ప్రకారం 2018లో 12,936 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.
* ఈ సంఖ్య అదే ఏడాది రైతుల ఆత్మహత్యల కంటే అధికం.
* ఇక 2017లోనూ అదే ఏడాది రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి.
* ఎన్‌ఆర్‌సీబీ గణాంకాంల ప్రకారం,2018లో ప్రతి గంటకూ ఒక నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
* ఆ ఏడాది జరిగిన 1,34,516 ఆత్మహత్యల్లో 9.6 శాతం నిరుద్యోగులవే.
* అదే ఏడాది మొత్తం బలవన్మరణాల్లో 10,349 మంది రైతు ఆత్మహత్యలు కాగా ఇవి మొత్తం మరణాల్లో 7.7 శాతంగా నమోదయ్యాయి.
* ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగుల్లో 10,687 మంది పురుషులు కాగా, 2249 మంది స్త్రీలుగా గుర్తించారు.
* నిరుద్యోగుల ఆత్మహత్యల్లో కేరళ మొదటి స్థానంలో ఉన్నది.
* ఆ రాష్ట్రంలో 1,585(12.3 శాతం) మంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
* ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు(1,579-12.2 శాతం), మహారాష్ట్ర(1,260-9.7 శాతం), కర్ణాటక(1,094-8.5 శాతం), ఉత్తరప్రదేశ్(902-7శాతం) ఉన్నాయి -2017లో 12,241 మంది నిరుద్యోగులు(9.4 శాతం), 10,655 మంది రైతులు(8.2శాతం) ఆత్మహత్యకు పాల్పడగా, 2016లో 11,173 మంది నిరుద్యోగులు, 11,379 మంది రైతులు బలవన్మరణం బాటపట్టారు.
రాష్ట్రీయం
రాష్ట్రీయం
No comments:
Post a Comment