అంతర్జాతీయం
'ఖతర్ ఓపెన్ విజేత రోహన్ బోపన్న
*భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను సాధించాడు.
*నెదర్లాండ్ ఆటగాడు వెస్లీ కూలాఫ్‌తో కలిసి బోపన్న 'ఖతర్ ఓపెన్ ఏటీపీ 250' టోర్నీలో విజేతగా నిలిచాడు.
*ఫైనల్లో బాంబ్రిడ్జ్ (ఇంగ్లాండ్)-శాంటియాగో (మెక్సికో) జంటని బోపన్న జోడీ 3-6, 6-2, 10-6 తేడాతో ఓడించింది. దీంతో బోపన్న జోడీ 76,870 డాలర్ల ప్రైజ్‌మనీతో పాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు గెలుచుకుంది.
*బోపన్న ఖాతాలో 19వ డబుల్స్ టైటిల్ ఇది. సెమీఫైనల్లో బోపన్న-కూలాఫ్ జంట 7-5, 6-2 తేడాతో హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)- స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది.
ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ మృతి
*ఆధునిక అరబ్ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాలించిన నేతగా పేరుగాంచిన ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ కన్నుమూశారు.
* 1970తో తన తండ్రి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఇప్పటి వరకు సుల్తాన్‌గా కొనసాగారు.
*చురుకైన విదేశీ విధానంతో ఒమన్‌ని ఆధునికత వైపు నడిపించిన నేతగా ఆయనకు పేరుంది.
*ఆరు దేశాలతో ఇరాన్‌కు కుదిరిన అణు ఒప్పందంలో ఖబూస్ నేతృత్వంలోని ఒమన్.. ఉభయపక్షాల మధ్య మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఒమన్‌కి ప్రాధాన్యం పెరిగింది.
*ఒమన్ రాజ్యాంగం ప్రకారం సుల్తాన్ పదవి ఖాళీ అయిన మూడు రోజుల్లోగా కొత్తవారు సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఖబూస్ బిన్ బ్రహ్మచారి.
*రాజకుటుంబం నుంచైనా లేదా వారు సూచించిన వారైనా సుల్తాన్‌గా బాధ్యతలు స్వీకరించాలి. లేనిపక్షంలో రాజకుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఖబూస్ రాసిన లేఖలో పేర్కొన్న వ్యక్తిని సుల్తాన్‌గా నియమిస్తారు.
*. కాగా రాచ కుటుంబం ఈ బాధ్యతను తీసుకోనట్లయితే.. ఒమన్ నిబంధనల ప్రకారం... మిలిటరీ, భద్రతా అధికారులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలిసి పాలకుడిగా తమకు నచ్చిన వ్యక్తిని రహస్య పద్ధతిలో ఎంపిక చేస్తారు.
*ఒమనీ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించి, రాజకుటుంబానికి చెంది, తగిన అర్హతలున్న వ్యక్తిని తదుపరి సుల్తాన్‌గా ఎన్నుకుంటారు. ఈ నిబంధనల ప్రకారం దాదాపు 80 మంది పోటీలో ఉన్నారు.
*65ఏళ్ల తారిఖ్ 2017లో ఉపప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఈయన పేరు సుల్తాన్ పదవి చేపట్టే అవకాశం ఉంది.
జాతీయం
ఇంటర్నెట్ సదుపాయం ప్రాథమిక హక్కు - సుప్రీం కోర్ట్
*ఇంటర్నెట్ సదుపాయంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది.
*రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపింది.
*వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ-బిజినెస్ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ద్వారా ఎక్కువగా జరుగుతుంది.ఆ సేవల్ని నిరవధికంగా నిలిపివేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
*జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారంలోగా సమీక్షించాలని కశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
*''అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన శకం, వెల్లివిరిసిన విజ్ఞానం, బ్రహ్మజెముడులా అజ్ఞానం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం నడుస్తున్నారు నరకానికి''అంటూ చార్లెస్ డికెన్స్ రాసిన రెండు మహానగరాలు(ఏ టెల్ ఆఫ్ టూ సిటీస్) నవలలోని వాక్యాలను జస్టిస్ ఎన్వీ రమణ తన తీర్పులో ఉటంకించారు.
*'భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు.
జనవరి 3వ తేదీ నాటికి 461.16 బి.డాలర్ల విదేశీ మారక నిల్వలు
*దేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు జనవరి నెల 3తో ముగిసిన వారానికి 3.69 బిలియన్ డాలర్లు పెరిగి, జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 461.16 బి.డాలర్లకు పెరిగాయి.*సమీక్షా వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు 3.01 బి.డాలర్లు పెరిగి, 427.95 బి.డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 666 మిలియన్ డాలర్లు పెరిగి 28.06 బి.డాలర్లకు చేరాయి.
*ఐఎంఎఫ్ వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 7 మి.డాలర్లు పెరిగి 1.45 బి.డాలర్లకు, దేశ నిల్వల స్థితి 3 మి.డాలర్లు పెరిగి 3.70 బి.డాలర్లకు చేరాయి.
*ఐఎంఎఫ్ వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 7 మి.డాలర్లు పెరిగి 1.45 బి.డాలర్లకు, దేశ నిల్వల స్థితి 3 మి.డాలర్లు పెరిగి 3.70 బి.డాలర్లకు చేరాయి.
నవంబర్ లో 1.8 శాతం అభివృద్ధి సాధించిన ఐఐపీ
*భారత్ పారిశ్రామిక రంగం నవంబర్‌లో మూడు నెలల తర్వాత క్షీణత నుంచి వృద్ధి బాటలోకి వచ్చింది.
*పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది.
*ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో భారత్ పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధినమోదుకాకపోగా, క్షీణ రేటు నెలకొంది.
* మొత్తం సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం కూడా క్షీణతలో నుంచి బయటపడ్డం మొత్తం గణాంకాలకు కొంత సానుకూలమైంది.
*జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు--
-
2018 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 0.2 శాతం.
-
సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2018 ఇదే నెలలో ఈ విభాగం అసలు వృద్ధిలేకపోగా -0.7 శాతం పడింది. నవంబర్ తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలనే ఇచ్చాయి.
-
విద్యుత్ రంగం విషయానికి వస్తే పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. 2018 నవంబర్‌లో కనీసం 5.1 శాతం వృద్ధి నమోదయితే, 2019 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా -5 శాతం క్షీణత నమోదయ్యింది.
-
మైనింగ్ విషయంలో క్షీణ రేటు 1.7 శాతంగా ఉంది. అయితే ఈ రేటు 2018 నవంబర్‌లో పోల్చితే (-2.7 శాతం) తక్కువగా ఉంది.
-
భారీ యంత్రపరికరాలు, పెట్టుబడులను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో -8.6 శాతం క్షీణత నమోదుకావడం జరిగింది.
-
ఎఫ్‌ఎంసీజీ (కన్జూమర్ నాన్-డ్యూరబుల్ సెగ్మెట్) వస్తువుల విభాగంలో 2 శాతం స్వల్ప వృద్ధి (2018 నవంబర్‌లో -0.3 శాతం) నమోదయ్యింది. అయితే రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి నమోదుకాలేదు.
*ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే, వృద్ధి రేటు కేవలం 0.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5 శాతంగా ఉంది.
2018 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 0.2 శాతం.
సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2018 ఇదే నెలలో ఈ విభాగం అసలు వృద్ధిలేకపోగా -0.7 శాతం పడింది. నవంబర్ తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలనే ఇచ్చాయి.
విద్యుత్ రంగం విషయానికి వస్తే పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. 2018 నవంబర్‌లో కనీసం 5.1 శాతం వృద్ధి నమోదయితే, 2019 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా -5 శాతం క్షీణత నమోదయ్యింది.
మైనింగ్ విషయంలో క్షీణ రేటు 1.7 శాతంగా ఉంది. అయితే ఈ రేటు 2018 నవంబర్‌లో పోల్చితే (-2.7 శాతం) తక్కువగా ఉంది.
భారీ యంత్రపరికరాలు, పెట్టుబడులను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో -8.6 శాతం క్షీణత నమోదుకావడం జరిగింది.
ఎఫ్‌ఎంసీజీ (కన్జూమర్ నాన్-డ్యూరబుల్ సెగ్మెట్) వస్తువుల విభాగంలో 2 శాతం స్వల్ప వృద్ధి (2018 నవంబర్‌లో -0.3 శాతం) నమోదయ్యింది. అయితే రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి నమోదుకాలేదు.
No comments:
Post a Comment