Current Affairs in Telugu 10th January

అంతర్జాతీయం 


మాలేసియా మాస్టర్స్‌లో పీవీ సింధు ఓటమి
* కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మాలేసియా మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది.
* టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ పీవీ సింధు 16-21, 17-21తేడాతో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది.
* వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు మరోసారి ఓడిపోయింది.
* తొలి గేమ్‌ను 16-21తో సింధు కోల్పోయింది.
*ప్రారంభం నుండి చివరి వరకు తై జు యింగ్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించడంతో సింధు 11-20 పాయింట్ల వెనుకబడింది.
*చివర్లో మ్యాచ్ విజయానికి కావాల్సిన ఆరు పాయింట్లను గెలుచుకోవడంతో 21-16తో గేమ్‌ను గెలుచుకుంది. దీంతో సింధుపై తన రికార్డుని తై జు యింగ్ మరింతగా పెంచుకుంది.
* వీరిద్దరూ ఇప్పటివరకు 17 సార్లు తలపడగా సింధు 12 సార్లు ఓడిపోయింది. అయితే, సింధుపై తై జు యింగ్‌కు ఇది వరుసగా రెండో విజయం.
*ఇదే టోర్నీలో మహిళల ప్రిక్వార్టర్స్‌ పోరులో పీవీ సింధు 21-10, 21-15తో అయా ఒహోరి (జపాన్‌)పై గెలుపొందింది. 



జపాన్ పాస్‌పోర్టుతో 191 దేశాలు చుట్టి వచ్చే అవకాశం


* జపాన్‌ పాస్‌పోర్టుకు డిమాండ్‌ ఉన్నదని హెల్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ (హెచ్‌పీఐ) జనవరి 9వ తేదీన వెల్లడించింది.
* జపాన్‌ పాస్‌పోర్టు కల్గివున్న పౌరులు వీసాలు లేకుండా 191 దేశాలు చుట్టి వచ్చే అవకాశం ఉంటుంది.
*  హెచ్‌పీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలోని వివరాల ప్రకారం...పాస్‌పోర్టులకు డిమాండ్‌ ఉన్న దేశాల జాబితాలో జపాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో సింగపూర్‌, తృతీయ స్థానంలో జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి.
*  గత మూడేండ్ల నుంచి జపాన్‌ తొలిస్థానంలోనే కొనసాగుతూ వస్తుంది.
* అమెరికా, బ్రిటన్‌, నార్వే, గ్రీస్‌, బెల్జియం దేశాల పాస్‌పోర్టులు 8వ స్థానంలో ఉన్నాయి. 10ఏండ్ల కిందట బ్రిటన్‌ తొలిస్థానంలో నిలిచింది. క్రమక్రమంగా దీని స్థానం 8కు పడిపోయింది.
*అప్పట్లో బ్రిటన్‌ పాస్‌పోర్టు ఉన్నవారు 166 దేశాలు సందర్శించే అవకాశం ఉండేది. భారతీయ పాస్‌పోర్టు ఉన్నవారు 58 దేశాలకు వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.
* ఈ  ర్యాంకింగ్‌లో భారత్ 84వ స్థానంలో  నిలిచింది.
*గతంలో 82వ స్థానంలో ఉన్న భారత్‌ రెండు స్థానాలకు దిగజారింది.
* మౌరిటేనియా, తజికిస్తాన్‌ దేశాలు కూడా 84వ స్థానాల్లో ఉన్నాయి.
* పాకిస్తాన్‌ పాస్‌పోర్టు కల్గివున్నవారు 32 దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
*కాగా, పాస్‌పోర్టు ఆధారంగా పౌరులు సందర్శించగల దేశాల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని ర్యాంకింగ్‌ ఇస్తారు. 




బ్రెగ్జిట్ కు ప్రతినిధుల సభ ఆమోదం


* బ్రెగ్జిట్‌ ఒప్పందానికి బ్రిటన్‌లోని ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది.
*మూడు రోజుల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం జనవరి 9వ తేదీన ఈ ఒప్పందంపై జరిగిన ఓటింగ్‌లో 330-231 ఓట్ల తేడాతో బిల్లు నెగ్గింది.
*ఇక హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ (ఎగువ సభ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
*  సాధారణంగా దిగువసభ తీసుకున్న నిర్ణయాన్ని ఎగువసభ జాప్యం చేయగలదు తప్ప దాన్ని తిరస్కరించలేదు. 
*దీంతో ఐరోపాసమాజ దేశాల సమాఖ్య నుంచి డెడ్‌లైన్‌ లోగా అంటే జనవరి 31లోగా బ్రిటన్‌ వైదొలగడం దాదాపుగా ఖరారు అయింది.
*50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి వేరుపడనుంది బ్రిటన్‌. బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు, చర్చోపచర్చలు కొనసాగినా..తాజా ఓటింగ్‌తో ప్రతిష్టంభనకు తెరపడింది. 
*ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో బిల్లు పార్లమెంట్‌లో సునాయాసంగా గట్టెక్కింది. విపక్ష లేబర్‌ పార్టీ బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేసింది.


అభివృద్ధి చెందుతున్న పట్టణాల జాబితా -ఈఐయూ
*ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఎకనామిస్టు ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) ఒక జాబితా విడుదల చేసింది. 
*ఆ జాబితాలో టాప్‌ 10లో భారత్‌కు చెందిన మూడు ప్రాంతాలు ఉన్నాయి. 
*ఆ మూడు కూడా కేరళకు చెందిన మలప్పురం, కోజికోడ్‌, కొల్లాం పట్టణాలు ఉన్నాయి.
* అభివృద్ధి చెందుతున్న పట్టణాల జాబితాలో మలప్పురం అగ్రస్థానంలో ఉంది. 
*ఈ జాబితా ప్రకారం,2015 సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది నాటికి మలప్పురంలో 44.1 శాతం మేర అభివృద్ధిలో పురోగతి ఉంది.
*34.5 శాతం మేర అభివృద్ధితో కోజికోడ్‌ నాలుగో స్థానంలో నిలవగా, 31.1 శాతంతో కొల్లాం 10వ స్థానంలో ఉంది. 
*కేరళలోని మరో పట్టణం త్రిస్సూర్‌ 13వ స్థానంలో ఉండగా, గుజరాత్‌కు చెందిన సూరత్‌ 26వ స్థానంలో, తమిళనాడులోని తిరుప్పూర్‌ 30వ స్థానంలో నిలిచాయి. 
*టాప్‌ 10 జాబితాలో చైనాకు చెందిన మూడు పట్టణాలు, నైజీరియా, ఒమన్‌, యుఎఇ, వియత్నాంలకు చెందిన ఒక్కో పట్టణం చొప్పున ఉంది. 
*మరో కేరళ నగరం త్రిస్సూర్‌ 13వ ర్యాంకు సాధించింది.




జాతీయం

భారత్ బంగ్లాదేశ్ మధ్య ఆధునిక ఫెన్సింగ్


*భారత దేశంలోకి బంగ్లాదేశీయుల చొరబాట్లను నిరోధించేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*కత్తిరించడానికి, తొలగించడానికి వీలులేని విధంగా అత్యాధునిక కంచెను నిర్మించాలని నిర్ణయించింది.
* పాత కంచెను త్వరలో తొలగించి, ఈ అత్యాధునిక కంచెను నిర్మిస్తారు. 
*ఈ కొత్త కంచెను కత్తిరించడం సాధ్యం కాదు.
*ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఇటువంటి కంచెను లాఠిటిలా సిల్చార్ సెక్టర్‌ వద్ద నిర్మిస్తున్నారు. 7.18 కిలోమీటర్ల పొడవున రూ.14.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
*ఇదేవిధంగా భారత దేశం-పాకిస్థాన్ సరిహద్దుల్లో కూడా కంచెను మార్చుతున్నారు.
*కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం సుమారు 300 మంది ఉగ్రవాదులను పాకిస్థాన్ సిద్ధంగా ఉంచింది.
*ఆఫ్ఘనిస్థాన్, తాలిబన్ ఉగ్రవాదులు కూడా వీరిలో ఉన్నట్లు సమాచారం


ప్రవాస భారతీయ దివస్‌
*ప్రవాస భారతీయ దివస్‌ సందర్భంగా  జనవరి 9 వ తేదీన ఎనిమిది దేశాల రాయబార  కార్యాలయాలలో సమావేశమైన ప్రవాస భారతీయులు, అధికారులతో  ఢిల్లీ నుంచి భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
*16 వ ప్రవాస భారతీయ దివస్ ప్రారంభమైంది.
*1915 నుండి ప్రవాస భారతీయ దివాన్ నిర్వహిస్తున్నారు.
*ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్ ద్వారా జనవరి 9 న ఏటా జరిగే వేడుక రోజు. జనవరి 9, 1915దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబై కి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవము జరుపుకొనబడుతున్నది.
*2003 లో స్థాపించబడి, ఇది భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (FICCI), భారత పరిశ్రమల సమాఖ్య మరియు నార్త్ ఈస్టర్న్ రీజియన్ యొక్క అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత స్పాన్సర్ చేయబడింది. ఒక వేడుక కార్యక్రమం ఒక భారతీయ నగరంలో ప్రతి సంవత్సరం 7-9 జనవరి న జరుగుతుంది.
*ఇండియన్ ప్రవాసల సంబంధించిన సమస్యల నివరణ మరియు ప్రవాసీ భారతీయ సన్మాన పురస్కారలు అందించును

జనాభా లెక్కలలో 31 ప్రశ్నలు

*జనగణన సమయంలో కుటుంబ పెద్ద మొబైల్‌ నెంబర్‌ వివరాలను కూడా సమాచారం కోసం వచ్చిన ఉద్యోగులకు(ఎన్యూమరేటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. 
*మొత్తం 31 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాల్సిందిగా జనగణన అధికారులను రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆదేశించారు.
* మొబైల్‌ నెంబర్‌ను జనగణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే వినియోగించనున్నారు. మరే ఇతర అవసరాలకు వినియోగించరు.
* ఇతర ప్రశ్నలతో పాటు కుటుంబపెద్ద ఫోన్‌ నెంబర్, ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్‌ ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్, తాగు నీటి వసతి.. తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. 
*ఏప్రిల్‌ 1-సెప్టెంబర్‌ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. 
*కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా?, ఇంట్లోని గదులెన్ని?
ముఖ్యమైన ఆహారం ఏమిటి?, వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర ప్రశ్నలు కూడా ఉంటాయి.
*ఈ సారి పేపర్‌పై కాకుండా ఈ వివరాలన్నింటినీ మొబైల్‌ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)ను కూడా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది.



2017 నుండి 2018 కి 1.3% పెరిగిన నేరాలు

*2018 సంవత్సరంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పలు రకాల నేరాలపై జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సిఆర్‌బి) తన నివేదికను విడుదల చేసింది. 
*నివేదికలోని అంశాలు- 
*2018 ఏడాదిలో రోజుకు సగటున 80 హత్యలు, 289 కిడ్నాప్‌లు, 91 అత్యాచారాలు జరిగాయి.
*2018లో మొత్తం 50,74,634 గుర్తింపదగిన(కాగ్నిజబుల్‌) నేరాలు జరగగా, అందులో  31,32,954 నేరాలు భారతీయ శిక్షాస్మృతి నియమావళి (ఐపిసి)లోని పలు సెక్షన్ల కింద నమోదు అయ్యాయి.
* 19,41,680 కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదు అయ్యాయి.
* ఇవి 2017తో(50,07,044) పోల్చుకుంటే అధికంగా ఉన్నాయి.
* ఇక్కడ 'కాగ్నిజబుల్‌' క్రైమ్స్‌ అంటే ఒక పోలీసుస్టేషన్‌కు చెందిన అధికారి మెజిస్రేట్‌ అనుమతి లేకుండానే విచారణ చేయగల లేదా ఎటువంటి వారెంట్‌ లేకుండానే అరెస్టులు చేసే అవకాశం ఉన్న కేసులు అని అర్ధం.
*2018లో మొత్తం దేశవ్యాప్తంగా 29,017 హత్యలు జరిగాయి. ఇది 2017 సంవత్సరం(28,653)తో పోల్చుకుంటే 1.3 శాతం ఎక్కువ.
*అదేవిధంగా 3,875 కేసుల్లో వ్యక్తిగత కక్షలు వలన హత్యలు జరిగాయి. కిడ్నాప్‌, అపహరణ కేసు నమోదులో 2017తో పోల్చుకుంటే 10.3 శాతం పెరుగుదల కనిపించింది. 
* 2018లో మొత్తం 1,05,734 ఈ విధమైన ఎఫ్‌ఐఆర్‌లో నమోదు కాగా, 2017లో ఆ సంఖ్య 95,893గా ఉంది. కాగా, ఇది 2016లో అయితే 88,008 ఉంది.
* కిడ్నాప్‌ అయిన వారిలో 80,871 మంది మహిళలు ఉన్నారు, మొత్తంలో 63,356 మంది చిన్నారులు ఉన్నారు.
* ఇక 2018లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 3,78,277 కేసులు నమోదయ్యాయి. ఇది 2017లో 3,59,849, 2016లో 3,38,954గా ఉంది. 
*వీటిల్లో ఐపిసి సెక్షన్‌ 376 ప్రకారం నమోదైన అత్యాచార కేసులు 33,356 ఉన్నాయి. 
*మొత్తంగా చూసుకుంటే 2017తో పోల్చుకుంటే 2018లో నేరాల సంఖ్య 1.3 శాతం పెరిగాయి.


లోక్‌పాల్‌ సభ్యుడి రాజీనామా

*జస్టిస్‌ దిలీప్‌ బి.బొసాలే లోక్‌పాల్‌ సభ్యత్వ పదవికి రాజీనామా చేశారు
* వ్యక్తిగత కారణాల వల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
* అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ దిలీప్‌ 2019 మార్చి 27న లోక్‌పాల్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
* స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన ఆయన... 2015-16లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
* లోక్‌పాల్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. లోక్‌పాల్‌ సభ్యులుగా ఎంపికైన వారి పదవీకాలం ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది.
*లోక్‌పాల్‌ వ్యవస్థ---
ప్రజా సేవకుల అవినీతి కేసులను విచారించేందుకు లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2019, మార్చిలో లోక్‌పాల్‌ మొదటి చైర్మన్‌గా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ప్రమాణం చేశారు. జస్టిస్‌ దిలీప్‌ బి.బొసాలేతో పాటు జస్టిస్‌ పీకే మహంతి, జస్టిస్‌ అభిలాష్‌ కుమారి, జస్టిస్‌ ఏకే త్రిపాఠి సభ్యులుగా నియమితులయ్యారు. తాజాగా జస్టిస్‌ దిలీప్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
*లోక్‌పాల్‌ కమిటీలో చైర్‌పర్సన్‌తోపాటు గరిష్ఠంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి.

సైరస్ మిస్త్రీ కేసులో ఎన్‌సీఏల్ఏటీ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
*టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని నియమించాలని ఇటీవల ఎన్‌సీఏల్ఏటీ ఇచ్చిన తీర్పుపై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది.
* ఎస్ ఏ బొబ్డే సహా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులను ఇచ్చింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో సాంకేతిక పరమైన దోషాలు ఉన్నాయని పేర్కొంది.
*. జస్టిస్ సూర్య కాంత్‌, బీఆర్ గవాయ్‌లు కూడా ఆ ధర్మాసనంలో ఉన్నారు. అప్పిల్లేట్ ట్రిబ్యునల్ ఈ కేసులో పిటిషన్ల వాదనలు పట్టించుకోలేదని సుప్రీం చెప్పింది.
*కేసు నేపథ్యం  -
*నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ) 2019,డిసెంబర్ 18వ తేదీన తీర్పునిచ్చింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించింది.
*ఈ కంపెనీ అధిపతిగా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్ట విరుద్ధమని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది.
*సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పునరుద్ధరిస్తూ ఇచ్చిన ఆదేశాల అమలును నాలుగు వారాల పాటు నిలిపేసింది. ఈ గడువులోగా అపీలు చేసుకునేందుకు టాటా కంపెనీకి అవకాశం ఇచ్చింది. 
*ఆయన టాటా సన్స్‌కు 6వ చైర్మన్.మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాలు ఉన్నాయి. తనను పదవి నుంచి తొలగించడాన్ని ఆయన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో సవాలు చేశారు.
*మైనార్టీ షేర్ హోల్డర్స్ గా మిస్రీ కుటుంబానికి చెందిన సంస్థలు టాటా సన్స్,రతన్ టాటా,మరికొందరు బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా NCLATని ఆశ్రయించాయి. తన తొలగింపు కంపెనీ చట్టంకి లోబడి జరుగలేదని మిస్రీ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
* దీనిపై విచారించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)టాటా గ్రూప్ చైర్మన్ గా సైరన్ మిస్రీని తిరిగి కొనసాగించాలని ఆదేశించింది.
**టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్‌ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది.
*టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్స్‌ స్వరూపాన్ని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి ప్రైవేట్‌ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది.
* వీటికి సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. ఈ లోగా దీనిపై టాటా గ్రూప్‌ అప్పీలు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌ఎల్‌ఏటీ తెలిపింది.


జమ్మూకాశ్మీర్లో ఆంక్షలపై పిటిషన్ విచారణ
సుప్రీం కోర్టులో కేసు--
1.నేపథ్యం--జమ్మూ కశ్మీర్‌లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇంటర్నెట్ సేవలను కేంద్రం నిలిపివేసింది.ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. పిటిషన్‌మీద జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
2.సుప్రీం కోర్ట్ పేర్కొన్న అంశాలు -
A.ఇంటర్నెట్ వినియోగం అనేది ఒక ప్రాథమిక హక్కు 
B. ఆర్టికల్ 19కి తూట్లు పొడుస్తారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. వెంటనే జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలి.
C. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా అధికారం చలాయించరాదు.పరిమితి దాటి ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు. ఎలాంటి ఆప్షన్ లేనప్పుడు మాత్రమే ఆంక్షలు విధింపుపై ఆలోచన చేయాలి.ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం టెలికాం నిబంధనలకు విరుద్ధం.ఒక గడువు వరకు సరైన కారణాలతో ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయవచ్చు కానీ ఎలాంటి గడువు లేకుండా నిరవధికంగా సేవలను ఎలా నిలిపి వేస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది 
*పిటిషన్‌ను విచారణ చేసిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.
* ఇంటర్నెట్ అనే కాదు.. జమ్మూ కశ్మీర్‌లో ఉన్న అన్ని ఆంక్షలపై ఒకసారి పునఃసమీక్షించాలని .. ఎలాంటి ఆంక్షలు విధించారో అది పబ్లిక్ డొమెయిన్‌లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.
*అభిప్రాయ బేధాలను అణగదొక్కేందుకు సెక్షన్ 144 ఉపయోగించకుండా సెక్షన్ 144ను అమలు చేసేందుకు దారితీసిన పరిణామాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది.
*జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారణ చేసింది అత్యున్నత న్యాయస్థానం .





No comments:

Post a Comment