Current Affairs in Telugu 7th January

అంతర్జాతీయం 


అత్యంత ఉష్ణోగ్రత గల దశాబ్దం

*భారత్‌లో హాటెస్ట్‌ డికేడ్‌గా గడిచిన (2010-2019)దశాబ్ది నిలిచింది. 
*1901లో అధికారిక లెక్కలు ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు గత దశాబ్దం అత్యంత హాటెస్ట్‌గా నిలిచింది.
*1.3 బిలియన్‌ జనాభా కలిగిన భారత్‌ వరదలు, కరువులు, తీరప్రాంత ఉష్ణోగ్రతల పెరుగుదలతో  ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
* ఎంత మంది మరణించారు ---గతేడాది విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల 1500 పైగా మంది మృత్యువాతపడ్డారు. భారీ వర్షాలకు 850 మంది, వేసవికాల తీవ్ర ఉష్ణోగ్రతలకు మరో 350 మంది, ఉరుములు, మెరుపులు, పిడుగుల వల్ల 380 మంది చనిపోయారు. 
*ఉష్ణోగ్రత ఎంత పెరిగింది-- 2010-2019 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు 0.36 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది.
* అన్ని సీజన్లలో గతేడాది విపరీత వాతావరణ పరిస్థితులను నమోదు అయ్యాయి.

భారత మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్తాన్
*సుమారు 14 నెలలపాటు పాకిస్థాన్‌ చెరలో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అక్కడి అధికారులు భారత్‌కు అప్పగించారు. 
*పాక్‌లోని లంధి జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చి భారత అధికారులకు అప్పగించారు. 
*శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వేల మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వీరావాల్‌లోని చేపల వ్యాపారుల వద్ద పనిచేస్తుంటారు. 
*చేపల వేటలో భాగంగా వీరావల్‌ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన వీరు పొరపాటున పాకిస్థాన్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించటంతో... ఆ దేశ భద్రత సిబ్బంది వీరిని 2018 నవంబరులో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 
*అప్పటి నుంచి వారంతా పాక్‌ జైళ్లలో ఉన్నారు. భారత విదేశాంగ శాఖ జోక్యంతో వీరు విడుదలయ్యారు.

జాతీయం 

వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
*ఢిల్లీ ఎన్నికల్లో వృద్ధుల కోసం ఈసీ ప్రత్యేక సౌకర్యం కల్పించింది.
*80 ఏళ్ల పైబడిన వృద్ధులతోపాటు దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
* ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకుంటే నోటిఫికేషన్‌ జారీ అయిన ఐదు రోజుల్లో పేర్లను నమోదు చేసుకోవాలి.

* ఈ విధానాన్ని జార్ఖండ్‌ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయగా,  ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. 


జనవరి 13 నుండి శబరిమల కేసు విచారణ


* కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జనవరి 13 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
*తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. 
*శబరిమల అంశంతో పాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై కూడా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
*శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ.. ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 
*మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళలను అనుమతించకపోవడం.. పార్శీ మహిళలు పార్శీయేతర కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే వారిని అగ్యారీ అనే పవిత్ర స్థలంలోకి ప్రవేశించనీయకుండా నిషేధాజ్ఞలు విధించడం వంటి ఆంక్షలు దేశంలో ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. 
*దీనికి సంబంధించి కూడా ధర్మాసనం విచారణ జరపనుంది.

గగన్ యాన్ వ్యోమగాములకు ఆహారం
*భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతోంది.
* మిషన్ గగన్‌యాన్‌లో ఉండే ఆ వ్యోమగాముల కోసం ఆహారపదార్ధాలు సిద్ధం అయ్యాయి. 
*మైసూరులోని డీఆర్‌డీవో సంస్థ ఆ ఫుడ్ ఐటమ్‌లను తయారు చేసింది.
* ఫుడ్ హీటర్లను కూడా వ్యోమగాములకు అందుబాటులో ఉంచనున్నారు. అంతరిక్షంలో తేలియాడే వ్యోమగాముల కోసం తాగేందుకు ప్రత్యేకంగా కంటేయినర్లు తయారు చేశారు. 
*వాటర్‌, జ్యూస్‌లను తీసుకువెళ్లేందుకు స్పెషల్ ప్యాకెట్లను తయారు చేశారు.
*2022లో మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టు ఉంటుంది. 
*ఇప్పటికే గగన్‌యాన్ కోసం 4 వ్యోమగాములు ఎంపికయ్యారు. ఆ నలుగురూ రష్యాలో శిక్షణ పొందుతున్నారు.వీరంతా భారత వాయుసేనకు చెందిన పైలట్లే.
*ఇస్రో 'గగన్‌యాన్‌' కోసం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెలో అదనపు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది.
*'హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌'గా కూడా పిలిచే ఈ కేంద్రం నుంచి గగన్‌యాన్‌కు సంబంధించిన కార్యక్రమాలతోపాటు వ్యోమగాములకు శిక్షణ ఇస్తుంది.
*2018 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా ఈ గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించారు. దాదాపు రూ.10వేల కోట్లతో ఇస్రో ఈ రోదసీ యాత్ర చేపట్టనుంది.



మేఘదూత్ లో కీలక పాత్ర వహించిన ప్రేమనాథ్ హూన్ మృతి


*1984లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో ముఖ్యపాత్ర పోషించిన వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జన్ రల్ ప్రేమనాథ్ హూన్  జనవరి 6న 90 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. 
*1929 అక్టోబర్ 4న జన్మించిన ప్రేమనాథ్ భారత సైన్యంలో చేరారు.పలు సేవలు చేశారు. 
*సియాచెన్  హిమానీనదం ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1984 ఏప్రిల్ 13 న భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్‌ను ఆపరేషన్ మేఘదూత్ అంటారు. ఈ ఆపరేషన్ సియాచెన్ ఘర్షణల్లో భాగం.
* ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధరంగంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్  హిమానీనదం ప్రాంతం మొత్తంపై నియంత్రణ చేకూరింది.
*ప్రస్తుతం భారత సైన్యం మోహరించిన వాస్తవ క్షేత్రస్థితి రేఖ (AGPL) ను కూడా ఆపరేషన్ మేఘదూత్ అని తప్పుగా పేర్కొనడం కద్దు. ఇప్పటికీ 6,400 మీ పైచిలుకు ఎత్తులో ఉన్న సియాచెన్‌లో భారత పాకిస్తాన్‌లు చెరి 10 పదాతి దళ బెటాలియన్లను మోహరించి ఉన్నాయి.
*1949 నాటి కరాచీ ఒడంబడికలో సియాచెన్‌ హిమానీనదం ఎవరికి చెందుతుందో స్పష్టంగా పేర్కొనకపోవడంతో ఈ ప్రాంతం వివాదాస్పదంగా మారింది. 
*సిమ్లా ఒడంబడిక ప్రకారం పాకిస్తానీ భూభాగం NJ9842 నుండి ఉత్తరానికి ఉందని భారత్ భావించగా అది ఈశాన్యంగా, కారకోరం కనుమ వైపు సాగిందని పాకిస్తాన్ భావించింది. దీంతో సియాచెన్ హిమానీనదం మాదంటే మాదేనని ఇరుపక్షాలూ భావించాయి.

ఏసీల కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు


*ఏసీల ద్వారా విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
* ఇకపై ఏసీని 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎగువన నడిపించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.
* ఈ నిబంధన ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది.ఇందులో భాగంగా ఏసీలు తయారు చేసే కంపెనీలకు, ఎయిర్ కండిషనర్లలో డిఫాల్ట్ సెటింగ్ 24 డిగ్రీల దగ్గర ఉంచాలని ఆదేశాలు ఇవ్వనున్నారు.
 *ఈ నిబంధన అన్ని స్టార్ గుర్తులకూ వర్తిస్తుంది.
* ఏసీ డిఫాల్ట్ సెట్టింగ్ 24 డిగ్రీల సెల్సియస్ ఉంటే కరెంటు ఆదా అవుతుందని  విద్యుత్ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
*ఈ నిర్ణయం వలన ఏడాదికి 20 బిలియన్ యూనిట్లు ఆదా చేయవచ్చు.
*  ఏసీలో ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెంచడం వల్ల 6 శాతం ఎనర్జీ ఆదా అవుతుంది.
*కనిష్ట ఉష్ణోగ్రతను 18 డిగ్రీలకి బదులు 24 డిగ్రీలకు సెట్ చేయడం వలన ఎనర్జీ ఆదా అవుతుంది. 
*గదిలో ఉష్ణోగ్రత తగ్గించి ఉంచడానికి కంప్రెసర్‌ ఎక్కువ సేపు శ్రమించాల్సి ఉంటుంది.
* కంపెనీలు, నివాసాల్లో ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచేలా జపాన్ ప్రభుత్వం 2005లోనే అక్కడి ప్రజలను ప్రోత్సహించింది.

రాష్ట్రాలకు జాతీయ విపత్తు సహాయ నిధులు
*జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాలకుగానూ రూ.5,908 కోట్లు విడుదల చేసింది.
* అయితే వరద సాయానికి కేంద్రం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం పేరు లేదు.
* గత రెండేళ్లుగా కేరళ భారీ వరదలు సంభవించాయి.
*  కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఈ ఏడు రాష్ట్రాలను ఎంపిక చేసింది. 
*వీటిలో ఉత్తర ప్రదేశ్, కర్నాటక, త్రిపుర, అసోం సహా నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండగా... మిగతా వాటిలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. 
*ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఏడు రాష్ట్రాలకు విడుదల చేసిన రూ.5908.56 కోట్లలో... ఒక్క కర్నాటకకే రూ.1869.85 కోట్లు దక్కాయి. అసోంకు రూ. 616.63 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.284.93 కోట్లు, మధ్య ప్రదేశ్‌కు రూ. 1749.73 కోట్లు, మహారాష్ట్రకు రూ. 956.93 కోట్లు, త్రిపురకు రూ.63.32 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌కు రూ. 367.17 కోట్లు మేర నిధులు విడుదలయ్యాయి.
*ఇంతకు ముందు కేంద్రం మధ్యంతర సాయం కింద నాలుగు రాష్ట్రాలకు రూ.3200 కోట్ల నిధులు విడుదల చేసింది.
*మధ్యంతర సాయం అందుకున్న రాష్ట్రాల్లో కర్నాటక (రూ. 1200 కోట్లు), మధ్య ప్రదేశ్ (రూ.1000 కోట్లు), మహారాష్ట్ర (రూ.600 కోట్లు), బీహార్ (రూ. 400 కోట్లు) ఉన్నాయి.
*2018లో కేరళలో మొదటిసారి వరదలు వచ్చినప్పుడు రూ.20 వేల కోట్ల నష్టం వచ్చినట్టు అంచనా వేస్తే.. అప్పట్లో కేంద్రం రూ.600 కోట్లు ఇచ్చింది. 
*నీటిమట్టాలు తగ్గిన తర్వాత మొత్తం నష్టం రూ.40 వేల కోట్లుగా ఉండింది.
*  2019 వరదల్లో రూ. 2101 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 
*గతేడాది సెప్టెంబర్‌లో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం వరద ప్రాంతాల్లో పర్యటించి వెళ్లింది. 
*జాతీయ విపత్తు సంఘటిత నిధి పేరును జాతీయ విపత్తు సహాయనిధి గా 2010 సెప్టెంబర్లో మార్చారు.
*రాష్ట్ర విపత్తు సహాయ నిధికి కేంద్రం చెల్లించే వాటా 25 శాతం నుండి తొంభై శాతానికి పెంచింది. 



ఉద్యోగుల భవిష్యత్తును నిధి పై వడ్డీ రేటు తగ్గే అవకాశం

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఉద్యోగుల జమపై ఇచ్చే వడ్డీరేటును 15 బేసిస్‌ పాయింట్ల నుంచి 25 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించే అవకాశాలున్నాయి.
* భవిష్యనిధి సంస్థ తీసుకోనున్న ఈ నిర్ణయంతో 2019-20లో వేతన జీవులకు రిటర్నులు భారీగా తగ్గనున్నాయి.
*2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను 8.65 శాతం వార్షిక వడ్డీని చెల్లించింది. 
*ఈ ఏడాది ఇది 8.50 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
*ఆర్థిక మందగమన పరిస్థితులు, మరోవైపు వడ్డీరేట్లు తగ్గుతుండటంతో ఈపీఎఫ్‌వోపై చెల్లించే వడ్డీరేట్లను కూడా కుదించే అవకాశం ఉంది.
* జనవరి నెల చివరిలోగా వడ్డీరేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 
*బ్యాంకులు వడ్డీరేట్లను ఒక్క శాతం మేర తగ్గిస్తే ఈపీఎఫ్‌వోపై ఈ ప్రభావం 55 నుంచి 70 బేసిస్‌ పాయింట్ల వరకు ఉంటుంది. 
* ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో వడ్డీరేటును 8.65 శాతం చెల్లించడం కష్టతరమవుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంది. 

రాష్ట్రీయం 

అమ్మఒడి పథకంలో మినహాయింపులు


*అమ్మఒడి పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి స్వల్ప ఊరటని కల్పించింది. అయితే ఇది ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుంది.
*అమ్మఒడికి ఉన్న అర్హతల్లో ఏడాదిలో 75 శాతం అటెండెన్స్ ఉండాలి.
* అయితే ఈ పథకాన్ని ఇప్పుడే తీసుకు వస్తున్నందున, ప్రజల్లో అవగాహన లేనందున ఈ అర్హత నుంచి ఈసారికి మినహాయింపు ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మాత్రం ఇది తప్పనిసరి.
*అమ్మఒడి పథకంలో 75 శాతం హాజరు నిబంధనకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 
*హాజరుతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ అమ్మఒడి పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించనుంది. 
*అనాథ పిల్లల విషయంలోను అమ్మఒడి పథకంలో భాగంగా సగం డబ్బు అనాథాశ్రమానికి, మిగతా సగం పిల్లల పేరుపై డిపాజిట్  చేస్తారు.
* అమ్మఒడి పథకం అర్హతకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించవద్దు.








No comments:

Post a Comment