Daily Current Affairs In Telugu December 20th 2019

అంతర్జాతీయం:
రష్యా వైపు కదులుతున్న ఉత్తర అయస్కాంత ధ్రువం
*బ్రిటిష్‌ జియోలాజికల్‌ సర్వే(బీజీఎస్‌) ప్రకారం,భూమి ఉత్తర అయస్కాంత ధ్రువం స్థానచలనం చెందుతోంది. ప్రతీ ఏడాది 34 మైళ్ల వేగంతో క్రమంగా రష్యా వైపు కదలిపోతోంది.ఇటీవల ఈ వేగం కాస్త తగ్గినప్పటికీ(25 మైళ్లు) ఇది సాధారణం కంటే ఎక్కువగా ఉంది.
*ఉత్తర ధ్రువం, ఉత్తర అయస్కాంత ధ్రువం రెండూ వేర్వేరు. అయస్కాంత ధ్రువాన్ని 1831లో కనుగొన్నారు. 
*అప్పటి నుంచి అది కదులుతూ 1400 మైళ్ల దూరం ప్రయాణించింది.
*శాస్త్రవేత్తల ప్రకారం,భూ కేంద్రకంలో ద్రవ ఇనుము ప్రవాహాల దిశ మారడం, ఇతర చర్యల వల్ల అయస్కాంత ధ్రువంలో మార్పులు జరుగుతాయి.
*దిక్సూచిల్లో అయస్కాంత ధ్రువాలను గమనించవచ్చు. అయస్కాంత ధ్రువం మారుతూ ఉండటం వల్ల స్థలాలను గుర్తించడం పైన ప్రభావం పడవచ్చు.
43 ఏళ్ల తర్వాత ప్రధానిని నియమించుకోనున్న క్యూబా 
*క్యూబా దేశానికి 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రధానమంత్రి రాబోతున్నారు. 
*పార్లమెంటరీ సమావేశాల్లో దేశాధ్యక్షుడు మిగేల్‌ డియాజ్‌-కానెల్‌ ప్రధాని అభ్యర్థిని నామినేట్‌ చేస్తారు. 
*ఆయన నామినేషన్‌ను జాతీయ అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది.
*ఆపై మాజీ అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రో నేతృత్వంలోని శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ ఆమోదం కూడా లభిస్తే ప్రధాని నియామక ప్రక్రియ పూర్తవుతుంది. 
*నూతన ప్రధాని ప్రభుత్వాధినేతగా ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. 
*చివరగా విప్లవ యోధుడు ఫిడెల్‌ క్యాస్ట్రో క్యూబా ప్రధానమంత్రిగా పనిచేశారు. 1976లో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
*అదే ఏడాది ప్రధాని పదవి రద్దయింది.
*ఒక పెద్ద ద్వీపము 'గ్రేటర్ ఆంటిల్లెస్' మరియు కొన్నిచిన్నచిన్న ద్వీపాలు గలవు. క్యూబా ఉత్తర 'కరీబియన్' ప్రాంతంలో గలదు. ఈ ప్రాంతం కరీబియన్ సముద్రం మెక్సికో అఖాతము మరియు అట్లాంటిక్ మహాసముద్రము ల కలయికల ప్రాంతం. క్యూబా అమెరికా మరియు బహామాస్కు ఆగ్నేయ దిశలోనూ, 'టర్క్స్ మరియు కైకోస్ ద్వీపాలు, హైతీ లకు పశ్చిమాన, మెక్సికోకు తూర్పున మరియు కేమెన్ ద్వీపాలు మరియు జమైకా లకు దక్షిణాన ఉంది.దేశరాజధాని నగరం వవానా అతిపెద్ద నగరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంది. 

తగ్గిన పొగాకు మరణాలు -ప్రపంచ ఆరోగ్య సంస్థ 
ధూమపానం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక లోని అంశాలు---
1.ప్రపంచవ్యాప్తంగా ధూమపానాన్ని అదుపు చేసే దిశగా పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
2.ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం,పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్న పురుషుల సంఖ్యలో తొలిసారిగా తగ్గుదల కనిపిస్తోంది. 
3.ధూమపానం చేసేవారి సంఖ్య 2000 నాటితో పోలిస్తే గత ఏడాది 6 కోట్లు తగ్గింది.
4.మహిళలు, బాలికల్లో పొగాకు వినియోగం తగ్గుదల నిలకడగా ఉంది.
5.80 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ధూమపానానికి ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు.
6.ధూమపానం చేసేవారి మొత్తం సంఖ్యలో పురుషుల శాతం 80% పైగా
7. గత ఏడాదితో పోలిస్తే 2020 నాటికి ధూమపానం చేసే పురుషుల సంఖ్యలో 20 లక్షలు తగ్గుదల కనిపించింది.
8.2018తో పోలిస్తే 2025 నాటికి ధూమపానం చేసే మగాళ్ల సంఖ్య 60 లక్షలు తగ్గుతుందని అంచనా.

జాతీయం :
 'వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌' కొరకు ప్రామాణిక కార్డ్
* నిరుపేదలకు రేషన్‌ సరుకులను అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌' పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక రూపాన్ని కల్పించింది. 
* ప్రస్తుతం ఈ పథకాన్ని ఆరు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన క్లస్టర్లలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. 
*2020 జూన్‌ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. 
*వన్‌ నేషన్‌-వన్‌ కార్డుకు జాతీయ పోర్టబులిటీ కల్పించారు. 
*ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ఈ కార్డును ఉపయోగించుకొని దేశంలో ఎక్కడైనా రేషన్‌ సరుకులను పొందే వీలుంటుంది.
*ఈ పోర్టబులిటీని విజయవంతంగా సాధించేందుకే కార్డుకు ప్రామాణిక రూపాన్ని కల్పించనున్నారు.
*  దీన్ని కొత్త కార్డుల జారీ విషయంలో అన్ని రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాలు నియమాలు పాటించాల్సి ఉంటుంది.
*  అవసరాన్నిబట్టి లబ్ధిదారులకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కార్డులో రాష్ట్రాలు పొందుపరచవచ్చు.
*  స్థానిక భాషతో పాటు హిందీ లేదా ఇంగ్లిషులోనూ లబ్ధిదారుల వివరాలు ఉండేలాగా కేంద్రం రాష్ట్రాలను సూచించింది.
*10నంబర్ల సంఖ్యతో కూడిన కార్డులో తొలి 2 సంఖ్యలు రాష్ట్ర కోడ్‌ను సూచిస్తాయి.
* కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది.
*జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ప్రస్తుతం 75 కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందుతున్నారు. 
*వలస వెళ్లే నిరుపేదలకు రేషన్ సరుకులు అందక ఇబ్బంది పడకూడదన్న ఉద్ధేశ్యంతో కేంద్రం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది.
* నకిలీ రేషన్ కార్డులను అరికట్టేందుకు ఆధార్‌ను రేషన్ సరుకుల కోసం తప్పనిసరి చేసింది.
* ఇప్పటికే ఏపీ, తెలంగాణతో సహా చాలా రాష్ట్రాల్లో రేషన్ సరుకులు ఎక్కడి నుంచేనా తీసుకొనే సౌకర్యాన్ని కల్పించారు.
* ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా లబ్దిదారు బయోమెట్రిక్ / ఆధార్‌ను ధృవీకరించిన తర్వాత..ఈ పథకం అందుబాటులోకి వస్తుంది.

జనాభా నియంత్రణకు నీతి అయోగ్ ప్రణాళిక 
*దేశంలో జనాభా నియంత్రణకు, జననాల రేటు మరియు కుటుంబ నియంత్రణ కొరకు నీతి అయోగ్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
*ఈ ప్రణాళిక రూపకల్పన కొరకు నీతి అయోగ్ జాతీయ జనాభా నియంత్రణ సంస్థతో సమావేశం జరపనుంది.
*ఈ ప్రణాళిక ద్వారా నీతి అయోగ్ దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని లోని లోపాలను సవరించేందుకు ప్రయత్నిస్తుంది.
*వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు,ప్రభుత్వ విభాగాల మధ్య అంతరాలు తొలగించేందుకు నీతి అయోగ్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
* కుటుంబ నియంత్రణ విషయంలో బడ్జెట్ కేటాయింపుల కొరకు సలహాలను  నీతి ఆయోగ్ అందించనుంది.
*కుటుంబ నియంత్రణ మరియు జనాభా నియంత్రణ అంశాలను దేశంలో ప్రాధాన్యత అంశాలుగా నీతి అయోగ్ గుర్తిస్తోంది.
* 1.37 మిలియన్ల జనాభాతో భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా గల దేశం గా ఉంది.
* జననాల రేటు తగ్గుతూ వస్తున్న జనాభా పెరుగుదల మాత్రం తగ్గడం లేదు. దీనికి ముఖ్య కారణం 30 శాతం మంది జనాభా యుక్త వయసులో ఉండి ప్రత్యుత్పత్తి వయస్సు కలవారు గా ఉండడం.
భారత్ రష్యాల మధ్య ఇంద్ర సైనిక విన్యాసాలు
*భారత్ మరియు రష్యా మధ్యన డిసెంబర్ 10వ తేదీన ప్రారంభమైన  ఇంద్ర 2019 త్రివిధ దళాల విన్యాసాలు డిసెంబర్ 19న ముగిశాయి.
*ఈ విన్యాసాలు పూణేలోని బాబీనా మరియు గోవా లో జరిగాయి.
* భారత్ మరియు రష్యా మధ్య రక్షణ రంగంలో సంబంధాలు బలోపేతం కావడానికి ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలకు తీవ్రవాదం నుండి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి.
* ఈ విన్యాసాలు ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు.
* ఈ విన్యాసాలలో పేలుడు పదార్థాలను నిరుపయోగంగా మార్చడం, సముద్ర మార్గం గుండా ఆయుధాల స్మగ్లింగ్ అరికట్టడం, ఇతర మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది.
*త్రివిధ దళాల యొక్క ఆయుధాలు, నౌకలు, విమానాలు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి.
*ఈ ఇంద్ర విన్యాసాలు 2003వ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. 2017 లో మొదటిసారి త్రివిధ దళాలు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి.
* ఇరు దేశాల మధ్య సహకారం, అవగాహన పెంపొందించేందుకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి.

ఫాస్ట్ ట్యాగ్‌ గడువు మరొకసారి పొడగింపు 
*ఇండియా గవర్నమెంట్ హైవేల మీద ప్రయాణం చేసే వాహనదారులకు ఫాస్ట్ ట్యాగ్‌లను తప్పనిసరి చేసే కొత్త నియమాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
*ఇప్పుడున్న కొత్త సమాచారం ప్రకారం 2020 జనవరి 15 నుండి జాతీయ రహదారులపై ఫాస్ట్ ట్యాగ్స్ తప్పనిసరి చేయనున్నది. 
*గతంలో ప్రభుత్వం ఈ గడువును డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు పొడిగించింది.
*ఫాస్ట్ ట్యాగ్ అంటే దేశంలోని జాతీయ రహదారుల మీదుగా 100 శాతం ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ కోసం ప్రభుత్వ ప్రణాళికకు మద్దతు ఇవ్వడం. 
*ఈ ట్యాగ్ల కొరత కారణంగా దీనిని జనవరి 15, 2020 వరకు పొడిగింపును ప్రకటించింది.
*ఇప్పటివరకు సుమారు 1కోటి ట్యాగ్‌లను జారీ చేయబడ్డాయి.
*ఇది ఒక రకమైన ప్రీపెయిడ్ . ఇది నాలుగు చక్రాల నుండి మోటారు వాహనాలను లావాదేవీల కోసం ఆపాల్సిన అవసరం లేకుండా టోల్లను జిప్ చేయడానికి అనుమతిస్తుంది.
*ప్రీపెయిడ్ పునర్వినియోగపరచదగిన స్టిక్కర్ ట్యాగ్‌లు RFID- ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. ఇది మీ వాహనం యొక్క సమాచారాన్ని బార్‌కోడ్‌లో స్టోర్ చేస్తుంది. అలాగే కస్టమర్ అకౌంట్ లేదా ప్రీపెయిడ్ వాలెట్‌తో అనుసంధానించబడుతుంది.
*ఫాస్ట్ ట్యాగ్ అనేది ప్రీపెయిడ్ ట్యాగ్. ఇది వాహనం యొక్క విండ్‌స్క్రీన్‌పై అతికించబడి ఉంటుంది. దీని ద్వారా టోల్ ప్లాజా యొక్క ఛార్జీలు ఆటొమ్యాటిక్ గా చెల్లింపు చేయబడతాయి మరియు మీ యొక్క అకౌంట్ లోని మొత్తంలో క్రమంగా తగ్గింపును అనుమతిస్తుంది.
*దీని ద్వారా నగదు లావాదేవీల కోసం ఎక్కువ సేపు ఆపకుండా టోల్ ప్లాజా గుండా వాహనాన్ని వెళ్ళడానికి అనుమతిస్తుంది.
*ఫాస్ట్ ట్యాగ్ ప్రస్తుతం ఇండియా హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌ఎంఎల్), NHAI మరియు దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకుల యొక్క ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పాయింట్-ఆఫ్-సేల్ స్థానాల్లో అందుబాటులో ఉంది. 


రాష్ట్రీయం
ఉపాధి హామీ పథకం అమలులో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
*జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
*ఢిల్లీలో ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి.
*ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
*పథకం అమల్లో సమర్థ స్వపరిపాలన విభాగంలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది.
* పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన జిల్లాల జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు అవార్డు లభించింది. *ఏపీ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అవార్డులు అందుకున్నారు.
*తెలంగాణ నుండి ఉపాధి హామీలో ఎక్కువ సగటు పనిదినాలు కల్పించడంలోనూ, నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడంలో రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు దేశంలోనే నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.
*  ఉపాధి హామీ చట్టం ద్వారా కల్పించే ప్రయోజనాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందిన గ్రామాల విభాగంలో వికారాబాద్‌ జిల్లాలోని నవాబుపేట్‌ మండలం లింగంపల్లి గ్రామం జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది.
*శ్యాంప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగముగా జియో-స్పేషియల్‌ ప్లానింగ్‌ను అన్నిరూర్బన్‌ క్లస్టర్లలో దేశంలోనే అందరికంటే ముందు పూర్తిచేసినందున జాతీయ స్థాయి అవార్డు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. 

ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ రాజధాని కమిటీ నివేదిక
*ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అంశాలపై నియమించిన జీఎన్‌రావు నిపుణుల కమిటీ రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. 
*కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం చేసి.. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరించింది.
*రాజధానిపై మధ్యంతర నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది.
*విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించింది. 
* పలు ప్రాంతాల నుంచి వచ్చిన 40వేలకు పైగా వినతులను కమిటీ పరిశీలించింది.
*ఇప్పటికే రాజధానిపై సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు. 
* ఈ కమిటీలో డాక్టర్ కేటీ రవీంద్రన్, డా.మహవీర్, డా. అంజలికరోల్ మోహన్, డా. ఏవీ సుబ్బారావు, కేబీ అరుణాచలం, విజయమోహన్ సభ్యులుగా ఉన్నారు.




No comments:

Post a Comment