Daily Current Affairs in Telugu 24th December 2019

అంతర్జాతీయం 
స్వర్ణం సాధించిన సింధు 
*స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి సింధూ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. *ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి ఇండియన్‌గా కొత్త చరిత్ర సృష్టించింది.
*ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గతంలో రెండు కాంస్య (2013, 2014), రెండు రజత పతకాలు (2017, 2018) సాధించిన సింధూ ఈ ఏడాది స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
* ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన బిసాయి ప్రణీత్‌ కాంస్యంతో మెరిశాడు. పురుషుల విభాగంలో ఈ టోర్నిలో భారత్‌కు పతకం రావడం 36 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారి.
*1983లో ప్రకాష్‌ పదుకోనే కాంస్య పతకం సాధించాడు.
రాఖీ హల్దెర్‌కు కాంస్యం 

*ఖతార్‌ ఇంటర్నేషనల్‌ కప్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్లు మొత్తం మూడు పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు.
*టోర్నీ తొలి రోజు మీరాబాయి చాను, జెరేమీ లాల్‌రినుంగా స్వర్ణ పతకాలు దక్కించుకోగా,పోటీల చివరి రోజు మహిళల 64 కేజీల విభాగంలో రాఖీ హల్దెర్‌ కాంస్యం పతకం చేజిక్కించుకుంది.
*రాఖీ రెండు జాతీయ రికార్డులను  తన పేరిట రాసుకుంది.
*పోటీల్లో హల్దెర్‌ 218 కేజీల (స్నాచ్‌లో 98 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 123 కేజీలు) బరువెత్తి.. తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపర్చుకోవడంతో పాటు రెండు విభాగాల్లోనూ జాతీయ రికార్డులు బద్దలు కొట్టింది.
*టోక్యో ఒలింపిక్స్‌ సిల్వర్‌ స్థాయి అర్హత టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఖతర్‌ కప్‌లో ఓవరాల్‌గా భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు ఈ టోర్నీలో మీరాబాయి చాను స్వర్ణం, జెరెమీ లాల్‌రినుంగా రజతం సాధించారు.    
జాతీయం 
క్యూఆర్‌శామ్ క్షిపణి ప్రయోగం 
*ఉపరితలం నుంచి గగన తల లక్ష్యాలను చేధించే క్యూఆర్‌శామ్ క్షిపణిని(క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్) భారత్ డిసెంబర్ 23వ తేదీన విజయవంతంగా పరీక్షించింది. 
*ఒరిస్సా తీరం నుంచి జరిగిన ఈ పరీక్ష లక్ష్యాలకు అనుగుణంగా సాగిందని, అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణిని వచ్చే ఏడాది సైనిక దళాల అమ్ముల పొదిలో చేర్చే అవకాశం ఉంది.
*భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రూపొందించిన ఈ క్విక్ రియాక్షన్ క్షిపణి తాజా పరీక్షలో అన్ని ప్రమాణాలను సంతృప్తి పరిచింది.
*మధ్యలోనే ఈ క్షిపణి తన లక్ష్యాన్ని చేధించింది.
* క్యూఆర్‌సామ్‌ క్షిపణి ప్రయోగాన్ని భూ ఉపరితలంపై గల టెలిమిట్రీ, రేంజ్‌ రాడార్‌, ఎలక్ట్రికో ఆప్టికల్‌ వ్యవస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది.
* గగనతలంలోనే లక్ష్యాలను ఢీకొట్టగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. ఇది పూర్తిగా ఆటోమేటెడ్‌ కంట్రోల్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో నడుస్తుంది.
*ఈ క్షిపణి లో అత్యంత శక్తివంతమైన రాడార్లు, కమాండ్, కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయి.
*ఈ క్షిపణి కదులుతున్న సమయంలోనే ఈ రాడార్లు శతృ లక్ష్యాలను గుర్తించగలవు.
* ఈ తాజా పరీక్షతో ఈ ఉపరితల క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి మరియు దీన్ని2021లో ఈ వెపన్‌ సిస్టమ్‌ను సైనిక దళాల్లోకి ఇండెక్ట్‌ ఆచరణాత్మకంగా వినియోగించాల్సి ఉంది.

విదేశాంగ కార్యదర్శిగా హర్షవర్ధన్ 
*సీనియర్‌ దౌత్యవేత్త హర్ష్‌వర్ధన్‌ శ్రింగ్లా తదుపరి భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 
* ఆయన ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.
*1984 బ్యాచ్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి అయిన శ్రింగ్లాను కొత్త విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయించింది. 
*ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే పదవీకాలం జనవరి 28న ముగియనుండగా ఆ మర్నాడు శ్రింగ్లా బాధ్యతలు చేపడతారు.

జాతీయ జ‌నాభా రిజిస్ట‌ర్‌కు అనుమతి 

 *జాతీయ జ‌నాభా రిజిస్ట‌ర్‌ను కేంద్ర ప్ర‌భుత్వం అప్‌డేట్ చేయ‌నున్న‌ది.
*డేటా సేక‌ర‌ణ కోసం సుమారు 8500 కోట్లు ఖ‌ర్చు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.
*డిసెంబర్ 24వ తేదీన కేంద్ర క్యాబినెట్ నేష‌న‌ల్ పాపులేష‌న్ రిజిస్ట‌ర్‌(ఎన్‌పీఆర్‌)కు అనుమ‌తి ఇచ్చింది.
* ప్ర‌తి ఒక పౌరుడి పూర్తి డేటాబేస్‌ను త‌యారు చేయ‌డ‌మే ఎన్‌పీఆర్ ల‌క్ష్య‌మ‌ని సెన్స‌స్ క‌మిష‌న్ పేర్కొంది.
* జ‌నాభా వివ‌రాల్లో ప్ర‌తి పౌరుడు భౌగోళిక‌, బ‌యోమెట్రిక్ వివ‌రాలు ఉంటాయి. ఎన్‌పీఆర్ చేయాలంటే.. పౌరులు ఎవ‌రైనా ఒక ప్రాంతంలో ఆరు నెల‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం ఉన్న‌వారే అర్హులు.లేదా వచ్చే ఆరు నెలల పాటు అదే ప్రాంతంలో నివసించే పౌరులు.
*భారత దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఎన్‌పీఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
*ఎన్‌పీఆర్ ను జనాభా లెక్కలతో కల్పించారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఈ కార్యక్రమానికి ఇది మొదటి అడుగు.
*దేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఎన్‌పీఆర్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనాభా లెక్క‌ల‌(సెన్స‌స్‌)కు ఎన్‌పీఆర్ అనుసంధాన‌మై ఉంటుంది. 
*దీని ఆధారంగానే పౌర జాబితా (నేష‌న‌ల్ రిజిస్ట‌ర్ ఆఫ్ సిటిజ‌న్స్‌) ప‌ట్టిక‌ను త‌యారు చేస్తారు. 
*వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య కాలంలో ఎన్‌పీఆర్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్నారు. అస్సాం మిన‌హా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. 
*2010లో తొలిసారి NPR డేటాను సేక‌రించారు. అప్పుడు యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ది. 
*2015లో ఎన్‌పీఆర్ డేటాను ఇంటింటి స‌ర్వే ద్వారా అప్‌డేట్ చేశారు. ఆ డేటా డిజిటైజేష‌న్ పూర్తి అయ్యింది.
*2021 జనాభా లెక్కల కొరకు 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 
పెరగనున్న భారతీయ రైళ్ల వేగం 
*రానున్న నాలుగున్నరేళ్లలో భారతీయ రైళ్ల సగటు వేగం గంటకు 80 కిలోమీటర్లకు చేరనుంది. 
*ప్రస్తుతం ఉన్న వేగం కంటే 30 శాతం వేగం పెంచడం ద్వారా ప్రయాణికులు ప్రయాణించే రైళ్ల యొక్క ప్రయాణ సమయం తగ్గుతుంది.
*సంవత్సరం వారీగా ప్రణాళిక చూసినట్లయితే 2020-21 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని 30 కిలోమీటర్ల వేగానికి మరియు 2021-22 సంవత్సరంలో గంటకు 34 కిలోమీటర్లు ,2022-23 సంవత్సరంలో గంటకు  39 కిలోమీటర్లు, 2024 సంవత్సరం నాటికి గంటకు 45 కిలోమీటర్ల వేగాన్ని పెంచనున్నారు.
*ఇందుకోసం రైల్వేశాఖ నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
*కేంద్రం ఆమోదముద్ర పడితే.. పనులు ప్రారంభమవుతాయి.
*అదే సమయంలో సరుకు రవాణాలో తిరిగి నిలదొక్కుకునేందుకు నాలుగున్నరేళ్లలో దశలవారీగా గూడ్స్‌ రైళ్ల సగటు వేగాన్ని ప్రస్తుతమున్న 25 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్లకు పెంచనున్నారు.
ఇస్రో -2020

* వచ్చే 2020 సంవత్సరంలో ఇస్రో భారీ లక్ష్యాలను పెట్టుకుంది. 
* 12 కీలక ఉపగ్రహ మిషన్లను ప్రయోగించనున్నారు. 
* హైప్రొఫైల్‌ ఇంటర్‌ ప్లానెటరీ మిషన్‌, ఆదిత్య, గగన్‌యాన్‌ మిషన్‌లో మొదటి మానవరహిత టెస్ట్‌ ఫ్లైట్‌, జీశాట్‌1, జీశాట్‌12ఆర్‌, భూమిమి పరిశీలన ఉపగ్రహాలు, రీశాట్‌2, బీఆర్‌2, మైక్రోసాట్‌ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. 
*2020 మధ్య నాటికి ఆదిత్య ఎల్‌ 1 మిషన్‌ ప్రయోగం నిర్వహించనున్నారు. 
*  డిసెంబర్‌లో గగన్‌యాన్‌ తొలి మానవరహిత టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగించనున్నారు. 

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ నియామకానికి కేంద్రం ఆమోదం
*త్రివిధ దళాలు(ఆర్మీ, నేవీ, వాయుసేన) కలిసి సమన్వయంతో పనిచేసేందుకు గానూ ఒక ఉన్నత స్థాయి పదవిలో అధికారిని నియమించేందుకు భద్రతపై ఏర్పాటైన కేబినెట్‌ కమిటీ అంగీకారం తెలిపింది.
*మూడు దళాలకు కలిపి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) పదవి సృష్టించేందుకు ఈ కమిటీ నేడు ఆమోద ముద్ర వేసింది.
*సీడీఎస్‌ బాధ్యతలు, ఈ పదవి ఫ్రేమ్‌వర్క్‌పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కేబినెట్‌ కమిటీ ఆమోదించింది.
*దేశ రక్షణ కోసం సైనిక సంస్కరణల్లో భాగంగా త్రివిధ దళాలకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ప్రకటన చేశారు.
* ప్రధాని ప్రకటన తర్వాత కొద్ది రోజులకు సీడీఎస్‌ నియామకం, బాధ్యతలపై దోభాల్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది.
*రక్షణ దళాలన్నింటికీ కలిపి సీడీఎస్‌ పోస్టును ఏర్పాటు చేయాలని 1999లో కార్గిల్‌ కమిటీ చీఫ్‌గా ఉన్న కె.సుబ్రహ్మణ్యం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కానీ అప్పుడు ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు. 
*ఆ తర్వాత 2000 సంవత్సరం ఏప్రిల్‌లో కార్గిల్‌ రివ్యూ కమిటీ నుంచి వచ్చిన సిఫార్సులపై సమీక్షకు అప్పటి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
*అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను అమలు చేయాలని ప్రస్తుత మోదీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రీయం 
అరుణ్ సాగర్ అవార్డుల ప్రకటన 

*పాత్రికేయుడు అరుణ్‌సాగర్‌ పేరిట ఇచ్చే విశిష్ఠ పాత్రికేయ, విశిష్ఠ సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవాన్ని జనవరి 2న జరపనున్నారు. 
* విశిష్ఠ పాత్రికేయ పురస్కారానికి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె శ్రీని వాస్‌, విశిష్ఠ సాహిత్య పురస్కారానికి ప్రముఖ కవి ప్రసేన్‌ ఎంపికయ్యారు. 
* ఈ కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమి చైర్మెన్‌ అల్లం నారాయణ, తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ చైర్మెన్‌ ఘంట చక్రపాణి, సారస్వతి సమ్మాన్‌ అవార్డు గ్రహిత కె.శివారెడ్డి, టీవీ-5 చైర్మెన్‌ బిఆర్‌. నాయుడు, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత దేవీప్రియ, కాళోజి అవార్డు గ్రహిత సీతారం, పాత్రికేయులు ప్రసాదమూర్తి పాల్గొంటారు.
*అరుణ్ సాగర్ (జనవరి 2, 1967 - ఫిబ్రవరి 12, 2016) ప్రముఖ కవి మరియు సీనియర్ జర్నలిస్టు. ఈయన చివరగా టీవీ5 సీఈవోగా పనిచేశాడు. గతంలో పత్రికా రంగంలో పనిచేసిన సాగర్, అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాకు మారాడు. పలు ఛానళ్లలో ఉన్నత పదవులను చేపట్టాడు. మేలు కొలుపు, మ్యూజిక్ డైస్, మ్యాగ్జిమమ్ రిస్క్ కవితా సంకలనాలు ఈయనకు మంచిపేరును తెచ్చాయి. తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశాడు.
*ఇతడు ఖమ్మం జిల్లా, భద్రాచలంలో భారతీదేవి, టి.వి.ఆర్.చంద్రం దంపతులకు 1967, జనవరి 2వ తేదీన జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం భద్రాచలం,ఖమ్మం, విజయవాడ, విశాఖపట్టణం లలో జరిగింది. మానవపరిణామశాస్త్రము (ఆంత్రోపాలజీ)లో స్నాతకోత్తర పట్టా పొందాడు. ఆంధ్రజ్యోతి, సుప్రభాతం మొదలైన పత్రికలలో టి.వి9, టి.వి.10, టి.వి.5 మొదలైన టి.వి.ఛానళ్లలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు.
*ఇతని మియర్ మేల్ కవితా సంపుటానికి 2012 సంవత్సరానికిగాను రొట్టమాకురేవు కవితా పురస్కారం లభించింది.

No comments:

Post a Comment