Daily Current Affairs In Telugu 22nd & 23rd December 2019

అంతర్జాతీయం 
8 దేశాల ఉమ్మడి కరెన్సీ 
*పశ్చిమ ఆఫ్రికాకు చెందిన 8 దేశాలు తమ కరెన్సీని CFA ఫ్రాంక్(CFA franc)ను ఎకో(Eco) గా మార్చాయి. 
*గతంలో Sakshi యొక్క వలస పాలనలో ఉన్న దేశాలు కాబట్టి ఉమ్మడి కరెన్సీ ని కలిగి ఉన్నాయి. 
*ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మైక్రాన్ ఐవరీ కోస్ట్ పర్యటనలో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 
*ఈ ఒప్పందం కుదరడానికి ఆరు నెలల సమయం పట్టే గా ఉమ్మడి కరెన్సీ 2020 నుండి ప్రారంభం కానుంది. 
*8 పశ్చిమ ఆఫ్రికా దేశాలు-ఐవరీ కోస్ట్, మాలి, బుర్కినా ఫాసో , నైగర్ ,సెనెగల్ ,టోగో ,గునియా బిస్సావ్. ఈ ఎనిమిది దేశాలు ప్రస్తుతం  CFA France కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. 
* గునియా బిస్సావ్ తప్ప మిగతా అన్ని 1tan దేశం యొక్క వలస దేశాలు.
రెండోసారి ఆఫ్ఘన్‌కు అష్రఫ్‌
*ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ గెలుపు సొంతం చేసుకొన్నారు. 
* రెండోసారి ఆఫ్ఘన్‌ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు కావాల్సిన మెజార్టీ సాధించింది.
* అష్రఫ్‌ఘనీకి 50.64% ఓట్లు రాగా, ప్రధాన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లాకు 39.52% ఓట్లు పోలయ్యాయి.
*అధ్యక్ష పదవికి సెప్టెంబర్‌ 28 న ఎన్నికలు జరిగాయి. 
* ఎన్నికలకు సంబంధించి అభ్యంతరాలను అభ్యర్థులు మూడు రోజుల్లోగా ఎన్నికల సంఘానికి తెలపాలి.
*అక్టోబర్‌ 19న ఫలితాల్ని వెల్లడించాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపించడంతో ఫలితాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. 
*2001లో తాలిబన్ల పాలన అంతం తర్వాత జరిగిన ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 
* జర్మనీ సంస్థ పంపిణీ చేసిన బయోమెట్రిక్‌ యంత్రాలు బాగా పనిచేశాయని పేరొచ్చింది. కానీ, లక్ష ఓట్ల వరకు గల్లంతైనట్టు ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. 
*తాలిబన్లతో అమెరికా జరిపిన చర్చలతో రాజకీయ అనిశ్చితి నెలకొంది.
*వారితో చర్చించడానికేమీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటిస్తే, అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
* 2014 అధ్యక్ష ఎన్నికల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో తలెత్తిన రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు అష్రఫ్‌ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా కలసి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత అయిదేళ్లుగా ఆ ప్రభుత్వం సాగింది.
* ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనల ఉపసంహరణపై తాలిబాన్లకు, అమెరికా ప్రభుత్వానికి మధ్య గత ఏడాది కాలంగా చర్చలు సాగుతున్నాయి.
క్యూబా ప్రధానిగా మర్రేరో 
*క్యూబాలో 43 ఏళ్ల అనంతరం ప్రధానమంత్రి పదవిని పునరుద్ధరించారు. 
*2004 నుంచి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న మాన్యుయల్‌ మర్రేరో (56) ఈ పదవిని చేపట్టారు. 
*1959-1976 మధ్యకాలంలో ఈ పదవిలో విప్లవ నాయకుడు ఫిడెల్‌ క్యాస్ట్రో ఉండేవారు. 
*దేశంలో అధ్యక్ష తరహా పాలన వచ్చి, క్యాస్ట్రో అధ్యక్షుడయిన తరువాత ప్రధాని పదవిని రద్దు చేశారు.
*దేశాధ్యక్షుడు మిగేల్‌ డియాజ్‌-కానెల్‌ ప్రధాని అభ్యర్థిని నామినేట్‌ చేస్తారు. 

జాతీయం 
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
*జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు---
*మొత్తం అసెంబ్లీ స్థానాలు - 81 
* బిజెపి 25 స్థానాలు, కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం) -46 స్థానాలు,AJSU -3 స్థానాలు,JVM - 3 స్థానాలు, ఇతరులు -4 స్థానాలు గెలుచుకున్నారు.
* 81 స్థానాలు ఉన్న ఈ ఝార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 మధ్య ఐదు దశల్లో పోలింగ్ జరిగింది.
సుమారు 65.17% పోలింగ్ నమోదు అయ్యింది.
*ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రఘువర్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఝార్ఖండ్‌లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి ముఖ్యమంత్రి ఆయనే.
*బీజేపీ ఈసారి 79 స్థానాల్లో పోటీ చేసింది. క్రితం సారి (2014) ఎన్నికల్లో ఆ పార్టీకి 37 స్థానాలు వచ్చాయి.
అప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు.
*గత ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు 17, కాంగ్రెస్‌కు 6 సీట్లు వచ్చాయి.
ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు, ఆర్జేడీ జట్టు కట్టి పోటీ చేశాయి. 
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడో రాష్ట్రం ఝార్ఖండ్.
ఇంతకు ముందు హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌
*'ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌'నావికాదళంలోనే అంతర్గతంగా ఉన్న ఏడుగురు శత్రు గూఢచారులను గుర్తించారు.
* వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ఒక నెట్‌వర్క్‌ వలే పని చేస్తున్నారు.తూర్పుతీర నావికాదళ కేంద్ర స్థావరమైన విశాఖ పట్టణంలోని కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారు.
*వాస్తవానికి తూర్పుతీర నావికాదళం పాకిస్థాన్‌వైపు ఉండదు.. ముంబయి, కేరళ, గుజరాతీ తీరప్రాంతాలు పాక్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. 
*పాక్‌ను ఎదుర్కొవడానికి మన దళాలు వాటినే వాడుతుంటాయి.
* వైజాగ్‌.. నావికాదళానికి అత్యంత కీలకమైంది. అటు చెన్నై, ఇటు కోల్‌కతాకు ఇక్కడి నుంచి చేరుకోవడం తేలిక. 
*భారత్‌కు చెందిన అణుశక్తి సబ్‌మెరైన్‌(ఎస్‌ఎస్‌ఎబీఎన్‌) అరిహంత్‌ స్థావరం ఇక్కడే ఉంది. 
* దాని తయారీ దగ్గర నుంచి మరమ్మతుల వరకు ఇక్కడే జరిగాయి. భారత అణు త్రిశూల (న్యూక్లియర్‌ ట్రైడ్‌) శక్తిలో ఇది కీలక భాగం. ఇటీవలే ఇది 'డిటరెన్స్‌ పెట్రోల్‌'ను కూడా పూర్తి చేసుకొంది.
* భారత్‌ దేశీయంగా కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌లో తయారవుతున్న విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌(కొత్త) తూర్పు తీరానికి రక్షణగా ఇక్కడే నిలిపి ఉంచనున్నారు.
* ఇక్కడ హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ భారత నావికాదళానికి చెందిన కీలక నౌకలను తయారు చేస్తోంది. 
* తాజాగా ఇక్కడ వీసీ11184 పేరుతో క్షిపణుల కదలికలను గుర్తించే నౌకను తయారు చేస్తున్నారు. దీని తయారీ రహస్యంగా ఉంచారు.
* ఇక్కడ ఉన్న షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌(ఎస్‌బీసీ)లో ఖండాంతర క్షిపణి ప్రయోగించే అణుశక్తి జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌)ను ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను సిద్ధం చేస్తున్నారు.దీనిని మరికొన్ని నెలల్లో నావికాదళానికి అప్పగించనున్నారు.
* దీంతోపాటు ఇక్కడ కీలకమైన ఎన్‌ఎస్‌టీఎల్‌ లాంటి పరిశోధన కేంద్రాలు, ప్రయోగ శాలలు వైజాగ్‌ కేంద్రంగా ఉన్నాయి.
*1965 భారత్‌-పాక్‌ యుద్ధసమయంలో పీఎన్‌ఎస్‌ ఘాజీ భారత పశ్చిమ తీరాన్ని దాటి మరీ భారత విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను వెతుక్కొంటూ వైజాగ్‌ తీరానికి చేరింది. 
*మన దళాలు అత్యంత అప్రమత్తంగా ఉండటంతో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రమాదం నుంచి తప్పించడంతో పాటు పీఎన్‌ఎస్‌ ఘాజీని ధ్వంసం చేశాయి.
* ఇప్పుడు  చైనా అండతో పాక్‌ సబ్‌మెరైన్లను, ఇతర అత్యున్నత శ్రేణి సాంకేతికతను సొంతం చేసుకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దళాల సమాచారం బయటకు పొక్కడం ఇబ్బందికరంగా మారింది.
*ఇటీవల చైనాకు చెందిన 'షీ యాన్‌ 1' అండమాన్‌ నికోబార్‌ వద్ద భారత ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌లోకి వచ్చి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 
*దీనిలో సముద్ర గూఢచర్యానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి.
*ఇవి సముద్రం అడుగు భాగాల్లో , పైన ఉన్న భారత సబ్‌మెరైన్ల, నౌకల కదలికలను పసిగట్టేందుకు ప్రయత్నాలు చేసింది. 
*దీంతో అప్రమత్తమైన మన నావికాదళం దానిని భారత ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ నుంచి బయటకు పంపింది. అండమాన్‌ ప్రాంతం వైజాగ్‌ తీరానికి సమీపంలోనే ఉన్నాయి.
*2001లో నేవీలో కీలక అధికారి రాజ్‌కుమార్‌ సింగ్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. వీరు ఐఎన్‌ఎస్‌ డేగాతోపాటు ఇతర కీలక స్థావరాల సమాచారాన్ని నేపాల్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్లకు అందజేసినట్లు గుర్తించారు. 
*నాటి సీపీ ఏకే ఖాన్‌ నేతృత్వంలోని నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రాజ్‌కుమార్‌ విశాఖ కేంద్ర కారాగారంలో తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు.
*పాక్‌ ఇప్పటికే ఉగ్రవాదులకు నావికాదళ శిక్షణ ఇస్తోందని నాటి భారత నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా మార్చిలో పేర్కొన్నారు. 'ఇండో-పసిఫిక్‌ రీజనల్‌ డైలాగ్‌-2019'లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 

క్విక్‌ రియాక్షన్‌ క్షిపణి ప్రయోగం
*డీఆర్‌డీవో డిసెంబర్ 23వ తేదీన క్విక్‌ రియాక్షన్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 
*క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ (QRSAM) వ్యవస్థను డీఆర్‌డీవో అభివృధ్ది పరిచింది.
* ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి దీన్ని పరీక్షించారు. 
* టార్గెట్‌ను మిడ్‌ ఎయిర్‌లోనే షూట్‌ చేశారు. మిషన్‌ లక్ష్యాలను అందుకునే విధంగా పరీక్షను చేపట్టారు. 
*ఏరియల్‌ టార్గెట్‌ను మిస్సైల్‌ తన పూర్తి సామర్థ్యంతో ఢీ కొట్టింది. 
* ఈ పరీక్షతో డెవలప్మెంటల్‌ ట్రయల్స్‌ పూర్తి అయ్యాయి. 
*  2021లో ఈ వెపన్‌ సిస్టమ్‌ను సైనిక దళాల్లోకి ఇండెక్ట్‌ చేయనున్నారు. 
*ఈ క్షిపణి వ్యవస్థ పూర్తిగా ఆటోమేటిక్ విధానంలో నియంత్రణ కలిగి ఉంటుంది.
*ఇందులో ఉండే రెండు రాడార్లు ( active array battery surveillance radar,active array battery multi-function radar )మూడు వందల డిగ్రీల కవరేజ్ ను కలిగి ఉంటాయి. 
*Search-on-move మరియు track-on-move సామర్థ్యం కలిగివుంటాయి. 

భారతీయ రైల్వేలో 50 లక్షల కోట్ల పెట్టుబడులు
*వచ్చే 12 సంవత్సరాలలో రైల్వేల ఆధునికీకరణ పై  50 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
*ఈ మొత్తం పెట్టుబడులను రైల్వేల ఆధునికీకరణ,రవాణా ఖర్చు తగ్గించడం మరియు ప్రపంచ స్థాయి రవాణా సౌకర్యాలను కల్పించడం కొరకు ఖర్చు చేయనున్నారు.
* రైల్వేల ఆధునికీకరణ ద్వారా రైల్వే  కోచ్ లు Proliferation of Linke Hofmann Busch సాంకేతికతను కలిగి ఉండడం ద్వారా అత్యంత వేగం, సాంకేతిక రంగం ముందడుగు లో ఉంటూ, సురక్షిత ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన సాంకేతికత కలిగిన రైల్వే కోచ్ లను  2018-19 సంవత్సరం తర్వాత నుండి ఏర్పాటు చేస్తున్నారు.
*సెమీ హై స్పీడ్ గ ల గతిమాన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి ఆగ్రా కు ప్రయాణించే రైలు వేగం గంటకు 160 కి.మీ.ఇలాంటి రైళ్ళ ఆధునికీకరణకు ఏ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి.
*చూపు లేని ప్రయాణికులకు బ్రెయిలీ ద్వారా సదుపాయాలు కల్పించడం, రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ లను ఏర్పాటు చేయడం మొదలైన పనులు చేపట్టనున్నారు. 
బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ తయారీకి ఆర్మీ డిజైన్‌ బ్యూరో ఎక్సలెన్స్‌ అవార్డు
*భారత ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్న అనూప్‌ మిశ్రా కు ఆర్మీ డిజైన్‌ బ్యూరో ఎక్సలెన్స్‌ అవార్డు దక్కింది. *ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అనూప్‌ మిశ్రా కు అందజేశారు.
*దేశీయంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను డెవలప్‌ చేసినందుకు అతనికి ఈ అవార్డును ప్రదానం చేశారు.
*స్నైపర్‌ బుల్లెట్ల నుంచి ప్రాణ రక్షణ కల్పించేందుకు సర్వత్ర బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను అనూప్‌ మిశ్రా డెవలప్‌ చేశారు. 
*ఎల్వోసీ, కాశ్మీర్‌ లోయలో స్నైపర్‌ ఘటనలు ఎక్కువ కావడం వల్ల మేజర్‌ అనూప్‌ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.
*ఇండియన్ ఆర్మీ 40,000 బుల్లెట్ప్రూఫ్ జాకెట్లను కాశ్మీరులోయలో ఉగ్రవాదులను ఎదుర్కొనే సైనికులకు అక్టోబర్ నెలలో అందజేసింది.
*ఏకే-47 ద్వారా ప్రయోగించే అమ్మూనిటీన్ స్టీల్( steel ammunition)బుల్లెట్ లను కూడా ఈ జాకెట్లు తట్టుకోగలవు. 
*అనుప్ మిశ్రా సర్వత్రా అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేశారు. 
*లైన్ ఆఫ్ కంట్రోల్ ,కాశ్మీర్ లోయలో గొడవల నేపథ్యంలో వీటిని లాంచ్ చేశారు. 
*భారత్ ఆర్మీ లో బాబా కవచం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఉపయోగిస్తున్నారు. 
*బాబా అటామిక్ రీసెర్చ్ కేంద్రం వీటిని నానో టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసింది.  
భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు
*ఇండియా ఫారెక్స్ నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. 
*ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ రెండో క్వార్టర్ ముగిసే సమయానికి 5 శాతం విదేశీ మారక నిల్వలు పెరిగాయి. 
*2019 మార్చి నాటికి 412.87 బిలియన్ డాలర్లు ఉండగా, సెప్టెంబర్ నాటికి 433.70 బిలియన్ డాలర్లు పెరిగాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ వద్ద 618.17 టన్నుల బంగారం ఉంది.
*ఇందులో 325.87 టన్నులు విదేశాల్లోని బ్యాంకుల్లో సేఫ్ కస్టడీలో ఉంది. 
*బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉంది. మిగతా బంగారం అంత భారత్‌లో ఉంది. 
* డాలర్ల పరంగా చూస్తే మొత్తం విదేశీ మారక నిల్వలో బంగారం వాటా మార్చి 30 నాటికి 5.6 శాతంగా ఉండగా, సెప్టెంబర్ చివరి నాటికి 6.1 శాతానికి పెరిగింది. 
*డిసెంబర్ 13తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 
*ఇవి 454.492 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత వారంలో నిల్వలు 107 కోట్ల డాలర్లు పెరిగాయి. 
*క్రితం వారంలో నిల్వలు 234.2 కోట్ల డాలర్లు పెరిగాయి.
* డిసెంబర్ మొదటి వారంలో బంగారం నిల్వలు 11 కోట్ల డాలర్లు తగ్గి 2,696.8 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. 
హిందుస్థానీ గాయకురాలు సవితా దేవి మృతి 
*ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకురాలు విదుషీ సవితా దేవి మృతి చెందారు. 
* పద్మశ్రీ గ్రహీత సిద్ధేశ్వరీదేవి కుమార్తె అయిన విదుషీ దేవి తుమ్రీ, దాద్రా, చైత్రి, కజ్రీ, తప్పా వంటి హిందుస్థానీ సెమీ క్లాసికల్‌ స్వరరూపాలతో పాటు పురాబాంగ్‌లోనూ ప్రముఖ గాయనిగా పేరు పొందారు.
*పండిట్‌ రవి శంకర్‌ నుండి సితార్‌ను నేర్చుకున్నారు.స్వర సంగీతంలో తన తల్లి వారసత్వాన్ని కొనసాగించారు. 
*దేశ విదేశాల్లో అనేక కచేరీలు ఇచ్చిన ఆమె దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియోలో క్రమం తప్పకుండా ప్రదర్శనలు ఇచ్చేవారు. 
*తన తల్లి సిద్ధేశ్వరి పేరుతో జీవిత చరిత్రను రచించడంతో పాటు ఢిల్లీ విశ్వ విద్యాలయానికి చెందిన దౌలత్‌రామ్‌ కళాశాలలో సంగీత విభాగానికి అధిపతిగా విధులు నిర్వహించారు.

రాష్ట్రీయం 
కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం 
*కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ కావాలన్న రాయలసీమ వాసుల కోరికమేరకు  సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేశారు .
*ఉక్కు పరిశ్రమ కోసం కడప జిల్లాలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజల ఆకాంక్ష మేరకు బ్రాహ్మణి స్టీల్స్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 
*జమ్మల మడుగు సమీపంలో 10వేల ఎకరాల్లో బ్రాహ్మణి కర్మాగారం పనులు చేపట్టారు. 
*బుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ కావడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
*అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. జమమ్మలమడుగు మండలం కంబాలదిన్నె దగ్గర ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 3వేల 400ఎకరాలు సేకరించారు. 
* శంకుస్థాపన చేయనున్న ఉక్కు ఫ్యాక్టరీని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు.
కడప జిల్లాల్లో ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా లక్ష మందికి లబ్ది చేకూరనుంది.
* సున్నపురాళ్ల పల్లెలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 
*మైదుకూరు నియోజకవర్గం నేలటూరు చేరుకున్నారు. కుందూ నదిపై జొలదరాశి, రాజోలి, బ్రహ్మంసాగర్‌ ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. 
*గండికోట నుంచి వెళ్లే కాల్వల సామర్థ్యాన్ని 4వేల నుంచి 6వేల క్యూసెక్కులకు పెంచనున్నారు.
*రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలను నీటితో సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిని పెన్నా బేసిన్‌కు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* బొల్లేపల్లిలో రిజర్వాయర్‌ నిర్మించి అక్కడి నుంచి బనకచర్లకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.దీనికి ఈ రూ.60వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
21st December 2019 Current Affairs In Telugu

No comments:

Post a Comment