Daily Current Affairs In Telugu 21st December 2019

అంతర్జాతీయం 
అంతరిక్ష దళాన్ని ప్రారంభించిన అమెరికా
*అమెరికా అంతరిక్ష దళాన్ని ఏర్పాటు చేసింది. పెంటగాన్ దీనికి నిధులను అందజేస్తుంది.
*అంతరిక్షంలో జరగబోయే యుద్ధాలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ దళాన్ని ఏర్పాటు చేశారు.
* అమెరికా సైనిక దళంలో ఓ కొత్త యూనిట్‌ను ప్రారంభించడం 70 ఏళ్లలో ఇది తొలిసారి. 
* అమెరికా వైమానిక దళం కిందే ఈ విభాగం పనిచేస్తుంది.
* వాషింగ్టన్ సమీపంలో ఉన్న ఓ ఆర్మీ బేస్‌లో స్పేస్ ఫోర్స్‌ను ప్రారంభించారు.
*ప్రపంచంలోనే ఇది కొత్త తరహా యుద్ధ దళం.
* జాతీయ భద్రతకు ముప్పు ఉన్న నేపథ్యంలో, అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఈ దళం అత్యంత ముఖ్యమైనది.
*స్పేస్ ఫోర్స్‌తో అంతరిక్ష ప్రాంతాల్లో నియంత్రణ కలిగి ఉండవచ్చు.
* ట్రంప్ 738 బిలియన్ డాలర్ల మిలిటరీ బడ్జెట్‌పై సంతకం చేశారు. 
*దాంట్లో ఈ కొత్త యూనిట్ కేటాయింపుల గురించి ప్రస్తావించారు.
*తొలి ఏడాది స్పేస్ ఫోర్స్ కోసం 40 మిలియన్ల డాలర్లు కేటాయించారు. 
* స్పేస్ ఫోర్స్ ద్వారా భూకక్ష్యలో అమెరికా తన దళాలను మోహరిస్తుంది. కక్ష్యలో ఉన్న వందలాది అమెరికా శాటిలైట్లను ఆ దళం నిరంతరం నిఘా పెడుతుంది.

యూఎస్ఏ నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయుడు
*అమెరికాలోని నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయుడు సేతురామన్‌ పంచనాథన్‌ (58) నియమితుడు కానున్నారు.  
*ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో ముఖ్య పరిపాలనాధికారిగా ప్రస్తుతం పనిచేస్తున్న సేతురామన్ ను ప్రతిష్టాత్మక ఎన్ఎస్ఎఫ్ డైరెక్టర్ గా నియమించింది.
*ప్రస్తుత డైరెక్టర్ ప్రాన్స్ కార్డోవా పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుండడంతో వచ్చే ఏడాది ప్రారంభంలో సేతురామన్ డైరెక్టర్ పదవిని చేపడతారు. 
*వైద్య రంగంతో సంబంధం లేని సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రాథమిక పరిశోధన, విద్యకు ఉద్దేశించిన జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి.
*బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఎలక్ట్రానిక్స్ డిగ్రీ, మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ లో పీజీ చేసిన సేతురామన్ కెనడాలోని ఒట్టవా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు.

ఇండియన్  ఫార్మకోపియాను గుర్తించిన ఆఫ్ఘనిస్తాన్ 
*భారతదేశం యొక్క ఇండియన్  ఫార్మకోపియాను గుర్తించిన మొట్ట మొదటి దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది.  
*భారతదేశం యొక్క వాణిజ్య విభాగం మరియు  ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించింది. 
* దీంతో అక్కడ లేబరేటరీలో మందుల తయారీకి మరియు నాణ్యతను  పాటించడానికి ఇండియన్ ఫార్మకోపియాను ఉపయోగిస్తారు. 
* ఆఫ్గనిస్థాన్ దేశం యొక్క వైద్య మరియు ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ఈ గుర్తింపు ఇచ్చింది. 
*డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్  చట్టం 1940,డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ నియమాలు 1945 ప్రకారం గుర్తించబడిన పుస్తకాన్ని ఇండియన్ ఫార్మకోపియా అంటారు. 
*మందుల తయారీ మరియు మార్కెటింగ్ లో పాటించవలసిన నియమాలు ,గుర్తింపు, నాణ్యత ఇందులో పేర్కొంటారు.  

జాతీయం 
జవాన్ల కొరకు శాటిలైట్ ఫోన్లు 
*సమాచార వ్యవస్థలు లేని మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
*దీంతో వారు కూడా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం కలుగనున్నది.
*శాటిలైట్ కమ్యూనికేషన్ (వీ శాట్) ఆధారంగా జవాన్లకు ఈ సౌకర్యం కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది.
*మారుమూల ప్రాంతాల్లోని మిలిటరీ, పారామిలిటరీ సిబ్బందికి ఈ వ్యవస్థ ద్వారా రోజుకు ఒక జీబీ డేటాను ఉచితంగా అందించనున్నారు.
* రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొన్న 1409 మారుమూల ప్రాంతాల్లో వీశాట్ వినియోగానికి డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ (డీసీసీ)అంగీకరించింది.
* ఈ వ్యవస్థ ద్వారా జవాన్లు చాలా తక్కువ ఖర్చుతో తమ కుటుంబీకులతో మాట్లాడుకోవచ్చు.
*నిమిషానికి ఒక రూపాయి ఖర్చు తో కాల్ చేసుకోవచ్చు.
*ప్రస్తుతం ఈ ధర నిమిషాలకు ఐదు రూపాయలుగా ఉంది.సంవత్సరానికి మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

దక్షిణ జోన్ అదనపు సొలిసిటర్ జనరల్ నియామకం
*దక్షిణాది జోన్‌ అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్జీ)గా హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టీ సూర్యకరణ్‌ రెడ్డి నియమితులయ్యారు.
*దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
* హైదరాబాద్‌ కేంద్రంగా ఆయన పని చేస్తారు.
* బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పోస్టులో కొనసాగుతారు.
* హైదరాబాద్‌లో 1956లో జన్మించిన ఆయన ఓయూ నుంచి 'లా' డిగ్రీ తీసుకున్నారు. 
*1979 నుంచి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.  
*1994 నుంచి1995 వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

పీడీఎస్‌ ద్వారా మాంసం,చేపలు
*ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) రేషన్ షాపులు నిత్యావసర సరుకులు అయిన బియ్యము, నూనె, పంచదార, గోధుమలు, పప్పుధాన్యాలు ఇంకా కొన్ని పోషకాహార సరుకులను ప్రజలకు ప్రభుత్వం అందజేస్తోంది.
*తాజాగా కేంద్ర ప్రభుత్వం చికెన్, చేపలు, మాంసాన్ని వీలైనంత తక్కువ ధరలకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందజేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
* 'పుష్టికర భారత్‌'నిర్మాణంలో భాగంగా నీతి ఆయోగ్‌ ఈ సరికొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు.
* పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పుష్టికర ఆహారాన్ని చవకైన ధరలకే పేద ప్రజలకు అందజేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది.
*దశలవారీగా నీతి అయోగ్ ఈ ప్రణాళికను అమలు చేయబోతోంది. 
*మొట్టమొదటిగా ఒకటి లేదా రెండు కొత్త సరుకులను ప్రవేశ పెట్టబోతోంది. 
*ఈ ప్రతిపాదన నీతి అయోగ్ 15 ఏళ్ల విజన్‌ డాక్యుమెంట్‌లో ఒక భాగం.
* వచ్చే ఏడాది ఏప్రిల్ 1 తర్వాత రేషన్ షాపులలో ప్రొటీన్‌ సహిత ఆహార పదార్థాలను పంపిణీ చేసే అవకాశం ఉంది. 

భారత వృద్ధి రేటును 4.6 శాతానికి తగ్గించిన ఫిచ్‌
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను దేశ జీడీపీ అంచనాను గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ తగ్గించింది.
*ఈసారి 4.6 శాతంగానే ఉండొచ్చని అంచనా వేసింది.
* ఇంతకుముందు 5.6 శాతంగా నమోదు కావచ్చన్న ఫిచ్‌ ఇప్పుడు 1 శాతం తగ్గించింది.
*ఈ సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం,పడిపోయిన వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం, వ్యాపారంలో మందగమనం, దిగజారిన పారిశ్రామికోత్పత్తి, పెచ్చుమీరుతున్న ద్రవ్యోల్బణం, వరుస త్రైమాసికాల్లో క్షీణిస్తున్న వృద్ధిరేటుల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 4.6 శాతం దాటక పోవచ్చు.
*బ్యాంకింగేతర విత్త సంస్థల్లో పడిపోయిన రుణ లభ్యత వ్యాపార, వినియోగదారుల విశ్వాసాన్నిదెబ్బ తీసినట్లు ఈ సంస్థ పేర్కొంది. 
* భారత క్రెడిట్‌ రేటింగ్‌ను 'బీబీబీ'గా స్థిరమైన ఔట్‌లుక్‌తో ఫిచ్‌ ఉంచడానికి గల కారణం  బలమైన విదేశీ మారకద్రవ్య నిల్వలు. 
*డిసెంబర్ నెలలో మొదటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 453 బిలియన్ డాలర్లను దాటాయి. 
* కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలను చేపడితే 2020-21లో వృద్ధి రేటు 5.6 శాతానికి, ఆ తర్వాత ఏడాదిలో 6.5 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది.

రాష్ట్రీయం 
తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో  నవకల్పన కేంద్రాలు
*తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయా ల్లో నవకల్పన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 
*ఇటీవల కేంద్ర మానవ వన రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేషనల్‌ ఇన్నోవే షన్‌, స్టార్టప్‌ పాలసీ-2019 ప్రకటించింది.
*అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని వర్సిటీల తోపాటు ఎంపిక చేసిన కాలేజీల్లోనూ ఇన్నోవేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
* జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీ యూ) హైదరాబాద్‌ దీన్ని పర్యవేక్షణ చేస్తుంది. 
*విశ్వ విద్యాలయాలు, కాలేజీలకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తుంది. 
*సందేహాలను నివృత్తి చేసేం దుకు ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది.
*ఇన్నోవేషన్‌ కేంద్రాలు మార్చి నాటికి అమల్లోకి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
* ఇందుకోసం విశ్వవిద్యాలయాల వారీగా అవసరమైతే నిధుల సహకారం చేసేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధం గా ఉంది.
* ఇన్నోవేషన్‌ కేంద్రాల ఏర్పాటు, వాటి ప్రాముఖ్యత ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు కేటాయించే అవకాశం ఉంది.
* రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేసే ఇన్నోవేషన్‌ కేంద్రాల పర్యవేక్షణకు ఉన్నత విద్యామం డలి రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ నియమించనుంది. 
జనవరిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
*మూడు నెలల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యేలా మార్గదర్శకాలు సమగ్రంగా రూపొందించాలి. 
*సంప్ర దాయక విశ్వవిద్యాలయాల్లో సామాజిక సమస్యలు, మద్య నిషేధం, సాంస్కృతిక అంశాలు, మహిళలపై హింస వంటి అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించి నవకల్పనలు ఆవిష్కరించాలి.


చీరాలలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం ప్రారంభం
*అనంతపురం జిల్లా ధర్మవరంలో '' వైఎస్సార్‌ నేతన్న నేస్తం’'' కార్యక్రమాన్ని డిసెంబర్ 21వ తేదీన ప్రారంభించారు.
*చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది.
*  వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, హస్త కళలకు పూర్వ వైభవం తేవడమే కాకుండా కేవలం మగ్గాలపై ఆధారపడి బతుకుతున్న వారికి మరింత తోడ్పాటునివ్వడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం.
* ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం అందిస్తారు.
* మరమగ్గాలు వచ్చిన తరువాత చేనేతలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో చేతి ద్వారా నేత నేసే నేతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడనుంది.
ప్రభుత్వం ఇచ్చే సాయంతో మగ్గాలను బాగు చేయించుకోవడం, నూలు, రంగులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 
*ఇందులో భాగంగా ఇప్పటివరకు 81,783 మంది నేతన్నలను గుర్తించారు. అలాగే, ఇందుకోసం రూ.196.27కోట్లు ఖర్చు చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జిఎం రావు కమిటీ నివేదిక
*రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌), విశాఖలో పరిపాలన రాజధాని(ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్‌ క్యాపిటల్‌) ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ తన నివేదికలో సూచించింది.
*రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది.
నివేదికలోని సిఫార్సులు-- 
*విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. 
* అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్‌ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది.
* వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది.
* కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది.
*ఈ కమిటీ కన్వీనరు జీఎన్‌ రావు, సభ్యులు విజయమోహన్, ఆర్‌.అంజలీ మోహన్, డాక్టర్‌ మహావీర్, డాక్టర్‌ సుబ్బారావు, కేటీ రవీంద్రన్, అరుణాచలం.
*మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన(లెజిస్లేచర్‌) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా వేసవికాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి.
*అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్‌ ఉండాలి. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి.
*అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణాలు ఉండరాదు. వరద ముంపు నుంచి రక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయాలి. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును నేషనల్‌ హైవేకు అనుసంధానించాలి.
*శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.
*పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి సాగాలి. రాష్ట్రంలో రాయలసీమ బాగా వెనకబడడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి.
* అడవుల్ని పరిరక్షించడంతో పాటు మరిన్ని పెంచాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. 
*యలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కృషి చేయాలి. అమరావతిలోని కొన్ని అధికార వ్యవస్థలను ఆ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
*అన్ని జిల్లాల్లోని సహజ వనరుల మేరకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలి.
*గిరిజనులు, మత్స్యకార వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడి, అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాలి.
*రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి.
*పరీవాహక ప్రాంతం ఆధారంగా గొలుసుకట్టు చెరువులను మైక్రో వాటర్‌షెడ్‌ విధానంలో అభివృద్ది చేయాలి. నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేసి.. అధిక ఆయకట్టుకు నీటిని అందించడంపై దృష్టి సారించాలి.
*పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అనంతరం అధిక వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. తద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించవచ్చు.
1. ఉత్తరాంధ్ర:  శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం
2. మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
3. దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
4. రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం

క్రీడలు 
వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణం సాధించిన చాను
*ఖతార్‌ ఇంటర్నేషనల్‌ కప్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్ లిప్టర్ మీరాబాయి చాను దోహా వేదికగా జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో బరిలో దిగిన ఆమె 194 (83+111) కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించింది. 
*మొదట స్నాచ్‌లో 83 కేజీలు ఎత్తిన చాను క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 111 కేజీలను ఎత్తింది. 
*ఫ్రాన్స్‌కు చెందిన అనీస్‌ మిషెల్‌ (172 కేజీలు), మానోన్‌ లొరెన్జ్‌ (165 కేజీలు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
*ఈ ఏడాది థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి 201 కేజీలు ఎత్తి బెస్ట్‌ మార్క్‌ నమోదు చేసిన మీరా బాయి ఈసారి దానికంటే 7 కేజీలు తక్కువే ఎత్తింది.
* పురుషుల విభాగంలో జెరేమీ లాల్‌రినుంగా (67 కేజీలు) రజతం దక్కించుకున్నాడు. 306 కేజీల (స్నాచ్‌లో 140, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 166 కేజీలు) బరువెత్తిన ఈ యువ సంచలనం రెండో స్థానంలో నిలిచాడు.
*ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ సిల్వర్‌ లెవల్‌ ఈవెంట్‌ అయిన ఈ టోర్నీలో మీరాబాయి స్వర్ణం సాధించడంతో 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతకు కీలకంగా మారింది.


No comments:

Post a Comment