Daily Current Affairs In Telugu 19th December 2019

అంతర్జాతీయం:
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు 
*ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత శశిథరూర్, నాటక రచయిత నంద్‌కిషోర్ ఆచార్య 2019 సంవత్సరానికి సంబంధించి సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు.
*. 23మంది రచయితలను ఈ పురస్కారానికి జాతీయ అకాడమీ ఎంపిక చేసింది. ఇందులో థరూర్ ఇంగ్లీష్‌లో రాసిన 'ఏన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్ : ది బ్రిటీష్‌ ఎంపైర్‌ ఇన్‌ ఇండియా'పుస్తకం అవార్డుకు ఎంపికైంది.భారతదేశంలో వలసకాలపు అణచివేతను, రాజకీయార్థిక విధానాలను ఈ పుస్తకంలో థరూర్‌ చ ర్చించారు.
*హిందీలో నంద్ కిషోర్ ఆచార్య రాసిన 'చీలత్ హుయే అప్నే కో' రచన అవార్డుకు ఎంపికైంది. 
*చంద్రశేఖర్‌ కంబర్‌ అధ్యక్షతన సమావేశమైన అవార్డుల కమిటీ 23 భాషలకు చెందిన రచయితలను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తుంది. 23 భారతీయ భాషలకు ప్రాతినిథ్యం వహించే జ్యూరీ సభ్యులు అవార్డులను ఎంపిక చేశారు. 
*పురస్కారం అందుకున్న పుస్తకాల్లో ఏడు కవితా సంపుటాలు, నాలుగు నవలలు, ఆరు కథల పుస్తకాలు, మూడు వ్యాస సంపూటాలు, నాన్‌ ఫిక్షన్‌, ఆత్మకథ, జీవిత కథ పుస్తకాలకు ఒక్కొక్కటి చొప్పున సత్కారం దక్కింది. 
*సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ కంబార్, కార్యదర్శి కే శ్రీనివాసరావు 
* తెలుగులో బండి నారాయణ స్వామి రాసిన నవల కూడా సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది.రచయిత బండి నారాయణస్వామి రాసిన ‘శప్తభూమి’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. రాయలసీమ చరిత్రను తెలిపే శప్తభూమి నవలను పురస్కారానికి ఎంపిక చేశారు.
*శప్తభూమి అంటే శపించబడిన నేల అని అర్థం. ఎంతో ఘన చరిత్ర ఉన్న రాయల సీమ ఎలా శాపగ్రస్తమైందో రచయిత నారాయణ స్వామి వివరించారు.
*18వ శతాబ్దం నాటి సంఘటల ఆధారంగా శప్తభూమి నవలను రచించారు.ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అనంతపురం జిల్లా తరఫున కేంద్ర సాహిత్య పురస్కారం తొలిసారి అందుకోగా, బండి నారాయణస్వా మి రెండోవారు.
*నారాయణస్వామి అనంతపురం జిల్లాలో 1952 జూన్ 3 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హన్నూరప్ప, పోలేరమ్మ. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన రాసిన మొదటి కథ ‘పరుగు’.
* గద్దలాడతండాయి, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశం, నిసర్గమ్‌ వంటి ఎన్నో రచనలు కూడా చేశారు. 
*శప్తభూమి నవల తానా పోటీల్లో రెండు లక్షల రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది. 
*సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన వాటిలో ఫుకాన్ సీహెచ్ బసుమత్రి (బోడో), నంద్ కిషోర్ ఆచార్య (హిందీ), నిబా ఏ కండేకర్ (కొంకణి), కుమార్ మనీష్ అరవింద్ (మైథిలి), వీ మధుసూదనన్ నాయర్ (మళయాళం), అనురాధా పాటిల్ (మరాఠీ), పెన్నా మధుసూదన్ (సంస్కృతం), జారుూ్శ గోస్వామి మహంత (అస్సామీ), ఎల్ బీర్మంగల్ సింగ్ (మణిపురి), చో ధర్మన్ (తమిళం)ల రచనలున్నాయి. 
*సృజనాత్మకంగా రాసిన నవలలకు శశిథరూర్‌తో పాటు విజయ (కన్నడ), షఫే కిద్వాయ్ (ఉర్దూ) సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యాయి.
* 2020 సంవత్సరం ఫిబ్రవరి 25న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అవార్డులో భాగంగా రచయితలకు కాపర్ మెమెంటోతో పాటు లక్ష రూపాయిల నగదును అందిస్తారు.
*కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు.
*కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో స్థాపించింది. రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు తాను పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలు కలిపి మొత్తం 22 భాషల సాహిత్యవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తొలి పురస్కారాన్ని 1955 ప్రదానం చేశారు.
*కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటుగా కొన్ని ఇతర పురస్కారాలను కూడా ఏర్పాటుచేశారు. ఇతర పురస్కారాల నుంచి వేరుగా గుర్తించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రధాన పురస్కారంగా వ్యవహరిస్తుంటారు. సాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు అకాడమీ ప్రకటించే ఇతర పురస్కారాలు:
భాషా సమ్మాన్ పురస్కారం : సాహిత్య అకాడమీ సంస్థ గుర్తించిన ఇతర భాషలలో సాహిత్యసృజన, సేవ చేసిన వారికి ప్రకటిస్తారు.
సాహిత్య అకాడమీ అనువాద బహుమతి : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో అనువాద రచనలు చేసిన వారికి ప్రకటిస్తారు.
సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లోని ఉత్తమ బాలసాహిత్యానికి/బాలసాహిత్యానికి సేవ చేసిన వారికి ప్రకటిస్తారు.
సాహిత్య అకాడమీ యువ పురస్కారం : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృష్టి చేసిన 35 సంవత్సరాలలోపు సాహిత్యవేత్తలకు ప్రకటిస్తారు.
2018
విమర్శిని
వ్యాసాలు
కొలకలూరి ఇనాక్
2017
గాలిరంగు
కవిత్వం
దేవిప్రియ
2016
రజనీగంధ - కవితా సంకలనం
కవిత్వం
పాపినేని శివశంకర్
2015
విముక్త -కథానికలు
కథ
వోల్గా

శాస్త్రీయ వ్యాసాల ప్రచురణలు మూడవ స్థానంలో భారత్
*భారత్‌కు చెందిన పరిశోధకులు ప్రచురించే ఇంజినీరింగ్‌, సైన్స్‌ రంగాల్లో శాస్త్రీయ వ్యాసాల ప్రచురణలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.
*అమెరికాకు చెందిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) గణాంకాల ప్రకారం,ఈ రంగాల్లో 2018లో భారత్‌లో 1,35,788 శాస్త్రీయ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
*చైనా 5,28,263 వ్యాసాలతో అగ్రస్థానంలో, అమెరికా 4,22,808 వ్యాసాలతో ద్వితీయ స్థానంలో నిలిచాయి.
*ప్రపంచవ్యాప్తంగా 2008లో సైన్స్, ఇంజనీరింగ్‌ రంగాలకు సంబంధించి మొత్తం 17.5 లక్షల ఆర్టికల్స్‌ ప్రచురితమవ్వగా.. 2018 నాటికి ఆ సంఖ్య 25.5 లక్షలకు పెరిగింది. 
* భారత్‌లో 2008లో 48,998 ఆర్టికల్స్‌ ప్రచురితమవ్వగా.. 10.73 శాతం వార్షిక వృద్ధి రేటుతో ఆ సంఖ్య 2018 నాటికి 1.35 లక్షలకు పెరిగింది.
* ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌ ఆర్టికల్స్‌లో చైనా 20.67 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. వార్షిక వృద్ధి రేటు 7.81 శాతంగా నమోదైంది. సైన్స్‌ ఆర్టికల్స్‌లో అమెరికా ఏడాదికి 0.71 శాతం వృద్ధి సాధించింది.
*సైన్స్‌ ఆర్టికల్స్‌లో టాప్‌-10 దేశాలు
1. చైనా (5,28,263), అమెరికా (4,22,808), భారత్‌ (1,35,788), జర్మనీ (1,04,396), జపాన్‌ (98,793), యూకే (97,681),రష్యా (81,579),ఇటలీ (71,240),దక్షిణ కొరియా (66,376), ఫ్రాన్స్‌ (66,352)
జాతీయం :
జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అతుల్‌ కార్వల్‌
*జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అతుల్‌ కార్వల్‌ నియమితులయ్యారు. 
* హోంశాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. 
* గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన అతుల్‌ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. 
*ఇంతవరకు పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న అభయ్‌ ఒడిశా డీజీపీగా వెళ్లడంతో ఆయన స్థానంలో అతుల్‌ నియమితులయ్యారు.
*2021 డిసెంబరు 5 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
* పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా డీజీ హోదా అధికారిని నియమిస్తారు. ఈ పోస్టును అదనపు డీజీ స్థాయికి తగ్గించి అతుల్‌ను నియమించారు.

2024-25 వరకూ మూడో దశ ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన
*ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై)మూడో దశను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రారంభించారు. 
*పథకం లక్ష్యం -- గ్రామీణ ఆవాసప్రాంతాల నుంచి వ్యవసాయ మార్కెట్‌యార్డులు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులను కలుపుతూ 1.25 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించడం.
* ఇందుకోసం మొత్తం రూ.80,250 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రం రూ.53,800 కోట్లు సమకూర్చుతుంది. 
*మిగిలింది రాష్ట్రాలు మ్యాచింగ్‌ గ్రాంట్‌గా సమకూర్చాల్సి ఉంటుంది. 
*పథకం కాలపరిమితి -- 2019-20 నుంచి 2024-25 వరకు ఉంటుంది.
*డిసెంబర్ 16,2019 నాటికి ఆరు లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద పూర్తి చేయడం ద్వారా 97.27 నివాసాలకు రోడ్డు అనుసంధానం చేశారు.
*మొత్తం రోడ్డు నిర్మాణంలో  36,063 కిలోమీటర్ల రోడ్డును గ్రీన్ టెక్నాలజీని,ప్లాస్టిక్ వ్యర్ధాలను, కోల్డ్ మిక్స్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా నిర్మించారు.
*ఈ పథకం మొదటి దశలో 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం వివిధ గ్రామాల్లో చేపట్టారు. రోడ్ల పునాది మరియు ప్రారంభానికి అవసరమైన కనీస విలువను 10 వేల నుండి 20 వేలకు పెంచారు.
* 2019-20 సంవత్సరానికి ఈ పథకం కింద ఏడు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
*ఈ ఏడు వేల కిలోమీటర్లలో మూడు వేల కిలోమీటర్ల రోడ్డును గ్రీన్ టెక్నాలజీ,కోల్డ్ మిక్సర్, నానో టెక్నాలజీ వంటి విధానాల ద్వారా నిర్మించనుంది. మొత్తం ఏడు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.3,936.04 కోట్లు ఖర్చు చేయనున్నారు.

లాటరీల పై 28 శాతం జీఎస్టీ విధింపు
*లాటరీలపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.
*డిసెంబర్ 18వ తేదీన జరిగిన 38వ కౌన్సిల్‌ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
* లాటరీ పన్ను పెంపు 2020 మార్చి నుంచి అమల్లోకి రానుంది.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న లాటరీలపై 12 శాతం జిఎస్‌టి, రాష్ట్ర ప్రభుత్వం అధికారం పొందిన లాటరీలపై 28 శాతం జిఎస్‌టిని విధిస్తున్నారు. ఇప్పుడు ఈ రేటు ఒకే విధంగా ఉంటుంది.
* అల్లిన బ్యాగులపై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచారు.
* ఇండస్ట్రియల్‌ పార్క్‌లు వచ్చేందుకు ఇండస్ట్రియల్‌ ప్లాట్స్‌ మీద పన్ను మినహాయించారు.
*గతంలో జరిగిన 37 కౌన్సిల్‌ సమావేశాల్లో జీఎస్‌స్టీ రేట్లపై అందరూ కలసి ఒకే నిర్ణయం తీసుకోగా, ఈ భేటీలో మొదటిసారి ఓటింగ్‌ ప్రక్రియను అమలు చేశారు.
* ప్రతి నెలా రూ.1.1 లక్షల కోట్లు జిఎస్‌టి వసూళ్లను కేంద్ర ప్రభుత్వం లక్షంగా నిర్దేశించింది. 
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201920)లో ప్రత్యక్ష పన్నులు, జిఎస్‌టి వసూళ్ల టార్గెట్ రూ.13.35 లక్షల కోట్లు.
*సమావేశంలో 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య ప్రతి నెలా రూ.1.1 లక్షల కోట్లు జిఎస్‌టి వసూళ్లు రావాలని లక్షంగా నిర్ణయించారు. 
*ఈ నాలుగు నెలలో ఒక నెల కనీసం రూ.1.25 లక్షల కోట్ల వసూళ్లు సాధించాలని ప్రభుత్వం  ప్రయత్నిస్తుంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో నాలుగు నెలలకు కేంద్ర, రాష్ట్రాలతో కలిసి స్థూల జిఎస్‌టి వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. ఒక్కసారి మాత్రమే రూ.1.1 లక్షల కోట్లు వసూళ్లు వచ్చాయి.
* రూ,13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు టార్గెట్‌లో రూ.6 లక్షల కోట్లు వార్షిక లక్షంలో 45 శాతం అక్టోబర్ నాటికి వసూళు అయ్యాయి. 2019-20 సంవత్సరానికి గాను జిఎస్‌టి రెవెన్యూ వాటా నుంటి రూ.6.63 లక్షల కోట్ల సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్షంగా చేసుకుంది. 

టాటాకు మళ్లీ మిస్త్రీ
*నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ) డిసెంబర్ 18వ తేదీన తీర్పునిచ్చింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించింది.
*ఈ కంపెనీ అధిపతిగా ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్ట విరుద్ధమని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది.
*సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పునరుద్ధరిస్తూ ఇచ్చిన ఆదేశాల అమలును నాలుగు వారాల పాటు నిలిపేసింది. ఈ గడువులోగా అపీలు చేసుకునేందుకు టాటా కంపెనీకి అవకాశం ఇచ్చింది. 
*ఆయన టాటా సన్స్‌కు 6వ చైర్మన్.మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాలు ఉన్నాయి. తనను పదవి నుంచి తొలగించడాన్ని ఆయన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో సవాలు చేశారు.
*మైనార్టీ షేర్ హోల్డర్స్ గా మిస్రీ కుటుంబానికి చెందిన సంస్థలు టాటా సన్స్,రతన్ టాటా,మరికొందరు బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా NCLATని ఆశ్రయించాయి. తన తొలగింపు కంపెనీ చట్టంకి లోబడి జరుగలేదని మిస్రీ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
* దీనిపై విచారించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)టాటా గ్రూప్ చైర్మన్ గా సైరన్ మిస్రీని తిరిగి కొనసాగించాలని ఆదేశించింది.
**టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్‌ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది.
*టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ నియామకం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్స్‌ స్వరూపాన్ని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి ప్రైవేట్‌ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది.
* వీటికి సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. ఈ లోగా దీనిపై టాటా గ్రూప్‌ అప్పీలు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌ఎల్‌ఏటీ తెలిపింది.
*నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (NCLAT) ను కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 410 ప్రకారం ఏర్పాటు చేశారు.  2016 జూన్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నుండి వచ్చే అప్పీళ్లను వినడానికి దీన్ని ఏర్పాటు చేశారు. 

100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువని దాటిన హెచ్‌డీఎఫ్‌సీ 
*ప్రైవేటు రంగ బ్యాకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది.
*భారత్‌లో ఈ మైలురాయిని చేరుకొన్న మూడో కంపెనీ ఇదే. 
* ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(140 బిలియన్‌ డాలర్లు), టాటా కన్సల్టెన్సీ (114.60 బిలియన్‌ డాలర్లు) ముందు వరుసలో ఉన్నాయి. 
*ప్రపంచలోనే అత్యంత విలువైన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 110వదిగా నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో 109 కంపెనీలు 100 బిలియన్‌ డాలర్లను దాటాయి.
*100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను దాటిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 26వ ర్యాంకులో ఉంది.

గోరటి వెంకన్నకు కబీర్ సమ్మాన్ అవార్డు
*ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కబీర్‌ సమ్మాన్‌ అవార్డు దక్కింది.
*వాగ్గేయకారుడిగా తెలుగునాట వెంకన్నకు విశేష ప్రజాదరణ పొందారు. 
*'పల్లె కన్నీరు' పాట ద్వారా వెంకన్నకు మరింత గుర్తింపు వచ్చింది. 
* కబీర్‌ సమ్మాన్‌ అవార్డుకు 'జ్ఞాన్‌పీఠ్‌' సమానమైన గౌరవం ఉంది. ఏటా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సాహితీ వేత్తలను గౌరవిస్తుంది.
* కబీర్‌ సమ్మాన్‌ అవార్డుకు 'జ్ఞాన్‌పీఠ్‌' సమానమైన గౌరవం ఉంది.
*మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 1986 సంవత్సరంలో ఈ అవార్డు స్థాపించింది.
* ఈ అవార్డు కింద ఒక లక్షా 50 వేల రూపాయల నగదు అందిస్తారు.
* భారతదేశంలోని వివిధ భాషల అయిన తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాలీ,మరాఠీ, గుజరాతి మొదలైన భాషలలో కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందిస్తారు.

ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్‌ ద ఇయర్ ను ప్రకటించనున్నబీబీసీ
*భారత ఉత్తమ మహిళా క్రీడాకారుల (పారా అథ్లెట్లు సహా) సేవలను గుర్తించేందుకు బీబీసీ మొదటిసారిగా ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారాన్ని ప్రారంభిస్తోంది. 
*'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్‌ ద ఇయర్ 2019' విజేతను మార్చిలో ప్రకటించనుంది.
*బీబీసీ ఎంపిక చేసిన జ్యూరీ, తుది పోటీ కోసం మహిళా క్రీడాకారుల జాబితాను రూపొందించింది.
ఆ జ్యూరీలో దేశంలోని కొందరు ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉన్నారు.
జ్యూరీ ఎంపిక చేసిన ఆ అయిదుగురు మహిళా క్రీడాకారుల పేర్లను ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.
*ఆ తర్వాత అభిమానులు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో దేనికైనా వెళ్లి ఆ జాబితాలోని తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు.
*"ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ 2019కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇస్తారు. అభిమానులు తమకు నచ్చిన అథ్లెట్‌కు బీబీసీ స్పోర్ట్‌లో ఓటు వేయవచ్చు.
* అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్‌ ద ఇయర్ అవుతారు. 
*అలాగే,భారత క్రీడా రంగానికి విశేష సేవలు అందించిన ప్రఖ్యాత క్రీడాకారిణికి 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేస్తారు.
* మరింత ఎక్కువ మంది మహిళలు, యువత ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, ప్రత్యేకించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు బీబీసీ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ అవార్డు.
*2000 సంవత్సరం తరువాత భారత్ మొత్తం 13 ఒలింపిక్ పతకాలను గెలుచుకుంది. అందులో మహిళలు సాధించినవి 5. దీనికి విరుద్ధంగా 20వ శతాబ్దంలో 1999 వరకూ భారత్ గెలిచిన మొత్తం 13 పతకాలూ పురుషులవే.
*గత ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 57 పతకాలు గెలవగా, అందులో దాదాపు సగం (28) మహిళా అథ్లెట్లు సాధించినవే.
ఈ ఏడాది జరిగిన దోహా ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ అదే ధోరణి కనిపించింది. అందులో భారత్ మొత్తం 17 పతకాలు సాధిస్తే, అందులో 10 మహిళలవే.

రాష్ట్రీయం
తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త,ఉప లోకాయుక్త నియామకం
*తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా జస్టిస్‌ చింతపంటి వెంకట(సీవీ) రాములు, ఉప లోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్‌రావు నియమితులయ్యారు.
*లోకాయుక్త, ఉప లోకాయుక్తల పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది.
*రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తొలి చైర్మన్‌గా జస్టిస్‌ గుండె చంద్రయ్య, సభ్యులుగా సెషన్స్‌ కోర్టు జిల్లా జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌ నియమితులయ్యారు.
*మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల పదవీ కాలం మూడేళ్లపాటు ఉంటుంది.
*. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లను ఈ నెల 20 కల్లా నియమించాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని  ఇటీవల ఆదేశించింది.
* సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ఈ కమిటీల్లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష ఉపనేత పాషాఖాద్రి, మండలిలో ఎంఐఎం పక్ష నేత జాఫ్రి ఉన్నారు. 
* లోకాయుక్త, ఉప లోకాయుక్త, హక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల పేర్లను ఈ కమిటీలు గవర్నర్‌ తమిళిసైకు పంపారు. 
*జస్టిస్‌ సీవీ రాములు నిజామాబాద్‌ జిల్లా అచనపల్లి గ్రామంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. 1978లో మహారాష్ట్రలోని యశ్వంత్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసుకున్నారు. 24 ఏళ్లపాటు ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఏపీ హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా 2002లో, జడ్జిగా 2004లో బాధ్యతలు స్వీకరించారు. 2011 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేశారు. కాగా, ఉపలోకాయుక్తగా నియమితులైన వి.నిరంజన్‌రావు న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు.
*జస్టిస్‌ జి.చంద్రయ్య ఆదిలాబాద్‌ జిల్లా తిమ్మాపూర్‌లో 1954 మే 10న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ చదివారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా 1980లో పేరు నమోదు చేసుకున్నారు. హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2005లో హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు. 2006 ఫిబ్రవరి 20న జడ్జిగా నియమితులైన ఆయన 2016లో పదవీ విరమణ చేశారు.


No comments:

Post a Comment