లింగ భేద సూచీలో 112వ స్థానంలో భారత్
*ప్రపంచ ఆర్థిక ఫోరం 2019 లింగ భేద సూచీలో భారత్ 112వ స్థానంలో ఉంది.
* ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనేందుకున్న అవకాశాలు, విద్య, రాజకీయ సాధికారిత, ఆరోగ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సూచీని వరల్డ్ ఎకనిక్ ఫోరం రూపొందించింది.
*ప్రపంచంలో లింగ భేద సమస్య తొలగిపోవడానికి మరో 99.5 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది.
* ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగడం లింగభేదం తగ్గడానికి కారణమని ఈ సూచి తెలిపింది.
* . రాజకీయ రంగంలో పురుషులు, మహిళల మధ్య అంతరం తొలగిపోవడానికి 95 ఏళ్లు పట్టే అవకాశముందని నివేదిక అంచనా వేసింది.
*గత ఏడాది డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసిన లింగ వ్యత్యాస సూచీలో ఇండియా 108వ స్థానంలో ఉండగా.. తాజా సూచీలో నాలుగు స్థానాలు కోల్పోయి 112వ స్థానానికి పరిమితమయ్యింది.
*ప్రొఫెషనల్ ఉద్యోగాలు, సీనియర్ స్థాయి పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించాల్సిన ఆవశ్యకత ఉందని నివేదిక పేర్కొంది.
*153 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో ఐస్‌లాండ్ అగ్రస్థానంలో ఉంది.
*భారత్ కంటే మెరుగైన స్థానాల్లో బంగ్లాదేశ్(50), ఇండోనేషియా, బ్రెజిల్, నేపాల్(101), శ్రీలంక, చైనా(106) ఉన్నాయి.
*యెమెన్ (153) చిట్టచవరి స్థానంలో ఉండగా.. ఇరాక్ (152), పాకిస్థాన్ (151) స్థానాల్లో ఉన్నాయి.
*జపాన్ 121 స్థానంలో ఉండడం ఇదే మొదటిసారి.
భారత వృద్ధిరేటు - మూడీస్ అంచనా
*అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గతంలో 5.8 శాతంగా గతంలో అంచనా వేసింది.
*వివిధ కారణాలతో దీనిని 4.9 శాతానికి తగ్గించింది.
* హౌస్ హోల్డ్ కన్సంప్షన్ బలహీనంగా ఉండటం ముఖ్య కారణంగా మూడీస్ పేర్కొంది.
* ఇది గృహ వినియోగదారులు డెబిట్ రీపేమెంట్స్ సామర్థ్యంపై ప్రభావం చూపింది మరియు రిటైల్ లోన్ క్వాలిటీని దెబ్బతీస్తుంది.
* ప్రయివేటురంగ బ్యాంకుల్లో రిటైల్ రుణాలు ఎక్కువగా ఉంటాయి. వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో ఇవి ప్రస్తుతానికి ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదని మూడీస్ పేర్కొంది.
*ఇప్పటికే పెట్టుబడులు బలహీనంగా మారగా,దీనికి ఇప్పుడు వినిమయ బలహీనత కలిసి భారత వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుంది.
* మూడీస్ ప్రకారం,గ్రామీణంలో ఆర్థిక ఒత్తిడి, నిదానమైన ఉద్యోగ కల్పన కూడా మందగమనానికి ప్రధాన కారణాలు.
* రిటైల్ సెక్టార్‌కు ఎక్కువగా రుణాలు ఇచ్చే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్టూషన్స్ (NBFC) తీవ్ర సంక్షోభంలో కోరుకోవడం వల్ల ఈ వృత్తి మరింత తగ్గే అవకాశం ఉంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్
*దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన సంస్థగా ఆర్‌ఐఎల్ రికార్డు సృష్టించింది.
* గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ.5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత పదేండ్లుగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి తొలిస్థానంలో నిలిచిన ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)ని వెనక్కినెట్టి ఈ స్థానాన్ని దక్కించుకున్నది ఆర్‌ఐఎల్.
*ఐవోసీ గతేడాది రూ.5.36 లక్షల కోట్ల ఆదాయంతో రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫార్చ్యూన్ ఇండియా 500 విడుదలచేసిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది.
* స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 2010 నుంచి అంతక్రితం ఏడాది వరకు ఐవోసీ తొలిస్థానంలోనే కొనసాగింది.
*రిలయన్స్ తొలి స్థానం రావడానికి రిటైల్, టెలికం, కన్జ్యూమర్ వ్యాపారాలు కారణం అని ఈ నివేదిక వెల్లడించింది.
*ఆర్‌ఐఎల్..2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.39,588 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో ఐవోసీ రూ.17,337 కోట్లు మాత్రమే.
*దేశీయ కార్పొరేట్ ప్రపంచంలో ఇంతటి స్థాయి ఆదాయాన్ని ఆర్జించిన సంస్థగాను ఆర్‌ఐఎల్ రికార్డు సృష్టించింది. ఆర్‌ఐఎల్ ఆదాయంలో 41.5 శాతం వృద్ధిని కనబరుచగా, అదే ఐవోసీ ఆదాయంలో 33.1 శాతం పెరుగుదల కనిపించింది.
*అంటే ఐవోసీ కంటే ఆర్‌ఐఎల్ ఆదాయం 8.4 శాతం అధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. ఇదివరకు ప్రభుత్వరంగ సంస్థయైన ఐవోసీ పేరిట ఈ రికార్డు ఉన్నది.
*గడిచిన పదేండ్లలో ఆర్‌ఐఎల్ నికర లాభం ఐవోసీ కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నది. ఈ జాబితాలో 2018లో మూడోస్థానంలో నిలిచిన మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) ఈసారి కూడా ఇదే స్థానంలో కొనసాగింది.
* ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉండగా, టాటా మోటర్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఉన్నాయి.
*ఓఎన్‌జీసీ ఇటీవల కొనుగోలు చేసిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌లను కలుపుకోకుండానే ఈ జాబితాను రూపొందించింది ఫార్చ్యూన్.
*రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఒక్కస్థానం ఎగబాకి ఈసారి 7వ స్థానానికి చేరుకున్నది.
*ఆ తర్వాతి స్థానాల్లో టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సెన్ అండ్ టుబ్రోలు నిలిచాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ రెండు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరింది.
*స్తుత సంవత్సరానికిగాను ఫార్చ్యూన్ జాబితాలో వేదాంతా తన ర్యాంక్‌ను మూడు స్థానాలు కోల్పోయి 18కి జారుకున్నది.
*ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 22.3 శాతం చమురు, గ్యాస్ రంగాలకు చెందినవి కాగా, 15.88 శాతం బ్యాంకింగ్ రంగానికి చెందినవి.
*ఈ జాబితాలో సంఖ్యపరంగా చూస్తే బ్యాంకింగ్ రంగానికి చెందినవి 48 సంస్థలు ఉండగా, లాభాల్లో 23.44 శాతం వాటాతో చమురు, గ్యాస్ సంస్థలు ఉన్నాయి
ముగిసిన సుదీర్ఘ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25
*కీలక అంశాలపై ఎలాంటి ఒప్పందం లేకుండానే ఐరాస వాతావరణ సదస్సు (కాప్-25) ముగిసింది.
* ఒప్పందం కుదరకుండా ధనిక దేశాలే అడ్డుకున్నాయని పేద దేశాలు విమర్శించాయి.
*కార్బన్ మార్కెట్ యంత్రాంగానికి సంబంధించిన 2015 పారిస్ ఒప్పందంలోని ఆరవ అధికరణపై ఆదివారం సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ ఒక అంగీకారానికి రావటంలో విఫలమయ్యాయి.
*ఈ చర్చలు డిసెంబర్ 13వ తేదీన ముగియాల్సి ఉన్నడిసెంబర్ 17వ తేదీ వరకూ 40 గంటల సేపు కొనసాగాయి.
*ఇప్పటి వరకూ జరిగిన కాప్ సదస్సుల చరిత్రలో అత్యధిక సమయం తీసుకున్న సదస్సు ఇదే.
*రెండు వారాలుగా సాగిన ఈ చర్చల్లో పాల్గొన్న దాదాపు 200కు పైగా దేశాలు ప్రధానంగా పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6పైనే కేంద్రీకరించాయి.
*ఆర్టికల్ 6పై ఒక అవగాహనకు రావటంలో విఫలం అయ్యాయి.
* ఈ అంశంపై వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కాప్26లో మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.
*వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో ధనిక దేశాలకు, పేద, వర్థమాన దేశాలకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి.
* వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో విస్తృత స్థాయి లక్ష్యాలను నిర్దేశించాలని కొన్ని దేశాలు వాదించగా, మరికొన్ని దేశాలు మాత్రం పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకే తాము కట్టుబడి వుంటామని స్పష్టం చేశాయి.
*2020 ముందు కాలంలో సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా దేశాల ప్రతినిధి బృందాలు సమీక్షించాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవటం, ఇందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక పరమైన అంశాల బదిలీ, సామర్ధ్య పెంపుదల వంటి అంశాలపై ఈ దేశాలు చర్చించాయి.
* భూగోళ ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు కర్బన ఉద్గారాల్లో మరింతగా కోతలు పెట్టాలని, ఈ పని తక్షణమే జరగాలని పేద దేశాలు కోరాయి.
*కాప్-25 సదస్సు ఆమోదించిన డిక్లరేషన్ కర్బ న ఉద్గారాల తగ్గింపు పై ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
* ఈ సదస్సు ఆమోదించిన పత్రాల్లో 'చిలీ-మాడ్రిడ్ టైమ్ ఫర్ యాక్షన్' ఒప్పందం ఒకటి.
* 2020 నాటికల్లా వాతావరణ అత్యయిక పరిస్థితి (క్లైమేట్ ఎమర్జన్సీ)ని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు దేశీయంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు (ఎన్‌డిసి) సాధనకు అవసరమైన భూమికను ఇది సిద్ధం చేస్తుంది.
* పారిస్ ఒప్పందంలో ఇచ్చిన హామీలకు, వాస్తవిక పరిస్థితికి చాలా తేడా ఉంది.
* భూగోళం ఉష్టోగ్రతలు 1.5 డిగ్రీల సెల్షియస్‌కు మించి పెరగకుండా చూడడం ప్రపంచం ముందున్న ఓ పెద్ద సవాల్.
* దీనిని ఎదుర్కొనేందుకు పారిస్ ఒప్పందాన్ని తు.చ తప్పక అమలు చేయాల్సిన అవసరముంది. కానీ, మాడ్రిడ్ సదస్సులో సంపన్న దేశాలు దీనికి భిన్నంగా వ్యవహరించాయి.
* చిలీలో నిర్వహించాల్సిన ఐరాస వాతావరణ సదస్సు అక్కడ నెలకొన్న రాజకీయ కల్లోల పరిస్థితుల దృష్ట్యా చివరి నిమిషంలో వేదికను స్పెయిన్‌కు మార్చారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో పన్నెండు రోజుల పాటు జరిగిన కాప్-25 సదస్సుకు 26 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం
*దేశంలోని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ శాఖ నిధులను విడుదల చేసింది.
*రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు 35 వేల 298 కోట్ల పరిహారాన్ని రిలీజ్ చేశారు.
* రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి జీఎస్టీ పన్ను బకాయిలను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల అయ్యాయి.
*ఆగస్టు నుంచి పరిహారం చెల్లించకపోవడం పట్ల రాష్ట్రాలు అసహనం వ్యక్తం చేశాయి.
* జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటును ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు కేంద్రం భర్తీ చేయాలని జీఎస్టీ చట్టం చెబుతోంది. 2017, జులై1వ తేదీన జీఎస్ టీ అమల్లోకి వచ్చింది.
*పరిహారం రెండు నెలల్లోపు రాష్ట్రాలకు చెల్లించాల్సివుండగా ఈ ఏడాది ఆగస్టు నెలకు సంబంధించిన పరిహారం ఇంత ఆలస్యం అయింది.
అబార్షన్ మహిళల సంపూర్ణ హక్కు కాదు -కేంద్రం
* అబార్షన్ అనేది మహిళల సంపూర్ణ హక్కు కాదని కేంద్రం తెలిపింది.
*అసురక్షిత గర్భవిచ్ఛిత్తి (అబార్షన్ల) వల్ల 8 శాతం మాతృ మరణాలు సంభవిస్తున్నాయని కేంద్రం పేర్కొంది.
* ఈ నేపథ్యంలో 1971 మెడికల్ టెర్మినేషన ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టంలోని నిబంధనలను తప్పక అనుసరించాల్సిందేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
*'గర్భం దాల్చిన మహిళకు అబార్షన్‌పై సంపూర్ణ హక్కు లేదు. అసురక్షిత గర్భవిచ్చిత్తి వల్ల సంభవించే మాతృ మరణాలను తగ్గించేందుకు అబార్షన్‌ను చట్టబద్ధం చేసేందుకు ఎంటీపీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
*కేంద్ర ప్రభుత్వం ప్రకారం,ఇందులో పేర్కొన్న నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ఉల్లంఘన కిందకు రావు.
* ఎంటీపీ చట్టంలోని సెక్షన్ 3, 5 నిబంధనలు తమ ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నాయంటూ ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
*ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై కేంద్రం నుంచి సమాధానం కోరగా ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.
*అబార్షన్ల కారణంగా పెరుగుతున్న తల్లి బిడ్డ మరణాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది. తల్లి బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిస్తే ఎక్కడా రాజీ పడకుండా సురక్షిత అబార్షన్లు చేయాల్సిన బాధ్యత కూడా తీసుకుంటామని కేంద్రం చెప్పింది. ఈ క్రమంలోనే పిటిషనర్ సెక్షన్ 3 మరియు సెక్షన్ 5 కింద డిక్లరేషన్ అడుగుతుంటే దానిని కొట్టివేయాలని కోరుతూ అఫిడవిట్‌లో పేర్కొంది కేంద్రం.
* ఈ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే విచారణ చేయనున్నారు.
*.గర్భం దాల్చిన మహిళకు ప్రాణహాని ఉందని పరీక్షల్లో తేలితేనే అబార్షన్ చేయొచ్చనేది సెక్షన్ 3 మరియు సెక్షన్ 5లో పొందుపర్చారు. ఆ సమయంలో డాక్టర్లు అనుసరించాల్సిన తీరును కూడా వివరిస్తూ ఎంటీపీ చట్టంలో పొందుపర్చారు.
అత్యాచారాల కేసుల శీఘ్ర విచారణకు ద్విసభ్య కమిటీ
*దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
*జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నియమించారు.
*మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన 'దిశ' కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
*దేశవ్యాప్తంగా ఉన్న ఈ తరహా కేసులు శీఘ్రగతిన పరిష్కారం కావాలన్న ఉద్దేశంతోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నారావణే
లెఫ్ట్‌నెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే తదుపరి భారత సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
*దాదాపు 13 లక్షల మందితో కూడిన భారత సైన్యానికి ఆయన సారథ్యం వహించనున్నారు.
* గత మూడు సంవత్సరాలుగా భారత సైన్యానికి చీఫ్‌గా సేవలు అందిస్తున్న ప్రస్తుత ఆర్మీ అధిపతి జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 31న రిటైర్మెంట్ తీసుకోనున్న నేపథ్యంలో ఆయన స్థానాన్ని నారావణే భర్తీ చేయనున్నారు.
*ప్రస్తుతం ఆయన ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
*బిపిన్ రావత్ తర్వాత ఆర్మీలో అత్యంత సీనియర్ ఆయనే. జమ్మూకశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు.అంతకు ముందు.. చైనాతో 4000కి.మీ. సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతిగా ఆయన పని చేశారు.
*అంతకు ముందు.. చైనాతో 4000కి.మీ. సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతిగా ఆయన పని చేశారు.
*శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో పనిచేశారు.
*నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీకి నారావణే పూర్వ విద్యార్థిగా ఉన్నారు.
* జూన్ 1980లో సిక్కు లైట్ ఇన్ఫ్యాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్‌లో ఆయన తొలి నియామకం జరిగింది. జమ్ముకశ్మీర్‌లో బెటాలియన్‌ను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ ఆయనకు సేన మెడల్ లభించింది.
*మయన్మార్‌లో మూడేళ్లపాటు భారత రాయబార కార్యాలయంతో కలిసి పనిచేశారు.
*నాగాలాండ్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్(నార్త్)గా అందించిన సేవలకు గానూ విశిష్ట్ సేవా మెడల్ అందుకున్నారు. స్ట్రైక్ కార్ప్స్ సేవలకు గానూ 'అతి విశిష్ట సేవా పతకం' అందుకున్నారు.
*1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు అప్పటివరకు ఉన్న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని భారత్, పాకిస్తాన్‌ల కోసం రెండు భాగాలు చేసారు. అప్పుడే భారత సైన్యానికి "ఇండియన్ ఆర్మీ" అని పేరు పెట్టబడింది.

No comments:
Post a Comment