Current Affairs in Telugu 25th December 2019

అంతర్జాతీయం 


బ్రిటన్ మంత్రిగా రిషి సునక్

*ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, బ్రిటన్ డిప్యూటీ ఆర్థిక మంత్రి రిషి సునక్ ఆర్థికమంత్రిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి.
*వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఎకనామిక్ సూపర్ మినిస్ట్రీని నడిపేందుకు బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యులు, డిప్యూటీ రిషి ఆర్థిక మంత్రిగా నియమితులయ్యే అవకాశం ఉంది.
*సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున రిషి సునక్ యార్కషైర్‌లోని రిచ్‌మండ్ నుంచి గెలిచారు.
*ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సన్నిహితులు.
*గత ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ ఆర్థిక మంత్రిగా పని చేశారు.
*ఆయన వయస్సు 39. ఇంగ్లాండులోని హాంప్‌షైర్ కౌంటీలో జన్మించారు. తాజా ఎన్నికల్లో రిచ్‌మండ్ నుంచి ఎంపీగా గెలిచారు.
*ఇక్కడి నుంచి ఆయన గెలుడం ఇది మూడోసారి. గతంలో థెరిసా మే ప్రభుత్వంలోను మంత్రిగా పని చేశారు.
*స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల దిగువ సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు. 
CO2 ను ద్రవంగా మార్చే పరికరం 
*కార్బన్‌ డయాక్సైడ్‌ను వాహనాల పొగ గొట్టంలోనే బంధించి ద్రవంగా మార్చేసే పరిజ్ఞానాన్ని స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లాజెన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
* కార్లు, బస్సులు, ట్రక్కులు, బోట్లలోనూ దీన్ని వినియోగించవచ్చు.
*  తద్వారా వాతావరణంలోకి CO2 విడుదలకు 90 శాతం మేర అడ్డుకట్ట వేయవచ్చు.
*భారీ వాహనాలకు ఇంజన్‌ బరువులో 7 శాతం ఉండేCO2 వడపోత కిట్‌ అమర్చుతారు.
*వాహనం పొగ గొట్టం నుంచి వెలువడే వాయువులు నేరుగా CO2 వడపోత కిట్‌లోకి చేరుతాయి. 
*అందులోని మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ (ఎంవోఎఫ్‌) అనే అబ్జార్బెంట్‌ నైట్రోజన్‌, ఆక్సిజన్‌లను వదిలేసి, CO2ను తనలోనే బంధిస్తుంది.
*పరిమితి మేర ఎంవోఎఫ్‌ CO2 పేరుకున్నాక పక్కనే ఉండే హై స్పీడ్‌ టర్బో కంప్రెషర్‌లు వేడెక్కుతాయి. ఆ ఉష్ణానికి ఎంవోఎ్‌ఫలోని CO2 ద్రవ రూపంలోకి మారి.. వడపోత కిట్‌లోని పెట్టెలోకి చేరుతుంది.
*1 కిలో పెట్రోలు/డీజిల్‌ నుంచి 3 కిలోల ద్రవరూప CO2 వెలువడుతుంది.
*వాహనాన్ని సమీప సర్వీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ద్రవ రూపంలోని CO2ను ఇవ్వాలి. జీవ ఇంధనాల సాయంతో దాన్ని రీసైక్లింగ్‌ చేసి పునర్వినియోగ ఇంధనంగా మారుస్తారు.
*వాహనాల్లో ఉపయోగించే ఈ క్యాప్సూల్ మరియు ట్యాంక్ బరువు వాహనం యొక్క బరువులో 7 శాతం ఉంటుంది. 
*సాధారణమైన ట్రక్కుల్లో ఒక కేజీ సంప్రదాయ ఇంధన వాడకం ద్వారా మూడు కేజీల ద్రవ కార్బన్డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. 
*కేవలం 10 శాతం కార్బన్డయాక్సైడ్ మాత్రమే రీసైక్లింగ్ పనికిరాదు 
జాతీయం 
ఏప్రిల్‌ 1 నాటికి ఆంధ్ర బ్యాంక్ విలీనం 

*యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) లో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకుల విలీన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 తేదీ నాటికి పూర్తి కానుంది.
*సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయం, సంస్థాగత నిర్మాణం, శాఖల ఏకీకరణ... తదితర వివిధ అంశాలకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక అయింది.
*ఈ ప్రకియ సజావుగా పూర్తి కావటానికి వీలుగా కొన్ని అధికార బృందాలు ఏర్పాటయ్యాయి.
*ఈ విలీనం తర్వాత యూనియన్‌ బ్యాంక్‌ దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంకుగా నిలుస్తుంది.
* అదనపు మూలధన నిధుల సమీకరణకు, రాని బాకీల భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం కలుగుతుంది.
*2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రా బ్యాంకుకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల (ఆర్‌ఎస్‌ఈటీఐ) విభాగంలో ఉత్తమ పనితీరు సాధించిన బ్యాంకుగా అవార్డుకు ఎంపికైంది.
*దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కుల్‌ భూషన్‌ జైన్‌ ఈ అవార్డు అందుకున్నారు.
*ఆంధ్రా బ్యాంకు నెలకొల్పిన శ్రీకాకుళం జిల్లాలో కల రాజాంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం, ఉత్తమ సంస్థగా ఎంపికై అవార్డు గెలుచుకుంది.
చరిత్రలో కలసిపోనున్న 'మిగ్‌ 27' 
*వైమానిక దళంలో ఇంత కాలం పనిచేసిన యుద్ధ విమానం 'మిగ్‌ 27' వినియోగం పూర్తిగా ఇకపై ఉండదు. 
*ఏడు మిగ్‌ 27లతో కూడిన చివరి స్క్వాడ్రన్‌ జోధ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి పూర్తిగా నిష్క్రమించనుంది. 
*. ఇకపై వీటిని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా వినియోగించరు. 
*రష్యా తయారుచేసిన మిగ్‌ 27 పైలట్ల ప్రాణాలు తీస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. 
* 1999 కార్గిల్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించి, పైలట్లతో మంచి పేరు సంపాదించుకున్నాయి. 


తగ్గుతున్న నిరర్ధక ఆస్తులు
*బ్యాంకుల ఆస్తుల నాణ్యత ప్రమాణాలు మెరుగుపడటంతో బ్యాంకుల మొండి బకాయిలు భారీగా తగ్గాయి. సెప్టెంబర్ 30తో ముగిసేకాలానికిగాను బ్యాంక్‌ల నిరర్థక ఆస్తుల విలువ అడ్వాన్స్‌లో 9.1 శాతానికి తగ్గినట్లు రిజర్వు బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడించింది.  
*అంతక్రితం ఏడాదిలో 11.2 శాతంగా ఉన్నది.
*2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను విడుదల చేసిన వార్షిక నివేదికలో బ్యాంకుల తీరును విశ్లేషించింది. ఇదే సమయంలో బ్యాంకుల నికర ఎన్‌పీఏ కూడా 6 శాతం నుంచి 3.7 శాతానికి దిగొచ్చింది. 
*2017-18లో 11.2 శాతంగా ఉన్న ఎన్‌పీఏల వాటా గతేడాదిలో 9.1 శాతానికి తగ్గింది.
*ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ మొత్తం అడ్వాన్స్‌లో 11.6 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇది 14.6 శాతంగా ఉన్నది. అలాగే నికర ఎన్‌పీఏ మాత్రం ఏకంగా 8 శాతం నుంచి 4.8 శాతానికి దిగొచ్చింది.
*ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ రంగ బ్యాంకుల మొండి బకాయిలు భారీగా పెరిగాయి. 
*ఐడీబీఐ బ్యాంక్ ఒక్కసారిగా రూ.10 వేల కోట్లకుపైగా నిరర్థక ఆస్తులను ప్రకటించడంతో మొత్తం బ్యాంకుల ఎన్‌పీఏలు పెరుగడానికి ప్రధాన కారణం. 
*మొత్తంగా ప్రైవేట్ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.7 శాతం నుంచి 5.3 శాతానికి పెరుగగా, నికర ఎన్‌పీఏ 2.4 శాతం నుంచి 2 శాతానికి దిగొచ్చింది. 
*బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కొనుగోలుచేసిన ఐడీబీఐ బ్యాంక్ నిరర్థక ఆస్తులు భారీగా పెరుగడం ప్రైవేట్ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు పెరుగడానికి ప్రధాన కారణం. 
* ఐడీబీఐ బ్యాంక్‌ను మినహాయిస్తే మాత్రం ప్రైవేట్ రంగ స్థూల నిరర్థక ఆస్తుల విలువ తగ్గుముఖం పట్టింది. వీటిలో ఒక ఐడీబీఐ బ్యాంక్ ఎన్‌పీఏనే 29.4 శాతంగా ఉన్నది.
*మిగతా రంగాలతో పోలిస్తే పారిశ్రామిక రంగంలోనే స్థూల నిరర్థక ఆస్తులు అధికంగా ఉన్నాయి. 
*సెప్టెంబర్ 2019 నాటికి ఉన్న మొండి బకాయిల్లో మూడింట రెండోవంతు ఈ రంగానివే.
*వీటి వాటా 17.4 శాతంగా ఉన్నది. మరోవైపు కమర్షియల్ బ్యాంకుల అధికంగానే ఉన్నాయి. 
* ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుండటంతో ఇదే సమమంలో కమర్షియల్ బ్యాంకులు చతికిలా పడ్డాయి. రూ.5 కోట్ల కంటే అధికంగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారి వాటా 91%గా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బకాయిలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
*గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ రూ.71,543 కోట్లు. అంతక్రితం ఏడాది జరిగిన రూ.41,167 కోట్ల మోసాలతో పోలిస్తే 74 శాతం అధికం. 
*2017-18లో బ్యాంకులను మోసం చేసిన కేసులు 5,916 కాగా, ఆ తర్వాతి ఏడాదిలో ఈ సంఖ్య 6,801కు చేరుకున్నాయి.
* వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకులను అత్యధికంగా మోసం చేశారు. కేసుల్లో వీటి వాటా 55.4 శాతంగా ఉండగా, విలువలో 90.2 శాతంగా ఉన్నాయి.
*2018-19లో బ్యాంకింగ్ మోసాల్లో ప్రైవేట్ రంగ సంస్థల వాటా 30.7 శాతంగా ఉండగా, విదేశీ బ్యాంకుల వాటా 11.2 శాతంగా ఉన్నది. విలువపరంగా చూస్తే వీటి వాటా 7.7 శాతంగాను, 1.3 శాతంగా ఉంది.
*అత్యధిక శాఖలు కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే అధిక మోసాలు జరుగుతున్నాయి. మోసాల్లో వీటి వాటానే 91.6 శాతంగా ఉంది.
* మరోవైపు బ్యాంక్ అడ్వాన్స్ విభాగంలో 3,606 మోసాలు జరుగగా, వీటి విలువ రూ.64,548 కోట్లుగా ఉన్నది. విదేశీ ఎక్సేంజ్ లావాదేవీల్లో రూ.695 కోట్ల విలువైన 13 మోసాలు జరిగాయి.


దివాలా స్మృతి సవరణ ఆర్డినెన్స్ 
*దివాళా చట్టంలో పలు సందిగ్ధతలను తొలగించేందుకు చట్టాన్ని సవరించేందుకు వీలుగా ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
* కొన్ని అస్పష్టతలను తొలగించి, స్మృతిని సాఫీగా అమలు చేసేందుకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. 
*ఈ మార్పులతో దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభానికి ముందు జరిగిన నేరానికి సంబంధించి కార్పొరేట్‌ రుణగ్రహీతకు ఎలాంటి బాధ్యత ఉండదు. 
*పరిష్కార ప్రణాళికను సంబంధిత న్యాయ నిర్ణయాధికార సంస్థ ఆమోదించిన తేదీ నుంచి జరిగిన ఉల్లంఘనలకూ కార్పొరేట్‌ రుణగ్రహీతను ప్రాసిక్యూట్‌ చేయబోరు.
* దివాలా స్మృతిని సవరించేందుకు ఈ నెల 12న కేంద్రం లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దివాలా పరిష్కార ప్రక్రియలో అడ్డంకులను తొలగించడం దీని ఉద్దేశం. 
*దివాలా తీసిన కంపెనీలను దక్కించుకున్న బిడ్డర్లు మునుపటి ప్రమోటర్లు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోకుండా ఇది చూస్తుంది. 
*ఈ స్మృతికి ఇప్పటికే మూడుసార్లు సవరణలు జరిగాయి.
*దివాలా స్మృతి (రెండో సవరణ) బిల్లును ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘానికి పంపాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నిర్ణయించారు. మూడు నెలల్లోగా దీనిని పరిశీలించి, నివేదిక సమర్పించాలని సూచించారు.
కేంద్ర మంత్రి జవదేకర్‌ - తాజా సవరణతో చట్టంపై మరింత స్పష్టత రానుందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెరగనున్నాయి.
అటల్ భూజల్ యోజన
*దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
*  అదేవిధంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 
* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25న 'జాతీయ సుపరిపాలన దినోత్సవం'గా జరుపుతారు. 
* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘అటల్ భూజల్ యోజన’కు శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి తక్షణమే రూ. 6 వేల కోట్లను కేటాయించారు. 
*మాజీ ప్రధాని అటల్‌జీ 95వ బర్త్‌డే సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. 
* దేశంలో భూగర్భ జలాల వల్ల సుమారు 65 శాతం వ్యవసాయం జరుగుతుంది.
*దేశంలోని భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. 
*నీటి లభ్యత తక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాలకు పథకం మేలు కలిగిస్తుంది. 
* గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు  ఉత్తర ప్రదేశ్ లలో గుర్తించిన ప్రాంతాలలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ రాష్ట్రాల్లోని 78 జిల్లాల్లో ఉన్న 8350 గ్రామ పంచాయతీలకు స్కీమ్ వర్తిస్తుంది.
* ఇకపై గ్రామ పంచాయితీ స్థాయిలోనే, తమతమ గ్రామాల పరిధిలో భూగర్భ జలాలను ఎలా పెంచుకోవాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 
* భూగర్భ జలాలను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 
*2020 నుంచి 2025 మధ్య కాలంలో భూజల్ పథకాన్ని అమలు చేయనున్నారు.

క్యాబినెట్ నిర్ణయాలు -రైల్వే సంస్కరణలు
1.పర్యాటక రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2,400 కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2.మరోవైపు గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో భూగర్భ జలవనరులు పెంపొందించేందుకు రూ.6,000 కోట్లతో చేపట్టిన అటల్‌ భుజల్‌ పథకానికి కూడా ఆమోద ముద్ర వేసింది.
3.రైల్వే బోర్డు సభ్యుల సంఖ్యను సగానికి సగం తగ్గించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న ఎనిమిది మంది సభ్యులకు బదులుగా ఇకపై నలుగురే (చైర్మన్‌ కాకుండా) ఉండనున్నారు.
*వివిధ విభాగాలను, కేడర్లను కూడా విలీనం చేయనున్నారు.
*ఇప్పటిదాకా వివిధ విభాగాల్లో 8 సర్వీసులు ఉండగా ఇకపై ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ అనే ఒకే కేడర్‌ ఉంటుంది.
* రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌- మెడికల్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌, రైల్వే మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌గా రెండే విభాగాలుంటాయి.
*రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ -  రైల్వేల పునర్వ్యవస్థీకరణతో శాఖాపరమైన సమస్యలకు ముగింపు లభిస్తుంది.
* ట్రాఫిక్‌, రోలింగ్‌ స్టాక్‌, ట్రాక్షన్‌, ఇంజనీరింగ్‌ విభాగాల రైల్వే బోర్డు సభ్యులకు బదులుగా కొత్తగా ఏర్పాటుచేయబోయే బోర్డులో ఆపరేషన్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫైనాన్స్‌ శాఖల నుంచి ఒక్కొక్కరు ఉంటారు.
*అలాగే ఇండస్ట్రీ, ఫైనాన్స్‌, ఎకనమిక్స్‌, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో 30 ఏళ్ళ అనుభవం ఉన్న పలువురు స్వతంత్ర సభ్యులు కూడా ఉంటారు.
*రైల్వేలో ఎనిమిది సర్వీసులకు బదులుగా 'ఇండియన్‌ రైల్వే సర్వీస్‌' ఒక్కటే ఉండనుంది.
* రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్‌), వైద్య సేవల విభాగం అలాగే కొనసాగనుండగా, మిగిలిన అన్ని విభాగాలూ ఉమ్మడి రైల్వే నిర్వహణ వ్యవస్థ కిందకు రానున్నాయి.
*రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియకు యూపీఎస్సీ, సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించి కొత్తగా ఇండియన్‌ రైల్వేస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ను ఏర్పాటు చేయనున్నారు.

జాతీయ జనాభా పట్టిక సవరణ 
*అసోం మినహా మిగిలిన అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జనాభా పట్టికను (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌-ఎన్పీఆర్‌)ను సవరించాలని (అప్‌డేట్‌ చేయాలని) నిర్ణయించింది.
*NCR సవరణకు రూ.3,941.35 కోట్లు, 2021 జనగణనకు రూ.8,754.23 కోట్లు కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
*2021 జనాభా లెక్కల సేకరణ తొలి విడుత ప్రక్రియతోపాటే వచ్చే ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య ఎన్పీఆర్‌ ప్రక్రియనూ చేపట్టనున్నారు.
*ఎన్నార్సీతో ఎన్పీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టంచేశారు.
* ఎన్పీఆర్‌ సవరణకు ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి పత్రాలు కానీ, బయోమెట్రిక్‌ వివరాలను కానీ సేకరించబోదని తెలిపారు.
* స్వీయ ధ్రువీకరణ కింద ప్రజలిచ్చిన సమాచారాన్నే తీసుకోనున్నారు.
* దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన సమగ్ర గుర్తింపు డాటాబేస్‌ను (వివరాలను) రూపొందించడమే ఎన్పీఆర్‌ ప్రధాన ఉద్దేశమని 'రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌' అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
* ఈ డాటాబేస్‌లో జనాభా సమాచారంతోపాటు బయోమెట్రిక్‌ వివరాలు కూడా ఉంటాయి.
*జనగణన- 2021ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. 2020 ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య తొలి దశను పూర్తి చేస్తారు. ఈ దశలో కుటుంబ సమగ్ర వివరాలను నమోదు చేస్తారు.
*2021 ఫిబ్రవరి 9 - 28 మధ్య రెండో దశ నమోదు జరుగుతుంది. ఆ దశలో వర్గాల వారీగా మొత్తం జనాభా సంఖ్యను గణిస్తారు.
*వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు తమిళనాడు, బెంగాల్‌, ఒడిశా, మిజోరం తదితర రాష్ర్టాల ప్రభుత్వాలు ఎన్పీఆర్‌ డాటాను వినియోగిస్తున్నాయి.
*ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఉజ్వల, సౌభాగ్య వంటి పథకాలకు కూడా ఈ సమాచారాన్ని వినియోగించనున్నారు.
* ఎన్పీఆర్‌కు జనన, మరణ ధ్రువీకరణను లింక్‌ చేయడం ద్వారా భవిష్యత్తులో రిజిస్టర్‌ ఆధారిత జనగణనకు మార్గం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
*చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే జాతీయ పౌర పట్టిక(నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్, ఎన్నార్సీ).
*ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం..భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతోపాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా పొందుపరచబడి ఉంటాయి.
*ఈ పట్టికను మొట్టమొదటిసారిగా 1951లో ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకు దానిని మళ్లీ అప్‌గ్రేడ్‌ చేయలేదు. అయితే, ఇది అస్సాంలో మాత్రమే ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో అప్‌గ్రేడ్‌ అవుతోంది.
*1955 పౌరసత్వ చట్టం ప్రకారం.. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే. దీని ప్రకారం.. ఎ) 1950 జనవరి 26వ తేదీన కానీ, అంతకుపూర్వం కానీ..1987 జూలై 1వ తేదీకి ముందు జన్మించిన వారు భారతీయ పౌరులు.
బి) 1987 జూలై 1వ తేదీన కానీ, అంతకుముందు పుట్టిన వారు. అయితే.. 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి రాకముందు జన్మించిన వారు; తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు ఆ సమయానికి భారత పౌరులై ఉన్నా..
సి) 2003లో సవరించిన పౌరసత్వ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వారు; తల్లిదండ్రులిద్దరూ పౌరులై ఉన్నా లేక తల్లిదండ్రులిద్దరిలో ఒకరు అక్రమ వలసదారు కాకున్నా పౌరుడిగానే పరిగణింపబడతారు.

రోహ్‌తంగ్‌కు వాజ్‌పేయీ పేరు
* హిమాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గంగా పరిగణించే రోహ్‌తంగ్‌కు ప్రభుత్వం దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టనుంది.
*డిసెంబర్ 25వ తేదీన వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
*ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి మార్చ్ 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజునాడు అనగా సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
* వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరం జూన్‌ మూడోతేదీన రోహ్‌తంగ్‌ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.
*లాహౌల్ లోయను మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయడం కొరకు రోహతంగ్  టన్నెల్ నిర్మించారు.
*సముద్ర మట్టానికి 13,054 అడుగుల ఎత్తులో 365 రోజులు మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లోని మనాలికి 53 కిమీల దూరంలో ఉంది.
*కేవలం వేసవిలో మాత్రమే పర్యటకుల కోసం అందుబాటులో ఉంటుంది. మిగతా రోజుల్లో దారులన్నీ మంచుతో మూసుకుపోయి ఉంటాయి.
*ఎత్తైన పర్వతాలు, జలపాతాలు, బియాస్, చీనాబ్ నదులు పుట్టే ప్రాంతాలు ఇక్కడే కలవు.
*రావి నది రోహ్‌తంగ్‌ సొరంగానికి పశ్చిమ ప్రాంతంలో,కులు హిల్స్ (హిమాచల్ ప్రదేశ్)లో జన్మిస్తుంది. 
*ఇది హిమాలయాల యొక్క పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో ఉంది.
*ఈ సొరంగం ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా పేరుపొందింది. దీని పొడవు 8.8 కిలోమీటర్లు. 3వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది.
* లేహ్ మరియు మనాలి మధ్య  46 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది.
*ఇది సింగిల్ ట్యూబ్ సొరంగం. 10.5 మీటర్ల వెడల్పు కలిగి, ఫైర్ ప్రూఫ్ సౌకర్యం కలిగి ఉంది.
*ఈ సొరంగం హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోయ ప్రాంతాన్ని మరియు లాహౌల్ ,స్పితి లోయలను కలుపుతుంది. 

జమ్మూకాశ్మీర్ లో పారామిలటరీ దళాల ఉపసంహరణ
*కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మోహరించిన 72 కేంద్ర పారామిలటరీ దళాలను ఉపసంహరించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది.
*జమ్మూకశ్మీర్ నుంచి విత్ డ్రా చేసిన కేంద్ర పారామిలటరీ దళాల్లో 24 సీఆర్‌ఫీఎఫ్ కంపెనీలు, 12 కంపెనీల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, 12 కంపెనీల ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళం, 12 కంపెనీల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మరో 12 కంపెనీల సషస్త్ర సీమాబల్ దళాలున్నాయి.
*ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 72 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలను లోయలో నుంచి ఉపసంహరించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది.
*జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినపుడు సాధారణంగా కశ్మీర్‌లో ఉండే 61 బెటాలియన్ల బలగాలే గాక అదనంగా మరో 70 బెటాలియన్ల భద్రతా సిబ్బందిని ఆగస్టు- సెప్టెంబరు నెలల్లో కేంద్రం కశ్మీర్‌లో మోహరించింది.
*జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370 రద్దు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది.
*ఉగ్రవాదుల ఏరివేత, శాంతి భద్రతల పర్యవేక్షణ మాత్రం నిరంతరం కొనసాగుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.







Styling Tables


POLITY HISTORY GENERAL KNOWLEDGE
CURRENT AFFAIRS GEOGRAPHY PREVIOUS PAPERS


No comments:

Post a Comment