దిశా బిల్లును ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

'దిశ' బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.
*దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నిందితులను తక్షణమే శిక్ష వేయడానికి ఈ బిల్లు తీసుకు వచ్చారు.
*ఈ కొత్త చట్టంతో మహిళలపై నేరాలకు పాల్పడే వారికి 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో శిక్షలు విధించేలా చర్యలు తీసుకోనున్నారు.మహిళలపై నేరం చేసినట్లు రుజువైతే, సరైన ఆధారాలు ఉంటే  21 రోజుల్లో మరణ శిక్ష పడేలా చట్టంలో మార్పులు.
*దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టనున్నారు. 
* ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నారు.డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక పోలీసుల టీంలు..అదే విధంగా ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తారు. 
* శిక్షల అమలులో కూడా జాప్యం ఉండకుండా చర్యలు చేపట్టనున్నారు.
*ఏ మాధ్యమం ద్వారా అయినా మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడటం, ప్రవర్తించడం చేసినా వాళ్లకు 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా పడుతుంది.రెండోసారి పాల్పడితే నాలుగేళ్ల జైలు శిక్ష పడుతుంది.దీని కోసం సీపీసీ 173, 309 లో సవరణలు తీసుకొస్తూ బిల్లులో చేసిన సవరణలకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. 
*బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తే 354 ఎఫ్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తారు.354 ఎఫ్‌ చట్టం కింద పదేళ్లు జైలు శిక్ష విధిస్తారు.
*రాష్ట్రంలో 2014 లో 930, 2015 లో 1014, 2016 లో 969, 2016 లో 1045, 2019 లో 1095 రేప్‌ కేసులు  నమోదయ్యాయి.
* అకృత్యాలకు పాల్పడేవారికి మరణదండన విధించాలనే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం చేసింది. 
* దేశ వ్యాప్తంగా ఈ తరహా చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
*నిర్భయం చట్టం ప్రకారం- 2 నెలల్లో దర్యాప్తు పూర్తయితే, మరో 2 నెలల్లో శిక్షలు పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఈ రెండూ పూర్తికావాలి.ఏపీ దిశ చట్టంలో 4 నెలలకు కాదు 21 రోజులకు కుదించారు. 
*కేంద్రం చేసిన ''పోక్సో'' చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు.రాష్ట్రంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు.
*అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తు 7 రోజుల్లో చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ తీసుకు వచ్చారు.
*ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న 6 నెలల కాలాన్ని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పరిధిలో కేవలం 3 నెలలకు తగ్గించారు.
*ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.
* మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉంచి, జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరగాడు, ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు.
* కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.

No comments:

Post a Comment