ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గాజులరేగ ప్రాంతంలో ఏయూ క్యాంపస్ ఎదురుగా నిర్మించనున్న 100 పడకల కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఆస్పత్రికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ డిసెంబర్ 19న శంకుస్థాపన చేశారు.
ఈఎస్‌ఐ ద్వారా దేశంలో 3.50 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారని ఈ సందర్భంగా గంగ్వార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ... ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని రూ.75 కోట్లతో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. ఆస్పత్రిని 500 పడకల స్థాయికి పెంచనున్నట్టు తెలిపారు.
No comments:
Post a Comment