సంయుక్త ఎంపిక కమిటీ పరిశీలనకు పౌరుల సమాచార రక్షణ బిల్లు

*లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరుల సమాచార రక్షణ బిల్లును సంయుక్త ఎంపిక కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్రం డిసెంబర్ 11వ తేదీన నిర్ణయించింది.
*డిసెంబర్ 12వ తేదీన ప్రభుత్వం ఈ బిల్లును సంయుక్త కమిటీకి పంపింది.
*పార్లమెంటరీ ప్యానెల్‌ దీన్ని క్షుణ్ణంగా పరిశీలించనుంది.
* ఈ బిల్లును పరిశీలించే కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 సభ్యులు ఉంటారు. లోక్‌సభ స్పీకర్‌ ఈ కమిటీకి ఒకరిని ఛైర్మన్‌గా నియమిస్తారు. 
*రాబోయే బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపు ఈ కమిటీ బిల్లుకు సంబంధించిన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
* ఈ బిల్లు కేవలం ప్రజల సమాచారాన్ని రక్షించడం కోసమే. సమాచార గోప్యత అనేది ప్రజల ప్రాథమిక హక్కే కానీ ఉగ్రవాదులు దీన్ని నాశనం చేస్తున్నారు. అలా జరగకుండా ఉండేందుకే దీన్ని రూపొందించినట్టు కేంద్రం పేర్కొంది.
* ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను ప్రాసెస్‌ చేయాలంటే ఈ బిల్లు అనుమతించదు. మన సమాచారాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఉపయోగించకుండా తోడ్పడుతుంది.

NEXT

No comments:

Post a Comment