మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ క్లీన్ చిట్

*2002 గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
*. జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ తన తుది నివేదికను గుజరాత్ అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టింది.
*ఈ నివేదికను ఆ రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హ్‌ జడేజా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
* ఈ ఘటనకు సంబంధించి 2008లో జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 
*తొలి నివేదికలో గోద్రా ఘటనలో రైలు కాలిపోయిన ఘటనను ప్రస్తావించింది.సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి ఎస్-6 కోచ్‌ అల్లర్ల సందర్భంగా గోద్రా రైల్వే స్టేషన్‌లో తగలబెట్టారు.
* ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. 2008లో తొలి నివేదికలో కూడా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
*ధాని నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ జస్టిస్ నానావతి కమిషన్ నివేదిక ఇచ్చిన ఐదేళ్లకు అసెంబ్లీలో గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా ప్రవేశపెట్టారు. 
*2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి 2014లో గుజరాత్ ప్రభుత్వానికి రిటైర్డ్ జస్టిస్ నానావతి అక్షయ్ మెహతాలు తమ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. 
*ఈ అల్లర్లలో దాదాపు 1000 మంది ప్రజలు మృతి చెందారు. 
*ఈ రిపోర్టును అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందిబెన్ పటేల్‌కు సమర్పించారు.
*గుజరాత్ అల్లర్లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 
* గుజరాత్ అల్లర్ల సందర్భంగా చెలరేగిన గొడవల కారణంగా గోద్రా రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 కోచ్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బోగిలో ఉన్న 59 మంది కరసేవకులు మృతి చెందారు.
NEXT

No comments:

Post a Comment