కొలీజియం నిర్ణయం తర్వాత ఆరు నెలల్లో నియామకం

*న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై సుప్రీం కోర్టు డిసెంబర్ 10 వతేదీన కీలక ఆదేశాలు జారీ చేసింది.
*ఇకపై కొలీజియం ఎంపిక చేసిన న్యాయమూర్తు లను ఆరు నెలల్లోగా ప్రభుత్వం నియమించాలని కోర్టు స్పష్టం చేసింది. 
* ఇప్పటికే వివిధ హైకోర్టుల్లో 213 మంది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థ చేసిన సిఫార్సు లు అటు కేంద్ర ప్రభుత్వ పరంగా గానీ, సుప్రీం కోర్టు పరంగా గానీ పెండింగ్‌లో ఉన్నాయి. 
*ఇకమీదట న్యాయమూర్తుల నియామ కానికి సంబంధించి హైకోర్టులు చేసే సిఫార్సులు సుప్రీంకోర్టు కొలీజియం, కేంద్ర ప్రభుత్వం అంగీకరిపుస్తే, వారు ఆరు నెలల్లోగా నియామకం పొందేలా ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. 
*జస్టిస్‌ సంజరు కిషన్‌, కెఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం --ఇతర కేసుల్లో మాదిరిగా గడువులోగా పూర్తి చేయకుండా ఉండరాదు. 
*సుప్రీం కోర్టు పేర్కొన్న ప్రకారం, న్యాయ నియామకాల ప్రక్రియ నిరంతర, సహకార, సమగ్ర ప్రక్రియగా ఉండాలి.  
*హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి విపరీతమైన ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి. 
* వివిధ హైకోర్టుల్లో 410 ఖాళీలు ఉన్నాయి. దేశంలో మొత్తం 1079 మంది హైకోర్టు జడ్జీలుండాలి. 669 మందే పనిచేస్తున్నారు. 213 మందికి సంబంధించిన సిఫారసులు సుప్రీం కొలీజియం వద్ద, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరో 197 సిఫారసులు హైకోర్టు కొలీజియాల నుంచి రావాల్సి ఉంది. 

No comments:

Post a Comment