కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుకు లోక్ సభ ఆమోదం

*దేశంలో ఉన్న మూడు డీమ్డ్ సంస్కృత విశ్వవిద్యాలయాలను  కేంద్రీయ విశ్వవిద్యాలయాలు గా మార్చడానికి ప్రవేశపెట్టిన కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ బిల్లు 2019 ని లోక్ సభ ఆమోదించింది.
*ఈ బిల్లును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ లోక్ సభలో ప్రవేశపెట్టారు.
* భోపాల్ లో ఉన్న రాష్ట్రీయ  సంస్కృత సంస్థాన్, ఢిల్లీలో ఉన్న రాష్ట్రీయ సంస్కృత విద్య పీఠం,తిరుపతిలో ఉన్న రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అనే ఈ మూడు డీమ్డ్ సంస్కృత విశ్వవిద్యాలయాలను కేంద్రీయ విశ్వవిద్యాలయాలుగా మార్చనున్నారు.
*విద్యార్థులకు సంస్కృత విద్యను అందించడం వారికి సంస్కృత జ్ఞానాన్ని అందించి సంస్కృత భాషా సాహిత్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
*సంస్కృత భాషను ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో, 250 విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు. ముఖ్యంగా జర్మనీలో 14 విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు.
NEXT

No comments:

Post a Comment