వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు

* వ్యక్తిగత సమాచార భద్రత(పీడీపీ) బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానుంది.
* దీనికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో పౌరుల గోప్యత హక్కుకు భంగం కలిగించే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి.
* పౌరుల సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోరాదన్న నిబంధనతో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా బిల్లు రూపొందించింది.
* సోషల్‌ మీడియా కంపెనీలు తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రభుత్వ ఏజెన్సీల స్వచ్ఛంద పరిశీలనకు అనుమతించేలా బిల్లులో కొన్ని క్లాజుల్ని చేర్చారు.
* ఈ బిల్లుకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన ముసాయిదా బిల్లు ఆధారం. 
*  2018లోనే ముసాయిదా బిల్లును పౌర సమాజం ముందు చర్చకు పెట్టారు. అయితే, కృష్ణ కమిటీ బిల్లును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదిం చలేదు.
*దానికి కొన్ని మార్పులు చేసింది.
*కృష్ణ కమిటీ ముసాయిదా బిల్లులో లేని మూడు కీలక క్లాజుల్ని క్యాబినెట్‌ ఆమోదించిన బిల్లులో చేర్చారు. 
*సెక్షన్‌ 91లోని రెండో క్లాజ్‌లో డేటా నియంత్రణ సంస్థ నుంచి వ్యక్తిగత రహస్యాలు లేదా వ్యక్తిగతేతర సమాచారాన్ని తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
*  పౌరులకు నాణ్యమైన సేవల్ని అందించడం కోసం, సాక్ష్యాధారాల కోసం అవసరమైన సమాచారాన్ని డేటా నియంత్రణ సంస్థలు అందించాలని ఈ క్లాజ్‌లో పేర్కొన్నారు.
*పౌరుల ఖాతాల్లోని సమాచారాన్నిప్రభుత్వ ఏజెన్సీలు స్వచ్ఛందంగా పరిశీలించేందుకు సోషల్‌ మీడియా సంస్థలు అనుమతించాలని బిల్లులోని సెక్షన్‌ 28లో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాలు ప్రభుత్వ నిఘా సంస్థల నియంత్రణలోకి వెళ్తాయి.
* గోప్యత అనేది ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.వ్యక్తిగత సున్నిత సమాచారాన్ని దేశం బయటికి పంపేందుకు కూడా బిల్లు అనుమతిస్తుంది.అయితే, భారత్‌లో అందుకు సంబంధించిన కాపీని స్టోర్‌ చేయాలని షరతు విధించారు. 
NEXT

No comments:

Post a Comment