2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
ఆ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ శర్మ డిసెంబర్ 20న తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు. రెండు రోజుల క్రితం మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫురీష్మన్ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్‌ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అదే ఏడాది ఢిల్లీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
No comments:
Post a Comment