బ్యాక్టీరియాను గుర్తించే 'రైట్‌ బయోటిక్‌' యంత్రం

* రక్త, మూత్ర సంబంధిత వ్యాధికారక బ్యాక్టీరియాను సులువుగా గుర్తించే ప్రత్యేక యంత్రాన్ని హైదరాబాద్‌లోని బిట్స్‌ పిలానీ తయారు చేసింది. 
*ప్రొఫెసర్‌ సుమన్‌ కపూర్‌ నేతృత్వంలోని విద్యార్థుల బృందం.. వర్సిటీలోని ఇంక్యుబేషన్‌ కేంద్రంలో పనిచేస్తున్న ఎక్స్‌-బిట్స్‌ అంకుర సంస్థ సాయంతో ఈ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. 
*ఇప్పటికే యంత్రం సాయంతో బ్యాక్టీరియా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా నదుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా గుర్తించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)ఆదేశించింది.
*సాధారణంగా రక్త, మూత్ర నమూనాల్లో వ్యాధికారక బ్యాక్టీరియాను గుర్తించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఇప్పటివరకు మూత్రంలో వ్యాధికారక బ్యాక్టీరియాను గుర్తించడానికి (కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ పరీక్షకు) 48 నుంచి 72 గంటల సమయం పడుతోంది. అదే రక్త నమూనాలను విశ్లేషించేందుకు 24 గంటలు అవసరమవుతోంది.
*ఈ సమయాన్ని తగ్గిస్తూ బిట్స్‌ పిలానీ 'రైట్‌ బయోటిక్‌' యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం నాలుగు గంటల్లోనే మూత్ర నమూనాలు, గంటలోనే రక్త నమూనాలను ఈ యంత్రం విశ్లేషించి ఫలితం రాబడుతుంది.
*ఆయా నమూనాల్లో ఏ బ్యాక్టీరియా ఉందో చెప్పడం, దానికి ఏ యాంటీ బయోటిక్‌ ఇవ్వాలో కూడా చెబుతుంది.
* దీని వల్ల వ్యాధి ముదరకుండానే రోగికి సత్వరం చికిత్స అందించే అవకాశముంటుంది.
*కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) రైట్‌బయోటిక్‌ యంత్రాన్ని వినియోగించి గతంలో మూసీ నది కాలుష్యంపై సర్వే నిర్వహించింది. 
*కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ అనుమతితో దేశవ్యాప్తంగా కాలుష్యమైన నదుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా గుర్తించవచ్చని ఇటీవల సీపీసీబీ అధికారులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పించారు. 
*ఈ యంత్రాన్ని వినియోగించి దేశంలో కాలుష్య కారక నదుల్లో ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించాలని సీపీసీబీని ఎన్జీటీ ఆదేశించింది.

No comments:

Post a Comment