శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు పొందిన పిన్న వయస్కురాలు

*శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా డాక్టర్‌ నీనా గుప్తా (35) రికార్డు సృష్టించారు.
*కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎ్‌సఐ)లో ఆమె మేథమెటిక్స్‌ ప్రొఫెసర్‌.
*ఈ అవార్డు అందుకున్న మూడో మహిళ నీనా.
*70 ఏళ్ల గణిత చిక్కుప్రశ్నకు సమాధానం కనుగొన్నందుకు ఈ అవార్డు లభించింది.
*2006లో కోల్‌కతాలోని బెథూన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నీనా ఆల్‌జీబ్రాయిక్‌ జామెట్రీలో పీహెచ్‌డీ చేశారు.
*శాంతి స్వరూప్ భట్నాగర్ (SSB) శాస్త్ర మరియు సాంకేతిక పురస్కారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) ద్వారా ప్రముఖ శాస్త్ర పరిశోధకులకు అందజేయబడుతున్న శాస్త్ర పురస్కారం. ఈ పురస్కారాలను శాస్త్ర రంగాలైన జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణితశాస్త్రం, వైద్యరంగం మరియు భౌతిక శాస్త్రాలలో అసమాన ప్రతిభ కనబరచిన వారికి అందజేస్తారు. ఈ పురస్కారం భారతీయ శాస్త్ర మరియు సాంకేతిక రంగాలలో మంచి గుర్తింపు తెచ్చిన వారికి అంజజేయబడుతుంది. 
*ఇది భారతదేశంలోని శాస్త్ర రంగంలో అతి గౌరవనీయమైన పురస్కారం.
*ఈ పురస్కారానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్థాపకుడైన శాంతిస్వరూప్ భట్నాగర్ పేరును పెట్టారు. ఈ పురస్కారం మొదటిసారి 1958 లో యివ్వబడినది.
* ఈ పురస్కారాన్ని పొందవలసిననాటి నుండి ముందు ఐదు సంవత్సరాలపాటు ఆయన చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేస్తారు.
*ఈ పురస్కారం ఒక పతకం, నగదు బహుమతి INR5 లక్షలు అందజేయబడుతుంది. అదనంగా ఆ పురస్కార గ్రహీత 65 వ సంవత్సరం వరకు ప్రతీ నెలా రూ. 15,000 అందజేయబడుతుంది.

NEXT

No comments:

Post a Comment