ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్

*ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మరో ఘనతను సాధించారు.
*బీజేపీ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న నిర్మలా సీతారామన్, ఫోర్బ్స్అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. 
*ఈ లిస్ట్‌లో క్వీన్ ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె,సలహాదారు ఇవాంకా ట్రంప్‌ కంటే నిర్మల సీతారామన్ ముందు ఉన్నారు. 
*న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ కంటే కూడా నిర్మలా సీతారామన్ ముందున్నారు.
* 'ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచంలో 34 వ ర్యాంకులో నిలిచారు. భారత్‌ తరపున ఈ ఏడాది అత్యుత్తమ స్థానం అదే. ఫోర్బ్స్‌ జాబితాలోకి రావడం సీతారామన్‌కు ఇదే తొలిసారి.
*గతంలో ఆమె రక్షణశాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. 
*క్వీన్ ఎలిజబెత్-2 15 పాయింట్లు క్షీణించి 38వ స్థానం, ఇవాంకా ట్రంప్‌ 18 ర్యాంకులు పడిపోయి 42 వ స్థానాన్ని దక్కించుకున్నారు. 
* నిర్మలా సీతారామన్ తర్వాత భారతదేశం నుండి హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈవో రోష్ని నాడర్‌ మల్హోత్ర 54వ స్థానంలో ఉన్నారు. కంపెనీ వ్యూహాత్మక నిర్ణయాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు ఆమె కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబుల్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌, శివ్‌నాడార్ ఫౌండేషన్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థలు దేశంలోని విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నాయి. 
*బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందార్‌ షా 65 ర్యాంకులో ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద బయో ఫార్మస్యూటికల్‌ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మజూందార్‌ షా నేతృత్వంలో కంపెనీ పరిశోధనలకు అవసరమైన సౌకర్యాల కల్పన, ప్రతిభావంతులను ప్రోత్సహించి బయోటెక్‌ విభాగంలో పరిశోధనను ప్రోత్సహిస్తున్నారు.
*ఈ జాబితాలో మిలిందా గేట్స్‌(6), ఐబీఎం సీఈవో గిన్నీ రొమెట్టీ(9), ఫేస్‌బుక్‌ సీఈవో షెర్లీ శాండ్‌బర్గ(18), న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ (38), అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌(42), గాయకురాలు రిహాన్న(61), బియాంక (66), టేలర్‌ స్విఫ్ట్‌(71), టెన్నిస్‌ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌(81), పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌(100)కు స్థానం దక్కింది.
*జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మార్కెల్ వరుసగా తొమ్మిదిసారి కూడా ఈ జాబితాలో నెంబర్‌ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 
* యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు ప్రెసిడెంట్‌ క్రిస్టీన్ లగార్డ్ (2), నాన్సీ పెలోసి (3), యూరోపియన్ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (4), జనరల్‌ మోటార్స్‌ సీఈవో మేరీ బార్రా (5) మేరీ బార్రా (5), మెలిండా గేట్స్, అబిగైల్ జాన్సన్, అనా ప్యాట్రిసియా బోటిన్, గిన్ని రోమెట్టి, మారిలిన్ హ్యూసన్ మిగిలిన టాప్ 5 స్థానాలను దక్కించుకున్నారు.
*ఆర్థిక మందగమనం, జిడిపి వృద్ధి క్షీణించడంపై ఆర్థిక మంత్రి సీతారామన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
NEXT

No comments:

Post a Comment