అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం

*ఇప్పటివరకూ వరల్డ్‌లో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌క్రికెట్‌ స్టేడియం రెండో స్థానానికే పరిమితం కానుంది.
* భారత్‌లోని అహ్మదాబాద్‌లోలో నిర్మించిన క్రికెట్‌ స్టేడియం ఇక నుంచి ప్రపంచ అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం కానుంది.ఈ స్టేడియం పేరు మోటేరా స్టేడియం. 
*అహ్మదాబాద్‌లోని నూతన క్రికెట్‌ స్టేడియం రూపుదిద్దుకోవడంతో వచ్చే ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
*దాదాపు రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం కెపాసిటీ ఒక లక్షా 10 వేలు.
*దాంతో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం లక్ష కెపాసిటీని అహ్మదాబాద్‌ నూతన స్టేడియం అధిగమించనుంది. 
*ఇందులో 70 కార్పోరేట్‌ బాక్స్‌లను, నాలుగు డ్రెస్సింగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 
* ఒలింపిక్స్‌ సైజ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఇందులో ఉంది.2017 జనవరిలో ఈ స్టేడియం నిర్మాణ పనులను ఆరంభించగా పూర్తి కావడానికి సుమారు మూడేళ్లు పట్టింది.
*అంతకుముందు ఇక్కడ ఉన్న సర్దాల్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మించారు.
*వచ్చే ఏడాది మార్చిలో ఇక్కడ మ్యాచ్‌ జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*ఆసియా ఎలెవన్‌-వరల్డ్‌ ఎలెవన్‌ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 
*గతంలో భారత్‌లో అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ ఉండేది. దాని కెపాసిటీ సుమారు లక్ష కాగా, ప్రధాన బిల్డింగ్‌ పునః నిర్మాణంలో దాన్ని 66 వేలకు తగ్గించారు.
NEXT

No comments:

Post a Comment