తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ (సవరణ) బిల్లు

*తల్లిదండ్రులు, వృద్ధులను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తే వారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా లేదా రెండూ గానీ విధించేందుకు చట్టం రానుంది.
* తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ (సవరణ) బిల్లు-2019ను కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
*తల్లిదండ్రులు/ వృద్ధులను భౌతికంగా గానీ, మానసికంగా గానీ వేధించే కొడుకు, కూతురు, సవతి పిల్లలు, దత్తత పిల్లలు, అల్లుడు, కోడలు, మనుమడు, మనుమరాలు, మైనర్ల గార్డియన్లకు ఈ బిల్లు వర్తిస్తుంది.
*తమ సంరక్షణలో ఉన్న తల్లిదండ్రులను, సీనియర్‌ సిటిజన్లను మానసికంగా బాధ పెట్టినా శిక్ష తప్పదు. 
*మైనర్ల విషయంలో చట్టప్రకారం ఎవరు సంరక్షకులో వారిదే బాధ్యత. సీనియర్‌ సిటిజన్ల విజ్ఞప్తులను పరిష్కరించేందుకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తారు. 
*80 ఏళ్లు పైబడిన వారి దరఖాస్తులను 60 రోజుల్లోపు పరిష్కరించాలి.
*ప్రత్యేక పరిస్థితుల్లో గడువును ట్రైబ్యునల్‌ ఒక్కసారి మాత్రమే పొడిగించవచ్చు. అదీ 30 రోజులకు మించకూడదు.
*తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సై ర్యాంకుకు తగ్గకుండా ఒక అధికారి ఉంటారు. 
*అలాగే, ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేయాలి. 
*దీనికి డీఎస్పీ లేదా పైస్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజ న్లు తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వీలుగా సంరక్షణ అధికారిని రాష్ట్రప్రభుత్వం నియమించాలి.
*తల్లిదండ్రుల సంక్షేమం- సీనియర్ సిటిజన్ల చట్టం 2007 నాటి చట్టంలో నిబంధనలను సమీక్షించాలని పలు హైకోర్టులు కూడా ప్రభుత్వానికి సూచించాయి.
*ఈ నేపథ్యంలో చట్టంలోని నిబంధనలను కార్యదర్శుల బృందం సమీక్షించి సిఫారసులు చేసింది. 
*అల్లుడు, కోడలిని కూడా 'పిల్లల' పరిధిలోకి తీసుకురావాలంటూ అందిన విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, తాజా బిల్లును ప్రవేశపెట్టింది. 
* దీనిప్రకారం సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ హోంలు, మల్టీ సర్వీస్‌ డే కేర్‌ సెంటర్లు, హోం కేర్‌ సర్వీసులు అందించే సంస్థలు విధిగా సంబంధిత అధికారుల వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. 
*వాటికి కనీస ప్రమాణాలను కూడా నిర్దేశించారు.

NEXT

No comments:

Post a Comment