*ఆర్‌టిసి ప్రజా రవాణా వ్యవస్థగా మారనుంది. ఆ సంస్థలోని 51,488 మంది జనవరి ఒకటో తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ డిసెంబర్ 16వ తేదీన ఆమోదం తెలిపింది.
*ఈచర్యతో 2021-22 సంవత్సరం నుండి సంస్థకు నికర మిగులు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది.
*ప్రసుత్తం నెలకు రూ.100 కోట్ల నష్టం ప్రభుత్వ నిర్ణయం వల్ల తగ్గే అవకాశం ఉంది.
* అన్ని ఖర్చులకు సంబంధించి విడివిడిగా నిర్వహణా వ్యయాన్ని, ఖర్చును తగ్గించి సామర్థ్య ప్రమాణాలను పెంచనున్నారు.
*అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా. ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ చట్టం-1968కు సవరణ.బార్‌లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లైసెన్స్ ఫీజుకు రెండు రెట్లు జరిమానా.. రెండోసారి పాల్పడితే బార్ లైసెన్స్ రద్దు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్‌సి కమిషన్(ఎస్సీ కమిషన్) బిల్లు-2019, రాష్ట్ర ఎస్‌టి (ఎస్టీ )కమిషన్ బిల్లు -2019, ఆర్‌టిసి బిల్లు, ఆంధ్రప్రదేశ్ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగులపై పన్ను (సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ఆబ్కారీ (రెండవసవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ మద్య నిషేధం (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ వస్తువులు, సేవల పన్నుల (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల (రెండవ సవరణ) బిల్లు, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం(సవరణ) బిల్లు, చిరుధాన్యాల బోర్డు బిల్లులకు,సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం వంటి అంశాల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించింది.
* పప్పు ధాన్యాల బోర్డు బిల్లు, ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల(రెండవ సవరణ) బిల్లు, కర్నూలులో కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టరు విశ్వవిద్యాలయం ఏర్పాటు చట్టం -2019, ఎపి మునిసిపల్ లా (అమెండ్‌మెంట్) యాక్ట్-2019, ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం(1/1982(అమెండ్‌మెంట్ యాక్ట్- 2019 బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
*రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, ఆత్యాచారాలను నిరోధించడానికి శాసనసభలో ఆమోదించిన దిశ బిల్లును హోంమంత్రి ఎం సుచరిత డిసెంబర్ 16వ తేదీన శాసనమండలిలో ప్రవేశపెట్టారు.
*రాష్ట్రంలో పర్యాటక, సంస్కృతి వారసత్వపు బోర్డు ఏర్పాటుకు రూపొందించిన చట్ట సవరణ బిల్లును పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ డిసెంబర్ 16వ తేదీన శాసనమండలిలో ప్రవేశపెట్టారు.
NEXT

No comments:
Post a Comment