ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పొడగింపు బిల్లు

*ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభ, ఆయా రాష్ర్టాల చట్టసభల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల వరకు పొడిగించేందుకు ఉద్దేశించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ డిసెంబర్ 10వ తేదీన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 
* ఆంగ్లో ఇండియన్ల కోటాను పొడగించలేదు.
*చట్టసభల్లో గత 70 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల గడువు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్లకు ఉన్న రిజర్వేషన్లను ప్రభుత్వం నిలుపుదల చేసింది. 
* భారత దేశంలో ఆంగ్లో ఇండియన్స్ జనాభా బాగానే ఉంది. వారికంటూ చట్టసభల్లో చోటు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది. గత 70 ఏళ్లుగా ఆంగ్లో ఇండియన్స్‌కు ఇటు పార్లమెంటులో అటు రాష్ట్ర అసెంబ్లీల్లో నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు.
**రాజ్యాంగంలోని ఆర్టికల్ 334లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రొవిజన్లు ఉండగా అదే ఆర్టికల్‌లో చట్ట సభల్లో ఆంగ్లో ఇండియన్స్‌ను నామినేట్ చేయాలనే ప్రొవిజన్ కూడా ఉంది. 
*లోక్ సభకు రాష్ట్రపతి ఇద్దరూ ఆంగ్లో-ఇండియన్ లను నామినేట్ చేస్తారు. 
*రాష్ట్రాల్లో అసెంబ్లీ కి ఒక ఆంగ్లో-ఇండియన్ సభ్యుడిని గవర్నర్ నామినేట్ చేస్తారు.(ప్రకరణ  170)
NEXT

No comments:

Post a Comment