లోక్‌సభలో పౌరసత్వ బిల్లు ప్రవేశానికి ఆమోదం

*పౌరసత్వ చట్ట సవరణ బిల్లును హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
*చర్చ అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్‌ నిర్వహించారు. 
* సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌ అనంతరం లోక్‌సభలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 
*ఈ బిల్లు ప్రకారం,ప్రధానంగా మూడు దేశాల్లోని పాకిస్థాన్,బంగ్లాదేశ్,అఫ్ఘానిస్థాన్‌లో వివక్షకు గురై అక్కడి నుండి భారత దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ మూడు దేశాల నుంచి 2014 డిసెంబరు 31వ తేదీలోపు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరు. 
*ఈ పౌరసత్వ బిల్లును కాంగ్రెస్‌తో పాటు 11 పార్టీలు వ్యతిరేకించాయి. 
* గతంలో పదకొండేళ్ల పాటు దేశంలో కొనసాగితేనే భారత దేశ పౌరసత్వాన్ని పొందే హక్కు ఉండేది.. కానీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా అయిదేళ్లకు కుదించింది ఎన్డీఏ ప్రభుత్వం.
*2014 సంవత్సరంలో డిసెంబర్ 31 లోపు దేశానికి వలస వచ్చిన వారందరికీ భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు అవకాశం కల్పిస్తూ పౌరసత్వ సవరణ బిల్లులో కీలక మార్పులు చేసింది. 
Next

No comments:

Post a Comment