అమెరికా అధ్యక్షుడితో రాజ్‌నాథ్, జైశంకర్‌లు భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు.
Current Affairsఅమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో డిసెంబర్ 20న జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అలాగే వాణిజ్య అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు.

మరోవైపు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మైక్ ఎస్పర్‌లతో రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ... భారత్ నుంచి వస్తున్న ప్రతిభావంతులను అడ్డుకోరాదని అమెరికాకు సూచించారు. ఇరు దేశాల మధ్య వారి సేవలు వ్యూహాత్మక వారధిగా పనిచేస్తాయని, ఆర్థిక సహకారంలోనూ ఇది ముఖ్యమైన భాగమని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment