దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ వర్సిటీ

దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ రూపుదిద్దుకుంది.
Current Affairsఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో 2020 ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు(ఏఐటీఈఎస్‌టీ) ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయమై ఏఐటీఈఎస్‌టీ అధ్యక్షుడు డాక్టర్ క్రిష్ణమోహన్ మిశ్రా మాట్లాడుతూ... ‘ ఈ యూనివర్సిటీలో శిశు తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి. జనవరి 15 నుంచి కొన్ని క్లాసులు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి, మార్చి నుంచి అన్ని తరగతులు ప్రారంభమవుతాయి’ అని పేర్కొన్నారు.

No comments:

Post a Comment