ఆంధ్రా విశ్వవిద్యాలయంలో వర్చ్యువల్ పోలీస్ స్టేషన్

* ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రా యూనివర్సిటీలో వర్చ్యువల్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దీని ద్వారా విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న హింస మరియు ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయవచ్చు.
* ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు 2019 ఆగస్టు లో ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రసాద్ రెడ్డి మొదటిసారిగా ప్రతిపాదించారు.
* ఒకసారి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ ఆ కేసును పరిగణలోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తుంది.
*రాష్ట్రంలో మహిళలు మరియు చిన్నారుల పట్ల దాడులను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒకటి.
*ఆపదలో 100 నంబర్ కు డయల్ చేసిన వారి ప్రాంతానికి ఐదు నిమిషాల్లోనే పోలీస్ బృందం చేరుకుంటుంది.
*విశాఖపట్నంలో మహిళా మిత్ర పథకం కింద 23 పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి.మహిళా కానిస్టేబుల్ ను ఇందులో పనిచేస్తున్నారు.వాలంటీర్లు అవగాహన సదస్సులను పాఠశాలలు మరియు కళాశాలలు ఇతర పని చేసే ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు.
NEXT

No comments:

Post a Comment