చిన్న వయసులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ - గ్రేటా థన్‌బర్గ్

*స్వీడిష్ స్కూల్ అమ్మాయి గ్రేటా థన్‌బర్గ్  టైమ్స్ మ్యాగజైన్ గ్రేటాను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. 1927వ సంవత్సరం ప్రారంభమైన ఈ అవార్డును అతి పిన్న వయస్సులో(16 సంవత్సరాలు) గెలుచుకున్న వ్యక్తిగా గ్రేటా నిలిచింది.
*ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులపై ప్రపంచ దేశాల విధాన రూపకర్తలు నూతన విధానాలు రూపొందించాల్సిందిగా గ్లోబల్‌ యూత్‌ మూమెంట్‌ పేరుతో ఏడాది కాలంగా పోరాటం చేస్తోంది.
*గత ఏడాది, గ్రేటా స్వీడన్ పార్లమెంట్ భవనం వెలుపల నిరసన తెలిపింది. శుక్రవారాలు పాఠశాలకు దూరమై పర్యావరణ సమ్మెను ప్రారంభించింది. 
*ఇది #FridaysForFuture అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రాచుర్యం పొంది ప్రపంచవ్యాప్త ఉద్యమానికి నాంది పలికింది. 
*ప్రపంచవ్యాప్తంగా నిరసనలలో పాల్గొనడానికి మిలియన్ల మంది విద్యార్థులను ప్రేరేపించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆమె నోబెల్ శాంతి బహుమతికి అభ్యర్థిగా ఎంపికైంది.
*సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన యుఎన్ క్లైమేట్ కాన్ఫరెన్స్‌లో, వాతావరణ మార్పులకు సమాధానాల కోసం యువతపై ఆధారపడినందుకు రాజకీయ నాయకులను విమర్శించింది.
*1927 నుంచి ప్రతి సంవత్సరం టైమ్స్‌ 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డులను ప్రకటిస్తోంది. 
*పోర్చుగల్‌లోని లిస్బన్‌ తీరంలో ఆకాశంవైపు చూస్తున్న గ్రెటా చిత్రాన్ని టైమ్స్‌ ముఖచిత్రంగా ప్రచురించింది. దీనికి 'ది పవర్‌ ఆఫ్‌ యూత్‌' అని క్యాప్షన్‌ ఇచ్చింది.
* టైమ్స్ చీఫ్ ఎడిటర్ - ఎడ్వర్డ్ ఫెల్సెంథల్

NEXT

No comments:

Post a Comment