ముగిసిన మిత్ర శక్తి విన్యాసాలు

*భారత్ శ్రీలంక మధ్య పూణేలోని అంద్ మిలిటరీ స్టేషన్ లో జరిగిన ఏడవ ఎడిషన్ మిత్ర శక్తి vii సైనిక విన్యాసాలు  ముగిశాయి. 
* ఈ విన్యాసాలు డిసెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ మధ్య జరిగాయి. 
* ఐక్యరాజ్య సమితి నిర్వహించే శాంతి రక్షక దళం లో భాగంగా ఈ విన్యాసాలు జరిగాయి. 
* భారత్ మరియు శ్రీలంక సైన్యం మధ్య నిర్వహణ సామర్ధ్యం పెంపుదలకు ఈ సైనిక విన్యాసాలు ఉపయోగపడతాయి. 
*ఎడబాటు దారులను మరియు ఉగ్రవాదులను పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొనడానికి సబ్ యూనిట్ స్థాయి శిక్షణ ఉపయోగపడుతుంది. 
* భారతదేశం నుండి 120 మంది సైనికులు, శ్రీలంక నుండి 120 మంది సైనికులు ఈ విన్యాసాలలో పాల్గొన్నారు. 
*ఈ విన్యాసాల థీమ్ - ఇరు దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి  ముఖ్యంగా దృష్టి సారించారు. 
* ఈ విన్యాసాలు మాక్ బాటిల్ డ్రిల్స్,ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో చేపట్టవలసిన విధానాలను ఎలా అమలు చేయాలో  సైనికులకు అవగాహన కల్పిం చాయి.

NEXT

No comments:

Post a Comment