*బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.
*డిసెంబర్ 13వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది.
*కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వంలో, ప్రతిపక్ష లేబర్ పార్టీ జెరిమీ కోర్బిన్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లాయి.
*బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే నెల్లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్‌ను బయటకు తీసుకు రావడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రయత్నించనున్నారు.
*దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్'లో మొత్తం 650 స్థానాలు ఉన్నాయి. మెజారిటీ సాధించాలంటే కనీసం 326 స్థానాల్లో గెలవాలి.అధికార కన్జర్వేటివ్ పార్టీ మొత్తం 650 స్థానాల్లో 362 స్థానాల్లో విజయాన్ని చేజిక్కించుకుంది.
*మొత్తం పోలైన ఓట్లలో కన్జరర్వేటివ్స్ 43.5 శాతం దక్కించుకోగా, లేబర్ పార్టీకి 32.4 శాతం దక్కాయి.
*లేబర్ పార్టీ ఒకప్పటి కంచుకోటలైన బ్లిత్, డార్లింగ్టన్, వర్కింగ్టన్ లాంటి స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ జెండా ఎగరేసింది. ఈ స్థానాల్లో టోరీలు గెలవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే ప్రథమం.
* యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడమే ప్రధాన ఎజెంగా ఈ మధ్యంతర ఎన్నికలు జరిగాయి.
*బ్రెగ్జిట్ ప్రక్రియ వెంటనే ముగించాలనే అంశంతో ప్రధానంగా బోరిస్ ఎన్నికలకు వెళ్లగా, మరోసారి ఈ అంశంపై రిఫరెండంను నిర్వహించడమే అజెండాగా ప్రతిపక్షాలు ముందుకు వెళ్లాయి.
*పార్లమెంట్‌లో ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున బ్రెగ్జిట్ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది.
*యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా, వద్దా అనే అంశంపై 2016 రెఫరెండంలో ఉత్తర ఇంగ్లండ్, మిడ్‌ల్యాండ్స్, వేల్స్‌లలో 'బ్రెగ్జిట్'కు మొగ్గుచూపిన ప్రాంతాల్లోని సీట్లను లేబర్ పార్టీ కోల్పోయింది.
*ఐదేళ్లలోపు వ్యవధిలో ఇది మూడో సార్వత్రిక ఎన్నిక.
*1923 తర్వాత తొలిసారిగా ఈసారి డిసెంబర్‌లో ఈ ఎన్నిక జరిగింది.
*ప్రధాని బోరిస్ జాన్సన్, లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ తమ తమ స్థానాల్లో విజయం సాధించారు.
*1987లో మార్గరెట్ థాచర్ సాధించిన విజయం తరువాత ఇదే అతిపెద్ద విజయం.
*అలాగే లేబర్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 1935 తరువాత అతి దారుణమైన పరాజయం.
*లేబర్ పార్టీకి ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ రాజీనామా చేశారు.
*అలాగే లిబరల్ డెమొక్రాట్ నేత జో స్విన్‌సన్ ఓటమి పాలయ్యారు.మొత్తం 650 స్థానాల్లో 3,322 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

No comments:
Post a Comment