క్లైమేట్ చేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇండెక్స్

* భారత్ తొలిసారి ఈ సంవత్సర క్లైమేట్ చేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇండెక్స్ (సీసీపీఐ) ర్యాంకుల్లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకుంది. 
*స్పెయిన్  లోని మాడ్రిడ్  లో జరుగుతున్న సీఓపీ25 క్లైమేట్ సమ్మిట్‌లో డిసెంబర్ 10వ తేదీన  సీసీపీఐ ర్యాంకులతో కూడిన ఒక నివేదికను ప్రవేశపెట్టారు.
*భారత్‌లో తలసరి కర్బన ఉద్గారాలు, ఇంధన వినియోగ ప్రస్తుత స్థాయిలు 'హై కేటగిరి'లో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
*ఇవి ఇతర దేశాలతో పోల్చి చూస్తే తక్కువగా ఉన్నాయి.
* స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన వాతావరణ సదస్సులో ప్రవేశపెట్టిన ఈ నివేదిక  ప్రకారం,భారత్ గ్రీన్ హౌస్ గ్యాస్ (జీహెచ్‌జీ) ఉద్గారాలు, ఇంధన వినియోగం విషయంలో అధిక రేటింగ్‌లో ఉన్నాయి.  
* భారత్ తన వాతావరణ విధానం పనితీరులో మొత్తంమీద అధిక రేటింగ్‌లో ఉన్నప్పటికీ, బొగ్గు వినియోగానికి ఇస్తున్న సబ్సిడీల తొలగింపునకు ఒక రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయవలసి ఉంది.ఇలా చేయడం వల్ల భారత్ బొగ్గుపై ఆధారపడటం తగ్గుతుంది.  
* పునరుత్పాదక ఇంధన కేటగిరిలో భారత్ మొత్తంమీద మధ్య స్థాయి రేటింగ్‌ను పొందినప్పటికీ, 2030 పునరుత్పాదక ఇంధన లక్ష్యాలలో తన రెండు డిగ్రీల సెల్సియస్‌కన్నా చాలా తక్కువ అనుగుణ్యతతో అత్యంత అధిక స్థాయి రేటింగ్‌ను సాధించింది. 
* కర్బన ఉద్గారాలు, పునరుత్పాదక ఇంధన అభివృద్ధితో పాటు క్లైమేట్ పాలసీలో ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ప్రత్యేకించి అమెరికాలు తక్కువ స్థాయి నుంచి అతి తక్కువ స్థాయిలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. 

No comments:

Post a Comment