సీనియర్ న్యాయవాది లిల్లీ థామస్ మృతి

*సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ మహిళా న్యాయవాది లిల్లీ థామస్‌ (91) కన్నుమూశారు.
* కేరళలోని కొట్టాయంలో జన్మించిన లిల్లీ.. తిరువనంతపురంలో పెరిగారు. ఆ తర్వాత వారి కుటుంబం చెన్నైకి వచ్చింది. 1955లో ఆమె మద్రాస్‌ హైకోర్టు బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. . రెండేండ్ల తర్వాత మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరారు. ఈ కోర్సులో పట్టా పొందిన తొలి మహిళ కూడా లిల్లీ థామసే. 
* అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఆ సమయంలో నలుగురు మహిళలు న్యాయవాద వృత్తిలో ఉండగా, వారిలో లిల్లీ థామస్‌ ఒకరు. 
*సుప్రీంకోర్టులో ఎన్నో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలుచేసి ఆమె పేరుతెచ్చుకున్నారు. 
* దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులు తమపై కేసులను న్యాయస్థానంలో వాదించుకోవడానికి అనువుగా ఉన్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(4)ను రద్దు చేయాలని వ్యాజ్యం దాఖలు చేశారు. 
* ఆ వ్యాజ్యంతో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై కనీసం రెండేండ్ల అనర్హత వేటును వేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
NEXT

No comments:

Post a Comment