ఇన్ఫోసిస్ కు అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ పురస్కారం

*ఇన్ఫోసిస్‌కు 'ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణ పురస్కారం' లభించింది.
*  స్పెయిన్ దేశంలోని మేడ్రిడ్ నగరంలో ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో 'వాతావరణ మార్పులు' అనే అంశంపై జరిగిన సదస్సులో 'ప్రస్తుత వాతావరణ సహజత్వం' (క్లైమేట్ నేచురల్ నౌ) కేటగిరీ నుంచి తమ సంస్థకు ఈ అవార్డు లభించింది.
*  ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ కార్పొరేట్ కంపెనీగా బెంగళూరు కేంద్ర కార్యాలయంగా నడిచే ఈ సంస్థ నిలిచింది.
* వాతావరణ మార్పులను నియంత్రించి పనితీరులో చక్కటి ప్రతిభను కనబరిచే కంపెనీలను ఎంపికచేసి ఐక్యరాజ్య సమితి ఈ విశిష్ట అవార్డును ప్రదానం చేస్తుంది.
*ఇన్ఫోసిస్ నిర్వహించే 'కార్బన్ నేచురల్' కార్యక్రమానికిగాను ఐరాస ఈ అవార్డుకు ఎంపిక  చేసింది.
* ఈ విషయంలో సరైన పరిమితి (కొలతలతో) కూడిన, పరిశోధనాత్మక, ప్రయోగాత్మక చర్యలను  ఇన్ఫోసిస్ కంపెనీ చేపడుతూ వస్తుంది.
*ఇతర కార్యక్రమాల లక్ష్య సాధనలో లింగ వివక్ష రాహిత్యం, ఆరోగ్యం, చక్కటి జీవనం, ఆర్థికాభివృద్ధి అవకాశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
* కార్బన్ నేచురల్లీ కార్యక్రమం కోసం తొలిసారిగా ఇన్ఫోసిస్ ఓ ప్రయోగాత్మక నమూనాను వాతావరణ చర్యలకోసం ఏర్పాటు చేసింది.

NEXT

No comments:

Post a Comment