భారత వృద్ధి రేటు 5.1 శాతానికి తగ్గించిన ఎడిబి

*భారత వృద్ధి రేటు అంచనాలకు ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎడిబి) కోత పెట్టింది.
*ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2019-20)లో దేశ వృద్ధి రేటు 5.1 శాతానికి పరమితం కావొచ్చని పేర్కొంది.ఇది దక్షిణాసియా దేశాల్లోనే అతి తక్కువ వృద్ధి రేటు అవుతుందని అంచనా వేసింది.  
*ఇంతక్రితం ఈ అంచనాను 6.5 శాతంగా వేసింది. కాగా 2020-21లోనూ తొలుత వేసిన 7.2 శాతం వృద్ధిని తాజాగా 6.5 శాతానికి కోత పెట్టింది.
*భారత్‌లో నెలకొన్న రుణ సంక్షోభం, బలహీన దేశీయ డిమాండ్‌ వల్ల వృద్ధి మందగించినట్లు ఎడిబి విశ్లేషించింది.ఉద్యోగ కల్పనలో జోరు తగ్గడం, పంటల విస్తీర్ణం పడిపోవడంతో గ్రామీణ ప్రాంతాల వాసులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉండటంతో వృద్ధి అంచనాను తగ్గించింది. 
*ఇటీవలే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కూడా 2019-20 వృద్ధి రేటు అంచనాలను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.
*ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో దేశ జిడిపి 4.5 శాతానికి తగ్గి,6 సంవత్సరాల  కనిష్ట స్థాయికి పడిపోయింది.
*గతేడాదితోపాటు 2019లోనూ ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
*2020లో మాత్రం వృద్ధి తిరిగి కోలుకుని 6.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
*భారత పొరుగు దేశమైన చైనా వృద్ధి 6.1 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది.

NEXT

No comments:

Post a Comment