పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతం

*షార్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 11వ తేదీన పీఎస్‌ఎల్‌వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 
* పీఎస్‌ఎల్‌వీ సీ-48 ద్వారా 628 కిలోల బరువు కలిగిన రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహంతోపాటు(రిసాట్ -2 బిఆర్ 1 అనేది రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం, రిసాట్ -2 బి సిరీస్ ఉపగ్రహాలలో ఇది రెండవది. ఇస్రో రాబోయే రోజుల్లో మరో రెండు రిసాట్ -2 బి ఉపగ్రహాలను  ప్రయోగించింది. ), అమెరికాకు చెందిన 4 లీమూర్‌ అనే ఉపగ్రహాలు, టైవోక్‌-0129, ఆరు ఐహోప్‌శాట్‌ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్‌-సార్, ఇటలీకి చెందిన తైవాక్‌-0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్‌-3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. రిసాట్ -2 బిఆర్ 1 తో పాటు మరో తొమ్మిది ఉపగ్రహాలను ప్రయోగించింది. 
*ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో, ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది.
*పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. 
* ఈ ప్రయోగం దేశ రక్షణ రంగానికి కీలకం కానుంది. 
*షార్‌ కేంద్రం నుంచి ఇప్పటి వరకూ చేసిన ప్రయోగాల్లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌దే మొదటి స్థానం. 74 ప్రయోగాల్లో 49 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లే ఉన్నాయి. 1993 సెప్టెంబర్‌ 20న తొలిసారిగా పీఎస్‌ఎల్‌వీ డీ-1 27ఏళ్ల ముందు మొదలైన విజయపరంపర కొనసాగుతోంది. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి. 
*దేశీయ అవసరాల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూమిని అన్ని రకాలుగా పరిశోధన చేసే రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహాలను (రిశాట్‌) ప్రయోగిస్తుంది.
* దేశ భద్రతకు సంబంధించి కంటికిరెప్పలా కాపాడుతోంది. సరిహద్దులో జరిగే చొరబాట్లను పసిగడుతోంది. 
*రిశాట్‌ - 2బీఆర్‌1  ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్‌ను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. 2012 ఏప్రిల్‌ 20 పీఎస్‌ఎల్‌వీ సీ - 19 రాకెట్‌ ద్వారా రిశాట్‌ - 2 అనే ఉపగ్రహాన్ని పంపించారు.
*దీని కాలపరిమితి పూర్తవడంతో ఈ ఏడాది మే 22న పీఎస్‌ఎల్‌వీ సీ 46 రాకెట్‌ ద్వారా రిశాట్‌ - 3బీ అనే ఉపగ్రహాన్ని పంపించారు. 
*ఈ ఉపగ్రహాల్లో అమర్చిన పేలోడ్స్‌ భూమ్మీద 20 - 30 సెంటీమీటర్ల వ్యాసార్థంలో మాత్రమే ఛాయా చిత్రాలు తీసేవి. సీ - 48లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఎక్స్‌బాండ్‌ సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ భూమ్మీద జరిగే మార్పులను 10 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే చిన్నవాటినైనా సరే అత్యంత నాణ్యమైన చిత్రాలను పంపించే సామర్థ్యం కలిగి ఉంది.
*దేశ సరిహద్దుల్లో జరిగే అక్రమ చొరబాట్లు, పంటల విస్తీర్ణం, సాగువిస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనైనా అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాలు తీసి పంపిస్తుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్‌ భూమికి 576 కిలోమీటర్ల ఎత్తు నుంచి దేశానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది.
* రాత్రీ పగలు అనే తేడా లేకుండా అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాలు తీసే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు రోదసీలో ఉండి పనిచేస్తుంది. 


No comments:

Post a Comment