భారత్‌-అమెరికాల 2+2 చర్చలు

*భారత్‌-అమెరికాల మధ్య రెండో విడత 2+2 మంత్రుల స్థాయి చర్చలు డిసెంబర్ 18వ తేదీన జరగనున్నాయి. రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించే ఈ భేటీ వాషింగ్టన్‌లో జరగనుంది. 
* భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ ఇందులో  పాల్గొంటారు. 
* తాజాగా పార్లమెంట్‌ ఆమోదం పొందిన పౌరసత్వ బిల్లుపై వ్యక్తమైన అభ్యంతరాలపై అమెరికా ప్రజాప్రతినిధులతో విదేశాంగ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ మాట్లాడారు. 
* ఈ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గువాహటిలో 15వ తేదీ నుంచి 17 వరకు జరగాల్సిన భారత్‌-జపాన్‌ భేటీ రద్దు అయింది. 
*బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్‌ మొమెన్‌ భారత్‌ పర్యటన వాయిదా పడింది. 
NEXT

No comments:

Post a Comment