ఏపీ డీఎస్సీ-2020కి అర్హతలు, ఎంపికప్రక్రియ, ప్రిపరేషన్ గెడైన్స్..

డీఎస్సీ.. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష. దీని కోసం లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు! ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టు కోసం ఎన్నో కలలు కంటుంటారు.
ఇలాంటి వారికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించనుంది. వచ్చే ఏడాది(2020) జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌కు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ సంఖ్యలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) తదితర పోస్ట్‌లను భర్తీ చేసే అవకాశముంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌పై దృష్టిపెడితే టీచర్ పోస్టును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. డీఎస్సీకి అర్హతలు, ఎంపికప్రక్రియ,విజయానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలుసుకుందాం...

వేల ఉద్యోగాలు : 
వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్, తదితర పోస్ట్‌ల భర్తీ జరిగే అవకాశం ఉంది. 12వేల నుంచి 15వేల వరకూ టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నట్లు అంచనా.

పరీక్ష స్వరూపం!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి డీఎస్సీ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. దాంతో అభ్యర్థుల్లో పరీక్ష స్వరూపం ఎలా ఉంటుంది? అనే సందేహం ప్రధానంగా కనిపిస్తోంది. గతేడాది నిర్వహించిన డీఎస్సీని పరిగణనలోకి తీసుకుంటే.. ఎస్‌జీటీ పోస్ట్‌లకు టెట్ కమ్ టీఆర్‌టీ పేరుతో పరీక్ష జరిగింది. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, మ్యూజిక్ టీచర్స్, క్రాఫ్ట్ టీచర్స్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్స్ పోస్టుల భర్తీకి టీఆర్‌టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నిర్వహించారు. ఇందులో ఏపీ టెట్‌కు వెయిటేజీ ఇచ్చారు. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారితంగా జరిగాయి. రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో పరీక్షల విధానం పరంగా స్వల్ప మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని.. అయితే సబ్జెక్ట్‌లు, సిలబస్‌ల పరంగా మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో అధికార వర్గాల నుంచి మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

అర్హతలివే..
ఎస్‌జీటీ: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్)/డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ) (లేదా) కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత.
స్కూల్ అసిస్టెంట్: ఆయా సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు, బీఈడీ/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.(ఉదా: స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థులు బీఈడీ సోషల్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలాగే ఎస్‌ఏ-లాంగ్వేజెస్, ఎల్‌పీ, పీఈటీ, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ తదితర ఉద్యోగాలకు సదరు పోస్ట్‌లను బట్టి అకడమిక్, టీచింగ్ ఎడ్యుకేషన్, అనుభవం ఉండాలి.

పోస్టులు-పరీక్ష విధానం :
  • రిక్రూట్‌మెంట్ విధానంపై త్వరలో స్పష్టత వస్తుంది. గత డీఎస్సీ పరీక్షల విధానం.. మార్కులు వెయిటేజీని పరిశీలిస్తే...
  • స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, టీజీటీ: ఈ కేటగిరీల్లో మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో ఏపీ టెట్‌కు 20 మార్కులు, టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు 80 మార్కులు కేటాయించారు.
  • స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: వీటికి సంబంధించి మొత్తం 100 మార్కుల(టీఆర్‌టీ-50 మార్కులు, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్-30 మార్కులు, ఏపీ టెట్ వెయిటేజ్-20 మార్కులు)కు పరీక్ష నిర్వహించారు.
  • మ్యూజిక్ టీచర్: మొత్తం 100 మార్కుల(టీఆర్‌టీ-70 మార్కులు, స్కిల్ టెస్ట్-30 మార్కులు)కు పరీక్ష జరిగింది.
  • ప్రిన్సిపల్, పీజీటీ, క్రాఫ్ట్; ఆర్ట్ అండ్ డ్రారుుంగ్ టీచర్: మొత్తం 100 మార్కుల(టీఆర్‌టీ)కు పరీక్ష నిర్వహించారు.
ఎస్‌జీటీ: మొత్తం 100 మార్కులు

ఎస్‌జీటీ-టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్ష విధానం:
మొత్తం వంద మార్కులకు టెట్ కమ్ టీఆర్‌టీ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఆయా సబ్జెక్ట్‌లు, ప్రశ్నలు, మార్కుల వివరాలు..
సబ్జెక్టుప్రశ్నలుమార్కులు
జీకే అండ్ కరెంట్ అఫైర్స్2010
విద్యా దృక్పథాలు105
విద్యా మనో విజ్ఞానశాస్త్రం2010
లాంగ్వేజ్-1(ఆప్షనల్)
కంటెంట్2010
మెథడాలజీ105
లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్)
కంటెంట్2010
మెథడాలజీ105
మ్యాథమెటిక్స్
కంటెంట్2010
మెథడాలజీ105
సైన్స్‌
కంటెంట్2010
మెథడాలజీ105
సోషల్ స్టడీస్
కంటెంట్2010
మెథడాలజీ105
మొత్తం200100
పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు.
స్కూల్‌ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ తదితర) టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ పరీక్ష విధానం:
సబ్జెక్టు{పశ్నలుమార్కులు
జీకే అండ్ కరెంట్ అఫైర్స్2010
విద్యా దృక్పథాలు105
విద్యా మనోవిజ్ఞానశాస్త్ర తరగతి గది అన్వయం105
సంబంధిత సబ్జెక్టు
కంటెంట్8040
మెథడాలజీ4020
మొత్తం16080
  • పరీక్ష కాల వ్యవధి రెండున్నర గంటలు.
  • సంబంధిత సబ్జెక్ట్ అంటే.. అభ్యర్థులు తాము బీఈడీలో ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్ట్ ఆధారంగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రిపరేషన్ఎలా..? 
పరీక్ష స్వరూపం ఎలా ఉన్నా.. టెట్ కమ్ టీఆర్‌టీ పేరిట నిర్వహించినా.. లేదా టెట్ లేదా టీఆర్‌టీ వేర్వేరుగా జరిగినా.. డీఎస్సీలో ఆయా కేటగిరీలకు సంబంధించి సబ్జెక్ట్‌లు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ కసరత్తును ప్రారంభించాలి. కేటగిరీల వారీగా, సబ్జెక్ట్‌ల వారీగా పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని ప్రిపరేషన్ సాగించాలి.

ఎస్‌జీటీ :
  • జీకే, కరెంట్ అఫైర్స్: ఎస్‌జీటీలో కీలకంగా భావించే జీకే, కరెంట్ అఫైర్స్ విభాగానికి సంబంధించి ముందుగా సిలబస్‌పై పూర్తిస్థారుు అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత సబ్జెక్టుల వారీ ప్రణాళికను అనుసరిస్తూ.. అధ్యయనం సాగించాలి. స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి. భౌగోళిక నామాలు, నదీతీర నగరాలు, దేశాలు-రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, శాస్త్రసాంకేతిక అంశాలు వంటి వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. అదే విధంగా పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు వాటి లక్ష్యాలు, ఫలితాలు తదితర అంశాల గురించి తెలుసుకోవాలి.
  • రానున్న డీఎస్సీ కోసం ఏపీ ప్రభుత్వ నవరత్నాల గురించి అధ్యయనం చేయడం ఎంతో ఉపకరిస్తుంది. ఇందుకోసం దినపత్రికలను నిరంతరం అనుసరించడం మేలు.
విద్యా దృక్పథాలు : 
దేశంలో విద్యా చరిత్ర,కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్య సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు-హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం (ఎన్‌సీఎఫ్-2005); విద్యాహక్కు చట్టం, నూతన విద్యా విధానం తదితర అంశాలపై పట్టు సాధించాలి. ప్రిపరేషన్ సమయంలో డీఎడ్ స్థారుు తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.

విద్యా మనోవిజ్ఞానశాస్త్రం :
  • శిశు వికాసం అభివృద్ధ్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన-స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టి సారించాలి.
  • ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా, సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థారుు తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.
కంటెంట్ :
  • తెలుగు(ఆప్షనల్), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్‌‌స, సోషల్‌స్టడీస్ సబ్జెక్టుల కంటెంట్‌లో సన్నద్ధతకు ప్రిపరేషన్ పరంగా పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు-కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలతోపాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్‌‌స తదితరాలపై పట్టు సాధించాలి.
  • గణితం(మ్యాథమెటిక్స్)లో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం,రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్‌ను అధ్యయనం చేయడం లాభిస్తుంది. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ చాలా ముఖ్యమని గుర్తించాలి. ప్రాక్టీస్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌తో అత్యధిక మార్కుల సాధనకు ఆస్కారం లభిస్తుంది.
  • సైన్‌‌సలో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్‌‌సలో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు-క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టి సారించాలి.
  • ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాల గురించి అధ్యయనం చేయాలి.
  • సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, ఖండాలు, పారిశ్రామిక విప్లవం, మనీ-బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం-సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాలపై అవగాహన అవసరం. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ.. అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు.
మెథడాలజీ : 
ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాలపై పరిపూర్ణ అవగాహన సాధించాలి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వరుుంచుకంటూ చదవడం లాభిస్తుంది. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకుంటే.. రివిజన్‌కు ఎంతో సమయం ఆదా అవుతుంది. ప్రిపరేషన్‌కు డీఎడ్ పాఠ్యపుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి.

స్కూల్ అసిస్టెంట్ :
  • ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు సంబంధించి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై పట్టు సాధించడం అవసరం.
  • బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాలు ఎంతో ముఖ్యమైనవి.
  • సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు-అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితర అంశాలపై దృష్టి సారించాలి. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఎస్‌ఏ - మెథడాలజీ : 
ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందుకోసం బీఈడీ స్థారుు పుస్తకాలను అధ్యయనం చేయాలి. గత డీఎస్సీలో గణితంలో బోధనా పద్ధతులు; సోషల్‌స్టడీస్‌లో బోధనోపకరణాలకు అధిక ప్రాధాన్యం లభించగా బయాలజీలో అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు వచ్చారుు.

మాక్‌టెస్ట్‌లతో మేలు...కంటెంట్ పరంగా ముందు పాఠ్యపుస్తకాలను ఔపోసన పట్టిన తర్వాతే ఇతర మెటీరియల్‌వైపు దృష్టిసారించాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు -స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థారుు అవగాహన అవసరం. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ ముఖ్యం. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో, అదే విధంగా ఇతర మార్గాల ద్వారా అందుబాటులో ఉండే ‘ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది. ఎస్‌జీటీ ఔత్సాహికులు గతేడాది నిర్వహించిన ఆన్‌లైన్ టెస్ట్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం మేలు. దీని ద్వారా ఏఏ అంశాలను ఎలా చదవాలి? ప్రశ్న స్వరూపం? స్థాయి వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. 

No comments:

Post a Comment