*ఆయుధాల సవరణ బిల్లు-2019ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిసెంబర్ 10వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
* సవరణ బిల్లు ప్రకారం చట్ట విరుద్ధంగా ఆయుధాలను తయారు చేసినా, కలిగి ఉన్నాశిక్ష తప్పదు. ఈ మేరకు ఆయుధాల బిల్లుకు డిసెంబర్ 9వ తేదీన లోక్‌సభ ఆమోదం తెలిపింది.
* సవరణ బిల్లు ప్రకారం ఒక వ్యక్తి రెండు లైసెన్స్‌డ్ ఆయుధాలు మాత్రమే కలిగి ఉండొచ్చు.
*ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రెండు కంటే ఎక్కువ ఆయుధాలు కలిగిన వారు తమ ఆయుధాలను సంబంధిత అధికారులకు లేదా గుర్తింపు పొందిన ఆయుధాల డీలర్లకు 90 రోజుల లోపల లైసెన్స్ రద్దు కోరుతూ అందజేయాలి.
* ఆయుధాల చట్టం1959 లోని సెక్షన్ 25 (1AA)కీ సవరణ చేపడుతున్నారు.ఈ సవరణ ప్రకారం చట్ట విరుద్ధంగా ఆయుధాలను తయారు చేసినా, కలిగి ఉన్న వారికి సాధారణంగా విధించే 14 సంవత్సరాల జైలు శిక్షను జీవిత ఖైదుగా మారుస్తారు.
* ఈ సెక్షన్ ప్రకారం కనీస శిక్షగా 14 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది.సవరణ చేపట్టక ముందు 1959 చట్టంలో కనీసం శిక్ష ఏడు సంవత్సరాలు గరిష్టంగా 14 సంవత్సరాలుగా ఉండేది.
*భారతదేశంలో దాదాపు 35 లక్షల గన్ లైసెన్సులు కలవు. ఉత్తరప్రదేశ్ లో 13 లక్షల మంది గన్ లైసెన్సులు కలిగి ఉన్నారు.
*తర్వాత స్థానంలో జమ్మూకాశ్మీర్(3.7 లక్షల ప్రజలు)ప్రజలు ఉన్నారు. ఎక్కువమంది స్వీయ భద్రత పేరుతో గన్ లైసెన్స్ లను పొందుతున్నారు.
*అక్రమంగా ఆయుధాలు తయారు చేసేవారికి శిక్ష పెంచారు.
* వ్యక్తిగత భద్రతకు, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆయుధాలు, ఆయుధ సామగ్రిని సమర్ధవంతంగా అదుపు చేయడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు.
* అయితే క్రీడాకారులెవరిపైనా ఈ నిబంధన ప్రభావం ఉండదు.
* బిల్లు ప్రకారం, చట్టవిరుద్ధంగా ఆయుధాలు తయారీ, అమ్మకాలు జరిపితే 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు,అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే 7 ఏళ్ల నుంచి 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది.
*పోలీసు సిబ్బంది నుంచి ఆయుధాలు ఎత్తుకు వెళ్తే జీవిత ఖైదు విధిస్తారు.
* చట్టవిరుద్ధంగా మారణాయుధాలతో జరిగే నేరాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు 1958లో ప్రవేశపెట్టిన ఆయుధ చట్టానికి ఈ బిల్లు సవరణ తీసుకువస్తోంది.

No comments:
Post a Comment