మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల జాతీయ కమిటీ రెండో సమావేశం డిసెంబర్ 19న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, పోర్చుగీసు ప్రధాని ఆంటోనియో కోస్టా, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ నేత అద్వానీలు సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సమావేశం రాష్ట్రపతి మాట్లాడుతూ... మానవ సమాజానికి అప్పటి కంటే ఇప్పుడే గాంధీ అవసరం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు గాంధేయవాదమే సరైనదన్నారు. మోదీ మాట్లాడుతూ... మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవడానికి, ఆయన మార్గాలను ఆచరించడానికి ప్రపంచం ఉవ్విళ్లూరుతోందని, అందుకే ప్రపంచానికి గాంధీ గురించి చెప్పడం భారత్ బాధ్యత అని తెలిపారు.
No comments:
Post a Comment