100%ఎయిర్ ఇండియా వాటా విక్రయం

*కేంద్ర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్  - ఎయిర్ ఇండియాలో పూర్తిగా 100 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది.
*కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (ఎఐఎస్‌ఎఎం)ను తిరిగి ఏర్పాటు చేశారు. స్థలో పెట్టుబడి పెట్టడానికి ఎఐఎస్‌ఎఎం పూర్తిగా ఆమోదించింది. 
*ఈ సంవత్సరం బిడ్ నిబంధనలు సులభతరం చేశారు. 
* గత సంవత్సరంలో ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను విక్రయించడానికి మోడీ ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. అయితే దీనికి కొనుగోలుదారులు ఆసక్తి చూపలేదు. దీని తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ విఫలం కావడానికి కారణాలపై నివేధిక రూపొందించి, తదనుగుణంగా మార్పులు చేపట్టారు. 
* దాదాపు రూ. 50,000 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియా .. 2018–19లో రూ. 8,556 కోట్ల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు, ఏవియేషన్‌ రంగంలో పరిస్థితులను మెరుగుపర్చే దిశగా.. జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలను ఇతర ఎయిర్‌లైన్స్‌కు బదలాయించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. 
*  వచ్చే అయిదేళ్లలో వివిధ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) రూ. 25,000 కోట్లు ఖర్చు చేయనుంది. 
*నిధుల సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో మూత పడింది. 
*1932లో జెఆర్‌డీ టాటా తొలిసారి ఈ ఎయిర్‌లైన్స్ ప్రారంభించారు. తొలినాళ్లలో కరాచీ నుంచి ముంబైకి నడిపారు. కొంత కాలానికి పబ్లిక్ లిమిటెడ్‌ కంపెనీగా మారింది. అప్పుల కారణంగా దాన్ని ఇండియన్ ఎయిర్‌ లైన్స్‌లో విలీనం చేశారు. తర్వాత ఈ సంస్థ 94 జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు నడుపుతోంది. అంతర్జాతీయంగా కూడా వీటికి మంచి ఆధరణ ఉంది. కానీ క్రమేన అప్పులు మాత్రం పెరుగుతూ వచ్చాయి. 
NEXT

No comments:

Post a Comment